Brahmanadam
-
సీఎం కేసీఆర్‌ను కలిసి బ్రహ్మానందం
-
భోళా శంకర్ సినిమాలో చిరంజీవి,బ్రహ్మానందం సూపర్ హిట్ కామెడీ
-
బ్రహ్మానందం 20 టేకులు చెప్పినా చేసేవారు: కృష్ణవంశీ
‘‘ప్రతి నటుడిలో విభిన్న కోణాలు ఉంటాయి. వాటిని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించడం నాకు ఇష్టం. విలన్‌గా చేస్తున్న చలపతిరావుగారిని ‘నిన్నే పెళ్లాడతా’లో మంచి తండ్రిగా చూపించాను. బ్రహ్మానందంగారిలోని మరో నటుణ్ణి ‘క్షణం క్షణం’లో చూశాను. అందుకే ‘రంగ మార్తాండ’లోని చక్రి పాత్రలో ఆయన్ని ఊహించుకునే ధైర్యం చేశా.. ఆయన పాత్ర అద్భుతంగా వచ్చింది’’ అన్నారు డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, ఆదర్శ్, అనసూయ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలైంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ– ‘‘మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’ ప్రకాశ్‌రాజ్‌కి బాగా నచ్చింది. నన్నా సినిమా చూసి, స్క్రీన్‌ప్లేలో సాయం చేయమన్నాడు. నాలాంటి రాక్షసుడితోనే కంటతడిపెట్టించిన చిత్రమిది. ఆ తర్వాత నాకు తోచిన మార్పులు ప్రకాశ్‌రాజ్‌కి చెబితే.. ‘ఈ సినిమాకి నువ్వే దర్శకత్వం వహిస్తే బాగుంటుంది’ అనడంతో ఓకే అన్నాను. మనుషులపై నాకు ఇంకా నమ్మకం పోలేదు. ఓ మంచి సినిమా తీస్తే ఆదరిస్తారనే నా నమ్మకాన్ని వారు ‘రంగమార్తాండ’ ద్వారా నిజం చేశారు. 1250కి పైగా సినిమాలు చేసిన బ్రహ్మానందంగారు ఒక్కో సీన్‌కి పదీ ఇరవై టేకులు చెప్పినా చేసేవారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందంగారి నటన, ఇళయరాజాగారి సంగీతం సినిమాకి హైలైట్. శివాత్మిక, అనసూయ, రాహల్, ఆదర్స్ బెస్ట్ ఇచ్చారు. చిరంజీవిగారి వాయిస్ ఓవర్ ప్లస్సయింది’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు బ్రహ్మానందం. -
ఇండస్ట్రీలో ఆ తేడా లేదు: బ్రహ్మానందం
‘‘చిత్ర పరిశ్రమలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఓ మూవీ కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తారు. సినిమా బాగుంటే అదే హిట్ అవుతుంది’’ అని నటులు బ్రహ్మానందం అన్నారు. వెంకట్ కల్యాణ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’. గాయత్రీ పటేల్ హీరోయిన్. అబుజా, శ్రీలీల ఎంటర్టైన్మెంట్స్పై సీహెచ్ క్రాంతి కిరణ్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని బ్రహ్మానందం ఆదివారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘హాస్య నటులు తీసే సినిమాలన్నీ సక్సెస్ కావాలని, హాస్యం బయటకు రావాలని మా గురువు జంధ్యాలగారు చెప్పేవారు. హాస్యాన్ని బతికించాలని కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ వేడుకకి వచ్చాను’’ అన్నారు. ‘‘నిర్మాతలు రైతుల్లాంటి వాళ్లు.. ప్రేక్షకులకు వినోదాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాం. ఈ మూవీ రెండో భాగం ఉంటుంది.. అన్నీ కుదిరితే బ్రహ్మానందంగారు నటిస్తారు’’ అన్నారు సీహెచ్ క్రాంతి కిరణ్. ‘‘పూర్తి కామెడీ డ్రామాగా రూపొందిన సినిమా ఇది’’ అన్నారు వెంకట్ కల్యాణ్. ఈ చిత్రానికి కెమెరా: జీకే యాదవ్ బంక, సంగీతం: అర్జున్ నల్లగొప్పుల. -
నన్ను కామెడియన్‌గా మాత్రమే చూడలేదు..: బ్రహ్మానందం భావోద్వేగం
Bahmanandam Emotional Request To His Fans: ‘హాస్య బ్రహ్మా’, ప్రముఖ నటుడు బ్రహ్మానందం ఓ వీడియో పంచుకున్నారు. ఆయన నటించిన ‘తెలంగాణ దేవుడు’ మూవీ ప్రమోషన్లో భాగంగా ఆయన ఓ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు బ్రహ్మానందం మాట్లాడుతూ.. తెలంగాణ దేవుడు ఓ సందేశాత్మక చిత్రమన్నారు. రేపు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందానికి ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు శ్రీకాంత్, సంగీతలు వారి నటనతో ప్రాణం పోశారని బ్రహ్మానందం కొనియాడారు. చదవండి: బ్రహ్మానందంకు నితిన్ షాక్, ఆ మూవీ నుంచి బ్రహ్మీ తొలగింపు! డైరెక్టర్ హరీశ్ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సినిమాను తెరకెక్కించారని, సమర్థవంతమైన దర్శకుడని ప్రశంసించారు. తన పాత్ర కూడా సినిమాలో చాలా బాగుంటుందన్నారు. తనను కేవలం కామెడీగా మాత్రమే చూడకుండా... హీరో గురువైన మృత్యుంజయ శర్మ పాత్రను తనకిచ్చారని అన్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైందన్నారు. కొంచెం జాప్యం జరిగినా దర్శకుడు సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడని కొనియాడారు. కాగా, ఈ సినిమాను జీషన్ ఉస్మానీ నిర్మించగా.. నందన్ బొబ్బిలి స్వరాలు సమకూర్చారు. చదవండి: పెళ్లి ఎప్పుడో చెప్పిన విష్ణు ప్రియ, ఆలోపే మింగిల్ అవుతానన్నా యాంకర్ -
ఆ కమెడియన్‌ను ఫాలో అవుతున్న బ్రహ్మీ!
నటుడు బ్రహ్మానందం కమెడియన్‌గా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. కామెడీ అంటే బ్రహ్మీ.. బ్రహ్మీ అంటే కామెడీ అనేంతగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ హాస్యాన్ని పండిస్తాడు. ఇలా హాస్యా బ్రహ్మగా పేరు తెచ్చుకున్న ఆయన తన తాజా చిత్రంలో జబర్తస్థ్ కమెడియన్‌ను ఫాలో అవుతున్నారట. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలు తగ్గించిన బ్రహ్మీ.. ప్రస్తుతం ‘రంగమార్తండ’లో నటిస్తున్నాడు. దీనితో పాటు ఆయన నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న ‘పెళ్లి సందడి’లో నటిస్తున్నాడు. ఈ పెళ్లి సందడిను కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో గేటప్ శ్రీనును బ్రహ్మీ కాపీ కొడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా జబర్థస్త్ కామెడీ స్టేజ్‌పై ఎన్నో రకాల పాత్రలు పోషించి నవ్వులు పూయించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు శ్రీను. అందులో అతడు వేసిన బిల్డప్ బాబాయి పాత్ర ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రను అదే తరహాలో దర్శకుడు రాఘవేంద్రరావు ‘పెళ్లి సందD’లో పెట్టినట్లుగా సమాచారం. ఈ పాత్రకు బ్రహ్మీనే సంప్రదించడం.. ఆయన దీనికి ఒకే చెప్పడం విశేషం. అలా బ్రహ్మీ ఈ మూవీలో గెటప్ శ్రీనును అనునాయించనున్నాడట. ఏకంగా హాస్యా బ్రహ్మా.. గెటప్ శ్రీనును ఫాలో అవుతుండటంతో అతడి క్రేజ్ మరింత పెరగనుందని చెప్పుకొవచ్చు. కాగా ఈ సినిమాలో రోషన్‌కు జోడిగా శ్రీలీల హీరోయిన్గా పరిచయం కానుంది. చదవండి: టీజర్ హిట్.. రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య వైరల్ అవుతోన్న జూ. ఎన్టీఆర్ అరుదైన వీడియో.. -
అయోధ్య:హాస్య బ్రహ్మా అద్భుతమైన స్కెచ్!
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తన నటనతో అందరిని ఎంత నవ్విస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏ డైలాగ్ చెప్పినా ప్రేక్షకులు పడిపడి నవ్వాల్సిందే. ఆయనలో నటన మాత్రమే కాదు, ఏ టాఫిక్ గురించి అయినా ధారాళంగా మాట్లాడగలరు. అదేవిధంగా ఆయనలో ఇంకా ఎన్నో అద్భుతమైన కళలు కూడా దాగున్నాయి. పెన్సిల్ స్కెచ్‌లు కూడా ఎంతో చక్కగా గీయగలరు. అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా ఇప్పుడు ఆయన వేసిన ఒక స్కెచ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. శ్రీరాముడు ఆంజనేయుడిని గుండెలకు హత్తుకుంటున్న ఆ సెచ్క్ను ఎంతో అందంగా గీశారు హాస్యబ్రహ్మ. ఆ చిత్రాన్ని చూస్తే ఎవరైనా పులకించిపోవాల్సిందే. Another lovely pencil sketch by Hasya Brahma #Brahmanandam #TheArtandTheArtist pic.twitter.com/kpsB5ot1RF — Shreyas Group (@shreyasgroup) August 5, 2020 -
బర్త్‌డేకి ఆచారి...
అందరూ ‘ఆచారి... ఆచారి’ అంటున్నారు. అసలు, ఆచారిగారు ఎలా ఉంటారేంటి? అనడిగితే... ‘పన్నెండు రోజులు ఆగండి. ఆచారిని అందరి ముందుకు తీసుకొస్తాం’ అంటున్నారు దర్శక–నిర్మాతలు. మంచు విష్ణు హీరోగా ఎం.ఎల్. కుమార్‌చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తీ చౌదరి, కిట్టు నిర్మిస్తున్న సిన్మా ‘ఆచారి అమెరికా యాత్ర’. కథానాయికగా ప్రగ్యా జైస్వాల్, కీలక పాత్రలో బ్రహ్మానందం నటిస్తున్నారు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ (నవంబర్) 23న మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘విష్ణు, నాగేశ్వరరెడ్డి కలయికలో ‘దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం’ వంటి హిట్స్ తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ‘ఆచారి అమెరికా యాత్ర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టు సినిమా రూపొందుతోంది. హైదరాబాద్, అమెరికా, మలేసియాలలో పలు సన్నివేశాలు, పాటలు చిత్రీకరించాం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. విష్ణు పుట్టినరోజు కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. పాటల్ని, ప్రచార చిత్రాల్ని ఎప్పుడు విడుదల చేసేది త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు. కోట శ్రీనివాసరావు, పోసాని, పృథ్వీ, ప్రవీణ్, విద్యుల్లేఖా రామన్, ‘ప్రభాస్’ శీను, ప్రదీప్ రావత్, ఠాకూర్ అనూప్ సింగ్, సుప్రీత్, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచయిత: మల్లాది వెంకటకృష్ణ మూర్తి, కెమెరా: సిద్ధార్థ, కూర్పు: శేఖర్, సంగీతం: ఎస్.ఎస్. తమన్, మాటలు: ‘డార్లింగ్’ స్వామి, కళ: కిరణ్, యాక్షన్: సెల్వ. -
సినిమా రివ్యూ: లౌక్యం
దసరా పండగ రేసులో పవర్, ఆగడు చిత్రాల తర్వాత అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శుక్రవారం(సెప్టెంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘లౌక్యం’. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం తర్వాత శ్రీవాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గోపిచంద్, రకుల్ ప్రీత్ సింగ్‌లు నటించారు. ప్రేక్షకుల ఆదరణను చూరగొనేందుకు దర్శక, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు తమ లౌక్యాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసుకోవడానికి కథలోకి వెళ్దాం. వరంగల్‌లో బాబ్జీ(మిర్చి ఫేం సంపత్), కేశవరెడ్డి(ముఖేశ్ రుషి)లు బద్దశత్రువులు. వీళ్లు ఓ కారణంగా వీరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న కేశవ్ రెడ్డి... బాబ్జీ చిన్న చెల్లెలు చంద్రకళ(రకుల్ ప్రీత్ సింగ్)ను చంపాలని ప్లాన్ వేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా బాబ్జీ పెద్ద చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లిన వెంకీ(గోపిచంద్) హైదరాబాద్ చేరుకుంటాడు. హైదరాబాద్‌లో చంద్రకళను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే తాను ప్రేమించింది బాబ్జీ చిన్న చెల్లెల్ని అని వెంకీ తెలుసుకోవడం ఈ కథలో ట్విస్ట్. అయితే చంద్రకళతో ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చడానికి బాబ్జీ ఎలా ఒప్పించాడు? పెద్ద చెల్లెలి పెళ్లి చెడగొట్టాడానే పీకల్లోతు కోపంలో ఉన్న బాబ్జీని వెంకీ ఎలా కన్విన్స్ చేశాడు? బాబ్జీని ఒప్పించడానికి ఎలాంటి డ్రామా ప్లే చేశాడు? బాబ్జీ, కేశవరెడ్డిల మధ్య శత్రత్వానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే లౌక్యం చిత్ర కథ. డైలాగ్స్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ బ్రహ్మానందం, పృథ్వీ కామెడి సెకండాఫ్ మైనస్ పాయింట్స్: రొటిన్ కథ, కథనాలు మ్యూజిక్ నటీనటుల పెర్ఫార్మెన్స్: గోపిచంద్‌కు వెంకీ పాత్ర రొటిన్ కారెక్టరే. కాని చాలా వేరియేషన్స్, ఎక్స్‌ప్రేషన్స్ పలికించడానికి స్కోప్ లభించింది. తన ప్రత్యేకతను ప్రదర్శించడానికి స్కోప్ లేకపోవడంతో కథతోపాటు ప్రయాణించి.. అక్కడక్కడ తన మార్కును వదిలి.. అవసరమైన పాటలు, ఫైట్లతో గోపిచంద్ పనికానిచ్చాడు. హీరోయిజం చుట్టే కథ తిరిగినా.. మిగిత పాత్రల మాటున గోపిచంద్ ప్రత్యేకత కనిపించదు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన గ్లామర్‌తోనే కొంత నటనతోనూ ఆకట్టుకున్నారు. స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన హంసానందిని ప్రదర్శించిన గ్లామర్ డోస్ అతిగానే ఉంది. ఐటమ్ సాంగ్స్‌కు పాపులర్‌గా, తెలుగు సినిమాలకు లక్కీ మస్కట్‌గా మారిన హంసానందిని ఈచిత్రంలో కొంత హుందాతనాన్ని కొంత తగ్గించుకుందా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో కలగడం సహజం. సిప్పీ పాత్రలో బ్రహ్మనందం, బాయిలింగ్ స్టార్‌గా పృథ్వీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్ర భారాన్నంత బ్రహ్మనందం, పృథ్వీలు తమ భుజాలపై వేసుకుని ప్రేక్షకులను ఆలరించడానికి చేసిన ప్రయత్నం సఫలమైంది. సాంకేతికవర్గాల పనితీరు: అనూప్ రూబెన్ సంగీతంలో ప్రత్యేకత ఏమి కనిపించలేదు. ‘సుర్ సుర్ సూపర్..’, ‘నిన్ను చూడగానే’ పాటలు రొటిన్‌గానే ఉన్నా.. పర్వాలేదనిపించాయి. శ్రీధర్ సీపాన రోటిన్ కథనే అందించాడు. గురువు కోన వెంకట్ ప్రభావం నుంచి ఇంకా శ్రీధర్ బయటకు రాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కోన వెంకట్ అందించిన విజయవంతమైన చిత్రాల కథల్ని, స్క్రీన్‌ప్లే ఫార్మూలానే నమ్ముకున్నాడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తే ఫలితం ఏలా ఉంటుందనే భయం అణువణువునా వెంటాడిని కనిపిస్తుంది. అయితే రొటిన్ కథకు కోన వెంకట్, గోపి మోహన్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు కొంత ఊరట లభించింది. మూస చిత్రాలకే ఓటేసినట్టు దర్శకుడి తీరు ఉంది. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా తప్ప కొత్తగా ఆలోచించకుండా కోన వెంకట్, గోపి మోహన్ల మార్కు కామెడీతో శ్రీవాసు లౌక్యాన్ని ప్రదర్శించాడు. ఎలాంటి ప్రత్యేకతలేని ఈ చిత్రంలో బ్రహ్మనందం, పృథ్వీల కామెడీయే విజయరహస్యంగా దర్శకుడు భావించారు. అయితే దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టడంలో బ్రహ్మనందం రొటిన్ కామెడీకి, పృథ్వీ సరికొత్త యాంగిల్లో హాస్యం బాగానే సహాయపడ్డాయి. ముగింపు: కొత్త కథలపై నమ్మకం లేని టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ పాతకథనే అటు ఇటు మార్చి కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారనేది ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాలు చెబుతున్నాయి. కథ అదే కాని టైటిల్, హీరో మారాడనే టాక్ లౌక్యంపై బాహాటంగా విమర్శలు వినిపించడం ఖాయం. అయితే రొటిన్ కథకు వినోదాన్ని జోడించి కమర్షియల్ సక్సెస్ చేయాలని చేసిన ప్రయత్నంగా 'లౌక్యం' రూపొందింది. బ్రహ్మనందంను కాస్తా వెనక్కినెట్టి బాయిలింగ్ స్టార్ పాత్రలో పృథ్వీ చేసిన కామెడీ బ్రహ్మండంగా పేలింది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, హంసానందిని ఎపిసోడ్ లౌక్యం చిత్రానికి బలంగా మారాయి. పాత చింతకాయ పచ్చడేనా అని అనిపించే ప్రతిసారి వినోదంతో ఆ సంతృప్తిని తగ్గించేలా కథనం సాగింది. ఓవరాల్ గా తొలి భాగంలో నిరసపడ్డ ప్రేక్షకుడికి సెకండాఫ్ లో పృథ్వీ, బ్రహ్మనందంల కామెడీ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసింది. పండుగ సెలవుల్లో లౌక్యం చిత్రానికి పెద్దగా పోటీ కనిపించకపోవడం పాజిటివ్‌గా కనిపిస్తోంది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరించడంపైనే ఈ చిత్ర కమర్షియల్ సక్సెస్ ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. -రాజబాబు అనుముల -
నవ్వుల ముందడుగు
లఘుచిత్రాల ద్వారా అతను ఇప్పటికే చాలామందికి పరిచితుడయ్యాడు.. చలనచిత్రాలలోకి కొత్తగా అడుగుపెడుతున్నాడు... ప్రకాశ్‌రాజ్‌లా, రావు రమేష్‌లా నిలబడాలని అతను కలలు కంటున్నాడు... ‘పడమటిలంక నవీన్’ గా చిత్రపరిశ్రమలో నిలబడాలనుకుంటున్న నవీన్ సనక ఇప్పటికే లఘుచిత్రాలలో రికార్డు సృష్టించాడు. అందరూ ఒకటి రెండు లఘుచిత్రాలలో నటిస్తుంటే, నవీన్ మాత్రం ఏకంగా పాతిక పైగా లఘుచిత్రాలలో నటించాడు. ఆ అనుభవంతో ఇప్పుడు చలనచిత్రాలలోకి వచ్చాడు. ఎక్కడో చిన్న గ్రామం నుంచి సినిమా స్థాయికి ఎదిగిన నవీన్ ప్రయాణం ఆసక్తిగా అనిపిస్తుంది. కృష్ణాజిల్లా మంటాడ గ్రామానికి చెందిన ఈ యువకుడు ఎంబిఏ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాక, లఘుచిత్రాల మీద వ్యామోహంతో అది విడిచి పెట్టేసి, 2012లో హైదరాబాద్ వచ్చేశాడు. చిన్నప్పటి నుంచి సరదాగా మాట్లాడటం గమనించిన అతని స్నేహితులు చిన్నచిన్న కామెడీ బిట్స్ రాయమని ప్రోత్సహించారు. నవీన్ తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను ఒక కథగా రాశాడు. దానిని అందరూ మెచ్చుకున్నారు. అలా చదువుకునే రోజుల్లోనే అతడి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. ఎంబిఏ చదువుతుండగా స్టేజ్ మీద చేసిన స్కిట్ చూసిన వారంతా సినీ ఇండస్ట్రీకి వెళ్లమని ప్రోత్సహించారు. ‘‘నా డైలాగులలో ఉన్న హాస్యానికి ఇద్దరు అంధులు నిలబడి మరీ చప్పట్లు కొట్టారు’’ అని నవీన్ ఎంతో సంబరంగా చెప్పుకుంటారు. ‘ఫేస్బుక్’ లో అసిస్టెంట్ డెరైక్టర్లు కావాలనే ప్రకటన చూసి స్కిట్స్ పంపడంతో, అతడికి చలనచిత్ర పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. అక్కడ సెలక్ట్ అయ్యాడు. అలా ‘వెన్నెల వనండాఫ్’కూ, ‘జప్ఫా’ సినిమాకూ అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. చిన్న పాత్రలోనూ నటించారు. ‘వాలెంటైన్’లో కామెడీ విలన్‌గా, ‘జంపర్ మే బంపర్’ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఆత్మహత్యలపై తీసిన సందేశాత్మక చిత్రం ‘అమావాస్య అర్ధరాత్రి’ లో లీడ్ రోల్ చేశాడు. ‘పెళ్లిపుస్తకం’లో హీరో ఫ్రెండ్‌గా కామెడీ రోల్, ‘నౌ దో గ్యారహ్’లో రివ్యూ రాజుగా, ‘పవన్ కల్యాణ్ ప్రేమలో పడ్డాడు’ లో కామెడీ రోల్’ చేశాడు. ‘రన్ రాజా రన్’ చలన చిత్రంలో చలాకీ చంటి (జబర్దస్త్ఫేమ్)తో కలిసి చేశాడు. ఇవన్నీ లఘుచిత్రాలే. ‘కిర్రాకు’ చలన చిత్రం షూటింగ్ అయిపోవచ్చింది. ప్రస్తుతం ‘నేను వస్తున్నా’ చిత్రంలో నక్సలైట్‌గా, శర్వానంద్ మూవీలో ఒక పాత్ర చేస్తున్నాడు. జీవితంలో మరచిపోలేని ఒక అంశం గురించి చెబుతూ, ‘‘ఒకసారి బ్రహ్మానందంగారితో నటించినప్పుడు... ‘కుర్రాడు బాగానే నటిస్తున్నాడు’ అని ఆయన నన్ను ప్రశంసించడం, నా జీవితంలో మరచిపోలేని రోజు’’ అంటాడు. నవీన్ నటన చూసినవారంతా ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ అని, టైమింగ్ ఉందని మెచ్చుకుంటూ ఉంటారని సంబరంగా చెబుతాడు. నటన గురించి తన అభిప్రాయం చెబుతూ, ‘‘ఎవరి నటనలోనైనా ప్రత్యేకత ఉండాలనేది నా భావన. పంచ్ డైలాగులు వాడటం నాకు బాగా అలవాటు. అందరినీ నవ్విస్తూ పదికాలాల పాటు మంచి హాస్యం అందరికీ పంచాలనుకుంటున్నాను. ఒకవేళ నేను సినిమాలలో సక్సెస్ సాధించకపోయినా, ఒత్తిడి ఫీలవను. సినిమాలు కాకపోతే ఉద్యోగం చేసుకుంటాను’’ అని నవీన్ నవ్వేశారు. నిజాయితీగా ప్రయత్నం చేస్తే ఫలితం రావడం తథ్యమని ఆయనకు వేరే చెప్పాలా! ‘బ్రహ్మానందంగారితో నటించినప్పుడు... ‘కుర్రాడు బాగానే నటిస్తున్నాడు’ అని ఆయన ప్రశంసించడం, నా జీవితంలో మరచిపోలేను’ - నవీన్