sketches
-
కాన్వాస్‌పై.. సిటీ లైఫ్వ్..
నగరవ్యాప్తంగా అర్బన్ స్కెచ్చర్ల ఈవెంట్లు లైవ్ స్కెచ్‌లతో జీవనశైలికి చిత్రరూపం హబ్సిగూడలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలకు గత నవంబరు 9న ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది.. తమ ప్రాంగణంలోకి వచి్చన కొందరు ఔత్సాహిక చిత్రకారులు తమ ల్యాబ్స్ సహా పరిసరాలను బొమ్మలుగా గీస్తుంటే ఆసక్తిగా గమనించడం అంతకు ముందెన్నడూ ఎరుగని అనుభూతి. ‘ఇది మా 298వ స్కెచ్ంగ్ ట్రిప్. శాస్త్రవేత్తల పని చూసినప్పుడు ఎంతో అబ్బురం అనిపించింది. ఆ పని, పరిసరాలు మా కళకు స్ఫూర్తిని అందించాయి’ అంటూ అర్బన్ స్కెచ్చర్స్ ప్రాంతీయ అడ్మిన్స్లో ఒకరైన సయ్యద్ జీషన్ అహమద్ చెప్పారు. నగరాన్నే తమ కాన్వాస్‌గా మార్చుకుని వారాంతాల్లో లైవ్స్కెచ్ డ్రైవ్ నిర్వహిస్తున్న అర్బన్ స్కెచ్చర్స్ ఈ నెలలో 300వ మైలురాయిని చేరుకుంది. ఈ అరుదైన సందర్భాన్ని వీరు నెల రోజుల వేడుకగా మార్చారు. ‘ఒక రోజులో ఒకే ఈవెంట్ జరుపుకునే బదులు, నెల అంతటా నిర్వహించాలని అనుకున్నాం’ అని అర్బన్ స్కెచర్స్ సహ వ్యవస్థాపకుడు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ ఫరాజ్ ఫర్షోరి చెప్పారు. స్కెచ్ వేద్దాం రా.. బొమ్మలు వేద్దాం రా.. అంటూ ఆహా్వనించే ఈ అర్బన్ స్కెచ్చర్స్ అనే గ్రూప్ అమెరికాలో గాబ్రియేల్ క్యాంపెనారియో అనే వ్యక్తి వాషింగ్టన్లో ప్రారంభించిన ఒక అంతర్జాతీయ వేదిక. నగరాల్లో తమకు నచి్చన ప్రదేశాన్ని ఎంచుకుని లైవ్ స్కెచ్ వేసే ఔత్సాహిక చిత్రకారుల నెలవు. నగరంలో ఈ గ్రూపు నవంబర్ 2017లో ట్యాంక్ బండ్‌లోని బోట్ క్లబ్‌ను స్కెచ్ చేయడంతో దాని మొదటి ఈవెంట్ నిర్వహించింది. అప్పటి నుంచి వివిధ ప్రదేశాల్లో వారానికో రెండు గంటల సెషన్ చొప్పున దాదాపు 30–60 మంది సభ్యులు నగర విశేషాలను కాగితంపై బంధిస్తున్నారు. వీరంతా బొమ్మలు గీశాక వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేస్తారు. అలా వీరి అభిరుచి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను ఒకచోట చేర్చింది. ‘మాలో చాలా మంది ప్రొఫెషనల్స్ కాదు, దీనిని వారాంతపు అభిరుచిగా కొనసాగిస్తున్నవారు మాత్రమే’ అని ఫరాజ్ చెప్పారు. అర్బన్ స్కెచ్చర్స్కు చెందిన జీషన్ అహ్మద్ మాట్లాడుతూ.. ‘ఇషాక్, ఫరాజ్ ఫర్షోరీ ఆధ్వర్యంలో హైదరాబాద్ చాప్టర్ ఒక ఐదుగురు మాత్రమే హాజరైన చిన్న స్కెచ్ మీట్‌తో ప్రారంభమైంది, ఇప్పుడు 7–70 సంవత్సరాల వయసు గల ఎందరో సభ్యులకు విస్తరించింది’ అన్నారు. ‘ఇది కళ ద్వారా హైదరాబాద్ ఆత్మను సంగ్రహించే’ ప్రయత్నంగా ఫరాజ్ అభివరి్ణంచారు.కళాత్మక అనుబంధం.. ‘నా పరిసరాలను శ్రద్ధగా గమనించడానికి రికార్డ్ చేయడానికి ఇది గొప్ప మార్గం’ అన్నారు అమెరిగో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ డీ హు. తాను 2021లో వాషింగ్టన్లో ఉన్నప్పుడు అర్బన్ స్కెచ్చర్స్లో చేరారు. ప్రస్తుతం నగరంలో నివసిస్తున్న డీ హు కేఫ్‌లు, డాక్టర్ అపాయింట్మెంట్లకు కూడా తన స్కెచ్‌బుక్ తీసుకెళతారు. తాను స్కెచ్ గీసిన ప్రతి ప్రదేశం తన జీవితంలో భాగమే. ఇది ఫొటో తీయడం కంటే గాఢంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పారామె. గత వారం అర్బన్ స్కెచ్చర్స్ వర్క్‌షాప్‌లో భాగమైన నరేష్ మాట్లాడుతూ, ‘నేను కళ ద్వారా ప్రపంచ సౌందర్యాన్ని కనుగొనాలని అనుకుంటున్నాను’ అని అన్నారు. ‘నాలాంటి ఆసక్తిగల కొత్త వ్యక్తులను కలవడం ద్వారా కొందరు స్నేహితులను సంపాదించుకున్నాను. ఇది నా దినచర్యకు భిన్నం.. ప్రశాంతతని అందించే కళాత్మక థెరపీలా అనిపిస్తుంది’ అన్నారు సుజిత. తన 12 ఏళ్ల కూతురితో ఈ ఈవెంట్‌కు హాజరైన మరో గృహిణి మాట్లాడుతూ.. ‘నా బిడ్డ కేవలం సోషల్ మీడియాతో మమేకం అయిపోవడం నాకు ఇష్టం లేదు. తను స్క్రీన్లకు మించిన జ్ఞాపకాలను పొందాలని కోరుకుంటున్నాను’ అన్నారు.ట్రిపుల్ సెంచురీ.. ఈవెంట్ల సందడి.. ఈ నెల తమ ఈవెంట్ల సంఖ్య 300కి చేరుకున్న సందర్భంగా వీరు మరింత తరచూ స్కెచి్చంగ్ ట్రిప్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత ఆదివారం అబిడ్స్‌లో ఈ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ ఆరి్టస్ట్స్ సభ్యులు సండే బుక్ ఫెయిర్, తాజ్ మహల్ హోటల్, మొజామ్జాహి మార్కెట్లను స్కెచ్‌గా వేశారు. గత డిసెంబర్ 8న బంజారాహిల్స్‌లో జరిగిన స్కెచ్చింగ్ సెషన్లో లామకాన్, జీవీకే మాల్, సిటీ సెంటర్ షాపింగ్ ఏరియా కవర్ చేశారు. ఇక డిసెంబర్ 22లోపు.. ఓల్డ్ సిటీలో బారా గల్లి, హుస్సేనీ ఆలం, చారి్మనార్.. వీరి మెనూలో ఉన్నాయి.ఎవరైనా సరే వెల్కమ్.. ‘సమూహంలో చేరడానికి నైపుణ్యం స్థాయి ఏదీ అడ్డంకి కాదు. ప్రొఫెషనల్ ఆరి్టస్ట్ కానవసరం లేదు. అయితే ఇందులో పాల్గొనేవారు తమ సొంత స్టేషనరీని తీసుకురావాలని, ఎంచుకున్న ప్రదేశంలో కనిపించిన దేనినైనా సరే స్కెచ్‌గా గీయవచ్చు’ అని జీషన్ వివరించారు. వర్ధమాన చిత్రకారులు రాణించడంలో సహాయపడుతూ వాటర్ కలర్స్, స్కెచి్చంగ్, చార్క్కోల్ డ్రాయింగ్ వంటి ప్రాథమిక విషయాలపై ఉచిత వర్క్‌షాప్‌లను కూడా అర్బన్ స్కెచ్చర్స్ నిర్వహిస్తోంది. వారాంతాల్లో ఈ సెషన్లకు హాజరు కావాలనిఇ అనుకున్నవారు సోషల్ మీడియా పేజీల ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. -
Jammu-Kashmir: ఈ ఉగ్రవాదుల ఆచూకీ చెబితే రూ. 5 లక్షల రివార్డు
ఇటీవలి కాలంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు కలకలం సృష్టిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య పలుచోట్ల ఎదురుకాల్పులు జరిగాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని కథువా పోలీసులు నలుగురు ఉగ్రవాదుల స్కెచ్లను విడుదల చేశారు. ఈ ఉగ్రవాదులు చివరిసారిగా ధోక్ ఆఫ్ మల్హర్, బానీ, సియోజ్ధర్లో కనిపించారు. వీరికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. జూన్ 9న రియాసీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత జమ్మూ డివిజన్లో తీవ్రవాద ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. శివఖోడి నుంచి వైష్ణోదేవికి వెళ్తున్న బస్సును ఉగ్రవాదులు చుట్టుముట్టారు. అనంతరం డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, బస్సు అదుపు తప్పి కాలువలో పడింది. అనంతరం ఉగ్రవాదులు బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మదిమంది మరణించగా, 41 మంది గాయపడ్డారు.ఈ దాడి జరిగిన రెండు రోజుల తరువాత కథువాలో రెండు ఉగ్రవాద ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 11న జమ్మూ డివిజన్లోని కథువా, దోడా, భదర్వాలో ఉగ్రదాడులు జరిగాయి. నాటి ఎన్కౌంటర్లో భారత సైనికులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. Kathua Police releases sketches of 04 terrorists who were last seen in dhoks of Malhar , Bani & Seojdhar. A reward of 05lakhs on each terrorist for an actionable information. Anyone with credible information of terrorists will also be suitably rewarded.@JmuKmrPolice@ZPHQJammu pic.twitter.com/FsBG1qdZdt— Kathua Police (@KathuaPolice) August 10, 2024 -
13 నెలల్లో 9 మంది మహిళల హత్యలు.. సీరియల్ కిల్లర్ హస్తం?
ఉత్తరప్రదేశ్‌లో మహిళల వరుస హత్యలు ఆందోళన రేపుతున్నాయి. బరేలీజిల్లాల్లోని గ్రామీణప్రాంతాల్లో గత 14 నెలలుగా 9 మంది మహిళలు ఒకేలా హత్యకు గురుయ్యారు. మరణించిన మహిళల వయసు కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉండటం గమనార్హం. అయితే వీరందరి మరణాల వెనక ఓ సీరియల్ కిల్లర్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.షాహీ, షీష్‌గఢ్, షెర్‌గఢ్.. ఈ మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని మహిళలే టార్గెట్‌గా ఈ హత్యలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. 45 నుంచి 55 సంవత్సరాల వయసున్న మహిళలను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి వారి చీరలతోనే గొంతు నులిమి చంపినట్లు బయటపడింది. . అయితే మృతులను దుస్తులు చిందరవందర అయిన స్థితిలో గుర్తించారు. కానీ.. ఎవరిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు కనిపించలేదు. వరుస హత్యలతో పరిసర గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.గత ఏడాది జూన్‌లో మూడు హత్యలు, జూలై, ఆగస్టు, అక్టోబర్లలో ఒక్కొక్కటి, నవంబర్‌లో రెండు హత్యలు జరిగాయి. అయితే హత్యల వెనక అనేక అంశాలు ఒకేలా ఉండటంతో ఈ కేసుల్లో సీరియల్ కిల్లర్ హస్తం ఉన్నట్లు భావిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయితే 8వ హత్య జరిగిన తర్వాత 300 మంది పోలీసులతో కూడిన అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. యూనిఫారంతో కొందరు, సివిల్ దుస్తుల్లో కొందరు మొత్తం 14 బృందాలుగా విడిపోయి ఈ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. పెట్రోలింగ్ నిర్వహించారు. పాత నేరస్థులపై కూడా నిఘా పెట్టారు. దీంతో కొంతకాలం హత్యలు జరగలేదు. గతేడాది నంబర్ నుంచి ఒక్క హత్య కూడా జరగలేదు. దీంతో స్థానికులు, పోలీసులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఈ నెల ఆగస్టులో జరిగింది. మరో హత్యతో..7 నెలలపాటు ఎలాంటి హత్యా జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకుంటున్న వేళ గడిచిన నెల జూలై 9వ హత్య జరిగింది. అనిత అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. మునుపటి హత్యల మాదిరిగానే ఆమె మృతదేహాన్ని కూడా చెరకు తోటలోనే గుర్తించారు. షేర్‌ఘర్‌లోని భుజియా జాగీర్ గ్రామానికి చెందిన అనిత ఖిర్కా గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. జులై 2న డబ్బు విత్ డ్రా చేయడానికి ఇంటి నుంచి బ్యాంక్‌కు వెళ్లి తిరిగి రాలేదు. చెరకు తోటలో ఆమె మృతదేహం కనిపించింది. ఆమె చీరతోనే గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్గంలో తేలింది.దీంతో గతేడాది జరిగిన హత్యల వెనుక ఉన్న సీరియల్ కిల్లరే ఈ హత్య కూడా చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జులైలో జరిగిన హత్యను గమనించిన తర్వాత అనుమానాలు మరింత బలపడ్డాయని ఓ అధికారి తెలిపారు. హత్యలు జరిగిన ప్రాంతాలకు చెందిన పలువురితో మాట్లాడిన పోలీసులు ముగ్గురు అనుమానితుల స్కెచ్లను తాజాగా విడుదల చేశారు. ఏమైనా సమాచారం తెలిస్తే బరేలీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సౌత్) కార్యాలయాన్ని సంపద్రించాలని కోరారు. -
రణ్వీర్ దశావతార్
తమ అభిమాన హీరో బొమ్మ గీసి ముచ్చటపడే అభిమానులు మనకు కొత్తేమీ కాదు. అయితే బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ అభిమాని పౌమిల్ కత్రి వినూత్న శైలితో తన అభిమానాన్ని చాటుకున్నాడు. రకరకాల స్కెచ్‌లు ఉన్న పరికరంతో కాన్వాస్‌పై ఒకే సమయంలో వివిధ సినిమాలలోని రణ్వీర్ క్యారెక్టర్లను గీసి నెటిజనులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ‘మేడ్ 10 స్కెచెస్ ఆఫ్ రణ్‌వీర్‌సింగ్ ఎట్ ఏ సేమ్ టైమ్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసి ముచ్చటపడిన రణ్‌వీర్‌సింగ్ పౌమిల్ను ప్రశంసిస్తూ కామెంట్ పెట్టడం మరో విశేషం. ఇక టాలెంటెడ్ ఆర్టిస్ట్ పౌమిల్ కత్రి విషయానికి వస్తే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన కత్రికి ఇన్‌స్టాగ్రామ్‌లో వందలాదిమంది ఫాల్వర్స్ ఉన్నారు. -
అయోధ్య:హాస్య బ్రహ్మా అద్భుతమైన స్కెచ్!
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తన నటనతో అందరిని ఎంత నవ్విస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ డైలాగ్ చెప్పినా ప్రేక్షకులు పడిపడి నవ్వాల్సిందే. ఆయనలో నటన మాత్రమే కాదు, ఏ టాఫిక్ గురించి అయినా ధారాళంగా మాట్లాడగలరు. అదేవిధంగా ఆయనలో ఇంకా ఎన్నో అద్భుతమైన కళలు కూడా దాగున్నాయి. పెన్సిల్ స్కెచ్‌లు కూడా ఎంతో చక్కగా గీయగలరు. అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా ఇప్పుడు ఆయన వేసిన ఒక స్కెచ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. శ్రీరాముడు ఆంజనేయుడిని గుండెలకు హత్తుకుంటున్న ఆ సెచ్క్ను ఎంతో అందంగా గీశారు హాస్యబ్రహ్మ. ఆ చిత్రాన్ని చూస్తే ఎవరైనా పులకించిపోవాల్సిందే. Another lovely pencil sketch by Hasya Brahma #Brahmanandam #TheArtandTheArtist pic.twitter.com/kpsB5ot1RF — Shreyas Group (@shreyasgroup) August 5, 2020 -
మహమ్మారిపై ‘శృతి’ స్కెచ్‌లు అద్భుతం
సాక్షి, హైదరాబాద్: కరోనా గురించి చాలా మంది ఆర్టిస్ట్‌లు వివిధ రకాలుగా స్కెచ్‌లు వేస్తూ తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు. అయితే వీటిలో అర్బన్ స్కెచర్ / ఆర్టిస్ట్ శృతి దేవులపల్లి వేసిన స్కెచ్‌లు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆర్బన్ స్కెచింగ్ అంటే మన దైనందిన జీవితంలో జరిగే అంశాలను ప్రధానంగా తీసుకొని వాటిని గీయడం. ఈ మధ్య ఇలాంటి స్కెచ్‌కి ఆదరణ పెరుగుతోంది. అందులోనూ ప్రస్తుత మహమ్మారిని ఎదురించడంలో అహర్నిశలు పనిచేస్తున్న వారికోసం శృతి గీసిన స్కెచ్‌లు అందరి మన్ననలు పొందుతున్నాయి. కరోనాకు ముందు ప్రపంచ దేశాలు ఎలా ఉండేవి, కరోనా తరువాత దేశాలు ఎలా ఉన్నాయి అనే విషయానికి సంబంధించి శృతి గీసిన పెయింటింగ్ అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది. కరోనాకి ముందు దేశాలన్నీ వేటికి అవే వేరుగా ఉంటూ, ఒకదేశంపై మరొకటి ధ్వేషభావంతో ఉండేవి. పెద్ద పెద్ద దేశాలన్ని విధ్వేషపూరిత వైషమ్యాలతో ఉంటే చిన్న దేశాలు బాధతో సాయం కోసం ఎదురుచూస్తూ ఉండేవి. కానీ కరోనా మహమ్మారి కారణంగా దేశాలన్నింటినీ ఏకం చేసిన తీరును వివరిస్తూ కనిపించని ఈ మహమ్మారిపై యుద్దం చేయడానికి తమ మధ్య ఉన్న విబేధాలన్నింటిని పక్కన పెట్టి ఒక్కటైన తీరును ప్రతిబింబించేలా శృతి వేసిన స్కెచ్ అద్భుతంగా ఉంది. అదే విధంగా కరోనా నుంచి దేశాన్ని కాపాడటానికి నిరంతరం పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులకు సెల్యూట్ చేస్తూ సేవియర్స్ ఆఫ్ సాగా పేరుతో శృతి వేసిన స్కెచ్లను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ కు మంచి ఆదరణ లభిస్తోంది. శృతి స్కెచ్‌లు ఎంతో మంది ప్రశంసలు పొందుతున్నాయి. -
సీఎం వైఎస్ జగన్ పెన్సిల్ స్కెచ్ ఎగ్జిబిషన్
-
ఫ్లిప్‌కార్ట్‌పై ‘స్కెచర్స్’ కేసు!
మీరు అమెజాన్‌లోనో, ఫ్లిప్కార్ట్లోనో కాస్త తక్కువ ధరకు వస్తోంది కదా అని ‘ఐఫోన్’ కొన్నారు. అది మీకు అనుకున్న సమయంలోనే డెలివరీ అయింది. ఫోన్ చూడటానికి చాలా బాగుంది. వాడుతున్నపుడు కూడా బాగుంది. కాకపోతే ఓ ఐదు వారాలు గడిచాక చిన్న రిపేపు వచ్చింది. ఏమైందో తెలుసుకుందామని సర్వీస్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ దాన్ని విప్పి చూసిన సర్వీస్ సెంటర్ సిబ్బంది... అది నకిలీదని చెప్పారు. మీరేం చేస్తారు? మీరు కొన్న ఈ– కామర్స్ సంస్థకు తిరిగి ఇచ్చేద్దామంటే అప్పటికే రిటర్న్ చేయటానికిచ్చిన గడువు అయిపోయింది. పోనీ యాపిల్ ఆథరైజ్డ్ డీలర్‌ను అడుగుదామనుకుంటే మీరు కొన్నది ఆన్లైన్లో... వారికెలాంటి సంబంధం ఉండదు. మీకు అమ్మిన వ్యక్తినో, సంస్థనో అడిగితే... తనకు ఈ–కామర్స్ సంస్థ నుంచి డబ్బులొచ్చేశాయి కనక జవాబుండదు. మరేం చేస్తారు..? మోసపోవాల్సిందేనా..? ఇదంతా ఇపుడెందుకంటే... తమ బ్రాండ్ పేరిట నకిలీ ఉత్పత్తులు విక్రయించారంటూ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై అమెరికాకు చెందిన పాదరక్షల దిగ్గజం ‘స్కెచర్స్’ కేసు వేసింది. ఇలాంటి వ్యవహారాలపై ఈ–కామర్స్ సంస్థలేమంటున్నాయి? సెల్లర్స్ ఏమంటున్నారు? కస్టమర్లు ఏం చేయాలి? వీటిలో ఎవరి బాధ్యత ఎంత? వీటన్నింటినీ వివరించేదే ఈ ‘సాక్షి’ ప్రత్యేక కథనం... హైదరాబాద్, న్యూఢిల్లీ– సాక్షి బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’పై అమెరికాకు చెందిన అథ్లెటిక్ ఫుట్‌వేర్ బ్రాండ్ ‘స్కెచర్స్’ కేసు వేసింది. నకిలీ వస్తువుల విక్రయానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు దాఖలు చేసింది. తన బ్రాండ్ నకిలీ ప్రొడక్టులను విక్రయించినందుకు రిటైల్ నెట్, టెక్ కనెక్ట్, యూనికెమ్ లాజిస్టిక్స్, మార్కో వేగన్ అనే సెల్లర్స్‌పై కూడా కేసులు పెట్టింది. కోర్టు నియమించిన స్థానిక కమిషనర్ల సాయంతో ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని ఏడు గిడ్డంగులపై దాడి చేసి నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు స్కెచర్స్ తెలియజేసింది. ఈ నలుగురు సెల్లర్స్ దాదాపు 15,000 జతలకు పైగా తమ బ్రాండ్ నకిలీ ‘షూ’లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులకు విక్రయించినట్లు స్కెచర్స్ ఆరోపించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి మాత్రం దీంట్లో తమ బాధ్యత లేదని స్పష్టంచేశారు. కస్టమర్లకు, సెల్లర్స్‌కు మధ్య తాము కేవలం మధ్యవర్తిగా మాత్రమే ఉంటామని చెప్పారాయన. ఈ–కామర్స్ సంస్థల ద్వారా నకిలీ ఉత్పత్తులు విక్రయించినట్లు ఆరోపణలు రావటం ఇది మొదటిసారి కాదు. గత మూడేళ్లలో చూస్తే.. టామీ హిల్ఫిగర్, లాకోస్ట్, కెల్విన్ క్లీన్, లెవీస్, సూపర్‌డ్రై వంటి సంస్థలు వేర్‌హౌస్‌లపై దాడి చేసి నకిలీ ఉత్పత్తులను అడ్డుకున్నాయి. వస్తువును పర్యవేక్షించే వ్యవస్థ ఎక్కడుంది? ఈ–కామర్స్ వ్యాపారం ఎలా నడుస్తుందంటే... కస్టమర్ ఏదైనా ప్రోడక్టును ఆన్లైన్లో బుక్ చేయగానే ఆ సమాచారం ఈ–కామర్స్ కంపెనీ ద్వారా దాన్ని విక్రయించే సెల్లర్‌కు వెళుతుంది. సెల్లర్ ఆ ఉత్పాదనను కస్టమర్‌కు కొరియర్ ద్వారా పంపిస్తాడు. కస్టమర్ చెల్లించిన డబ్బులు సెల్లర్‌కు కాకుండా ఈ–కామర్స్ కంపెనీకి చేరతాయి. రిటర్న్ పాలసీ ప్రకారం... ఉత్పత్తి నచ్చకపోయినా, నాణ్యత లేకున్నా ఉత్పాదనను బట్టి గరిష్ఠంగా 30 రోజుల్లో వెనక్కిచ్చి మరొకటి పొందవచ్చు. లేదా తన సొమ్ము తను పొందవచ్చు. ఎందుకంటే రిటర్న్ గడువు ముగిసేదాకా... కస్టమర్ చెల్లించిన మొత్తం ఈ–కామర్స్ సంస్థ ఖాతాలోనే ఉంటుంది. రిటర్న్ గడువు ముగిశాకే ఆ డబ్బు సెల్లర్ ఖాతాలోకి వెళ్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. కస్టమర్‌కు సెల్లర్ నుంచి ఉత్పత్తి చేరడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి... నేరుగా విక్రేతే కొరియర్ ద్వారా కస్టమర్‌కు పంపించటం. రెండోది.. విక్రేత ఆ ఉత్పత్తిని ఈ–కామర్స్ కంపెనీకి పంపిస్తాడు. అది ఈ–కామర్స్ కంపెనీ గిడ్డంగిని చేరి... అక్కడి నుంచి కస్టమర్‌కు వస్తుంది. నిజానికి సెల్లర్ నేరుగా కస్టమర్‌కు ఉత్పత్తిని పంపేటపుడు అది నకిలీదా, అసలైనదా అని పర్యవేక్షణ చేసే అవకాశం ఈ–కామర్స్ కంపెనీకి ఎటూ ఉండదు. ఇక గిడ్డంగికి వచ్చే వస్తువుల్ని పర్యవేక్షించే అవకాశం ఉన్నా... అక్కడా అలాంటిదేమీ జరగటం లేదన్నది సెల్లర్ల మాట. ‘‘సెల్లర్ నుంచి గిడ్డంగికి చేరిన ఉత్పాదనలకు సీల్ ఉందా లేదా అని మాత్రమే అక్కడి సిబ్బంది చూస్తున్నారు. మా నుంచి 2 శాతం కమిషన్ తీసుకుని గిడ్డంగుల్లో సరుకు నిల్వ చేస్తారు. ప్యాక్‌లో ఉత్పాదన ఉందా లేదా, అసలుదా / నకిలీదా అని చూసే వ్యవస్థ అక్కడ లేదు. ఒకవేళ కస్టమర్ల నుంచి ఫిర్యాదు అందితే అమ్మకాలు జరుపకుండా సెల్లర్‌ను నిషేధిస్తారు. అయితేనేం! కొత్తపేరుతో వారు తిరిగి వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సెల్లర్ రిజిస్ట్రేషన్ ఎటూ ఉచితమే’’ అని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సెల్లర్ ఒకరు వ్యాఖ్యానించారు. భారీ డిస్కౌంట్‌తో దొరుకుతున్నపుడు కస్టమర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారాయన. నకిలీలు అరికట్టడం అసాధ్యం..! ఆన్లైన్లో ప్రతిరోజూ లక్షల ఉత్పత్తులు పోస్ట్ అవుతాయి. మొత్తంగా కోట్ల ఉత్పత్తులు కొలువుదీరతాయి. వీటన్నిటిపైనా పూర్తి స్థాయి పర్యవేక్షణ సాధ్యం కాదని ప్రముఖ ఈ–కామర్స్ కంపెనీ డైరెక్టర్ ఒకరు స్పష్టం చేశారు. ‘‘మీరొక షాపింగ్ మాల్‌కు వెళ్లారు. ఆ మాల్లోని ఓ షాపులో నకిలీ వస్తువు అమ్మారని అనుకుందాం. అపుడు తప్పు షాపు వారిదే తప్ప మాల్ నిర్వాహకులది ఎలా అవుతుంది? మా విషయంలోనూ అంతే. మేం మార్కెట్ ప్లేస్ విధానాన్ని అనుసరిస్తున్నాం. విక్రేతే బాధ్యుడు. నకిలీలకు చాలా మటుకు అడ్డుకట్ట వేస్తున్నా ఇలాంటి సంఘటనలు అపుడపుడు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని ఈ–కామర్స్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా విక్రేతలను చేర్చుకుని వ్యాపారం చేయడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి’’ అని ఆయన వివరించారు. అయితే మొబైల్స్ విక్రయంలో ఉన్న రిటైల్ చైన్ కంపెనీ ప్రతినిధి ఒకరు దీనిపై స్పందిస్తూ... ‘‘ఆన్లైన్ కస్టమర్లకు తాము కొనుగోలు చేసే వస్తువును విక్రయిస్తున్నది ఎవరో తెలియదు. వారికి తెలిసిందల్లా సదరు ఆన్లైన్ సంస్థ మాత్రమే. ఆ సంస్థపై భరోసాతోనే వస్తువులు కొనుగోలు చేయటానికి ముందుకొస్తారు. అలాంటిది ఉత్పత్తుల నాణ్యతకు తాము బాధ్యులం కాదని తప్పించుకుంటే ఎలా?’’ అని ఆయన ప్రశ్నించారు. ఉత్పత్తుల నాణ్యత బాధ్యత వారిదేనని అన్నారు. కంపెనీలు ఇలాగే వాదిస్తే ఆఫ్‌లైన్‌లో కొనడమే బెటరని కస్టమర్లు భావిస్తారని చెప్పారాయన. వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించొచ్చు కస్టమర్ తనకు నచ్చిన ఉత్పాదనను ఈ–కామర్స్ కంపెనీ వెబ్సైట్లో చూశాకే బుక్ చేస్తారు. డబ్బులు చెల్లించేది కూడా ఈ కంపెనీకే. అంటే కస్టమర్, ఈ–కామర్స్ కంపెనీ మధ్యే కాంట్రాక్టుంటుంది. కంపెనీకి, విక్రేతకు మధ్య ప్రత్యేక ఒప్పందం ఉన్నా... సదరు ఉత్పాదనకు విక్రేతనే బాధ్యుడంటూ బాహాటంగా వెబ్సైట్లో, బిల్లు మీద ఈ–కామర్స్ కంపెనీలు స్పష్టం చేసినా... చట్టం నుంచి తప్పించుకోజాలరు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం నాణ్యమైన ఉత్పత్తులే విక్రయించాలి. ఉత్పాదన సహజ గుణాన్ని బట్టి నిర్దేశిత కాలం ఎలాంటి సమస్య లేకుండా పని చేయాలి. బాధితులు రెండేళ్లలో వినియోగదారుల కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే సమస్య రాగానే కంపెనీతో కస్టమర్ సంప్రతింపులు జరపాలి. మొత్తంగా వస్తువు పాడైనా, నకిలీదిచ్చినా ఈ–కామర్స్ కంపెనీ, విక్రేత ఇద్దరూ బాధ్యత వహించాల్సిందేనని చట్టం చెబుతోంది. – వేముల గౌరీశంకర రావు, న్యాయవాది, రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్ -
నిందితుల ఊహాచిత్రాలు ఇవే..
మూఢనమ్మకాలు, దురాచారాల నిర్మూలనకు రాజీలేని పోరాటం చేసిన ప్రముఖ హేతువాది, వైద్యుడు, జర్నలిస్టు నరేంద్ర దబోల్కర్ హత్యకేసులో నిందితుల ఊహాచిత్రాలను గురువారం సీబీఐ అధికారులు విడుదలచేశారు. పలువురు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా రూపొందించిన ఇద్దరు యువకుల ఊహాచిత్రాలను మహారాష్ట్రలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపారు. ఈ పోలికలో ఉన్న వ్యక్తులపై తమకు సమాచారం అందించాల్సిందిగా ప్రజలను కోరారు. 2013 ఆగస్టు 21న పుణేలోని ఓంకారేశ్వర్ దేవాలయ సమీపాన ఉన్న వంతెనపై ఉదయం 7.30 గంటలకు మార్నింగ్‌వాక్ చేసి వస్తుండగా డాక్టర్ నరేంద్ర దబోల్కర్పై ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపారు.స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దబోల్కర్ ససూన్ ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే దబోల్కర్ మరణించారని వైద్యులు వెల్లడించారు. ఆ ఘటనపై కేసు దర్యాప్తునకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దబోల్కర్ హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. నిందితుల ఊహాచిత్రాల విడుదలతో కేసులో పురోగతి సాధించామని, హత్యకు పాల్పడి కూడా సంఘంలో స్వేచ్ఛగా తిరుగుతోన్న హంతకులను తర్వరలోనే పట్టుకుంటామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. -
ముంబై గ్యాంగ్ రేప్: పోలీసుల అదుపులో నిందితులు !
దేశవాణిజ్య రాజధాని ముంబైలో కలకలం సృష్టించిన మహిళ ఫోటో జర్నలిస్ట్ (23)పై సామూహిక అత్యాచార ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆ ఘటనకు సంబంధించిన కేసులో ఐదుగురి నిందితుల ఊహ చిత్రాలను ఉన్నతాధికారులు శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. ఆ ఘాతుకానికి పాల్పడిన ఐదుగురు నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వారు నిందితుల కోసం జల్లెడ పడుతున్నారని, అలాగే ఈ కేసును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించినట్లు పోలీసు అధికారులు వివరించారు. ఆ ఘటనకు సంబంధించిన ఇప్పటి వరకు 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించామని చెప్పారు. వారిలో నలుగురు తమ అదుపులోనే ఉన్నారని చెప్పారు. వారిని తమదైన శైలీలో విచారిస్తున్నామని పేర్కొన్నారు. సామూహిక అత్యాచారం చేసిన నిందితుల వివరాలను మహిళ జర్నలిస్ట్ అసిస్టెంట్ వివరించారని ఈ సందర్బంగా పోలీసు అధికారులు తెలిపారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా కొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అత్యాచారానికి గురైన మహిళ జర్నలిస్ట్ జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని పోలీసులు తెలిపారు. అత్యాచారం వల్ల ఆమె శరీరంలో అంతర్గంతంగా గాయాలు అయ్యాయని వైద్యులు వివరించినట్లు చెప్పారు. గురువారం సాయంత్రం మహాలక్ష్మీ పరిసర ప్రాంతంలో శక్తి మిల్ ప్రాంగణంలో విధి నిర్వహణలో భాగంగా ఆమె స్నేహితుడితో కలసి ఫోటో తీసుకుంటున్న మహిళ జర్నలిస్ట్‌ను స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో మహిళ జర్నలిస్ట్ అసిస్టెంట్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అతడిని కట్టిపడేశారు. అనంతరం ఆ ఐదుగురు యువకులు ఆ మహిళ ఫోటో జర్నలిస్ట్ పై సామూహిక అత్యాచారం చేశారు. ఆ మహిళ ప్రస్తుతం జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.