ఛేజ్ చేసి..నడి వీధిలో చుట్టుముట్టి..అందరూ చూస్తుండగానే.. | Tamil Nadu Man Chased Hacked To Death on Busy Street In Karaikudi | Sakshi
Sakshi News home page

ఛేజ్ చేసి..నడి వీధిలో చుట్టుముట్టి..అందరూ చూస్తుండగానే..

Published Sun, Jun 18 2023 4:44 PM | Last Updated on Sun, Jun 18 2023 5:03 PM

Tamil Nadu Man Chased Hacked To Death on Busy Street In Karaikudi - Sakshi

తమిళనాడు:తమిళనాడులోని కరైకూడి జిల్లాలో దారుణం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే కాలనీలో ఐదుగురు కలిసి ఓ యువకున్ని అందరూ చూస్తుండగానే హత్య చేశారు. బాధితున్ని వెంబడించి కర్రలతో దాడి చేసిన అమానవీయ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

బాధితున్ని మధురైకి చెందిన వినీత్‌గా పోలీసులు గుర్తించారు. ఓ మర్డర్ కేసులో పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేయడానికి బయటకు వచ్చాడు. ఇంతలోనే ఐదుగురు వ్యక్తులు ఎస్‌యూవీలో వెంబడించి బాధితున్ని చుట్టుముట్టారు. అనంతరం కర్రలతో తీవ్రంగా కొట్టారు. నిత్యం రద్దీగా ఉండే కాలనీలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. దుండగులు ఘటనాస్థలం నుంచి పారిపోగా.. బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. 

బాధితుడు ఓ కేసులో కండిషన్ బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు. ఇద్దరు స్నేహితులతో కలిసి లాడ్జ్‌లో ఉంటున్నట్లు చెప్పారు. బాధితుని స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  

ఇదీ చదవండి:వడగాల్పుల దెబ్బకు 54 మంది మృతి.. ఆస్పత్రుల్లో స్ట్రెచర్లు లేక భుజాలపైనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement