న్యూఢిల్లీ: రబీ సీజన్‌లో పాస్ఫరస్, పొటాషియం (పీ అండ్ కే) సంబంధిత ఎరువులపై రూ.22,303 కోట్ల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. 50 కేజీల డీఏపీ బస్తా ధరను రూ.1,350గానే కొనసాగించాలని నిర్ణయించింది. 2023–24 రబీ సీజన్(2023 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 2024 మార్చి 31 దాకా)లో పోషకాల ఆధారిత సబ్సిడీకి ఎరువులు, రసాయనాల శాఖ చేసిన ప్రతిపాదనలకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదముద్ర వేసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తర్వాత మీడియాకు వెల్లడించారు.
రైతులకు అందుబాటు ధరల్లో చాలినన్ని ఎరువులను అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ నత్రజని, ఫాస్ఫరస్, పొటాíÙయంలు పాత ధరకే లభిస్తాయి. అంటే బస్తా నత్రజని పాత రూ.1,470 ధరకే, ఎస్‌ఎస్‌పీ(సింగిల్ సూపర్ ఫాస్ఫేట్) బస్తా దాదాపు రూ.500కు దొరుకుతాయి. ఫొటాష్(ఎంఓపీ) బస్తా ధర రూ.1,655కు తగ్గనుంది’ అని మంత్రి వివరించారు. గత ఖరీఫ్ సీజన్‌కు రూ.38,000 కోట్ల ఎరువుల సబ్సిడీని కేంద్రం అందజేయడం తెలిసిందే. మొత్తం వార్షిక ఎరువుల సబ్సిడీ రూ.2.55 లక్షల కోట్లకు పెరిగిందని ఠాకూర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment