భార్యకు విడాకులు ఇచ్చిన ఆనందంలో బంగీ జంప్‌.. చివరికి! | Video: Man Bungee Jumping To celebrate Divorce Ends With Tragedy | Sakshi
Sakshi News home page

Viral: భార్యకు విడాకులు.. ఆనందంలో బంగీ జంప్‌.. పాపం ఇలా అవుతుందని ఊహించి ఉండడు!

Published Sat, May 6 2023 4:10 PM | Last Updated on Sat, May 6 2023 5:10 PM

Video: Man Bungee Jumping To celebrate Divorce Ends With Tragedy - Sakshi

పుట్టినరోజు, పెళ్లి వేడుక వంటి సందర్భాలను అందరితో కలిసి వేడుకగా జరుపుకోవడం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో బాధకరంగా ఫీల్‌ అవ్వాల్సిన విషయాలను కూడా కొంతమంది సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ మలయాళ నటి భర్తతో విడాకులు పొందిన క్రమంలో ఫోటోషూట్‌ చేసుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇది మరవకముందే మరోవ్యక్తి తన భార్యతో విడాకులు తీసుకున్నందుకు సంతోషంగా ఎంజాయ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా పర్యాటక ప్రాంతానికి వెళ్లి అక్కడ బంగీ జంప్‌ చేశాడు. అయితే అక్కడే అతడి ప్లాన్‌ అడ్డం తిరిగింది. ఊహించని ప్రమాదం ఎదురైంది.

అసలేం జరిగిందంటే.. బ్రెజిల్‌కు చెందిన రఫేల్‌ డోస్‌ సాంటోస్‌ టోస్టా అనే యువకుడు 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కలిసి సంతోషంగా ఎన్నో కలలు కన్నాడు. కానీ అతని కలలు కల్లలే అయ్యాయి. పెళ్లయిన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్య పోరు తట్టులేక  డాకులు ఇప్పించాలంటూ కోర్టుకు వెళ్లాడు.  చివరికి కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దాంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇక పెళ్లి జోలికి వెళ్లకుండా జీవితాన్ని ఎంజాయ్‌గా గడపాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతను 70 అడుగుల ఎత్తులో ఉండగా తాడు తెగి నీటి మడుగులో జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని మెడ, నడుము ఎముకలు విరిగిపోయాయి. ముఖంపైన, వీపుపైన తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్రెజిల్‌లోని కాంపో మాగ్రోలోగల లగోవా అజుల్‌ అనే టూరిస్ట్‌ స్పాట్‌ వద్ద గత ఫిబ్రవరి 11న ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగి మూడు నెలలైనా రఫేల్‌ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. 
చదవండి: బైక్‌పై రొమాన్స్‌ చేస్తూ రెచ్చిపోయిన ఇద్దరమ్మాయిలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement