Jammu-Kashmir
-
Jammu-Kashmir: ఈ ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ. 5 లక్షల రివార్డు
ఇటీవలి కాలంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు కలకలం సృష్టిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య పలుచోట్ల ఎదురుకాల్పులు జరిగాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని కథువా పోలీసులు నలుగురు ఉగ్రవాదుల స్కెచ్లను విడుదల చేశారు. ఈ ఉగ్రవాదులు చివరిసారిగా ధోక్ ఆఫ్ మల్హర్, బానీ, సియోజ్ధర్లో కనిపించారు. వీరికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. జూన్ 9న రియాసీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత జమ్మూ డివిజన్లో తీవ్రవాద ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. శివఖోడి నుంచి వైష్ణోదేవికి వెళ్తున్న బస్సును ఉగ్రవాదులు చుట్టుముట్టారు. అనంతరం డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. అనంతరం ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మదిమంది మరణించగా, 41 మంది గాయపడ్డారు.ఈ దాడి జరిగిన రెండు రోజుల తరువాత కథువాలో రెండు ఉగ్రవాద ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 11న జమ్మూ డివిజన్లోని కథువా, దోడా, భదర్వాలో ఉగ్రదాడులు జరిగాయి. నాటి ఎన్కౌంటర్లో భారత సైనికులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. Kathua Police releases sketches of 04 terrorists who were last seen in dhoks of Malhar , Bani & Seojdhar. A reward of 05lakhs on each terrorist for an actionable information. Anyone with credible information of terrorists will also be suitably rewarded.@JmuKmrPolice@ZPHQJammu pic.twitter.com/FsBG1qdZdt— Kathua Police (@KathuaPolice) August 10, 2024 -
సత్వర చర్యలే రక్ష!
మంచుకొండల సీమ మళ్ళీ నెత్తురోడుతోంది. జమ్మూ– కశ్మీర్‌లోని కఠువా జిల్లా మాచేడీలో భారత సైనిక గస్తీ బృందంపై సాయుధ తీవ్రవాదుల దాడి సహా 48 గంటల్లో నాలుగు ఘటనలు జరగడమే అందుకు తాజా సాక్ష్యం. కఠువా ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌తో సహా అయిదుగురు సైనిక సిబ్బంది, ఆ వెంటనే మరో ఘటనలో మరో ఇద్దరు అసువులు బాయడం పెరుగుతున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. సాధారణ తీవ్రవాదులు కాక సుశిక్షితులైన సాయుధ మూక కఠువా దుశ్చర్యకు పాల్పడడం సమస్య కొత్త లోతుల్ని చెబుతోంది. ఈ ఏడాది ఇంతవరకు జమ్మూలో ఇలాంటి ప్రధాన ఘటనలే అరడజనుకు పైగా సంభవించాయి. చిన్నాచితకా వాటి సంగతి సరేసరి. ఒక్క జూన్‌లోనే నాలుగు తీవ్రవాద దాడుల్లో, రెండు రోజుల్లో 9 మంది మరణించారు. ప్రభుత్వ వ్యూహాల వైఫల్యం, పాలకులు కశ్మీర్‌పై దృష్టి పెట్టి జమ్మూను తేలికగా తీసుకోవడం... ఏదైతేనేం తీవ్రవాదులు తమ కార్యాచరణను కశ్మీర్ లోయ నుంచి జమ్మూకు బదలాయించారు. అలా తీవ్రవాదానికి ఇప్పుడు రాజౌరీ – పూంఛ్ ప్రాంతం కొత్త కేంద్రమైంది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశం మేరకు సెప్టెంబర్ 30లోగా రాష్ట్రంలో ఎన్నికలు జరపాల్సి ఉన్నందున తీవ్రవాదానికి ముకుతాడు వేయడం తక్షణావసరం.పాతికేళ్ళ క్రితం తీవ్రవాదానికి అడ్డా అయినా, అనంతరం ప్రభుత్వ చర్యలు, స్థానికుల సహకారంతో గత రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ ఇప్పుడు మళ్ళీ అగ్నిగుండం కావడం విషాదం. గమనిస్తే, ముష్కర దాడులతో జమ్మూలో బలైన సామాన్యులు, భద్రతా సిబ్బంది సంఖ్య గత ఏడాది జనవరి నుంచి ఇప్పటికి రెట్టింపయింది. తీవ్రవాద కేంద్రం మారిందడానికి ఇది స్పష్టమైన సూచిక. 2023 డిసెంబర్లో రాజౌరీ ఘటనలో నలుగురు సైనికులను కోల్పోయాం. తరవాత కుల్గామ్ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు. ఇలా కొద్ది నెలల్లోనే సాహస జవాన్లను పలువురిని పోగొట్టుకోవడం విచారకరం. ప్రతి ప్రాణం విలువైనదే. అందులోనూ వీర సైనికుల ప్రాణత్యాగం వెల కట్టలేనిది. గత నెలలో వరుస ఘటనలతో తీవ్రవాదులు తెగబడ్డారు. జూన్ 9న పర్యాటకుల బస్సుపై దాడిలో 9మంది మరణించిన ఘటన, అది మరువక ముందే జూన్ 26న దోడాలో ఘటన... ఇవన్నీ అస్థిరతను సృష్టించాలని చూస్తున్న అదృశ్య శక్తుల విజృంభణకు సంకేతాలు. కశ్మీర్లో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నో ఏళ్ళ తర్వాత జనం ఉత్సాహంగా పాల్గొనడంతో, అసెంబ్లీ ఎన్నిక లకు పాలకులు సన్నద్ధమవుతున్నారు. దానికి అడ్డం కొట్టడానికే తాజా ఉగ్ర దుశ్చర్యలని విశ్లేషణ. ఢిల్లీలో మోదీ సర్కార్ మూడోసారి కొలువు తీరినరోజే తీవ్రవాదులు పేట్రేగడం యాదృచ్ఛికం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో దాయాది పాకిస్తాన్ పాత్రను విస్మరించలేం. భద్రత, విదేశాంగ విధానంలో తీవ్రవాదాన్ని క్రియాశీలంగా, అదే సమయంలో దొంగచాటు సాధనంగా చేసుకోవడం ఆ దేశం ఆది నుంచీ చేస్తున్నదే. ఆర్థికంగా కష్టాల్లో పడి, అంతర్జాతీయంగా ప్రతిష్ఠ తగ్గినా సరిహద్దులో అది తన కుటిల బుద్ధిని వదులుకోవట్లేదు. స్థానికులను ముందుంచి, తాను వెనుక నుంచి కథ నడిపే వ్యూహాన్ని జమ్మూలో అనుసరిస్తోంది. నిజానికి, జమ్మూ – కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేశాక కేంద్రం ఉక్కుపాదంతో వ్యవహరించింది. రద్దు అనంతరం సైతం అంతా సవ్యంగా ఉందని చెప్పడం, చూపడంలో మోదీ సర్కార్ బిజీగా ఉంది. దానికి తగ్గట్టే 2017 – 2022 మధ్య చొరబాటుదారుల సంఖ్య 53 నుంచి 14కి తగ్గిందనీ, దుశ్చర్యలు 228 నుంచి 125కి దిగివచ్చాయనీ హోమ్ శాఖ లెక్క. కానీ, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. క్షేత్రస్థాయి పరిస్థితులు సజావుగా లేవనీ, వాటిని పాలకులు పట్టించుకోవట్లేదనీ ప్రతిపక్షాలు ఆరోపి స్తున్నది అందుకే. ఆ మాటకొస్తే, పెద్ద నోట్ల రద్దు మొదలు 370వ అధికరణం ఎత్తివేత దాకా తమ ప్రతి చర్యా తీవ్రవాదాన్ని తుదముట్టించేదే అని పాలకులు చెప్పినా అది వాస్తవరూపం దాల్చలేదు. పైగా, వర్షాకాలం కావడంతో సరిహద్దు వెంట పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల చొరబాట్లు సులభమవుతాయి. ప్రస్తుతం ఏటా భారీగా సాగే సంక్లిష్టమైన అమరనాథ్ యాత్రాకాలం కూడా! హిమలింగాన్ని దర్శించడానికి యాత్రికుల రద్దీ ఉండే ఈ సమయంలో మాటు వేసి కాటు వేయాలనీ, అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలనీ ముష్కరులు ఎత్తుగడ వేస్తారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. లేదంటే, తదుపరి పరిణామాలకు చింతించి ప్రయోజనం ఉండదు. వచ్చేవారం బడ్జెట్ సమావేశాలు సైతం ప్రారంభమవుతున్నందున ప్రభుత్వం జాగు చేయరాదు. చేపడుతున్న చర్యలపై స్వచ్ఛందంగా సవివరమైన ప్రకటన చేయాలి.పాక్‌తో నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ కొనసాగుతున్నా, చైనాతో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత మన బలగాలు ఆ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట మోహరించాల్సి వచ్చింది. ఫలితంగా కశ్మీర్‌తో పోలిస్తే సైనిక బలగాలు తక్కువగా ఉన్న జమ్మూ తీవ్రవాదులకు వాటంగా మారింది. కశ్మీర్ లోయలో కాస్తంత ఊపిరి పీల్చుకొనే లోగా ఇక్కడకు విస్తరించిన ఈ ముప్పును ఆదిలోనే అడ్డుకోవాలి. దేశ భద్రతపై రాజకీయాల కన్నా రాజీ లేని ధోరణి ముఖ్యమని అధికార, ప్రతిపక్షాలన్నీ బాధ్యతతో ప్రవర్తించాలి. పాలకులు గత పదేళ్ళ తమ హయాంలో అంతా సుభిక్షంగా, సుదృఢంగా మారిపోయిందనే ప్రగల్భాలు మాని, కార్యాచరణకు దిగాలి. భద్రతాదళాల పెంపు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదని అర్థం చేసుకోవాలి. సమస్యను సమగ్రంగా దర్శించి, తీవ్ర వాదం వైపు స్థానికులు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు శుష్క వాగ్దానాలకు మించిన భరోసా కల్పించాలి. అప్పుడే ఈ భూతాన్ని అడ్డుకోగలుగుతాం. భారత్‌తో వాణిజ్యం, శాంతి కోరుతున్నట్టు చెబుతున్న పాక్ సైతం తీవ్రవాదానికి అండదండలు మానాలి. లేదంటే గుణపాఠం తప్పదు. -
ఆగని డ్రాగన్ దురాశ
ఇది ఆందోళన రేపే వార్త. తక్షణమే అడ్డుకట్ట వేయడానికి ఆలోచించాల్సిన వార్త. పొరుగు దేశం చైనా ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్ఏసీ) వెంట తన వైపున మరో 175కు పైగా గ్రామాలను నిర్మిస్తోందట. మన అరుణాచల్ ప్రదేశ్‌కు అభిముఖంగా సాగుతున్న ఈ కొత్త నిర్మాణాలు ఇప్పటికే ఎల్ఏసీ వెంట డ్రాగన్ సాగించిన 628 ‘షియావోకాంగ్’ (సంపన్న గ్రామాలు)కు అదనం. ఎల్ఏసీ వెంట తన బలం, బలగం పెంచుకొనేందుకు బీజింగ్ మరోసారి దుష్టపన్నాగం పన్నుతోంది. అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక ప్రచురించిన ఈ కథనం సంచలనం రేపుతోంది. ఈశాన్యంలోని అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు జమ్ము–కశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతం వెంట కూడా చైనా వైపున కొత్త గ్రామాలు వెలుస్తున్నాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన పరిణామం. వెరసి, రానురానూ ఎల్ఏసీ మరింత వివాదాస్పదం కానుంది. ఇది మన బలగాలు, స్థానికులు తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అంశం. నిజానికి, వాస్తవాధీన రేఖ అనేది భూతలంపై స్పష్టంగా నిర్ణయించిన సరిహద్దు ఏమీ కాదు. చైనీయుల నియంత్రణలో ఉన్న భూభాగాన్నీ, భారత నియంత్రిత భూభాగాన్నీ వేరుపరచే ఊహాత్మక సరిహద్దు రేఖ. దీన్ని వాటంగా చేసుకొని, ఊహాత్మక సరిహద్దయిన ఎల్ఏసీ వెంట సైనిక సన్నద్ధతను పెంచుకోవాలనీ, ఆ క్రమంలో అక్కడ మరింత భూభాగంపై తమ హక్కును ప్రకటించుకోవా లనీ చైనా కుటిల ప్రయత్నం. అందుకే, ఆ జగడాలమారి దేశం ఎల్ఏసీ వెంట తన వైపున గ్రామాలకు గ్రామాలు నిర్మిస్తూ వస్తోంది. దాదాపుగా 900 ఎల్ఏసీ గ్రామాలను నిర్మించాలనేది చైనా వ్యూహం. అందులో 200 దాకా గ్రామాలు భారత సరిహద్దుకు సమీపంలో కట్టాలని దాని ప్రయత్నం. ఆ భారీ ప్రయత్నంలో భాగమే ఇప్పుడీ కొత్త నిర్మాణాలు. ఆ గ్రామాలు ఇటు గస్తీ పాయింట్లుగా, అటు భారత్‌తో ఘర్షణ తలెత్తితే చేతికి అందివచ్చే సైనిక స్థావరాలుగా ఉపకరిస్తాయనేది బీజింగ్ ఎత్తుగడ. చైనా సైనిక వ్యూహం మాట అటుంచితే, కొత్త ఆవాసాలతో అనేక దీర్ఘకాలిక ప్రభావాలున్నాయి. అది మన దేశాన్ని మరింత కలవరపెడుతోంది. గమనిస్తే, భారత – చైనాల మధ్య 2005 నాటి ‘సరి హద్దు రక్షణ సహకార ఒప్పందం’ (బీడీసీఏ) ఉంది. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డ ప్రజానీకం ప్రయోజనాలను ఇరుపక్షాలూ సంరక్షించాలి’’ అని బీడీసీఏలోని ఏడో ఆర్టికల్ పేర్కొంటోంది. ఎప్పుడైనా ఎల్ఏసీని కచ్చితంగా నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తే, అప్పటికి జనావాసాలైన ఈ కొత్త గ్రామాలను కదిలించడానికి వీలుండదు. ఆ అంశాన్ని అడ్డం పెట్టుకోవాలనేది డ్రాగన్ దురా లోచన. అలా తన ప్రాదేశిక హక్కుల వాదనకు బలం చేకూర్చేలా ఈ కొత్త గ్రామాలు, అక్కడ తెచ్చి పెట్టిన జనాభాను వాడుకోవాలనేది దాని పన్నాగం. చైనా వైపు కడుతున్న ఈ కొత్త గ్రామాలకు ఎదురుగా భారత్ వైపున కూడా గ్రామాలు లేకపోలేదు. అయితే, వాటిలో జన సంఖ్య అంతంత మాత్రమే! విస్తరణ కాంక్షతో ఊగుతున్న చైనా ఈ గ్రామాల నిర్మాణంతో ఆగడం లేదు. టిబెట్‌లో, ఎల్ఏసీ సమీప ప్రాంతాల్లో పెద్దయెత్తున ప్రాథమిక వసతి కల్పన ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే తన 14వ పంచవర్ష ప్రణాళిక (2021 –25)లో భాగంగా సిచువాన్ – టిబెట్ రైల్వేలైను సహా హైస్పీడ్ రైల్వే వ్యవస్థను విస్తరించే పని పెట్టుకుంది. అలాగే, వాస్తవాధీన రేఖ వెంట, భారత భూభాగానికి సమాంతరంగా సాగే రెండు జాతీయ రహదారులను (జీ–219, జీ–318) అప్‌గ్రేడ్ చేసే పనులూ కూడా ఆ ప్రణాళికలో భాగమే. వాటిలో ఒకటి (జీ–219) లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్‌లకు ఎదురుగా ఉంటే, మరొకటి (జీ–318) అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్లకు అభిముఖమైనది కావడం గమనార్హం. తద్వారా ఒకపక్క టిబెట్‌ను తమలో భాగంగా ప్రచారం చేసుకోవడం, మరోపక్క ప్రాథమిక వసతుల పెంపు అనే రెండూ చైనా పెట్టుకున్న లక్ష్యాలు. అసలు 1959 మార్చి 28న దలైలామా నేతృత్వంలోని టిబెటన్ ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దు చేసి, టిబెట్‌ను ఆక్రమించుకున్న చరిత్ర బీజింగ్ది. కానీ, మొన్న షిజాంగ్ (టిబెట్)లో ప్రజాస్వామ్య సంస్కరణకు 65వ వార్షికోత్సవం అంటూ ఎల్ఏసీ వెంట డ్రాగన్ సంబరాలు జరపడం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమే! టిబెట్ నుంచి తైవాన్ దాకా అన్నీ తమవేననే డ్రాగన్ రాజ్య విస్తరణ వాదం ప్రపంచానికి కొత్త కాదు. చైనా సాగిస్తున్న ఈ కొత్త గ్రామాల నిర్మాణం నాటకాన్ని సైతం భారత్ గతంలోనే గమనించకపోలేదు. అందుకనే ఆ జనావాసాలను బీడీసీఏ కింద సరిహద్దు చర్చల నుంచి మినహాయించా లని తేల్చిచెప్పింది. డ్రాగన్ మాత్రం తన వంకర బుద్ధి వదులుకోలేదు. భారత్‌లోని లద్దాఖ్‌కు అభి ముఖంగా తాను చట్టవిరుద్ధంగా దురాక్రమణ చేసిన ప్రాంతాల్లోనూ చకచకా గ్రామాలు కట్టే పని చేస్తూనే ఉంది. ఇందుకు ప్రతిగా మన దేశం ఎదురుదాడికి దిగింది. ‘సచేతన గ్రామాల పథకం’ పేర ఆ సరిహద్దులోని మన జనావాసాలను ఏడాది పొడుగూతా జనంతో ఉండే ఆధునిక పర్యాటక ఆకర్షణలుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. అయితే అదింకా పూర్తి కాలేదు. పనులు సాగుతూనే ఉన్నాయి. తరచూ కయ్యానికి కాలుదువ్వే చైనాకు ముకుతాడు వేయడానికి మనం చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. క్లిష్టమైన హిమాలయ ప్రాంతాల్లో మనం మనవైపు నిర్మిస్తున్న గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మిగలకుండా స్థానిక ప్రజలు ఆవాసం ఉండేలా చూడాలి. దురాక్రమణలు జరగకుండా ఉండాలంటే, స్థానికులు ప్రతి ఒక్కరిలో తామే సరిహద్దును కాపాడే సైనికులమనే భావన కల్పించాలి. మాతృభూమి పరిరక్షణ స్ఫూర్తి రగిలించాలి. అది జరగాలంటే, ముందుగా లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న ప్రజానీకపు న్యాయమైన కోరికలను మన్నించాలి. ప్రాంతీయ సంస్కృతి, ఆకాంక్షలకు అనుగుణంగా మన ఢిల్లీ పాలకులు వ్యవహరించాలి. సొంత ఇంటిని చక్కదిద్దు కొని, పొరుగు ప్రత్యర్థిపై పోరాడే క్రమంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా అన్ని పక్షాలూ కలసిరావాలి. -
అనంతనాగ్ ఎన్ కౌంటర్... ఆర్మీ అధికారుల వీరమరణం..
-
జమ్మూకశ్మీర్ సోఫియాన్‌లో ఎన్కౌంటర్
-
జోజిలా పాస్ సొరంగానికి కేబినెట్లో ఓకే
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్, లేహ్‌ల మధ్య ప్రయాణ కాలాన్ని మూడున్నర గంటల నుంచి 15 నిమిషాలకు తగ్గించే జోజిలా పాస్ సొరంగ మార్గ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద సొరంగ మార్గమైన ప్రాజెక్టుకు 6,089 కోట్లు వ్యయం చేయనున్నారు. 14.2 కి.మీ పొడవుండే ఈ సొరంగం అందుబాటులోకి వస్తే శ్రీనగర్, కార్గిల్, లేహ్ మధ్య అనుసంధానత సాధ్యమవుతుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బిలాస్పూర్లో ఎయిమ్స్ నెలకొల్పడానికి, జాతీయ జలమార్గం–1లోని హల్దియా–వారణాసి మార్గంలో నౌకాయానానికి ఊతమిచ్చేలా 5,369 కోట్లతో జల్ వికాస్ మార్గ్ ప్రాజెక్టుకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. -
కశ్మీర్‌ను ఇక పాక్‌లో కలిపేసుకుంటాం!
-
ఇక కలిపేసుకుంటాం!
కశ్మీర్లో ఆక్రమించిన భూభాగంపై పాకిస్తాన్ దూకుడు గిల్గిట్ – బాల్తిస్తాన్‌ను ఐదో రాష్ట్రంగా కలుపుకునే యత్నం అందుకోసం రాజ్యాంగం సవరిస్తామని పాక్ మంత్రి ప్రకటన భారత్ తీవ్ర అభ్యంతరం.. సహించేది లేదని స్పష్టీకరణ పాక్ చర్యపై జమ్మూకశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు గిల్గిట్‌లో పాక్‌ది దురాక్రమణ.. కలిపేసుకోవడం అక్రమం అది భారత్‌కు చెందిన ప్రాంతమని బ్రిటన్ పార్లమెంటు తీర్మానం ఏడు దశాబ్దాలుగా తమ దేశానికి అనుబంధ ప్రాంతంగా పాక్ తన ఆధీనంలో ఉంచుకున్న గిల్గిట్ – బాల్తిస్తాన్ ప్రాంతానికి రాష్ట్రం (ప్రావిన్స్) హోదా ఇవ్వాలని విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించినట్లు పాక్ అంతర్రాష్ట్ర వ్యవహారాల మంత్రి రియాజ్ హుస్సేన్ పీర్జాదా గత వారంలో ప్రకటించారు. ఆ ప్రాంతపు హోదా మార్చి రాష్ట్రంగా చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేపడతామనీ వెల్లడించారు. పాక్‌లో ప్రస్తుతం బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్, సింధ్ – నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు కశ్మీర్లో తాము ఆక్రమించుకుని ప్రత్యేక ప్రాంతంగా వ్యవహరిస్తున్న గిల్గిట్ – బాల్తిస్తాన్‌ను ఐదో రాష్ట్రంగా కలుపుకునేందుకు చర్యలు చేపట్టింది. చైనా – పాక్ కారిడార్ కోసమే.. : చైనా 4,600 కోట్ల డాలర్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చైనా – పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (సీపెక్) కోసం ఈ ప్రాంతం చాలా కీలకమైనది కావడం ఇక్కడ గమనార్హం. గిల్గిట్ – బాల్తిస్తాన్ భూభాగం నుండి చైనా – పాక్ ఆర్థిక కారిడార్ విస్తరిస్తుంది. కానీ.. ఈ భూభాగం విషయంలో భారత్ – పాక్‌ల మధ్య వివాదం అపరిష్కృతంగా ఉండటం పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేస్తోందని.. అందుకే ఆ ప్రాంతాన్ని కలిపివేసుకుని, చైనా ఆందోళనకు తెరదించాలని పాక్ ప్రయత్నిస్తోందని భావిస్తున్నారు. ఈ భూభాగంలో సీపెక్‌కు చట్టబద్ధత కల్పించడం కోసం రాజ్యంగ సవరణ ద్వారా ఈ భూభాగం హోదాను మార్చాలని చైనా యోచిస్తున్నట్లు ఇటీవల పాక్ వార్తాపత్రిక ‘డాన్’లో కూడా కథనాలు వెలువడ్డాయి. (చదవండి: 70 ఏళ్లుగా ఆరని చిచ్చు.. కశ్మీర్) భారత్ కఠిన ప్రతిస్పందన.. : భారత్‌లో అంతర్భాగమైన భూభాగాన్ని పాక్ ఆక్రమించుకుని ఉండగా.. ఆ వివాదాస్పద భూభాగంలో మూడో దేశం చైనా ఆర్థిక కారిడార్ నిర్మాణ పనులు చేపడుతుండం పట్ల భారత్ ఇప్పటికే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ భూభాగాన్ని పాక్ ఒక రాష్ట్రంగా కలిపివేసుకునే ప్రయత్నాలు చేస్తుండటంపై భారత్ కఠినంగా స్పందించింది. ‘జమ్మూకశ్మీర్ ప్రాంతం మొత్తం 1947లో భారత్‌లో విలీనమైంది. అది అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగం. జమ్మూకశ్మీర్‌లో కొంత భాగం పాక్ ఆక్రమణలో ఉంది. గిల్గిట్ – బాల్తిస్తాన్ ప్రాంతం హోదాను మార్చడానికి ఎటువంటి ప్రయత్నాలూ చెల్లవు. వాటిని అంగీకరించబోం’ అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బగాలే ఉద్ఘాటించారు. కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఒక అడుగు ముందుకు వేసి.. ‘‘పాక్ ఆక్రమిత్ కశ్మీర్, గిల్గిట్ – బాల్తిస్తాన్లను పాక్ ఆక్రమణ నుంచి విముక్తం చేస్తాం. జమ్మూకశ్మీర్‌ను తన వాస్తవ రూపంలోకి తీసుకువచ్చి భారత సమాఖ్యలో విలీనం చేస్తాం’’ అని గత వారంలో ప్రకటించారు. కశ్మీర్ ఇరువైపులా ఆందోళనలు.. : గిల్గిట్ – బాల్తిస్తాన్‌ను పాకిస్తాన్ కలిపివేసుకునే ప్రయత్నాలకు.. కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు పాక్ సర్కారుకు తెలిపింది. పాక్ చర్యలను నిరసిస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపడతామని హెచ్చరించింది. ఆ ప్రాంతాన్ని పాక్ కలిపివేసుకున్నట్లయితే కశ్మీర్ సమస్య పరిష్కార ప్రయత్నాలు బలహీనపడతాయని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ చర్య కశ్మీరీ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని డెమొక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ అభివర్ణించింది. ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్లో గత వారం చాలా మంది కార్యకర్తలు, ముఖ్యంగా న్యాయవాదులు వీధుల్లోకి వచ్చి పాక్ ప్రయత్నాలకు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ప్రదర్శణలు నిర్వహించారు. ‘మా పిల్లలు చనిపోయినా సరే.. గిల్గిట్‌ను కలుపుకోనివ్వం’ అంటూ నినాదాలు చేశారు. జమ్మూకశ్మీర్ ప్రాంతాలన్నీ అవిభాజ్యమైనవని, వాటన్నిటినీ యధాపూర్వం కలిపేసి స్వాతంత్ర్యం కావాలని వారి డిమాండ్. పరిష్కారమా.. తిరస్కారమా..?: గిల్గిట్ – బాల్తిస్తాన్లను ఐదో రాష్ట్రంగా కలుపుకోవడానికి పాక్ ప్రయత్నించడం.. సుదీర్ఘంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీర్ వివాదాన్ని ఒక పరిష్కారం దిశగా నడిపించవచ్చునని భావించే వాళ్లూ ఉన్నారు. నిజానికి 1948లో కశ్మీర్ విషయంలో భారత్ – పాక్‌ల మధ్య యుద్ధం జరిగినపుడు కాల్పుల విరమణ రేఖనే ఆ తర్వాత నియంత్రణ రేఖగా పరిగణించాలని, దానిని క్రమంగా అంతర్జాతీయ సరిహద్దుగా మార్చాలని గతంలోనే చాలా ప్రతిపాదనలు వచ్చాయని.. ఇరుపక్షాలూ అధినాయకులూ వాటికి అంతర్గతంగా ఆమోదం తెలిపారని.. కానీ బాహాటంగా ప్రకటించి అమలు చేయడానికి సంకోచిస్తున్నారని ఆయా చర్చల్లో భాగస్వాములైన దౌత్యవేత్తలు పలువురు చెప్తున్నారు. అయితే.. తాజా పరిణామాలు కశ్మీర్ సమస్యను పరిష్కారం వైపుగా నడిపిస్తాయా.. లేక పరిస్థితిని మరింతగా జటిలం చేస్తాయా అన్నది వేచి చూడాల్సిందే! పాక్ చర్య అక్రమం: బ్రిటన్ పార్లమెంటు ఖండన గిల్గిట్ – బాల్తిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ అక్రమంగా తన దేశంలో కలిపివేసుకునే ప్రయత్నాలను బ్రిటన్ పార్లమెంట్ తీవ్రంగా ఖండించింది. ఆ భూభాగం చట్టబద్ధంగా భారత్‌కు చెందినదని, 1947 నుంచీ పాక్ అక్రమంగా ఆక్రమించుకుని ఉందనీ గత శుక్రవారం చేసిన ఒక తీర్మానంలో తప్పుపట్టింది. భారత ఉపఖండాన్ని రెండు వందల ఏళ్ల పాటు పరిపాలించి.. ఏడు దశాబ్దాల కిందట ఉపఖండాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా చీల్చి స్వాతంత్ర్యం ప్రకటించి వెళ్లిపోయిన బ్రిటన్ పార్లమెంటు ఈ విధంగా తీర్మానం చేయడం.. భారత్‌కు నైతికంగా చాలా బలాన్నిస్తోంది. భారతదేశంలోని జమ్మూకశ్మీర్‌లో గిల్గిట్-బాల్తిస్తాన్ చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన అంతర్భాగం. దానిని పాకిస్తాన్ 1947 నుంచి అక్రమంగా ఆక్రమించుకుని ఉంది. ఆ ప్రాంతంలోని ప్రజలకు భావప్రకటనా స్వాతంత్ర్యం సహా ప్రాధమిక హక్కులు లేవు. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఏకపక్షంగా ఐదో రాష్ట్రంగా ప్రకటించడాన్ని ఈ సభ ఖండిస్తోంది’’ అంటూ కామన్స్ సభలో తీర్మానాన్ని ఆమోదించారు. ‘‘ఆ ప్రాంతపు జనావళి స్వరూపాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలు, చైనా – పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణానికి బలవంతంగా అక్రమంగా చేస్తున్న ప్రయత్నాలు వివాదాన్ని మరింత జఠిలం చేస్తున్నాయి’’ అని కూడా ఆ తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేశారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
-
మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన
శ్రీనగర్ (జమ్మూ) : భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో 8 బీఎస్ఎఫ్ దళాల ఔట్ పోస్టులపై లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. భారత్, పాక్ సరిహద్దులోని బీఎస్ఎఫ్ ఔట్ పోస్టులపై కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పారు. కాగా పాక్ ఇప్పటివరకూ పలుమార్లు భారత్ సరిహద్దు వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. -
జమ్మూ సరిహద్దుల్లో పాక్ కాల్పులు
శ్రీనగర్ (జమ్మూ) : భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం మళ్లీ తన నైజాన్ని ప్రదర్శించింది. జమ్మూ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ రేంజర్స్ బీఎస్ఎఫ్ దళాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. మంగళవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పారు. సుమారు 7 గంటల పాటు కాల్పులు జరిగాయి. కాగా పాక్ ఈ నెలలో పలుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. తొలుత ఈనెల 6న కాత్వా జిల్లాలో , 11, 13 తేదీల్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. -
కశ్మీర్ లో పేలుళ్లు..!
జమ్మూ: జమ్ము-కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో మందు పాతర పేలి ఒకరికి గాయాలయ్యాయి. పూంచ్ జిల్లాలోని బాగియాల్ దారా వద్ద బుధవారం ఉదయం మహమ్మద్ బషీర్ అనే వ్యక్తి నడుచుకుంటూ వెళుతుండగా.. మందు పాతరపై కాలు పెట్టడంతో ఒక్కసారిగా అవి పేలాయి. ఈ ఘటనలో గాయపడ్డ అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రెండు రాష్ట్రాల్లో బ్యాలెట్ పోరు!
శాంతిభద్రతల రీత్యా సమస్యాత్మకమైన జార్ఖండ్, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ మంగళవారం జరగనున్నది. జార్ఖండ్‌లో నక్సలైట్ల సమస్య, జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదం మొదటినుంచీ ప్రభుత్వాలకు పెను సవాలుగా మారాయి. కనుకనే కట్టుదిట్టమైన భద్రత కోసం రెండు రాష్ట్రాల్లోనూ అయిదు దశల పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి దశలో జార్ఖండ్‌లో 13 స్థానాలకూ... జమ్మూ-కశ్మీర్లో 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 81 స్థానాలున్న జార్ఖండ్‌లో తమ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకేనని బీజేపీ విశ్వసిస్తున్నది. దాదాపు ఎన్నికల సర్వేలన్నీ ఆ మాటే చెబుతున్నాయి. 87 స్థానాలున్న జమ్మూ-కశ్మీర్లో 44 స్థానాలకుపైగా గెలిచి అధికారాన్ని అందుకోవడమే లక్ష్యమంటూ ‘మిషన్ 44 ప్లస్’ పేర తన శ్రేణుల్ని బీజేపీ ఉత్సాహపరుస్తున్నది. గత కొన్నేళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)లు ప్రధాన భూమిక పోషిస్తుండగా ఈసారి ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న జనాదరణ ఆసరాతో బీజేపీ బలమైన పక్షంగా ముందుకొచ్చింది. కశ్మీర్ లోయలో రెండు ప్రాంతీయ పార్టీలకూ పలుకుబడి ఉంటే జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్ గణనీయంగా సీట్లు గెల్చుకుని ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నది. ఈసారి మాత్రం కాంగ్రెస్ దివాలా తీసే స్థాయికి చేరుకుంది. అటు కశ్మీర్ లోయలో ఎన్సీ పరిస్థితీ అంతే. రెండు పార్టీల కూటమి పాలనపై వచ్చిన అవినీతి ఆరోపణల పర్యవసానమిది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో జమ్మూలోని రెండు స్థానాలనూ, లడఖ్ స్థానాన్నీ కైవసం చేసుకున్న బీజేపీ ఆ రెండుచోట్లా ఈసారి అధిక సంఖ్యలో అసెంబ్లీ సీట్లు గెలుచుకోగలమన్న నమ్మకంతో ఉంది. పీడీపీ కశ్మీర్ లోయ ప్రాంతంలోని మూడు లోక్‌సభ స్థానాలనూ సొంతం చేసుకుంది. ఈసారి కనీసం 35 అసెంబ్లీ స్థానాలు గెల్చుకోవడమే కాక జమ్మూ, లడఖ్ ప్రాంతాల్లో సైతం ప్రభావాన్ని చూపి పీడీపీ సొంతంగా అధికారాన్ని కైవసం చేసుకోగలదని సర్వేలు అంచనావేస్తున్నాయి. కల్లోల కశ్మీరంలో సమస్యల విస్తృతి ఎక్కువే. అభివృద్ధి, నిరుద్యోగం ఆ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు. అభివృద్ధికి ఉగ్రవాదమే ప్రధాన ఆటంకంగా ఉన్నదని ప్రభుత్వాలు చెబుతాయి. అయితే, 2001 నుంచీ చూస్తే హింసాకాండ క్రమేపీ తగ్గుముఖం పడుతున్నది. ఆ ఏడాది 4,500 మంది ప్రాణాలు కోల్పోతే 2009లో అది 375కు చేరుకుంది. ఈ ఏడాది ఇంతవరకూ 134 మంది హింసాకాండలో చనిపోయారు. గతంతో పోలిస్తే విద్య, ఉపాధి, పర్యాటక రంగాల్లో మెరుగుదల కనబడుతున్నది. అయితే, ఇది ఉండాల్సినంతగా లేదన్నది నిజం. ఇప్పటికీ ఎన్నికల బహిష్కరణ విధానానికే కట్టుబడి ఉన్న హుర్రియత్ కాన్ఫరెన్స్ ప్రభావం గతంతో పోలిస్తే ఇప్పుడు తక్కువే. సైనిక బలగాలకు అపరిమిత అధికారాలిస్తున్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం అమలు వల్ల తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకవలసి వస్తున్నదన్న అభిప్రాయం కశ్మీర్ పౌరుల్లో ఉంది. ఈమధ్యే శ్రీనగర్ సమీపంలోని ఛత్తర్‌గామ్‌లో జవాన్ల కాల్పుల్లో ఇద్దరు పిల్లలు మరణించడంతో ఆ సమస్య మళ్లీ ఎజెండాలోకొచ్చింది. రెండు నెలలక్రితం కశ్మీర్ లోయను చుట్టుముట్టిన వరదలు, విధ్వంసంనుంచి సామాన్య పౌరులు ఇంకా కోలుకోలేదు. అన్ని సమస్యలూ ఒక ఎత్తయితే జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణ మరో ఎత్తు. ప్రతి ఎన్నికల్లోనూ ఈ అధికరణాన్ని రద్దుచేయాల్సిందేనని డిమాండు చేసే బీజేపీ... మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో స్వరం మార్చింది. తాము సొంతంగా అధికారంలోకొస్తే ఆ అధికరణాన్ని రద్దుచేయగలమని అంతవరకూ చెప్తూ వచ్చిన బీజేపీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం 370 అధికరణ రద్దుకు సంబంధిత పక్షాలతో మాట్లాడి ఒప్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ అసెంబ్లీ ఎన్నికలకల్లా ఆ పార్టీ మరో మెట్టు కిందకు దిగింది. అసలు అది ఎన్నికల సమయంలో మాట్లాడాల్సిన విషయమే కాదన్నది. రాష్ట్రంలో మోదీ ప్రభంజనం వీస్తున్న ప్రస్తుత దశలో దాన్ని లేవనెత్తడంవల్ల ఏదో మేరకు నష్టమే తప్ప లాభం చేకూరదన్నది బీజేపీ అంచనా. అయితే, ఇది లాభనష్టాలకు సంబంధించిన సమస్య కాదు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో నక్సలైట్ల సమస్య, ఆదివాసీల సమస్య ప్రస్తావనకు రాకుండా...జమ్మూ-కశ్మీర్లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం, 370వ అధికరణ చర్చకు రాకుండా ఎన్నికల పర్వాన్ని దాటేద్దామనుకోవడం అత్యాశే అవుతుంది. 1947లో అప్పటి కశ్మీర్ పాలకుడు హరిసింగ్ ఆ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేసినప్పుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా రాజ్యాంగసభ చర్చించి 370వ అధికరణాన్ని చేర్చింది. దీని ప్రకారం విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, కమ్యూనికేషన్లు, రక్షణ వంటివి మినహా మిగిలిన అంశాల్లో కేంద్రం చేసే చట్టాలేవీ అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప జమ్మూ-కశ్మీర్‌కు వర్తించవు. జమ్మూ-కశ్మీర్‌కు వలసవెళ్లిన వేలాదిమంది ఈ అధికరణ కారణంగా వోటు హక్కు, ఆస్తి హక్కువంటివి కోల్పోవడమే కాకుండా ఉపాధికి సైతం అనర్హులవుతున్నారని నిరుడు డిసెంబర్లో అరుణ్ జైట్లీ ఆరోపించారు. తాము అధికారంలోకొస్తే ఆ అధికరణాన్ని రద్దుచేస్తామని చెప్పారు. రాష్ట్రానికున్న ఆ ప్రత్యేక ప్రతిపత్తి క్రమేపీ నీరుగారుతున్నదని కశ్మీరీలు అంటుంటే... జమ్మూ-కశ్మీర్‌కున్న ప్రతిపత్తి వంటిది రాష్ట్రాలన్నిటికీ ఇస్తేనే దేశంలో ఫెడరల్ వ్యవస్థ నిజమైన అర్ధంలో వర్థిల్లుతుందని వాదిస్తున్నవారూ ఉన్నారు. సాధారణ సమయాల్లో ఇలాంటి కీలక సమస్యలు ఎటూ చర్చకు రావడంలేదు. కనీసం ఎన్నికల సందర్భంగానైనా ఆయా అంశాల్లోని గుణదోషాలను చర్చించడంవల్ల ఉపయోగమే గానీ ఎలాంటి అనర్థమూ కలగదని అన్ని పార్టీలూ గుర్తించాల్సి ఉంది.