కీచకుడిని వెంటాడి రఫ్ఫాడించిన యువతి | Noida woman chases molester, slaps him for groping her  | Sakshi
Sakshi News home page

కీచకుడిని వెంటాడి రఫ్ఫాడించిన యువతి

Published Sun, Mar 14 2021 1:54 PM | Last Updated on Sun, Mar 14 2021 1:59 PM

 Noida woman chases molester, slaps him for groping her  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తనను  అనుచితంగా తాకి, ,లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని  చీల్చి చెండాడేసిందో యువతి. తన వర్క్‌ప్లేస్‌కు నడుచుకుంటూ పోతుండగా  కీచకుడు రెచ్చిపోయాడు.  నలభైఏళ్ల  ప్రబుద్ధుడు అదను చూసి తన దుష్టబుధ్దిని చాటుకున్నాడు. అంతే..  కడుపు రగిలిన ఆమె అతడిని దొరకబుచ్చుకుని రఫ్పాడించింది.  నోయిడాలోని సహారా రెడ్ లైట్ సమీపంలో శుక్రవారం (మార్చి 12) ఈ సంఘటన  జరిగింది. 

వివరాలను పరిశీలిస్తే నోయిడా సెక్టార్ 12 లోని పెట్రోల్ పంప్‌లో  పనిచేస్తున్న యువతి  తన ప్లేస్‌కు వెళ్లేందుకు రోడ్డు క్రాస్‌ చేస్తోంది. ఇంతలో కారు అడ్డు వచ్చింది. దాన్ని తప్పించుకుని ముందుకు పోతున్న సమయంలో ఎప్పటినుంచో ఆమెను గమనిస్తున్న వ్యక్తి  సైకిల్‌ వచ్చి  ఆమె ఛాతీపై తాకి ఉడాయించాడు. దీంతో క్షణం షాకైనా.. వెంటనే తేరుకుని సివంగిలా మారిపోయింది. వెంబడించి,వెంటాడి అతడి చొక్కాపట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి పడేసింది. ఆనక తీరిగ్గా సదరు వ్యక్తి క్షమాపణ చెప్పినా వదల్లేదు.  ఇలాంటి వారిని అస్సలు క్షమించకూడదని ఆమె పేర్కొన్నారు.

గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కానీ ఎపుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, వేధింపులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారని ఆమె చెప్పారు. కొంతమంది బాటసారులు అక్కడ గుమిగూడినా, ఎవరూ తనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని వాపోయారు. అయితే ఇలాంటి దుశ్చర్యలను గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ ప్రాంతంలో  సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయన్నారు. మరోవైపు నోయిడా అడిషనల్‌ డీసీపీ రణవిజయ్ సింగ్  ఫిర్యాదు దాఖలు చేయాల్సిందిగా బాధిత మహిళను కోరారు. ఈ మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement