
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు మైనర్ బాలిక మెడలో తాళి కట్టి ఆ ఫోటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ విషయం తెలుకున్న బాలిక అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాలిక కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడు బాబుగా గుర్తించిన పోలీసులు ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment