BSNL employee
-
వ్యాపారి వేధింపులు.. సెల్ఫీ సూసైడ్
సాక్షి, అమరావతి/కృష్ణా : ఉయ్యూరులో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి సెల్ఫీ సూసైడ్ కలకలం రేపుతోంది. వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక చిట్టిబాబు అనే వ్యక్తి అత్యహత్యకి పాల్పాడ్డాడు. కాగా గత నెల 29న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం... ఓ వడ్డీ వ్యాపారి వద్ద చిట్టిబాబు రూ. లక్ష అప్పుగా తీసుకున్నారు. నెలకు రూ.16వేలు వడ్డీ కట్టాలని వడ్డీ వ్యాపారి వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇల్లు అమ్మి వడ్డీ కట్టాలని బలవంత చేయడంతో సూసైడ్ చేసుకుంటున్నట్లు చిట్టిబాబు వీడియోలో వెల్లడించాడు. -
ఆడపిల్లలు పుట్టారని రెండో పెళ్లి...
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఘనకార్యం నాగోలు: వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని మొదటి భార్యను వేధించి రెండవ వివాహం చేసుకున్న ఓ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిపై సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి కథనం ప్రకారం... సరూర్‌నగర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన పి.నవీన్‌కుమార్ వనస్థలిపురంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఉద్యోగి. ఆసిఫ్‌నగర్‌కు చెందిన విజయలక్ష్మితో 12 ఏళ్ల క్రితం ఇతనికి పెళ్లైంది. వివాహ సమయంలో కట్నం కింద రూ.3.50 లక్షల నగదు, 25 తులాల బంగారం, కొన్ని వెండి ఆభరణాలు ఇచ్చారు. కొంతకాలం బాగానే ఉన్న నవీన్‌కుమార్ వరుసగా ఆడపిల్లలు పుట్టడంతో విజయలక్ష్మిని మానసిక, శారీరక వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. దీంతో విజయలక్ష్మి తల్లి తమ రెండు ఎకరాల భూమిని కూతురు, అల్లుడు నవీన్‌కుమార్‌ల పేరిట రాసింది. ఆ భూమిని అమ్మేయాలని నవీన్‌కుమార్ మళ్లీ భార్యను వేధిస్తుండటంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా.. నవీన్‌కుమార్ గత డిసెంబర్లో గుడిమల్కాపురానికి చెందిన ఓ యువతిని యాదగిరిగుట్టలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న విజయలక్ష్మి భర్తను నిలదీయగా.. ‘‘ నా ఇష్టం.. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అని అన్నాడు. దీంతో బాధితురాలు గురువారం సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు నవీన్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తేనెటీగల దాడిలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి మృతి
జైనథ్: తేనెటీగల దాడిలో ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో ఎంఏ హమీద్‌ఖాన్ (53) టెలిఫోన్ మెకానిక్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సంవత్సరకాలంగా కార్యాలయం పైకప్పుకు బయటి భాగం నుంచి తేనెటీగలు తుట్టెలను ఏర్పర్చుకున్నాయి. మంగళవారం విధులకు హాజరైన హమీద్ ఖాన్ మధ్యాహ్న సమయంలో భోజనం ముగించుకుని కార్యాలయంలో సేద తీరుతుండగా తేనెటీగలు దాడి చేశాయి. పక్కనే ఉన్న ఎంపీడీవో, తహసీల్దార్, సొసైటీ కార్యాలయాల వైపు కూడా తేనెటీగలు విజృంభించాయి. తీవ్రంగా గాయపడిన హమీద్‌ఖాన్ అక్కడికక్కడే చనిపోయారు. -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఘరానా మోసం
నిజామాబాద్ సిటీ, న్యూస్‌లైన్ : సొంత అవసరాల కోసం తెలిసిన వారితో పాటు తమ వద్ద అప్పులు తీసుకుని పరారీలో ఉన్న ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. జమానాతు ఇచ్చిన పాపానికి తమ వేతనాలకు ఎసరు వచ్చిందని సదరు ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో ప్లానింగ్ విభాగంలో సూపర్వైజర్గా పనిచేసే వెంకటేశం కొద్ది నెలల క్రితం తోటి ఉద్యోగుల వద్ద, తెలిసిన వారి వద్ద దాదాపు రూ.1.80 కోట్ల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. ఇందులో రూ.30 నుంచి 40 లక్షల వరకు వివిధ చిట్‌ఫండ్ కంపెనీలలో చీటీలు ఎత్తుకుని తోటి ఉద్యోగులను జమానాతు పెట్టాడు. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే మరోపక్క ప్రైవేట్‌గా పలు వ్యాపారాలు చేసేవాడని సంస్థ ఉద్యోగులు తెలిపారు. దానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం కావటంతో తెలిసిన వారివద్ద,తోటి ఉద్యోగుల వద్ద లక్షలాది రూపాయలు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక దాదాపు నాలుగు నెలల క్రితం ఉద్యోగులకు కనిపించకుండా పోయాడు. విధులకు కూడా గైర్హాజరవుతున్నాడు. కనిపించకుండా పోయిన వెంకటేశం కోసం ఉద్యోగులు పలు చోట్ల ఆరా తీసినప్పటికి ఆచూకీ లభ్యం కాలేదు. చిట్‌ఫండ్‌లో ఎత్తుకున్న డబ్బులు చెల్లించక పోవటంతో జమానాతులు ఉన్న ఉద్యోగులకు చిట్‌ఫండ్ కంపనీల నుంచి వేతనం కటింగ్ల నోటీసులు జారీ అయ్యాయి. దీంతో కంగారు పడిన ఉద్యోగులు రెండు రోజుల కిత్రం జిల్లా ఎస్పీ కేవీ మోహన్‌రావును ఆశ్రయించారు. కనిపించకుండా పోయిన వెంకటేశంను ఇక్కడకు రప్పించాలని వినతి ఇచ్చారు. ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదుపై తగిన న్యాయం చేస్తామని ఎస్పీ వారికి హామీ ఇచ్చారు.ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదును ఎస్పీ డీఎస్పీ అనిల్‌కుమార్‌కు పంపారు. ఆయన దానిని నగర సీఐకి పంపి విచారించాలని ఆదేశించారు. అయితే ఉద్యోగులు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో వెంకటేశంకు దాదాపు రూ.40 లక్షల వరకు జమానాతులు పెట్టినట్లు చెప్పారు. కాని మిగతా రూ.1.40 కోట్లపై బాధితులు ఎవరైనా తమకు ఫిర్యాదులు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఫైనల్ నోటీసులు జారీచేశాం.. సంస్థలో టెలికాం సూపర్వైజర్గా పనిచేసే వెంకటేశం నాలుగు నెలలుగా విధులకు గైర్హాజరవుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు శాఖాపరమైన నోటీసులు జారీచేశాం.అతని నుంచి ఎలాంటి స్పందనలేదు. ఇటీవలే చివరిసారిగా నోటీసులు సైతం జారీచే శాం.శుక్రవారం విధులకు హాజరవుతానని చె ప్పాడు. కాని కాలేదు. కొంతమంది ఉద్యోగులు అతనిపై ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. అతనిపై చీటింగ్ కేసు నమోదైతే చర్యలకు పైఅధికారులకు నివేదిస్తాం. - జగ్గురాం, బీఎస్ఎన్ఎల్ ఏజీఎం