శ్రీనగర్ (జమ్మూ) : భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో 8 బీఎస్ఎఫ్ దళాల ఔట్ పోస్టులపై లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. భారత్, పాక్ సరిహద్దులోని బీఎస్ఎఫ్ ఔట్ పోస్టులపై కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పారు. కాగా పాక్ ఇప్పటివరకూ పలుమార్లు భారత్ సరిహద్దు వద్ద కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.