
తిరుమల: తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి మెయిల్ రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. పోలీసులు తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి తనిఖీలు చేపట్టారు. అలిపిరి టోల్‌గేట్ వద్ద కూడా తనిఖీలను ముమ్మరం చేశారు. ఈ మెయిల్ ఎస్పీకి ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పరిశీలించి.. చివరికి ఇది ఫేక్ అని గుర్తించారు.
ఈ విషయంపై ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల కదలికలు లేవని స్పష్టం చేశారు. భక్తులు ఇటువంటి దు్రష్పచారాలను నమ్మవద్దని సూచించారు. దీనిపై టీటీడీ సీవీఎస్‌వో నరసింహకిషోర్ మాట్లాడుతూ తిరుమలలో ఉగ్రవాద కదలికలన్నది పూర్తిగా అవాస్తమని తెలిపారు. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారి ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు ఉన్నట్లు పలుమార్లు కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో ఇంతకుముందే తిరుమలలోని కీలకమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: జగజ్జనని చిట్ ఫండ్స్.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్