సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ప్రతిపక్ష పార్టీల నాయకులు
బెల్లంపల్లి : నెన్నెలకు చెందిన రామాగౌడ్ ఆత్మహత్యపై ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సబ్‌కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ తప్పుడు అట్రాసిటీ కేసుపై రామాగౌడ్ ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తెలిపారు. రామాగౌడ్ ఆత్మహత్యకు నెన్నెల కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం, పల్లె మహేష్, ఎంపీపీ భర్త భీమాగౌడ్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎమ్మెల్యే చిన్నయ్య కారకులని అన్నారు. రామాగౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మృతికి కారకులను కఠినంగా శిక్షించాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో జి.మల్లేష్, సిహెచ్.నర్సయ్య, యం.మల్లేష్, టి.మల్లేష్, పి.సుభద్ర, ఎస్.సంజీవ్‌రెడ్డి, కె.ఏమాజీ, రాజేశ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment