![Jhansi Raj Psychiatrist Committed Suicide - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/28/jhansi-raj.jpg.webp?itok=v-79_UQk)
టెక్సాస్ : అమెరికాలో సైకియాట్రిస్ట్‌గా పేరొందిన ప్రవాస తెలుగు మహిళ డాక్టర్ ఝాన్సీ రాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్‌లో నివసించే ఝాన్సీ తన కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ సరస్సులోకి దింపి బలవన్మరణానికి పాల్పడ్డారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఝాన్సీ నిత్యం చురుకుగా, ధైర్యంగా ఉండేవారు. ఆమె ఎందుకు ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారనేది వెల్లడి కాలేదు. ఝాన్సీ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో 1976లో వైద్య విద్యను అభ్యసించారు. అమెరికాలో ఆమె 43 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తూ ప్రముఖ సైకియాట్రిస్ట్‌గా గుర్తింపు పొందారు.
Comments
Please login to add a commentAdd a comment