జమ్మూ సరిహద్దుల్లో పాక్ కాల్పులు | Pakistani rangers violate ceasefire along IB Jammu | Sakshi
Sakshi News home page

జమ్మూ సరిహద్దుల్లో పాక్ కాల్పులు

Published Wed, Jan 21 2015 11:21 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

Pakistani rangers violate ceasefire along IB Jammu

శ్రీనగర్ (జమ్మూ) : భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం మళ్లీ తన నైజాన్ని ప్రదర్శించింది.  జమ్మూ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ రేంజర్స్ బీఎస్ఎఫ్ దళాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. మంగళవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కాల్పులు జరిగాయని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పారు. సుమారు 7 గంటల పాటు కాల్పులు జరిగాయి. కాగా పాక్ ఈ నెలలో పలుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. తొలుత ఈనెల 6న కాత్వా జిల్లాలో , 11,  13 తేదీల్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement