
సాక్షి, అమరావతి/కృష్ణా : ఉయ్యూరులో బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి సెల్ఫీ సూసైడ్ కలకలం రేపుతోంది. వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక చిట్టిబాబు అనే వ్యక్తి అత్యహత్యకి పాల్పాడ్డాడు. కాగా గత నెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం... ఓ వడ్డీ వ్యాపారి వద్ద చిట్టిబాబు రూ. లక్ష అప్పుగా తీసుకున్నారు. నెలకు రూ.16వేలు వడ్డీ కట్టాలని వడ్డీ వ్యాపారి వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లు అమ్మి వడ్డీ కట్టాలని బలవంత చేయడంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు చిట్టిబాబు వీడియోలో వెల్లడించాడు.