ఇటీవలి కాలంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు కలకలం సృష్టిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య పలుచోట్ల ఎదురుకాల్పులు జరిగాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని కథువా పోలీసులు నలుగురు ఉగ్రవాదుల స్కెచ్‌లను విడుదల చేశారు. ఈ ఉగ్రవాదులు చివరిసారిగా ధోక్ ఆఫ్ మల్హర్, బానీ, సియోజ్‌ధర్‌లో కనిపించారు. వీరికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.
జూన్ 9న రియాసీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత జమ్మూ డివిజన్‌లో తీవ్రవాద ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. శివఖోడి నుంచి వైష్ణోదేవికి వెళ్తున్న బస్సును ఉగ్రవాదులు చుట్టుముట్టారు. అనంతరం డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. అనంతరం ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మదిమంది మరణించగా, 41 మంది గాయపడ్డారు.
ఈ దాడి జరిగిన రెండు రోజుల తరువాత కథువాలో రెండు ఉగ్రవాద ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 11న జమ్మూ డివిజన్‌లోని కథువా, దోడా, భదర్వాలో ఉగ్రదాడులు జరిగాయి. నాటి ఎన్‌కౌంటర్‌లో భారత సైనికులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.
Kathua Police releases sketches of 04 terrorists who were last seen in dhoks of Malhar , Bani & Seojdhar. A reward of 05lakhs on each terrorist for an actionable information. Anyone with credible information of terrorists will also be suitably rewarded.@JmuKmrPolice
@ZPHQJammu pic.twitter.com/FsBG1qdZdt— Kathua Police (@KathuaPolice) August 10, 2024
Comments
Please login to add a commentAdd a comment