
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తన నటనతో అందరిని ఎంత నవ్విస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ డైలాగ్ చెప్పినా ప్రేక్షకులు పడిపడి నవ్వాల్సిందే. ఆయనలో నటన మాత్రమే కాదు, ఏ టాఫిక్ గురించి అయినా ధారాళంగా మాట్లాడగలరు. అదేవిధంగా ఆయనలో ఇంకా ఎన్నో అద్భుతమైన కళలు కూడా దాగున్నాయి. పెన్సిల్ స్కెచ్‌లు కూడా ఎంతో చక్కగా గీయగలరు. అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా ఇప్పుడు ఆయన వేసిన ఒక స్కెచ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. శ్రీరాముడు ఆంజనేయుడిని గుండెలకు హత్తుకుంటున్న ఆ సెచ్క్‌ను ఎంతో అందంగా గీశారు హాస్యబ్రహ్మ. ఆ చిత్రాన్ని చూస్తే ఎవరైనా పులకించిపోవాల్సిందే.
Another lovely pencil sketch by Hasya Brahma #Brahmanandam #TheArtandTheArtist pic.twitter.com/kpsB5ot1RF
— Shreyas Group (@shreyasgroup) August 5, 2020