వైరా: టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు.. తాగుబోతులు, రేపిస్టుల సమితి అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షరి్మల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 88వ రోజు బుధవారం ఖమ్మం జిల్లా వైరా మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా మండలంలోని గరికపాడులో స్థానికులతో ‘మాట ముచ్చట’కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షరి్మల మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ మోసం చేయని వర్గమంటూ లేదన్నారు. చదువు, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ ఉచితమని ఎన్నికల వేళ ప్రకటించిన ఆయన, ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు.
పనుల కోసం పోతే మహిళల మానప్రాణాలు అడుగుతున్నారని, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని విమర్శించారు. నిస్వార్థంగా, ప్రజాసమస్యలపై పోరాడేందుకు తాను పార్టీ పెట్టినట్లు షరి్మల వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే దివంగత వైఎస్సార్ మాదిరిగా సంక్షేమ పాలన తీసుకొస్తానని ప్రకటించారు. ‘మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీతోనే వస్తారా’అని స్థానికులు ప్రశ్నించగా.. ‘మంచివాళ్లు మంచి పారీ్టలోనే ఉంటారు. మీ నాయకుడు టీఆర్‌ఎస్‌లో ఉన్నాడు. ఆయన మంచి వాడేనా’అని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్రలో భాగంగా పొలంలో పనిచేస్తున్న రైతులతో మాట్లాడిన షరి్మల కాసేపు ట్రాక్టర్ నడిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీపీ అధికార ప్రతినిధులు పిట్టా రాంరెడ్డి, సత్యవతి, సంజీవ, చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment