దైవ దర్శనానికి వెళుతూ..
ప్రొద్దుటూరు క్రైం / మైదుకూరు : ‘పోదాం పదమ్మా.. లేట్‌గా వెళ్తే గుడిలో ఎవరూ ఉండరమ్మా..’ కుమారుడి మాటలివి. ‘అబ్బా నీకెప్పుడూ తొందరే.. నిదానంగా పోదాం.. ఆలస్యంగా వెళితే స్వామి ఎక్కడికి పోడులే..’ ఇవి తల్లి మాటలు. ఇవే ఆ తల్లీకొడుకుల మధ్య చివరి మాటలయ్యూరుు. మైదుకూరు మండ లంలోని వరదాయపల్లె సమీపంలో కారు ఢీకొన్న సంఘటనలో గుడిసెనపల్లి శ్రీహరి(12) అక్కడికక్కడే మరణించాడు. కళ్లెదుటే బిడ్డను మృత్యువు కబళించడంతో ఆ తల్లికి కడుపు కోతే మిగిలింది.
ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నారుు. మైదుకూరు మండలంలోని జీవీ సత్రం సమీపంలో ఉన్న శెట్టిపల్లె గ్రామానికి చెందిన చిన్న నరసింహులు వ్యవసాయ కూలీ. అతడికి శ్రీహరితో పాటు మరో ఇద్దరు కుమారులున్నారు. జీవీ సత్రంలోని వివేకానంద పాఠశాలలో శ్రీహరి ఆరో తరగతి చదువుతున్నాడు. శెట్టిపల్లె నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని వరదాయపల్లె సమీపంలో నరసింహస్వామి ఆలయం ఉంది. అక్కడ శ్రీహరి పెదనాన్న పూజారిగా వ్యవహరిస్తున్నాడు. శ్రీహరి ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్తుంటాడు. గుడికి వెళ్లి మొక్కుకున్న తర్వాత కొద్దిసేపు అక్కడే గడపడం అతడికి అలవాటుగా మారింది.
తల్లిని తొందరపెట్టి..
ఎప్పటిలాగే ఈ ఆదివారం అతడు గుడికి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. గుడికి వెళ్లాలంటే ఆటోలోనే వెళ్లాలి. సమీపంలో ఆటో నిలబడి ఉండడంతో ‘త్వరగా రామ్మా.. పోదాం’ అంటూ తల్లిని తొందర పెట్టాడు. తల్లి చిన్న ఓబుళమ్మతో కలిసి అతడు ఆటోలో బయలుదేరాడు. జీవీ సత్రం సమీపంలో ఆటో దిగిన తర్వాత నరసింహస్వామి గుడికి కొంత దూరం నడిచి వెళ్లాలి. ముందు శ్రీహరి నడుస్తుండగా, తల్లి వెనకాలే వస్తోంది. రోడ్డు దాటుతున్న శ్రీహరిని బద్వేల్ వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొంది.
రోడ్డు పక్కన పడిపోరుున శ్రీహరిని చూసి అతడి తల్లి కేకలు వేసింది. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న కుమారుడిని చూసి ఆమె హరీ అంటూ అతడిపై పడిపోయింది. స్థానికులు అక్కడకు చేరుకుని బాలుడిని ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నిం చారు. అప్పటికే అతడు చనిపోయూడు. కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని అతడి తల్లి తీవ్రంగా రోదించింది. సమాచారం అందుకున్న పోలీసులు సం ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహా న్ని పోస్ట్‌మార్టం కోసం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలియగానే శెట్టిపల్లె గ్రామంలోని బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు.