పాదయాత్ర కోసం ముమ్మర ఏర్పాట్లు | ready for ys jaganmohan reddy padayathra | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కోసం ముమ్మర ఏర్పాట్లు

Published Thu, Nov 2 2017 10:33 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ready for ys jaganmohan reddy padayathra - Sakshi

వేంపల్లె మండలం ఇడుపులపాయలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 6వతేదీన చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బుధవారం వైఎస్సార్‌సీపీ చక్రాయపేట మండల ఇన్‌చార్జి వైఎస్‌ కొండారెడ్డి, చక్రాయపేట జెడ్పీటీసీ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలు ఏర్పాట్లను పరిశీలించారు.  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3వేల కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేపడుతున్నట్లు వారు తెలిపారు. వీరన్నగట్టుపల్లె నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అడుగడుగునా కటౌట్లను ఏర్పాట్లు చేస్తున్నారు. సభావేదిక, కార్యకర్తల భోజన వసతి, వాహనాల పార్కింగ్‌కు సంబంధించి పనుల కోసం భూమిని జేసీబీలతో చదును చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement