Delhi Crime: Woman Chased, Stabbed to Death In Front Of Her Children - Sakshi
Sakshi News home page

Delhi Crime News: ఢిల్లీలో దారుణం.. మహిళను రోడ్డుపై వెంబడించి, పిల్లల ముందే

Published Fri, Apr 22 2022 11:41 AM | Last Updated on Fri, Apr 22 2022 1:08 PM

Woman Chased Stabbed to Death In Front Of Her Children - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగు చూసింది. పట్టపగలే మహిళను రోడ్డుపై వెంబడించి మరీ హత్యకు పాల్పడ్డాడు ఓ దుండగుడు. సౌత్‌ వెస్ట్‌ ఢిల్లీలో 24 ఏళ్ల మహిళను తన ఇద్దరు పిల్లల ముందే కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఆరతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటికి వెళ్తుండగా ఆమెను ఓ వ్యక్తి వెంబడించడం ప్రారంభించాడు. దీంతో ఏం చేయాలో తోచక ఇద్దరు పిల్లలతోనే మహిళ రోడ్డుపై పరుగెత్తింది. 

దుండగుడు తన వద్దనున్న కత్తితో ఆమెను అతి కిరాతకంగా పొడిచి చంపాడు. అనంతరం అక్కడ నుంచి పరారయ్యడు. ఈ ఘోర దృశ్యాలన్నీసీసీటీవీ ఫుటేజీలో రికారడ్డయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహిళను పొడిచినట్లు సాగర్‌ పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి నుంచి తమకు ఫోన్‌ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మహిళను ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారని పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే విచారణలో నిందితుడు మృతురాలు ఇంతకముందు ఇరుగుపొరుగువారని తేలిందని, ఆమె ఇప్పుడు వేరే ఇంటికి నివాసం మార్చినట్లు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పరారీలో ఉన్న నిందితుడిని గుర్తించి,  పట్టుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశామని తేలిపారు.

చదవండి👉🏻 ఫేస్‌బుక్‌ చాటింగ్‌.. మార్ఫింగ్‌ చేసిన వీడియోలతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement