నోయిడా : ఆడవారి పట్ల జరిగే అన్యాయాలను నిర్మూలించడానికి ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయి. ఇవన్ని బాధితులకు ఎంత మేర ఉపయోగపడుతున్నాయో తెలీదు కానీ.. ఈ చట్టాలను అడ్డం పెట్టుకుని అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నవారు కూడా ఉన్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి నోయిడాలోని లఖ్నావాలీ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఓ మహిళ, బాధితుడు ఇద్దరు స్నేహితులు. ఈ క్రమంలో సదరు మహిళ పలు సందర్భాల్లో వేర్వేరు కారణాలు చెప్తూ తన స్నేహితున్ని డబ్బు ఇవ్వాల్సిందిగా కోరింది.
తొలుత వీటిని నిజమని నమ్మిన యువకుడు, స్నేహితురాలిని ఆదుకోవడం కోసం తనకు తోచినంత ఇచ్చేవాడు. ఈ క్రమంలో సదరు మహిళ పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వాల్సిందిగా అడగడం ప్రారంభించింది. ఈ క్రమంలో నెల రోజుల క్రితం సదరు యువకున్ని 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసింది. ఒకవేళ తాను అడిగినంత ఇవ్వకపోతే ‘నాపై అత్యాచారం చేశావని కేస్ పెడతానం’టూ యువకున్ని బెదిరించడం ప్రారంభించింది. దాంతో యువకుడు ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు సదరు యువతి మీద ఐపీసీ సెక్షన్ 388, 506 కింద కేస్ నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment