chased
-
ఛేజ్ చేసి..నడి వీధిలో చుట్టుముట్టి..అందరూ చూస్తుండగానే..
తమిళనాడు:తమిళనాడులోని కరైకూడి జిల్లాలో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే కాలనీలో ఐదుగురు కలిసి ఓ యువకున్ని అందరూ చూస్తుండగానే హత్య చేశారు. బాధితున్ని వెంబడించి కర్రలతో దాడి చేసిన అమానవీయ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితున్ని మధురైకి చెందిన వినీత్‌గా పోలీసులు గుర్తించారు. ఓ మర్డర్ కేసులో పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయడానికి బయటకు వచ్చాడు. ఇంతలోనే ఐదుగురు వ్యక్తులు ఎస్‌యూవీలో వెంబడించి బాధితున్ని చుట్టుముట్టారు. అనంతరం కర్రలతో తీవ్రంగా కొట్టారు. నిత్యం రద్దీగా ఉండే కాలనీలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. దుండగులు ఘటనాస్థలం నుంచి పారిపోగా.. బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు ఓ కేసులో కండిషన్ బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు స్నేహితులతో కలిసి లాడ్జ్‌లో ఉంటున్నట్లు చెప్పారు. బాధితుని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి:వడగాల్పుల దెబ్బకు 54 మంది మృతి.. ఆస్పత్రుల్లో స్ట్రెచర్లు లేక భుజాలపైనే.. -
క్లాస్ రూం చుట్టూ పరిగెత్తించి మరీ టీచర్‌పై దాడి..పేరెంట్స్ అరెస్టు
టీచర్ని చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏకంగా క్లాస్ రూమ్ చుట్టూ పరిగెత్తించి మరీ చితకబాదారు విద్యార్థి తల్లిదండ్రులు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..తమిళనాడుతో స్కూల్లో టీచర్‌పై రెండో తరగతి విద్యార్థి పేరెంట్స్ దారుణంగా దాడి చేశారు. విద్యార్థి తల్లిందండ్రలు నేరుగా ఉపాధ్యాయుడి క్లాస్ రూం వద్దకు వచ్చి మరీ గొడవకు దిగారు. మా పిల్లలను కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు?..అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ టీచర్ని క్లాస్‌లోనే విద్యార్థులందరి ముందు పరిగెత్తించి మరీ దారుణంగా కొట్టారు. ఆఖరికి సమీపంలోని ఇటుక రాయిని కూడా తీసుకుని ఆయన మీదకు విసిరే యత్నం చేశారు. అందుకు సంబంధించిన మూడు నిమిషాల వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు బాధిత ఉపాధ్యాయుడుని ఆర్ భరత్‌గా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు ఆచిన్నారి తాతయ్యను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడమేగాక దాడికి పాల్పడినందుకు గాను వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విచారణలో..సదరు విద్యార్థి క్లాస్‌లో సరిగా వినకపోవడం, ఇతర పిల్లలను కొట్టడం వంటివి చేయడంతో టీచర్ ఆమెను సీటు మారమని చెప్పారు. ఐతే సీటు మారుతున్న క్రమంలో ఆ చిన్నారి పడిపోయింది. కానీ ఆ చిన్నారి ఇంటికి వెళ్లి తనను టీచర్ కొట్టాడంటూ.. వాళ్ల తాతయ్యకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు మా పిల్లలనే కొడతావ అంటూ టీచర్‌పైకి దాడికి దిగారని పోలీసులు తెలిపారు. (చదవండి: ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుకి కలత చెంది యువకుడు బలవన్మరణం) -
ఢిల్లీలో దారుణం.. మహిళను రోడ్డుపై వెంబడించి, పిల్లల ముందే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. పట్టపగలే మహిళను రోడ్డుపై వెంబడించి మరీ హత్యకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. సౌత్ వెస్ట్ ఢిల్లీలో 24 ఏళ్ల మహిళను తన ఇద్దరు పిల్లల ముందే కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఆరతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఆమెను ఓ వ్యక్తి వెంబడించడం ప్రారంభించాడు. దీంతో ఏం చేయాలో తోచక ఇద్దరు పిల్లలతోనే మహిళ రోడ్డుపై పరుగెత్తింది. దుండగుడు తన వద్దనున్న కత్తితో ఆమెను అతి కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యడు. ఈ ఘోర దృశ్యాలన్నీసీసీటీవీ ఫుటేజీలో రికారడ్డయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహిళను పొడిచినట్లు సాగర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మహిళను ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే విచారణలో నిందితుడు మృతురాలు ఇంతకముందు ఇరుగుపొరుగువారని తేలిందని, ఆమె ఇప్పుడు వేరే ఇంటికి నివాసం మార్చినట్లు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పరారీలో ఉన్న నిందితుడిని గుర్తించి, పట్టుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని తేలిపారు. చదవండి👉🏻 ఫేస్బుక్ చాటింగ్.. మార్ఫింగ్ చేసిన వీడియోలతో.. -
భయానకం: మత్స్యకారుడిని వెంటాడిన వింత జీవి.. వీడియో వైరల్
ఈ ప్రపంచలో వింతలు, విశేషాలకు కొదవే లేదు. నింగి, నేల, నీరు.. ఇలా ప్రతి చోట ఎప్పుడో ఒకసారి ఊహకందని వింత సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. వీటిలో కొన్నింటిని చేధించినప్పటికీ మరికొన్ని మిస్టరీలానే మిగిలిపోతుంటాయి. ఇప్పటికే భూమ్మీద కొన్ని లక్షల రకాల జీవులను గుర్తించినా.. నిత్యం కొత్త రకమైన జీవులు బయటపడుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే బ్రెజిల్లో చోటుచేసుకుంది. ఓ వింత జీవికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దక్షిణ బ్రెజిల్‌లోను కోస్ట్‌లో ఓ వ్యక్తి రాత్రి పూట చేపల వేటకు వెళ్లాడు. స్టీమర్‌తో వేట సాగిస్తుండగా.. సముద్రం నుంచి ఒక్క సారిగా ఓ వింత ఆకారంతో కూడిన జీవి బయటకు వచ్చింది. ఆ జీవి మత్స్యకారుడి బోటును వెంటాడింది. స్టీమర్ వేగంతో పోటీ పడి మరీ నీళ్ల మీద ఎగురుతూ వ్యక్తిని వెంబడించింది. అది నీళ్లలో నుంచి పైగి లేచినప్పుడు దాని కళ్లు మెరుస్తూ కనిపించాయి. దీన్ని ఆ వ్యక్తి తన కెమెరాలో బంధించగా.. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన అకౌంట్లో షేర్ చేశారు. చదవండి: జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్! Criatura misteriosa perseguiu um barco ontem no Rio Grande do Sul. Segue o fio para descobrir que monstro é esse nessa #BioThreadBr pic.twitter.com/chOfZ5d0VK — Pedrohenriquetunes (@PedroHTunes) January 27, 2022 ఆ వింత జీవి కళ్లు మెరుస్తూ ఉండటం.. వేగంగా ఆ వ్యక్తిని వెంబడించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీన్ని చూస్తుంటే భయం కలుగుతోంది. అయితే ఇంతకీ అది ఏ జీవీ అనేది మాత్రం కనుగొనలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చదవండి: బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. -
కీచకుడిని వెంటాడి రఫ్ఫాడించిన యువతి
సాక్షి, న్యూఢిల్లీ : తనను అనుచితంగా తాకి, ,లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని చీల్చి చెండాడేసిందో యువతి. తన వర్క్‌ప్లేస్‌కు నడుచుకుంటూ పోతుండగా కీచకుడు రెచ్చిపోయాడు. నలభైఏళ్ల ప్రబుద్ధుడు అదను చూసి తన దుష్టబుధ్దిని చాటుకున్నాడు. అంతే.. కడుపు రగిలిన ఆమె అతడిని దొరకబుచ్చుకుని రఫ్పాడించింది. నోయిడాలోని సహారా రెడ్ లైట్ సమీపంలో శుక్రవారం (మార్చి 12) ఈ సంఘటన జరిగింది. వివరాలను పరిశీలిస్తే నోయిడా సెక్టార్ 12 లోని పెట్రోల్ పంప్లో పనిచేస్తున్న యువతి తన ప్లేస్‌కు వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తోంది. ఇంతలో కారు అడ్డు వచ్చింది. దాన్ని తప్పించుకుని ముందుకు పోతున్న సమయంలో ఎప్పటినుంచో ఆమెను గమనిస్తున్న వ్యక్తి సైకిల్ వచ్చి ఆమె ఛాతీపై తాకి ఉడాయించాడు. దీంతో క్షణం షాకైనా.. వెంటనే తేరుకుని సివంగిలా మారిపోయింది. వెంబడించి,వెంటాడి అతడి చొక్కాపట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి పడేసింది. ఆనక తీరిగ్గా సదరు వ్యక్తి క్షమాపణ చెప్పినా వదల్లేదు. ఇలాంటి వారిని అస్సలు క్షమించకూడదని ఆమె పేర్కొన్నారు. గత ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను కానీ ఎపుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, వేధింపులను ఎదుర్కోవడం ఇదే మొదటిసారని ఆమె చెప్పారు. కొంతమంది బాటసారులు అక్కడ గుమిగూడినా, ఎవరూ తనకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని వాపోయారు. అయితే ఇలాంటి దుశ్చర్యలను గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయన్నారు. మరోవైపు నోయిడా అడిషనల్ డీసీపీ రణవిజయ్ సింగ్ ఫిర్యాదు దాఖలు చేయాల్సిందిగా బాధిత మహిళను కోరారు. ఈ మేరకు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. -
తల్లిఒడికి చేరిన బాలుడు వీరేష్...
సాక్షి, తిరుపతి: బాలుడు వీరేష్ అపహరణ కథ ఎట్టకేలకు ముగిసింది. తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన వీరేష్‌ను పోలీసులు మంగళవారం తిరుపతికి తీసుకువచ్చారు. పూణేలో కిడ్నాపర్‌ను గుర్తించిన అక్కడి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని గుర్తించడంలో సీసీ పుటెజీలు తమకు ఎంతో ఉపయోగపడ్డాయని తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. కిడ్నాపర్‌ను నిజామాబాద్ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు. ఈ నెల 28లో తిరుపతిలో బాలుడు వీరేష్‌ను కిడ్నాప్ చేసి మహారాష్ట్రకు పారిపోయిన విషయం తెలిసిందే. పూణే పోలీసులు అతని అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కిడ్నాప్ కథ ఒకొలిక్కి వచ్చింది. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించడంతో వారు అనందంలో మునిగిపోయ్యారు. మూడు రోజుల్లోనే కేసును ఛేదించిన తిరుపతి పోలీసులపై పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ బాలుడు ఎలా దొరికాడంటే..! -
ఆ బాలుడు ఎలా దొరికాడంటే..!
బాలుడి అపహరణ కథ సుఖాంతమైంది. తిరుమలలో శుక్రవారం కిడ్నాప్‌నకు గురైన వీరేష్ ఎట్టకేలకు దొరికాడు. మహారాష్ట్రలోని మామనూరు పోలీసులు ఆదివారం ఉదయం కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని స్వాధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సమాచారాన్ని తిరుమల పోలీసులకు చేరవేశారు. కుమారుడు దొరికాడని తెలియడంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. దేవుడి సన్నిధిలో ఇలా జరగడం బాధగా ఉన్నా, ఆయన కృపతోనే తమకు బాబు దక్కాడని సంతోషపడ్డారు. సోమవారం ఉదయం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. తిరుమల: బాలుడు వీరేష్ అపహరణ కథ ఎట్టకేలకు ముగిసింది. శ్రీవారి దర్శనార్థం మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన ప్రశాంత్ దంపతులు తమ ఏడాదిన్నర బాబు వీరేష్‌తో కలిసి గురువా రం రాత్రి 11.30 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. అధిక రద్దీ కారణంగా వసతి దొరకలేదు. యాత్రి వసతి సముదాయం–2 ఎదురుగా ఉన్న మండపం వద్ద సేదతీరారు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి బాబు కనిపించలేదు. చుట్టుపక్కల విచారించినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎలా దొరికాడంటే..! తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు బాలుడి కిడ్నాప్ కేసును చాలెంజ్‌గా తీసుకున్నారు. ఆరు ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలించాయి. కిడ్నాపర్ శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో బాబును అపహరించి, రింగ్ రోడ్డు గుండా తిరుపతికి వెళ్లిపోయాడు. తిరుపతిలోని రైల్వేస్టేషన్, బస్టాండ్‌లోని సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలించారు. తిరుపతికి చేరుకున్న నిందితుడు మంకీ క్యాప్ తీసేసి 8.45గంటల ప్రాంతంలో తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుని టికెట్ కౌంటర్లో అనంతపురం జిల్లా గుంతకల్లుకు టికెట్ కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి రైలులో ఉడాయించాడు. వెంటనే పోలీసులు ఓ బృందాన్ని అనంతపురానికి పంపా రు. అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. నిందితుడి ఫొటోతో పాటు బాబు ఫొటోను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. బాబు ఆచూకీ తెలపాలని విన్నవించారు. ఈ క్రమంలో ఆదివారం మహారాష్ట్ర నాందేడ్ జిల్లా మహోర్ మండలం, రేణుకాదేవి ఆలయం కోనేరు వద్ద ఒక వ్యక్తి చంటిబిడ్డతో అనుమానాస్పదంగా ఉన్నాడని ఆలయంలో పనిచేసే క్షురకుడు పోలీసులకు సమాచార మిచ్చాడు. మహారాష్ట్రలోని మహోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసు అక్కడికి చేరుకుని విచారించారు. వెంటనే తిరుమల పోలీసులకు సమాచారం అందించారు. వాట్సప్ ద్వారా బాబు, కిడ్నాపర్ ఫొటోలను పంపారు. ఆ బాబు వీరేష్ అని నిర్ధారించుకుని కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలుడు వీరేష్ స్వగ్రామానికి ఆ పోలీస్‌స్టేషన్‌కు 100 కిలోమీటర్ల దూరం ఉంది. నిందితుడు నిజామాబాద్ జిల్లా శాస్త్రి నగర్‌కు చెందిన విశ్వంబర్(43)గా గుర్తించారు. 50 గంటలుగా తీవ్రంగా శ్రమించిన తిరుమల పోలీసులు బాబు దొరికాడని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా కిడ్నాపర్‌కు, బాలుడి కుటుంబీకులకు ఉన్న సంబంధమేమిటో, ఎందుకు కిడ్నాప్ చేశాడో పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. ప్రశంసల జల్లు.. తిరుమల పోలీసులను పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. టీటీడీ చైర్మన్ పుట్టాసుధాకర్ యాదవ్, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు ప్రత్యేకంగా అభినందించారు. అర్బన్ జిల్లా ఎస్పీ అన్బురాజన్, టీటీడీ సీవీఎస్ఓ గోపీనాథ్‌జెట్టికి కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ సీవీఎస్ఓ గోపీనాథ్‌జెట్టి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారని, దీంతో కిడ్నాప్ కేసును త్వరగా ఛేదించగలిగారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించిన టీటీడీ నిఘా, భద్రతా సిబ్బందికి, పోలీసులకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా, పర్యవేక్షణతో ఉండాలని సూచించారు. -
వీడిన హత్య కేసు మిస్టరీ
ముగ్గురు నిందితుల అరెస్టు రూ. 59 వేలు, మోటరు సైకిల్ స్వాధీనం రావులపాలెం (కొత్తపేట) : ఈ నెల 8న రావులపాలెం గౌతమి గోదావరి పాత బ్రిడ్జి సమీపంలో లంక ప్రాంతంలో జరిగిన బెల్లంకొండ రాంబాబు (50) హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.59 వేలు, మోటారుసైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమలాపురం డీఎïస్పీ ఎల్. అంకయ్య ఈ కేసు వివరాలు వెల్లడించారు. రావులపాలెంలో చికెన్ సెంటరు నిర్వహించే బెల్లంకొండ రాంబాబుతోపాటు రావులపాలేనికి చెందిన కడలి నాగేశ్వరరావు, ఊబలంకకు చెందిన పడాల శ్రీనివాసరెడ్డి, రావులపాలెం కొత్తకాలనీకి చెందిన మానుపాటి శ్రీను స్థానిక గౌతమి గోదావరి బ్రిడ్జి సమీపంలో కుడి ఏటిగట్టు దిగువన ఉన్న లంక ప్రాంతంలోని దుబ్బుగడ్డి పొదల్లో పేకాట ఆడుతుంటారు. ఈ నెల 8 తేదీ ఉదయం రావులపాలెంలో కలుసుకున్న వీరు పేకాటకు వెళ్లే ముందులో మద్యం సేవించారు. రాంబాబు వద్ద పెద్దమొత్తంలో నగదు ఉన్నట్టు వారు గమనించారు. పేకాట స్థావరంలో రాంబాబు రూ.50 వేల విలువైన రూ.2 వేల నోట్లను పెట్టగా.. మిగిలిన వారు కొన్ని రూ.100 నోట్లను పెట్టారు. దీనిపై రాంబాబు ప్రశ్నించడంతో వారి మధ్య ఘర్షణ ఏర్పడగా, ఖాళీ మద్యం సీసాతో రాంబాబు తలపై బలంగా కొట్టారు. స్పృహ కోల్పోయిన అతడి తలను శ్రీనివాసరెడ్డి కాలితో తొక్కిపెట్టాడు. అతనికి శ్రీను, నాగేశ్వరరావు సహకరించడంతో రాంబాబు మృతి చెందాడు. అనంతరం రాంబాబు పెట్టిన రూ.50 వేలతోపాటు అతడి జేబులోని మరో రూ.10 వేలను, అతని మోటారు సైకిల్ తీసుకుని పరారయ్యారు. కుటుంబ సభ్యులకు 9 తేదీన సంఘటనా ప్రాంతంలో అతడి మృతదేహం కనిపించింది. సీఐ బి.పెద్దిరాజు పర్యవేక్షణలో ఇన్చార్జి ఎస్సై జేమ్స్రత్నప్రసాద్ తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టంలో తలపై గాయాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో హత్య కేసుగా మార్పు చేశారు. అతనితో పేకాడేందుకు వచ్చిన మిగిలిన ముగ్గురు హత్యకు పాల్పడినట్టు ఆధారాలు దొరకడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.59 వేలు, మోటారు సైకిల్, హత్య చేసేందుకు ఉపయోగించిన మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కొత్తపేట జేఎఫ్‌సీఎం కోర్టులో హజరుపర్చనున్నట్టు డీఎస్పీ అంకయ్య తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించడంలో కృషి చేసిన సీఐ పెద్దిరాజు, ఎస్సై జేమ్స్ రత్నప్రసాద్, ఏఎస్సై ఆర్వీ రెడ్డి, హెచ్‌సీలు శ్రీను, స్వామి, కానిస్టేబుళ్లు రమేష్, హరికృష్ణలను డీఎస్పీ అభినందించారు. -
డబ్బు కోసమే హత్య
ఏఎస్పీ దామోదర్ వెల్లడి విశ్రాంత బ్యాంకు మేనేజర్ హత్యకేసు నిందితుల అరెస్ట్ కాకినాడ క్రైం : జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన యువకులు డబ్బు కోసం నేర ప్రవృత్తిలోకి వెళ్తున్నారు. కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నంలో చివరకు మనుషులను హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. డబ్బు కోసం కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన ఓ విశ్రాంత బ్యాంకు మేనేజర్‌ను హత్య చేసిన సంఘటనలో పాల్గొన్న ముగ్గురు యువకులను కాకినాడ క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం స్థానిక త్రీటౌన్ క్రైం పోలీస్‌స్టేçషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఏఎస్పీ ఏఆర్ దామోదర్ హత్యకేసు వివరాలను వెల్లడించారు. రామచంద్రపురం వెల్లరోడ్డు కాలువగట్టుకు చెందిన బల్లిపాటి వరప్రసాద్ (19) కాకినాడలో ఓ మెడికల్ షాపులో సేల్స్‌బాయ్‌గా, ఇదే గ్రామం కమ్మవారివీధి గుబ్బలవారిపేటకు చెందిన ఖండవల్లి సత్యప్రభుకిరణ్ (20) స్థానికంగా ఓ హొటల్లో పనిచేస్తున్నారు. అలాగే కోటవీధి రామకృష్ణనగర్‌కు చెందిన పూళ్ల కామేష్ (19) పనిలేకుండా ఖాళీగా తిరుగుతుంటాడు. వీరిలో ఏ1 ముద్దాయి బల్లిపాటి వరప్రసాద్ కాకినాడ భానుగుడి సెంటర్లోని ఓ ఫార్మసీలో ట్రయినర్‌గా పని చేస్తూంటాడు. కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన విశ్రాంత బ్యాంకు మేనేజర్ బులుసు సూరయ్య (75) అనారోగ్యంతో మెడికల్ షాపులో మందులు కొంటుండేవారు. ఒకట్రెండుసార్లు ఫోన్ చేసి మందులు పంపించాలని ఆర్డర్ ఇవ్వగా వరప్రసాద్ ఇంటికి తీసుకెళ్లి మందులు ఇచ్చేవాడు. ఆ సమయంలో ఇంటి వాతావరణాన్ని, ఇంట్లో ఉండేవారని, వారి ఆస్తులను పరిశీలించిన ప్రసాద్ డబ్బు కోసం వీరిని హతమార్చాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని తన స్నేహితులకు తెలిపాడు. వారు ఒక ప్రణాళిక వేసుకుని ఏప్రియల్ 23న సంఘటనా స్థలానికి వెళ్లగా, నాలుగో వ్యక్తి భయపడి వెనక్కివెళ్లిపోవడంతో 24వ తేదీ రాత్రి 7.45 గంటల సమయంలో ముగ్గురూ వెళ్లారు. ఇంటి ముందున్న టూలెట్ బోర్డును చూచి వచ్చామని, ఇల్లు చూపించాలంటూ వరప్రసాద్ మేడపైకి వెళ్లి విజయలక్ష్మిని కోరాడు. తనతో పాటూ తన స్నేహితులు వచ్చారని చెప్పాడు. ఇల్లు చూపించడానికి కింద ఇంటి తాళం తీసి గదులు చూపిస్తుండగా సూరయ్యను పేపర్ కట్టర్‌తో గొంతు కోసి హతమార్చారు. అనంతరం ఏమీ తెలియనట్లు పోర్షన్ గదికి తాళం వేసి మేడపైకి వెళ్లి భార్య విజయలక్ష్మిని కూడా హతమార్చి వంటిపై ఉన్న బంగారం, నగదును అపహరించాలని భావించారు. ఈ లోగా విజయలక్ష్మి భర్త ఎక్కడికెళ్లారంటూ ప్రశ్నించడం, బయటకు వెళ్లారని చెప్పడం, కాలనీ అంతా తిరగడం జరిగాయి. మళ్లీ వారు మేడపైకి వెళ్లి మంచినీరు కావాలని అడిగారు. ఈ లోగా వారు సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, కొడాక్ కెమేరా, రెండు బంగారు గాజులు తస్కరించారు. సెల్‌ఫోన్ కోసం వెతికిన విజయలక్ష్మి వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చి దొంగా దొంగా అని కేకలేయడంతో ముగ్గురూ అక్కడ నుంచి మోటార్‌బైక్‌పై పరారయ్యారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన క్రైం డీఎస్పీ ఎ.పల్లపురాజు ఆదివారం ఈ ముగ్గురినీ రామచంద్రపురం పూళ్ల కామేష్ ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు బంగారు గాజులు, కొడక్ కెమెరా, సెల్‌ఫోన్, మోటార్‌బైక్, బ్యాంకు పుస్తకం, ఐడీకార్డు, హత్యకు ఉపయోగించిన పేపర్ కట్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో పూళ్ల కామేష్ తన ఇద్దరు స్నేహితులతో కలసి సొంత పెద్దమ్మ గుండు గంగాలక్ష్మికి మిరపకాయ బజ్జీలో మత్తు మందు పొడి కలిపి, ఆమె మెడలోని 3 కాసుల బంగారు తాడును దొంగిలించినట్లు తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన క్రైం డీఎస్పీ పల్లపురాజు, క్రైం ఎస్సైలు రామారావు, హరీష్‌రావు, ఎంఎస్ పాషా, సత్తిరాజు, హెచ్‌సీ గోవిందరావు, పీసీలు చిన్న శ్రీరామ్, వర్మ, అజయ్, బాబు, రాము, మారుతిలను అభినందించారు. -
మండపేట చోరీ కేసును ఛేదించిన పోలీసులు
చోరీ సొత్తు మొత్తం స్వాధీనం మండపేట : పట్టణంలో సంచలనం కలిగించిన భారీ చోరీ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో చాకచక్యంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్థానిక మఠం వీధికి చెందిన యువకుడు 20 ఏళ్ల యువకుడు వీవీ వీరేంద్ర ఈ చోరీకి పాల్పడ్డాడు. మాజీ ఎమ్మెల్యే వీవీఎస్ఎస్ చౌదరి నివాసంలో సోమవారం అర్ధరాత్రి దుండగుడు చొరబడి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వియ్యంకుడు చినబాబు గదిలోని బీరువాలో ఉంచిన సుమారు రూ.57.55 లక్షల విలువైన సొత్తును చోరీ చేసిన విషయం విదితమే. వారి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదుపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఐదు బృందాలుగా దర్యాఫ్తు ప్రారంభించారు. చోరీకి గురైన వస్తువుల జాబితాతో ముద్రించిన కరపత్రాలను మండపేట, రావులపాలెం, రామచంద్రపురం, భీమవరం, తణుకు, పాలకొల్లు, నర్సాపురం తదితర ప్రాంతాల్లోని బంగారు వర్తకుల షాపులకు అందజేశారు. గతంలో పనిచేసిన అనుభవంతోనే.. చోరీ జరిగిన ఇంటిలో ఈ యువకుడు గతంలో వడ్రంగి పనిచేసినట్టు తెలిసింది. వీరేంద్ర చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. 10వ తరగతి పాసైన తర్వాత పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ చేశాడు. తాతతో కలిసి వడ్రంగి పనిలోకి వెళుతూ, ఎలక్ట్రికల్ పనులు కూడా చేస్తుండేవాడు. గతంలో చౌదరి నివాసంలో తాతతో కలిసి పనులు చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌లోని ఒక కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటూ ఈ ఏడాది జనవరిలో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అయితే విజయవాడలోనే ఉండేవాడని తెలిసింది. సోమవారం రాత్రి మండపేట చేరుకున్న నిందితుడు ఇంటికి వెళ్లే మార్గంలోని చౌదరి ఇంటిలోకి చొరబడ్డాడు. సుజాతమ్మ టాయిలెట్‌కు వెళ్లిన సమయాన్ని గమనించి లోపలికి చొరబడి ఈ చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. పట్టుబడిందిలా... కేపీ రోడ్డులోని ఒక బంగారం షాపులో రెండు గాజులు విక్రయించేందుకు నిందితుడు బుధవారం తీసుకువచ్చాడు. పోలీసులు అప్పటికే కరపత్రాలు ఇవ్వడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు పోలీసులకు రహస్యంగా సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ మురళీకృష్ణ అతనిని చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడినుంచి అతని ఇంటికి వెళ్లి అతను ఇంటిలో దాచిన బ్యాగులో బంగారు ఆభరణాలు ఉన్నాయి. పోలీసుల ఇంటరాగేషన్‌లో చోరీ చేసినట్టుగా నిందితుడు అంగీకరించినట్టు తెలిసింది. మొత్తం చోరీ సొత్తు రికవరీ కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చోరీ విషయంలో ఇంకెవరికైనా ప్రమేయం ఉందనే విషయం కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. -
మట్టుబెట్టింది కోడలే..
నగల కోసం ఆశపడిన కోడలే వదినతో కలిసి నాటకం మత్తు తీవ్రత వల్ల అత్త చనిపోవడంతో మొత్తం ముగ్గురిపై హత్య కేసు నిందితులను అరెస్టు చేసి, రూ.7 లక్షల విలువైన సొత్తు రికవరీ చేసిన పోలీసులు అమలాపురం టౌన్(తూర్పు గోదావరి జిల్లా) : అత్యాశ.. బుల్లితెరలో నేర కథనాలు.. ఆమెలో రాక్షసత్వాన్ని ఉసిగొలిపాయి. నగల కోసం అత్తను మట్టుబెట్టడమే కాకుండా, ఆమె వదిన, మరొకరిని హత్య, చోరీ కేసులో నిందితులను చేసింది. అమలాపురం కూచిమంచి అగ్రహారంలోని గన్నవరపువారివీధిలో ఓ ఇంట్లో గత నెల 24న విద్యుత్ మీటరు నమోదు కోసం వచ్చి అత్తా కోడళ్లకు మత్తుమందు ఇచ్చి, రూ.7 లక్షల విలువైన సొత్తు కాజేసినట్టు నమోదైన కేసును పోలీసులు కొత్త కోణంతో ఛేదించారు. ఇదంతా కట్టుకథగా పోలీసులు తేల్చారు. మత్తుమందు ప్రభావానికి గురయ్యారన్న అత్తాకోడళ్లలో.. కోడలే దీనికి సూత్రధారిగా తేలింది. మత్తు మందు ప్రభావంతో అత్త గన్నవరపు సీతామహలక్ష్మి (84) గత నెల 28న మరణించిన సంగతి తెలిసిందే. కోడలు వెంకట పద్మావతి హైదరాబాద్‌కు చెందిన ఆమె వదిన కందెపు దేవిరెడ్డి, ఈమె ప్రియుడు కందెపు శివకేశవరావుతో కలిసి ఆ కథ అల్లింది. అదికాస్తా అడ్డం తిరగడంతో, ముగ్గురు నిందితులను పట్టణ సీఐ వైఆర్కే శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి రావులపాలెం ఫైనాన్స్ ఎదురుగా మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు. కేసు వివరాలను అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య, సీఐ శ్రీనివాస్ స్థానిక పోలీసు స్టేషన్లో బుధవారం విలేకరులకు తెలిపారు. కాఫీలో మత్తు మాత్రలు కలిపి.. తన అత్త సీతామహాలక్ష్మి బంగారు నగలు, వెండి వస్తువులను నలుగురు కూతుళ్లకు ఇచ్చేస్తుందని పద్మావతికి అనుమానం వచ్చింది. వాటిని దక్కించుకోవాలని హైదరాబాద్‌లో ఉంటు న్న తన వదిన దేవిరెడ్డితో కలిసి పద్మావతి పథకం రచించింది. ఆమెను, ఆమె ప్రియుడిని హైదరాబాద్ నుంచి గత నెల 23న అమలాపురం రప్పించింది. వీరంతా విద్యుత్ మీటర్ రీడింగ్‌కు వచ్చిన ఆగంతకుడి కథ అల్లారు. ఈ క్రమంలో అమలాపురం వచ్చిన దేవిరెడ్డి, ఆమె ప్రియుడు ఓ లాడ్జిలో దిగారు. అతను లాడ్జిలోనే ఉండగా, దేవిరెడ్డి ఎవరూ గమనించకుండా పద్మావతి ఇంటికి వెళ్లింది. గత నెల 24న ఉదయం 20 మత్తు బిళ్లలను కాఫీలో కలిపి పద్మావతి తన అత్తకు ఇచ్చింది. ఆమె అపస్మారక స్థితిలోకి చేరాక, ఆమె వద్దనున్న నగలు, బీరువాలను పగులగొట్టి, బంగారు, వెండి వస్తువులను ఇద్దరూ కాజేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆగంతకుడు తన నగలు కూడా తస్కరించినట్టు పద్మావతి అవి కూడా తీసేసింది. అన్ని నగలను మూటకట్టి దేవిరెడ్డికి ఇచ్చి, అక్కడి నుంచి పంపివేసింది. తర్వాత నగలు పంచుకోవాలనేది వారి ఒప్పందం. పద్మావతి మాత్రం ఓ మత్తుమాత్ర వేసుకుని నిద్రపోతున్నట్టు నటించింది. సాయంత్రం 3.30కు పనిమనిషి వచ్చి, అత్తాకోడళ్లను చూసి కేకలు వేసింది. పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్న పద్మావతి భర్త వెంకటరమణమూర్తికి స్థానికులు సమాచారం అందించారు. స్థానికుల సపర్యలతో పద్మావతి కోలుకున్నట్టు నటించింది. మత్తు తీవ్రతతో ఉన్న అత్తను అమలాపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నగలుతో దేవిరెడ్డి, ఆమె ప్రియుడు అదే రోజు హైదరాబాద్ వెళ్లిపోయారు. నగలను సొమ్ము చేసుకోవాలని ఆడపడుచు, వదిన మరో ప్లాన్ వేశారు. తన తండ్రికి అనారోగ్యంగా ఉందంటూ పద్మావతి మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చింది. హైదరాబాద్ నుంచి వదిన, ఆమె ప్రియుడు ఇక్కడకు వచ్చారు. వీరు రావులపాలెంలోని ఓ ఫైనాన్స్ సంస్థలో నగలు కుదుప పెట్టేందుకు యత్నిస్తుండగా.. వారిపై నిఘా పెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ శ్రీనివాస్, క్రైం పార్టీ హెచ్‌సీ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లు గుబ్బల శంకర్, శెట్టి రమేష్‌ను డీఎస్పీ అభినందించారు. -
ఛేజ్ చేసి ..తాట తీసింది...
న్యూఢిల్లీ : టెన్నిస్ దిగ్గజం , వరల్డ్ నెంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఓ దొంగ ఆట కట్టించిన తీరు ఆకట్టుకుంటోంది. తన ఫోన్ దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ప్రబుద్ధుడిని ఛేజ్ చేసి మరీ పట్టుకుని తాట తీసింది. 21 టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న బ్లాక్ థండర్ సెరెనానే ఈ ఇంటరెస్టింగ్ స్టోరీని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. సోదరి వీనస్ విలియమ్స్ , మరో టెన్నిస్ తార కరోలినా వాజ్నియాకితో కలిసి సెరెనా ఓ చైనీస్ రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడే ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. కుర్చీలో ఉంచిన ఆమె మొబైల్ ను కొట్టేసిన ఆ చోర శిఖామణి అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన సెరినా వెంటనే అప్రమత్తం అయింది. వాడు అంత కంటే వేగంగా కదిలాడు. అంతే ఇక ఊరుకుంటుందా.. టెన్నిస్ కోర్టులో తన అద్బుత షాట్లతో చెలరేగిపోయే సూపర్ స్టార్ మెరుపు వేగంతో కదిలింది. వాడిని ఛేజ్ చేసి పట్టుకుని రఫ్ఫాడించింది. దొంగిలించిన తన మొబైల్ ను వెనక్కి తీసుకుంది. ఈ చర్యతో ఈ అమెరికన్ టెన్నిస్ స్టార్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.