ఈ ప్రపంచలో వింతలు, విశేషాలకు కొదవే లేదు. నింగి, నేల, నీరు.. ఇలా ప్రతి చోట ఎప్పుడో ఒకసారి ఊహకందని వింత సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. వీటిలో కొన్నింటిని చేధించినప్పటికీ మరికొన్ని మిస్టరీలానే మిగిలిపోతుంటాయి. ఇప్పటికే భూమ్మీద కొన్ని లక్షల రకాల జీవులను గుర్తించినా.. నిత్యం కొత్త రకమైన జీవులు బయటపడుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. ఓ వింత జీవికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
దక్షిణ బ్రెజిల్‌లోను కోస్ట్‌లో ఓ వ్యక్తి రాత్రి పూట చేపల వేటకు వెళ్లాడు. స్టీమర్‌తో వేట సాగిస్తుండగా.. సముద్రం నుంచి ఒక్క సారిగా ఓ వింత ఆకారంతో కూడిన జీవి బయటకు వచ్చింది. ఆ జీవి మత్స్యకారుడి బోటును వెంటాడింది. స్టీమర్ వేగంతో పోటీ పడి మరీ నీళ్ల మీద ఎగురుతూ వ్యక్తిని వెంబడించింది. అది నీళ్లలో నుంచి పైగి లేచినప్పుడు దాని కళ్లు మెరుస్తూ కనిపించాయి. దీన్ని ఆ వ్యక్తి తన కెమెరాలో బంధించగా.. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన అకౌంట్‌లో షేర్ చేశారు.
చదవండి: జస్ట్ మిస్.. లేదంటే తలకాయ్ నిమ్మకాయలా నలిగేది.. వీడియో వైరల్!
Criatura misteriosa perseguiu um barco ontem no Rio Grande do Sul.
— Pedrohenriquetunes (@PedroHTunes) January 27, 2022
Segue o fio para descobrir que monstro é esse nessa #BioThreadBr pic.twitter.com/chOfZ5d0VK
ఆ వింత జీవి కళ్లు మెరుస్తూ ఉండటం.. వేగంగా ఆ వ్యక్తిని వెంబడించడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీన్ని చూస్తుంటే భయం కలుగుతోంది. అయితే ఇంతకీ అది ఏ జీవీ అనేది మాత్రం కనుగొనలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
చదవండి: బుసలు కొడుతూ పైకి లేచిన 14 అడుగుల కింగ్ కోబ్రా..
Comments
Please login to add a commentAdd a comment