ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్‌.. మారణాయుధాలు స్వాధీనం! | Punjab Police Has Arrested Two Terrorists | Sakshi
Sakshi News home page

Punjab: ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్‌.. మారణాయుధాలు స్వాధీనం!

Mar 7 2024 11:57 AM | Updated on Mar 7 2024 11:57 AM

Punjab Police Has Arrested Two Terrorists - Sakshi

బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 30 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై యూఏపీఏ,  ఆయుధ చట్టం కింద అమృత్‌సర్‌లోని రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ సెల్‌లో కేసు నమోదు చేశారు.  

అమెరికాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పసియాన్, ఉగ్రవాది హర్విందర్ సింగ్ అలియాస్ రిండా, అర్మేనియాకు చెందిన షంషేర్ సింగ్ అలియాస్ షేరాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం హ్యాపీ పసియాన్, రిండా, షంషేర్‌లు పంజాబ్‌లోని యువతను దేశ వ్యతిరేక కార్యకలాపాల దిశగా పేరేపిస్తున్నారు. హర్‌ప్రీత్ సింగ్, హర్విందర్ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement