suciede
-
బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆత్మ‘హత్య’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని హెమ్తాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేబేంద్రనాథ్ రే సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. నార్త్ దినాజ్‌పూర్ జిల్లాలోని స్వగ్రామం బిందాల్‌లో తన ఇంటి సమీపంలోని ఓ దుకాణం పైకప్పునకు ఉరేసుకుని కనిపించారు. అయితే, ఇది ఆత్మహత్య కాదు హత్యేనని దేబేంద్రనాథ్ కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయనను హత్య చేశారని మండిపడుతున్నారు. దేబేంద్రనాథ్ చొక్కా జేబులో సూసైట్ నోట్ దొరికిందని, తన ఆత్మహత్యకు ఇద్దరు వ్యక్తులు కారకులంటూ అందులో ఆయన రాశారని పోలీసులు చెప్పారు. దేబేంద్రనాథ్ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా హెమ్తాబాద్ రిజర్వ్డ్ స్థానం నుంచి గెలిచారు. అనంతరం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. దేబేంద్రనాథ్ మరణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మృతితో పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి రగులుకుంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో గూండారాజ్యం నడుస్తోందని, శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
యువకుడి ఆత్మహత్య
సాక్షి, మైదుకూరు(కడప) : మండల పరిధిలోని ఉత్సలవరం గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బేతంచర్ల ఎర్రన్న, సుబాన్‌బీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సుబాన్‌బీ చెల్లెలిని ఎర్రన్న రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి దస్తగిరి అనే కుమారుడు, మరో ఇద్దరు కుమార్తెలు సంతానం. దస్తగిరిని బీటెక్ వరకు చదివించారు. ఐదేళ్ల నుంచి బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన ఇద్దరు చెల్లెళ్లను, తల్లిని బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని భార్యను కూడా బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఏడాది పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆరు నెలల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దస్తగిరి తిరిగి ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం బెంగళూరులోని కేఆర్‌పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేఆర్‌పురం పోలీసులు విచారణ చేపట్టగా దస్తగిరి ఈనెల మూడవ తేదీన ఓ ఇంటిని బాడుగకు తీసుకున్నాడని అతని స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంటికి తలుపులు వేసి ఉండటంతో కిటికీలోనుంచి చూడగా దస్తగిరి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఉత్సలవరం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు. రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి.. కడప కోటిరెడ్డిసర్కిల్/అర్బన్: కమలాపురం రైల్వే గేటు సమీ పంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి(35) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే హెడ్ కానిస్టేబుల్ వి.సుభాన్ బాషా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తుపట్టిన వారు 9440900811,9502051021 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. మైదుకూరు రూరల్ : మండల పరిధిలోని ఉత్సలవరం గ్రామానికి చెందిన యువకుడు బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బేతంచర్ల ఎర్రన్న, సుబాన్‌బీ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సుబాన్‌బీ చెల్లెలిని ఎర్రన్న రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి దస్తగిరి అనే కుమారుడు, మరో ఇద్దరు కుమార్తెలు సంతానం. దస్తగిరిని బీటెక్ వరకు చదివించారు. ఐదేళ్ల నుంచి బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం తన ఇద్దరు చెల్లెళ్లను, తల్లిని బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని భార్యను కూడా బెంగళూరుకు తీసుకెళ్లాడు. ఏడాది పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలో ఆ తర్వాత గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆరు నెలల క్రితం భార్యాభర్తలు విడిపోయారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన దస్తగిరి తిరిగి ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం బెంగళూరులోని కేఆర్‌పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేఆర్‌పురం పోలీసులు విచారణ చేపట్టగా దస్తగిరి ఈనెల మూడవ తేదీన ఓ ఇంటిని బాడుగకు తీసుకున్నాడని అతని స్నేహితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంటికి తలుపులు వేసి ఉండటంతో కిటికీలోనుంచి చూడగా దస్తగిరి ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. కుమారుడు ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం ఉత్సలవరం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు. -
సైకియాట్రిస్ట్ ఝాన్సీ రాజ్ ఆత్మహత్య
టెక్సాస్ : అమెరికాలో సైకియాట్రిస్ట్‌గా పేరొందిన ప్రవాస తెలుగు మహిళ డాక్టర్ ఝాన్సీ రాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో నివసించే ఝాన్సీ తన కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ సరస్సులోకి దింపి బలవన్మరణానికి పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఝాన్సీ నిత్యం చురుకుగా, ధైర్యంగా ఉండేవారు. ఆమె ఎందుకు ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారనేది వెల్లడి కాలేదు. ఝాన్సీ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో 1976లో వైద్య విద్యను అభ్యసించారు. అమెరికాలో ఆమె 43 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రముఖ సైకియాట్రిస్ట్‌గా గుర్తింపు పొందారు. -
మార్పు కావాలి...రావాలి!
సాక్షి, అమరావతి: మార్పు కావాలి. మార్పు తేవాలి. మార్పుతోనే ముందడుగేయాలి... ఇది జనాభిమతం. ఐదేళ్లుగా వెంటాడిన అనుభవాలు కళ్లముందు కదలాడుతుండగా.. గుండె లోతుల్లోంచి తన్నుకొస్తున్న భావావేశంలో ఎవరిని కదిపినా వినిపిస్తున్న భావోద్వేగమిది. ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా నాడిని పసిగట్టేందుకు రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో ‘సాక్షి’ ‘రోడ్ షో’ చేపట్టింది. దారి పొడవునా సాగిన ఈ రాజకీయ చర్చలో రాష్ట్రంలో మార్పు చారిత్రక అవసరమన్న అభిప్రాయం వ్యక్తమైంది. అధికార పార్టీ అక్రమాలపై ఉక్కుపాదం మోపి, ఐదేళ్లు న్యాయ పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి ఓవైపు... ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేష్ మరోవైపు ఇక్కడ బరిలో ఉన్నారు. స్థానిక అభ్యర్థులే కాదు... రాష్ట్రంలో ఏ పార్టీని గెలిపిస్తే బాగుంటుందనే వాద ప్రతివాదాలూ స్థానికంగా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా జనం మనసులో మాటేంటో నిర్మొహమాటంగా బయటపడుతోంది. నేతన్నను ఆదుకునేదెవరు? పాత మంగళగిరిలోని పద్మశాలి నగర్ సెంటర్లో ఓ సెలూన్ షాప్ దగ్గర జనం మాట్లాడుకుంటున్నారు. ఆ పక్కనే టిఫిన్ సెంటర్ నుంచి, అటుగా వెళ్తున్న మరికొందరితో అక్కడ క్షణాల్లో గుంపు పెరిగింది. ‘ఐదేళ్లవుతోంది. అప్పుల పాలయ్యామని ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పలేదు. విన్నారా? కాలనీ సమస్యలు ఎన్ని చెప్పినా పట్టించుకున్నదెవరు? మళ్లీ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించాలి?’ నాగరాజు మాటల ఆవేశంతో తోకల బాలరాజు, కారంపూడి శ్రీనివాసరావు జోడీ కట్టారు. ‘ఈ గ్రాఫిక్స్ మాయాజాలం ఇంకా నమ్మొద్దు పెద్దయ్యా. నేను ఎంటెక్ చదివాను. ఏదీ ఉద్యోగం...?’ జీరబోయిన స్వరంతో కారంపూడి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. చేనేత సమస్యలు తీరుస్తానంటున్నాడు జగన్. ఉద్యోగాలిచ్చి తీరుతానంటున్నాడు. ఒక్క అవకాశం ఇద్దాం..’ అని తోకల బాలాజీ, దాసరి వినయ్‌తో పాటు పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు. ఐటీ బాబొస్తే... అంతా పోతుందేమో! లక్ష్మీనర్సింహ స్వామి కాలనీలో అంతా పేదలే. ‘ఐదేళ్లు ఏం చేసిందయ్యా ఈ ప్రభుత్వం. చూడండి మా కాలనీ. ఏమాత్రమైనా బాగు చేశారా? పైగా అదిగో ఆ పక్క ఐటీ పార్క్ పెడతారట. ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన మా భూములూ లాక్కుంటారట. మేం కట్టుకున్న ఇళ్లూ కూల్చేస్తారట...’ రాజేశ్వరి, మంగతాయారు, సూర్యలక్ష్మి భయంతో అన్న మాటలివి. ఇక్కడ లోకేష్ పోటీ చేస్తున్నాడంటేనే తమకు భయమేస్తోందని వారు చెప్పారు. ‘వైసీపీ అభ్యర్థి ఆర్కేను గెలిపించుకున్నాం. ఎప్పుడైనా సమస్య చెప్పుకునే వీలుంది. లోకేష్ దగ్గరకు మేం వెళ్లగలమా?’ అని ప్రశ్నించాడు నీలి శ్రీకాంత్. ‘మేమీ కాలనీలో ఈ మాత్రం ఉన్నామంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమే. మళ్లీ అలాంటి మంచి రోజులు జగన్ వల్లే సాధ్యం’ అని పేరం నాగమణి చెప్పింది. పేదల ఆవాసాలున్న రత్నాల చెరువు, లక్ష్మీనర్సింహ కాలనీపై ప్రభుత్వం కన్ను పడిందట అని అక్కడి జనం నమ్ముతున్నారు. ఒక్క అవకాశమిద్దాం పెదవడ్లపూడి చౌరస్తాలో వృద్ధులు, యువకులు తాజా రాజకీయాలపై జోరుగా చర్చించుకోవడం కన్పించింది. రైతులే ఎక్కువగా ఉన్న ఆ గ్రామంలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ అక్కడ చర్చను నిశితంగా పరిశీలిస్తే వాళ్లలో ఏదో తెలియని అసంతృప్తి. ‘పెద్ద దిక్కు అవుతాడని ఓట్లేశాం. ఏమైంది. ఏం పంటకు గిట్టుబాటు ధరొచ్చింది. మన పిల్లల్లో ఎవరికి ఉద్యోగాలొచ్చాయి. చంద్రబాబు అనుభవం ఏమైనట్టు?’ కోటా ప్రసాద్ నోటివెంట వచ్చిన మాటిది. ‘మార్పు తెస్తానంటున్న జగన్‌కు ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుంది’ అని పరిమినేని మహేష్ అన్నారు. రైతు కూలీ పిచ్చయ్య కూడా ‘ఈసారి మార్పు రావాల్సిందే’ అన్నాడు. ప్రజల గురించి పట్టించుకునే పార్టీ గెలవాలని వారు కోరుకుంటున్నారు. ఆ సత్తా జగన్‌కు ఉందనేది ప్రజాభిమతం అని వారు తెలిపారు. అందుబాటులోఉండాలి గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఏ సమస్యయినా నేరుగా ఆయనకు చెప్పుకొనే పరిస్థితి ఉండాలి. మేం గెలిపించుకున్న నేత కోసం మేమే నిరీక్షించే దుస్థితిని కోరుకోవడం లేదు. –తోకల బాలాజీ, చిరు వ్యాపారి (మంగళగిరి) రాజన్న రాజ్యం వస్తుందనే ఆశ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఎంతో అభిమానం. లక్ష్మీనర్సింహ కాలనీలో ఆయన హయాంలోనే పట్టాలొచ్చాయి. దీనికి కృతజ్ఞతగానే ఇక్కడ ప్రతిఒక్కరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పని చేశారు. దురదృష్టం కొద్దీ 2014లో జగన్‌ను గెలిపించుకోలేకపోయాం. ఈసారి మాత్రం జనానికి మంచి జరిగే ప్రభుత్వం వస్తుందని, రావాలని కోరుకుంటున్నాం. జనం కోరుకునే మార్పు సాధ్యమనే భావిస్తున్నాం. – పేరం నాగమణి, లక్ష్మీనర్సింహ కాలనీ ఉద్యోగం... ఉపాధి ఇచ్చే సర్కారు కావాలి ఎంటెక్ చదివా. కాళ్లరిగేలా తిరిగినా ఐదేళ్లుగా ఉద్యోగం రాలేదు. చూస్తుంటే ఆశలన్నీ అడియాశలవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు మమ్మల్ని బతికిస్తున్నాయి. అధికారంలోకి వస్తుందని, మాలాంటి నిరుద్యోగులకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది. ఆ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. – దాసరి వినయ్, ఎంటెక్ విద్యార్థి -
4 నెలలకు చివరి చూపు!
దుబాయ్: యూఏఈలో మృతిచెందిన ఓ భారతీయుడి మృతదేహం స్వదేశం చేరడానికి 4 నెలలు పట్టింది. యూసఫ్‌ఖాన్ రషీద్‌ఖాన్ (50) యూఏఈలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గత ఏప్రిల్ 12న మద్యం మత్తులో అజ్‌మన్స్ అల్ రషిదియా ప్రాంతంలోని ఓల్డ్ వర్కర్స్ వసతిగృహంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద సందర్శన వీసా తప్ప ఎలాంటి ధ్రువపత్రాలూ లభించకపోవడంతో కుటుంబ సభ్యులను గుర్తించడం కష్టంగా మారింది. వీసాలో చిరునామా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ అని ఉండటంతో అధికారులు ఈ విషయం ఉజ్జయినీలోని ప్రతి మసీద్‌కు తెలియజేశారు. అయినా కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. తుదిగా దౌత్య కార్యాలయంలో పాస్‌పోర్ట్ వివరాలు వెలికితీయగా అతనిది ఉజ్జయినీకి 49 కి.మీ. దూరంలో ఉన్న నగ్డ గ్రామం అని తేలింది. స్థానిక పోలీసుల ద్వారా ఖాన్ మృతి సంగతి కుటుంబానికి తెలిసింది. అయినా వారు శవాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో ఉన్నతాధికారులు కంగుతిన్నారు. వారు భయంకరమైన పేదరికంలో మగ్గుతుండటమే దీనికి కారణం. చివరికి అధికారులే ఖర్చులు భరిస్తామనడంతో ఆగస్టు 24న మృతదేహం దుబాయ్ నుంచి ఉజ్జయినీ చేరుకుంది. -
వ్యాపారి వేధింపులు.. సెల్ఫీ సూసైడ్
సాక్షి, అమరావతి/కృష్ణా : ఉయ్యూరులో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి సెల్ఫీ సూసైడ్ కలకలం రేపుతోంది. వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక చిట్టిబాబు అనే వ్యక్తి అత్యహత్యకి పాల్పాడ్డాడు. కాగా గత నెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం... ఓ వడ్డీ వ్యాపారి వద్ద చిట్టిబాబు రూ. లక్ష అప్పుగా తీసుకున్నారు. నెలకు రూ.16వేలు వడ్డీ కట్టాలని వడ్డీ వ్యాపారి వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లు అమ్మి వడ్డీ కట్టాలని బలవంత చేయడంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు చిట్టిబాబు వీడియోలో వెల్లడించాడు. -
మైనార్ బాలిక మెడలో తాళి.. ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు మైనర్ బాలిక మెడలో తాళి కట్టి ఆ ఫోటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. ఈ విషయం తెలుకున్న బాలిక అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాలిక కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు బాబుగా గుర్తించిన పోలీసులు ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
సూపర్ కాప్ హిమాంశు ఆత్మహత్య
సాక్షి, ముంబై: మహారాష్ట్ర అదనపు డీజీపీ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) మాజీ చీఫ్ హిమాంశురాయ్ (54) శుక్రవారం ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఎముకల కేన్సర్‌తో బాధపడుతున్న రాయ్ మధ్యాహ్నం నారీమన్‌పాయింట్‌లోని తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయారు. రివాల్వర్‌తో కాల్చుకున్న వెంటనే పక్కనున్న బాంబే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. ఫలితం లేకపోయింది. ఈయన 26/11 ముంబై దాడి మొదలుకుని ఎన్నో కీలక కేసుల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1988 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా కెరీర్‌ను ప్రారంభించి.. మహారాష్ట్ర అదనపు డీజీపీ వరకు ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. ధైర్యసాహసాలు, నీతి నిజాయితీలున్న అధికారిగా పేరొందారు. 2016 నుంచి సుదీర్ఘ సెలవులో ఉన్న రాయ్ మూడేళ్లుగా కేన్సర్‌కు దేశ, విదేశాల్లో చికిత్స పొందినా ఎలాంటి మార్పులేకపోవటంతో బలవన్మరణాకికి పాల్పడ్డారు. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. పట్టు వదలడు! ముంబై క్రైమ్‌బ్రాంచ్ బాస్‌గా, ఏటీఎస్ చీఫ్‌గా ఈయన బాధ్యతలు నిర్వహించారు. దేశం యావత్తూ సంచలనంరేపిన ముఖ్యమైన కేసుల పరిష్కారంలో ఈయన పాత్ర కీలకం. ముంబైలో జర్నలిస్టు జ్యోతిర్మయి డే, బాలీవుడ్ నటి లైలాఖాన్, మరోనటి మీనాక్షీ థాపా, 2012లో ఐఏఎస్ అధికారి కూతురు, యువ న్యాయవాది పల్లవి పుర్యకాయస్త హత్యలు సహా పలు కేసుల్లో దోషులకు శిక్షపడేలా చేశారు. ముంబై దాడి కేసులో అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ హాడ్లీ భారత్‌లో రెక్కీ నిర్వహించిన విషయంలోనూ సాక్ష్యాధారాల సేకరణలో చాలా శ్రమించి.. విజయం సాధించారు. మాలేగావ్, నాసిక్ ఎస్పీలుగా, నాసిక్ కమిషనర్‌గా, ముంబై అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ముంబై జాయింట్ కమిషనర్ (క్రైమ్)గా ఉన్నప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం విచారణతో బాలీవుడ్, క్రికెటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఏటీఎస్ చీఫ్‌గా బదిలీ అయిన తర్వాత.. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని అమెరికన్ స్కూల్ పేల్చివేతకు కుట్రపన్నిన అనీస్ అన్సారీ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేసి భారీ ప్రమాదం జరగకుండా అడ్డుకున్నారు. ఆత్మహత్య విషయం తెలిసి పోలీసు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కొంతకాలంగా రాయ్ కేన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. అయినా ఈ విధంగా తన జీవితాన్ని అంతం చేసుకుంటాడనుకోలేదు’ అని ముంబై మాజీ పోలీసు కమిషనర్ ఎమ్ఎన్ సింగ్ తెలిపారు. సీఏ నుంచి ఐపీఎస్‌గా.. వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ అయిన హిమాంశురాయ్ 1988లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన భార్య భావన రాయ్ ఐఏఎస్ అధికారి. వివాహం అయిన కొంతకాలానికే ఈమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థతో కలసి పనిచేస్తున్నారు. శారీరక దృఢత్వంపై మొదట్నుంచీ ఎక్కువ ఆసక్తి చూపించే హిమాంశురాయ్ కేన్సర్ బారిన పడిన తర్వాత ఆయన మెల్లిమెల్లిగా డిప్రెషన్లోకి వెళ్లారు. -
రామాగౌడ్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలి
బెల్లంపల్లి : నెన్నెలకు చెందిన రామాగౌడ్ ఆత్మహత్యపై ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సబ్‌కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ తప్పుడు అట్రాసిటీ కేసుపై రామాగౌడ్ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తెలిపారు. రామాగౌడ్ ఆత్మహత్యకు నెన్నెల కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, పల్లె మహేష్, ఎంపీపీ భర్త భీమాగౌడ్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎమ్మెల్యే చిన్నయ్య కారకులని అన్నారు. రామాగౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మృతికి కారకులను కఠినంగా శిక్షించాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో జి.మల్లేష్, సిహెచ్.నర్సయ్య, యం.మల్లేష్, టి.మల్లేష్, పి.సుభద్ర, ఎస్.సంజీవ్‌రెడ్డి, కె.ఏమాజీ, రాజేశ్ తదితరులున్నారు. -
ప్రియురాలు లేదని ప్రియుడి ఆత్మహత్య
షాద్‌నగర్: నెల రోజుల క్రితం ప్రియురాలు ఉరివేసుకొని మృతి చెందగా మనస్తాపం తో ప్రియుడు కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని విజయనగర్ కాలనీకి చెందిన భావన, ఈశ్వర్ కాలనీకి చెందిన గిరీశ్‌గౌడ్ ప్రేమించుకున్నారు. భావనకు వారి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో బలవంతంగా నిశ్చితార్థం జరిపించారు. దీనికి మనస్తాపం చెందిన ఆమె నెల క్రితం ఉరి వేసుకొని మృతి చెందింది. ఆమె మృతికి గిరీశ్‌గౌడ్ కారణమంటూ భావన బంధువులు అతనితో పాటు అతని బంధువులపై వేధింపుల కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో గిరీశ్‌గౌడ్ మనస్తాపానికి గురై యూసుఫ్‌గూడలో సూసైడ్ నోట్ రాసి శుక్రవారం ఉరి వేసుకున్నాడు. బాలికకు బలవంతపు పెళ్లి భర్త చెర నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు అనంతగిరి (వికారాబాద్): బలవంతపు పెళ్లిపై ఓ బాలిక పోరాటం చేసింది. తనకు చదువుకోవాలని ఉందని చెప్పినా వినకుండా పెళ్లి చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. పెళ్లి తర్వాత మూడు రోజుల అనంతరం వారి చెర నుంచి తప్పించుకుంది. ఈ క్రమంలో రాత్రంతా ఓ అడవిలో గడిపింది. ఎట్టకేలకు తెల్లవారుజామున పోలీసులు, చైల్డ్‌లైన్ 1098ను సంప్రదించింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. మర్పల్లి మండలానికి చెందిన ఓ బాలిక (17)కు తండ్రి లేడు. తల్లిపై బంధువులు ఒత్తిడి చేసి కర్ణాటకలోని చించోలికి చెందిన 40 ఏళ్ల వ్యక్తితో ఈ నెల 11న వివాహం చేశారు. అయితే అతడికి ఇదివరకే పెళ్లై, ఇద్దరు పిల్లలున్నారు. వివాహమయ్యాక ఈ నెల 13న సంగెంలో బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బాలిక ఎవరికీ తెలియకుండా సెల్‌ఫోన్ తీసుకుని గ్రామం నుంచి బయటపడి, ఓ బస్సు పట్టుకుని కల్లూర్‌లో దిగింది. అప్పటికే చీకటవడంతో బంధువులు వస్తారనే భయంతో రాత్రంతా గ్రామ సమీపంలోని అడవిలో గడిపింది. తెల్లవారుజామున చైల్డ్‌లైన్ 1098కి కాల్ చేయగా.. వారు ఆ అమ్మాయిని అక్కున చేర్చుకున్నారు. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు పరిగిలోని చైల్డ్ హోంకు తరలించారు. -
ఆవేశం మానుకో.. ప్రాణం నిలబెట్టుకో..
ఆత్మహత్యలతో కుటుంబాలను ఆగం చేయెుద్దు సమస్యలకు చావే ముఖ్యం కాదు చనిపోయి కాదు.. బతికి సాధించాలంటున్న మానసిక వైద్యులు నేడు ప్రపంచ ఆత్మహత్యల వ్యతిరేక దినం నేటి సమాజంలో చాలామంది చిన్నచిన్న సమస్యలకే తడబడిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.. పంటల సాగుకు పెట్టిన పెట్టుబడులు రాక అన్నదాతలు.. పరీక్షల్లో ఫెయిలైనందుకు విద్యార్థులు.. కుటుంబకలహాలతో కొందరు.. వ్యాధులబారి నుంచి ఉపశమనం పొందలేమనే ఆవేదనతో ఇంకొందరు.. ఇలా అనేకమంది అనేక కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా వారినే నమ్ముకుని, వారిపైనే ఆశలు పెట్టుకుని జీవించే కుటుంబసభ్యులు రోడ్డున పడుతున్నారు. బతికినంతకాలం వారినే గుర్తుకు చేసుకుంటూ తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో క్షణికావేశాలతో విలువైన ప్రాణాలను తీసుకోవద్దని.. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే పరిష్కారం తప్పక లభిస్తుందని మాన సిక వైద్యులు చెబుతున్నారు. నేడు ప్రపంచ ఆత్మహత్యల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం. ఆత్మసై్థర్యం నింపుతున్న ‘ఆరోగ్యమిత్ర’ మహబూబాబాద్ : సమాజంలో మనిషి జీవితం చాలా విలువైనది. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి వ్యక్తి అనుసరించే విధానాలు, ఆయన చేసే మంచి పనులు చిరకాలం గుర్తుండిపోతాయి. అయితే జీవిత ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొనే ధైర్యంలేక చాలా మంది అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆత్మహత్యలు వద్దు.. ఆలోచనే ముద్దు’ అనే నినాదంతో మానుకోటకు చెందిన హోమియో పతి డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ మానసిక వేదనకు గురవుతున్న వారిని చైతన్యపరుస్తూ వారిలో ఆత్మసై్థర్యం నింపుతోంది. అశోక్ వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ ప్రవృత్తిగా ఆయన సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతూSగుర్తింపు పొందుతున్నారు. ఏటా 1500 మంది మరణం.. ఆరోగ్యమిత్ర సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం జిల్లాలో ఏటా 1500 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఒక్క 2010లోనే 1610 మంది బలవన్మరణాలు పొందినట్లు పోలీస్ రికార్డుల్లో పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా మానసిక ఒత్తిడులు, క్షణికావేశాలు, అప్పులబాధలు, ఆకలి, విఫలమైన ప్రేమలు, కుటుంబకలహాలతో చనిపోయినట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదాల కంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారే ఎక్కువగా ఉంటున్నట్లు ఆరోగ్యమిత్ర సర్వేలో వెలుగుచూసింది. ఆత్మహత్యల జాబితాలో మనదేశం ప్రపంచంలో ముందు వరుసలో ఉందని తెలుస్తోంది. మానుకోట మండలం ఉత్తర తండాలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉందని ఆరోగ్య మిత్ర సంస్థ సభ్యులు గుర్తించారు. అవగాహన లోపంతోనే... ఆత్మహత్యలు చేసుకునే వారిలో 30 ఏళ్ల వయస్సు ఉన్నవారే 50 శాతం ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థులు, యువకులు తాము అనుకున్న లక్ష్యాలను సాధించలేనప్పుడు క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. ఆత్మహ్యతల విషయంలో మనదేశంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. వరంగల్ నగరంలో మూడేళ్లుగా ఆత్మహత్యల సంఖ్య తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ చనిపోయిన వారిలో యువత ఎక్కువగా ఉంటుండడం గమనార్హం. ఆరేళ్లుగా కౌన్సిలింగ్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆరోగ్యమిత్ర సంస్థ 20 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. ఇందులో 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, 126 మంది సభ్యులు ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలోని పలు ప్రాంతాలను సంస్థ సభ్యులు సందర్శిస్తూ ఆత్మహత్యలు చేసుకుందామని ఆలోచిస్తున్న వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఏటా సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 10 వరకు నెల రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తూ మనోవేదనతో సతమతమవుతున్న వారిని చేరదీసి ప్రాణం విలువ, కుటుంబ సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ధైర్యం నింపుతున్నారు. గత ఆరేళ్ల కాలంలో ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన 8 మందిని సంస్థ బాధ్యులు కాపాడారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఒక ప్రైవేట్ టీచర్, ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు రైతులు, ఒక వృద్ధురాలు ఉన్నారు. కాగా, ఆత్మహత్యలను నివారించేందుకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రించి ప్రచారం చేస్తుండడంతోపాటు గ్రామాల్లో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ధైర్యం కోల్పోవద్దు ధైర్యం కోల్పోవడంతోనే ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది. క్షణికావేశానికి గురై నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మహత్యల నివారణ కోసం తమ సంస్థ కృషి చేస్తోంది. సంస్థ ఆధ్వర్యంలో చాలా మందికి కౌన్సిలింగ్ నిర్వహించాం. సమస్య ఎదురైనప్పుడు ఆత్మహత్య వైపు చూడకుండా పరిష్కారం మార్గం వైపు ఆలోచించాలి. –డాక్టర్ పరికిపండ్ల అశోక్, ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు