జోజిలా పాస్‌ సొరంగానికి కేబినెట్‌లో ఓకే | Government approves Rs 6809-crore Zojila Pass tunnel project in J&K | Sakshi
Sakshi News home page

జోజిలా పాస్‌ సొరంగానికి కేబినెట్‌లో ఓకే

Published Thu, Jan 4 2018 5:02 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Government approves Rs 6809-crore Zojila Pass tunnel project in J&K - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్‌ సొరంగ మార్గ నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గమైన ప్రాజెక్టుకు 6,089 కోట్లు వ్యయం చేయనున్నారు.

14.2 కి.మీ పొడవుండే ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్‌ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో ఎయిమ్స్‌ నెలకొల్పడానికి, జాతీయ జలమార్గం–1లోని హల్దియా–వారణాసి మార్గంలో నౌకాయానానికి ఊతమిచ్చేలా 5,369 కోట్లతో జల్‌ వికాస్‌ మార్గ్‌ ప్రాజెక్టుకూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement