సాక్షి, మైదుకూరు(కడప) : మండల పరిధిలోని ఉత్సలవరం గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బేతంచర్ల ఎర్రన్న, సుబాన్‌బీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సుబాన్‌బీ చెల్లెలిని ఎర్రన్న రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి దస్తగిరి అనే కుమారుడు, మరో ఇద్దరు కుమార్తెలు సంతానం. దస్తగిరిని బీటెక్ వరకు చదివించారు. ఐదేళ్ల నుంచి బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన ఇద్దరు చెల్లెళ్లను, తల్లిని బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని భార్యను కూడా బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఏడాది పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆరు నెలల క్రితం భార్యాభర్తలు విడిపోయారు.
శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దస్తగిరి తిరిగి ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం బెంగళూరులోని కేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేఆర్‌పురం పోలీసులు విచారణ చేపట్టగా దస్తగిరి ఈనెల మూడవ తేదీన ఓ ఇంటిని బాడుగకు తీసుకున్నాడని అతని స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంటికి తలుపులు వేసి ఉండటంతో కిటికీలోనుంచి చూడగా దస్తగిరి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఉత్సలవరం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు.
రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి..
కడప కోటిరెడ్డిసర్కిల్/అర్బన్: కమలాపురం రైల్వే గేటు సమీ పంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(35) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే హెడ్ కానిస్టేబుల్ వి.సుభాన్ బాషా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తుపట్టిన వారు 9440900811,9502051021 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
మైదుకూరు రూరల్ : మండల పరిధిలోని ఉత్సలవరం గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బేతంచర్ల ఎర్రన్న, సుబాన్‌బీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సుబాన్‌బీ చెల్లెలిని ఎర్రన్న రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి దస్తగిరి అనే కుమారుడు, మరో ఇద్దరు కుమార్తెలు సంతానం. దస్తగిరిని బీటెక్ వరకు చదివించారు. ఐదేళ్ల నుంచి బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన ఇద్దరు చెల్లెళ్లను, తల్లిని బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని భార్యను కూడా బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఏడాది పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆరు నెలల క్రితం భార్యాభర్తలు విడిపోయారు.
శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దస్తగిరి తిరిగి ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం బెంగళూరులోని కేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేఆర్‌పురం పోలీసులు విచారణ చేపట్టగా దస్తగిరి ఈనెల మూడవ తేదీన ఓ ఇంటిని బాడుగకు తీసుకున్నాడని అతని స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంటికి తలుపులు వేసి ఉండటంతో కిటికీలోనుంచి చూడగా దస్తగిరి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఉత్సలవరం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment