bungee jump
-
వీల్‌చైర్‌లో వచ్చాడు... విల్‌పవర్ చూపాడు
వీల్‌చైర్‌కు పరిమితమైన ఈ యువకుడు విల్ పవర్ మాత్రం ఎప్పుడూ కోల్పోలేదు. స్నేహితుల సహాయంతో వీల్‌చైర్‌లో నుంచి రిషికేష్‌లో బంగీ జంప్ చేశాడు. ఈ వీడియోతో ప్రపంచవ్యాప్తంగా నెటిజనుల మనసు దోచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసిన ఈ వీడియో 24 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇఫ్ యూ డేర్’ ‘మోర్ పవర్ టు యూ, బాయ్’లాంటి కామెంట్స్ కనిపించాయి. చాలామంది హార్ట్ ఇమోజీలతో రియాక్ట్ అయ్యారు. గతంలో లెఫ్టినెంట్ కల్నల్ అవనీష్ బాజ్‌పాయ్ ఆర్టిఫిషియల్ లింబ్‌తో భటిండాలో 14,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. -
Horrifying: యువతి బంగీ జంప్! తాడు తెగడంతో..
బంగీ జంప్.. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో ఒకటి. తాడు సాయంతో వేలాడినప్పటికీ.. గుండె ధైర్యం ఉంటే తప్ప అలాంటి ఫీట్‌కు ముందుకు రాలేరు చాలామంది. ఎందుకంటే అందులో ఉన్న రిస్క్‌లు అలాంటివి!. తాజాగా ఓ యువతి బంగీ జంప్ సాహసానికి దిగింది. అక్కడి ఆపరేటర్ ఆమెను లాంచింగ్ ప్యాడ్ నుంచి కిందకు తోసేశాడు. అయితే యువతి బంగీ జంపింగ్ మధ్యలో ఉండగానే కాళ్లకు కట్టిన తాడు తెగిపోయింది. దీంతో ఆ యువతి బలంగా కింద ఉన్న నీళ్లలో పడిపోయింది. భయానకమైన ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ ఎప్పుడు జరిగింది?.. ఆ యువతి పరిస్థితి ఏంటన్నదానిపై ఎక్కడా స్పష్టత లేదు. కాకుంటే నెటిజన్లలో కొందరు మాత్రం ఆమె సురక్షితంగానే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. సీసీటీవీ ఐడియట్స్ అనే ట్విటర్పేజ్ నుంచి ఈ వీడియో పోస్ట్ కాగా, మిలియన్ల వ్యూస్‌తో విపరీతంగా వైరల్ అవుతోంది. pic.twitter.com/YfERoEIW4R — CCTV IDIOTS (@cctvidiots) May 14, 2023 ఇదీ చూడండి: ఎనిమిదేళ్లుగా జాబ్ కోసం ప్రయత్నాలు.. ఆ వీడియోతో జాబ్ దొరికింది -
భార్యకు విడాకులు ఇచ్చిన ఆనందంలో బంగీ జంప్.. చివరికి!
పుట్టినరోజు, పెళ్లి వేడుక వంటి సందర్భాలను అందరితో కలిసి వేడుకగా జరుపుకోవడం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో బాధకరంగా ఫీల్ అవ్వాల్సిన విషయాలను కూడా కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ మలయాళ నటి భర్తతో విడాకులు పొందిన క్రమంలో ఫోటోషూట్ చేసుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇది మరవకముందే మరోవ్యక్తి తన భార్యతో విడాకులు తీసుకున్నందుకు సంతోషంగా ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా పర్యాటక ప్రాంతానికి వెళ్లి అక్కడ బంగీ జంప్ చేశాడు. అయితే అక్కడే అతడి ప్లాన్ అడ్డం తిరిగింది. ఊహించని ప్రమాదం ఎదురైంది. అసలేం జరిగిందంటే.. బ్రెజిల్‌కు చెందిన రఫేల్ డోస్ సాంటోస్ టోస్టా అనే యువకుడు 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కలిసి సంతోషంగా ఎన్నో కలలు కన్నాడు. కానీ అతని కలలు కల్లలే అయ్యాయి. పెళ్లయిన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్య పోరు తట్టులేక డాకులు ఇప్పించాలంటూ కోర్టుకు వెళ్లాడు. చివరికి కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దాంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక పెళ్లి జోలికి వెళ్లకుండా జీవితాన్ని ఎంజాయ్‌గా గడపాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతను 70 అడుగుల ఎత్తులో ఉండగా తాడు తెగి నీటి మడుగులో జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని మెడ, నడుము ఎముకలు విరిగిపోయాయి. ముఖంపైన, వీపుపైన తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్రెజిల్‌లోని కాంపో మాగ్రోలోగల లగోవా అజుల్ అనే టూరిస్ట్ స్పాట్ వద్ద గత ఫిబ్రవరి 11న ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగి మూడు నెలలైనా రఫేల్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. చదవండి: బైక్‌పై రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ఇద్దరమ్మాయిలు.. -
Viral Video: బంగీ జంప్‌లో హఠాత్తుగా తెగిన తాడు.. తరువాత ఏమైందో చూడండి
-
బంగీజంప్ వైరల్ వీడియో
-
డైవ్ హార్డ్ ఫ్యాన్స్
గాల్లో తేలినట్టుందే,గుండె పేలినట్టుందే...అని పాడుకున్నంత వీజీ కాదు గాల్లో విన్యాసాలు చేయడం అంటే. అయితే సాహసమే నా పథం అంటోన్న సిటీ దేనికైనా సై అంటోంది. అడ్వంచర్ వైపు దూసుకుపోతోంది.కాలేజీ యువత కావచ్చు కార్పొరేట్ ఉద్యోగులు కావచ్చు కరోడ్పతులైన వ్యాపారులు కావచ్చు కారెవరూ సాహస యాత్రలకు అతీతం అన్నట్టుగా సిటీ అడ్వంచరిజమ్ జూమ్అవుతోంది. సాక్షి, సిటీబ్యూరో: సినీ, పొలిటికల్ సెలబ్రిటీల కారణంగా బంగీ జంపింగ్, స్కై డైవింగ్ వంటివి ఇప్పుడు బాగా పాప్యులర్ అయ్యాయి. ‘నేల మీద ఉన్నప్పుడు ఏమైనా చేయవచ్చు. అయితే గాల్లో చేసే సాహసాలు అద్భుతమైన అనుభవాలు’ అని చెప్పారు నగరానికి చెందిన ‘రియల్’ సంస్థ సుచిర్ ఇండియా సీఈఓ వై.కిరణ్‌కుమార్. బిజినెస్‌తో పాటు గత కొంతకాలంగా ఆయన సాహసయాత్రల్లో సైతం బిజీగా ఉన్నారు. అడ్వంచర్ ట్రిప్స్ అంటే అమిత ఇష్టం అని చెబుతున్న కిరణ్ బంగీ జంపింగ్ దగ్గర్నుంచి స్కై డైవింగ్ దాకా ఎన్నో అనుభవాలను చవి చూశారు. ఆయన చెబుతున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. దూకడం (వి)మానం... ‘ఒక్కసారి స్కై డైవింగ్ అలవాటైతే మానడం కష్టం. దాదాపు పదేళ్ల క్రితం న్యూజిల్యాండ్‌లో మొదలుపెట్టి ఇప్పటికి 70కిపైగానే డైవ్స్ చేశా. తాజాగా హవాయి ఐల్యాండ్స్‌లో 20 వేల అడుగుల ఎత్తు నుంచి దూకా. తొలిసారి డైవ్ చేసినప్పుడు కళ్లు తిరగడం వంటివి సహజమే. దాదాపు 10 వేల అడుగులకన్నా పైన ఎత్తులో ఎగిరే విమానం నుంచి దూకడం అంటే సాధారణ విషయం కాదు. స్కై డైవ్ చేసే సాహసికుడు, మరో నిపుణుడు కలిసి ఫ్లైట్‌లో గాల్లోకి వెళతారు. నిర్ణీత ఎత్తుకు చేరగానే...డైవ్‌కి సిద్ధమవుతారు. తగిన జాగ్రత్తలవీ చెప్పాక... ఒన్ టూ త్రీ అంటూ.. కాస్త బలంగానే వెనుక నుంచి నెట్టేస్తారు. కాళ్లు వెనుక పెట్టి జంప్ చేయాలి. కింద అగాధంలా కనపడి భయమనిపించినా కిందకు చూసేటప్పుడు కళ్లు మూసి ఉంచకూడదని ముందుగానే హెచ్చరిస్తారు. ఇరువురూ దూకిన కాసేపటికి పారాచ్యూట్ విచ్చుకుంటుంది. గాల్లో 4 నుంచి 5 నిమిషాలు పైనే ఉంటారు. ఇక కిందకి దిగేటప్పుడు కాళ్లు ఫోల్డ్ చేయకూడదు. కాళ్లు భూమికి తగలగానే ఆగకూడదు. దిగీ దిగగానే కాస్తంత దూరం పరుగు తీశాక మాత్రమే ఆగాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి వస్త్రధారణ, అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. స్కైకి చలో... డైవ్ కరో... నగరం నుంచి సాహసికులు ఇప్పుడు బంగీ జంపింగ్స్, స్కై డైవింగ్ కోసం దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అవసరమైతే విదేశాలకు కూడా పయనమవుతున్నారు. మహారాష్ట్రలోని అంబీ వ్యాలీ, కర్ణాటకలోని మైసూర్, మధ్య ప్రదేశ్‌లోని థనా, ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ తదితర ప్రాంతాలు దేశంలో స్కై డైవింగ్‌కు పేరొందాయి. దేశంలో స్కై డైవింగ్‌కు అత్యల్పంగా 3 వేల అడుగుల నుంచి అత్యధికంగా 10 వేల అడుగుల వరకూ అందుబాటులో ఉంటే... మరింత ఎత్తు నుంచి డైవ్ చేయాలనుకుంటే మాత్రం విదేశాలకు వెళ్లాల్సిందే. ధరలు కూడా మన దేశంలో అత్యధికంగా రూ.40 వేల వరకు.. విదేశాల్లో మరింత అధికంగా ఉన్నాయి. స్కై డైవింగ్స్ కోసం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా వంటివి బాగా వెళతారు. డైవర్స్...పారా హుషార్ ఈ గాల్లో విన్యాసాలు ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్టు చేయలేరు. వయసు 55 దాటిన వాళ్లు చేయడానికి అనుమతించరు. హెవీగా తిన్న తర్వాత జంప్స్ ఒప్పుకోరు. హృద్రోగాలు, హైబీపీ, అవయవాల సమస్యలు ఉండకూడదు. స్కై డైవ్స్కి బరువు 90 కిలోలకు మించకూడదు. వీటి కోసం కొన్ని వారాల ముందే స్లాట్స్ బుక్ చేసుకోవాలి. మనకు ఇచ్చిన సమయానికి రెండు గంటల ముందే రిపోర్ట్ చేయాలి. ఏ సాహసమైనా ఒకటి రెండుసార్లు మాత్రమే భయం అనిపిస్తుంది. అలవాటైతే ఆడుకోవడమే. ఇలాంటి సాహసాలు కొత్త రకం అనుభూతినివ్వడమే కాక అద్భుతమైన రీతిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలో ఇతరత్రా సమస్యలను ఎదుర్కోవడంలో కూడా మనకు ఉపకరిస్తాయనేది నిజం. -
వైఎస్ఆర్సీపీ జెండాతో బంగీ జంప్
-
సాహసాల సుందరి
తమిళసినిమా: సాధారణంగా మన హీరోయిన్లు విదేశాలు చుట్టిరావడానికి ఇష్టపడుతుంటారు. నటి త్రిష లాంటి వారైతే విదేశీయానానికి తరుచూ వెళ్లొస్తుంటారు. అయితే అలాంటి వారు చాలా మంది షాపింగ్‌లు, సముద్రతీరాన స్విమ్మింగ్లు చేస్తూ ఆ దృశ్యాలను వాట్సాప్, ట్విట్టర్ లాంటి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేసి ప్రచారం పొందే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చెన్నై చిన్నది త్రిష ఇందుకు విరుద్ధం అని చెప్పకతప్పదు. చేతి నిండా చిత్రాలు ఉన్నా, పార్టీలు, పబ్‌లు అంటూ జీవితాన్ని ఎంజాయ్ చేసే నటి త్రిష. ఈ అమ్మడు ప్రస్తుతం కెనడాలో ఎంజాయ్ చేస్తోంది. త్రిషకు కాస్త ధైర్యం ఎక్కువేనని చెప్పకతప్పదు. సినిమాల్లో హీరోలు బంగీ జంపు చేస్తుండడం చూస్తుంటాం. అందుకు వారు పలు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిజంగానే అలాంటి సాహసమే చేసింది త్రిష. కెనడా దేశ రాజధాని టోరంటో నగరంలోని రోజర్ సెంటర్లో 1,168 అడుగుల ఎత్తైన ప్రదేశంలో బేస్‌బాల్ గేమ్ ఆడడానికి డిసైడ్ అయిపోయ్యింది. సాధారణంగా 20 అడుగులపై నుంచి కిందికి చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది 1,168 అడుగుల ఎత్తైన బిల్డింగ్ అంచున రోప్ సాయంతో 10 నిమిషాలు నిలబడి ఆ దృశ్యాలను ఫొటో తీసుకుని వాటిని తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలిప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అయి అభిమానుల్ని విపరీతంగా అలరిస్తున్నాయి. త్రిష ధైర్య, సాహసాల గురించి వారు ఒక రేంజ్లో పొగిడేస్తున్నారు. త్రిష బంగీ జంప్ చేసిందో లేదో గానీ, ఈ అమ్మడికి అంత సాహసం చేసినంత ప్రచారం లభించేసింది. ఈ విధంగా త్రిష మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ బ్యూటీ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం మోహిని త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. దీనితో పాటు గర్జన, 96, చతురంగవేట్టై–2, పరమపదం, 1818 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. -
కోషి నదిపై... బంగీ ఖుషీ
నేపాల్ అటూ ఇటూ ఎత్తై కొండలు. మధ్యలో ప్రవహించే కోషి నది. ఆ కొండల మధ్యలో 560 అడుగుల ఎత్తులో వేసిన ప్లాట్‌ఫామ్ నుంచి కాళ్లకు తాడు తప్ప మరేమీ ఆధారం లేకుండా కిందికి దూకేస్తే? దూకే వరకూ భయమే. కానీ ఆ తరవాత ఉండే థ్రిల్... ఒక జీవితానికి సరిపోతుంది. అందుకే... బంగీ జంప్ కోసం నేపాల్‌కు విదేశీయులూ పెద్ద ఎత్తున వస్తుంటారు. నిజానికి బావగారూ బాగున్నారా... సినిమాలో చిరంజీవి బంగీ జంప్ చెయ్యటాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆఖరికి చిరంజీవి కూడా. అసలు బంగీజంప్ అంటే మొదట గుర్తొచ్చేది చిరంజీవి చేసిన న్యూజిలాండే. కానీ మనకు పక్కనే ఉన్న నేపాల్లోనూ ఈ అవకాశం ఉంది. న్యూజిలాండ్ బంగీ నిపుణులే దీన్నీ ఏర్పాటు చేశారు. నేపాల్‌కు వెళ్లేదెలా? * అంతర్జాతీయ ప్రయాణికులెవరైనా విమానంలో వెళితే ఖాట్మండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగాల్సిందే. స్థానికంగా చిన్న చిన్న విమానాలు, విమానాశ్రయాలతో నేపాల్ మొత్తానికి విమాన ప్రయాణ సౌకర్యాలున్నాయి. * హైదరాబాద్ నుంచి నేరుగా విమానాలు లేవు. ఢిల్లీ నుంచి మాత్రం 1.45 గంటల ప్రయాణం. కాస్తంత ముందుగా బుక్ చేసుకుంటే ఛార్జీలు ఒకరికి రూ.12వేలలోపే ఉంటాయి. * రోడ్డు మార్గంలో వెళ్లటానిక్కూడా నేపాల్ అనుకూలమే. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ల ద్వారా నేపాల్‌కు వెళ్లొచ్చు. క్యాబ్‌లు, కార్లతో నేరుగా ప్రవేశించొచ్చు. భారతీయులకు వీసా అవసరం లేదు. పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్సు, పాన్ వంటి ప్రభుత్వం జారీ చేసిన ఏదో ఒక గుర్తింపు కార్డు మాత్రం తప్పనిసరి. * నేపాల్‌కు మన దేశం నుంచి రైలు కూడా నడుస్తోంది. 1994లో ఈ రైలు ఆరంభమైంది. ఇది బీహార్‌లోని జయనగర్ నుంచి బయలుదేరి ఖాట్మండులోని జనక్‌పూర్ ధామ్ వరకూ వెళుతుంది. * మంచుకొండల్లో ఉండే నేపాల్ చాలా అందమైన దేశం కనక అక్కడికి వెళ్లినవారు కోషి బంగీజంప్కు వెళ్లేదాకా మిగతా ప్రాంతాల్ని చూడొచ్చు. కోషిపై బంగీజంప్ నిర్వహించే ప్రాంతం... నేపాల్- టిబెట్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉంటుంది. అక్కడికి బస్సులో దాదాపు 3 గంటల ప్రయాణం. ఏ సీజన్ అనుకూలం? మార్చి- మే: వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. పెద్దగా చలి, ఎండ ఉండవు. పర్వతారోహణకిదే సరైన సమయం. ఇక్కడ రకరకాల పుష్పాలు వికసించేదీ ఇప్పుడే. టూరిస్టుల సంఖ్యా ఎక్కువే. జూన్- ఆగస్టు: ఎండాకాలం, వర్షాకాలం కలిసే ఉంటాయి. రోజూ వర్షం పడటం... బాగా వేడిగా ఉండటం చూడొచ్చు. ఈ సమయంలో టూరిస్టుల తాకిడి తక్కువ. సెప్టెంబరు- నవంబరు: వేసవి వెళిపోతుంది. శీతాకాలం రావటానికింకా సమయం ఉంటుంది. ఇదే పర్యాటకులకు బెస్ట్ సీజన్. డిసెంబరు- ఫిబ్రవరి: చలికాలం. రాత్రిళ్లు, ఉదయం చలి ఎక్కువ. ట్రెక్కింగ్‌కు ఇది మంచి సీజన్. -
బంగిజంప్ చేసేదెప్పుడూ..
గాలిలో ఎగిరేందుకు ఎదురుచూపులు.. నెలలు గడుస్తున్నా కనిపించని పనులు కేంద్ర అనుమతికి నివేదిక పంపామంటున్న అధికారులు సోన్ బ్రిడ్జివద్ద ఏర్పాటు చేస్తామన్న పర్యాటకశాఖ నిర్మల్ రూరల్ : పచ్చని అడవులతో.. స్వచ్ఛమైన ప్రకృతిని కళ్లకు కట్టి చూపుతుంది ఆదిలాబాద్ జిల్లా. కొండలు, కోనల గుండా గలగల పారే సెలయేళ్లు.. ఎగిరేపడే జలపాతాల అందాలతో ఇట్టే ఆకట్టుకుంటుంది ఈ అడవుల ఖిల్లా. దక్షిణ కశ్మీరంగా ఖ్యాతికెక్కినా.. పర్యాటకపరమైన అభివృద్ధి మాత్రం అసలు కశ్మీరమంతా దూరంలో ఉంది. పాలకుల పట్టింపులేనితనం.. అధికారుల అలసత్వం ఆదిలాబాద్‌ను పర్యాటకపరంగా వెనుకబడేస్తున్నాయి. దీనికి సోన్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేస్తామన్న బంగిజంపే నిదర్శనం. తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్యాటకరంగానికి సీఎం కేసీఆర్ జవజీవాలు పోస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆయనే స్వయంగా దక్షిణ కశ్మీర్‌గా అభివర్ణించారు. దీన్ని పర్యాటకుల ధామంగా మారుస్తామన్నారు. అనంతరం పర్యాటక శాఖాధికారులు జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా సోన్ పాతబ్రిడ్జి అనుకూలంగా ఉండటంతో ఇక్కడ బంగిజంప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెక్కుచెదరని రాతికట్టడం.. ఆదిలాబాద్‌జిల్లాకు ముఖద్వారంగా నిర్మల్ మండలంలోని సోన్ గ్రామం ఉంటుంది. ఈ గ్రామ సమీపంలోనే గోదావరినదిపై నిజాం కాలంలో పూర్తిగా నల్లరాయి, డంగుసున్నంతో బ్రిడ్జి నిర్మించారు. అప్పట్లో పటిష్టంగా నిర్మించిన ఈ బ్రిడ్జి ఏళ్లపాటు సేవలందించింది. దాదాపు కిలోమీటర్ పొడవుగల ఈ రాతికట్టడం దశాబ్దా లు గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. తొమ్మిదేళ్ల క్రితం జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా పాతబ్రిడ్జి పక్కనే విస్తారంగా రెండు కొత్త బ్రిడ్జిలను నిర్మించారు. దీంతో పాతబ్రిడ్జిని ప్రస్తుతం ఉపయోగించడం లేదు. పర్యాటకంగా అనుకూలం.. ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాలను విడదీసే గోదావరిపై గల సోన్ బ్రిడ్జి కట్టడమే చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక ఇక్కడి వాతావరణం, అనుకూలతలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఈ బ్రిడ్జిపై నుంచి స్పష్టంగా చూడొచ్చు. ప్రాజెక్టు గల పోచంపాడ్ కూడా ఇక్కడి నుంచి కేవలం 5కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక కొయ్యబొమ్మలకు, కోటబురుజులకు ఖ్యాతి గాంచిన నిర్మల్ పట్టణం ఇక్కడి నుంచి 12కిలోమీటర్ల దూరమే. సోన్ బ్రిడ్జికి ఇరువైపులా పచ్చని చెట్లు, మధ్యలో గోదావరి నది ఉంది. వేసవిలో రాళ్లు, చెట్లు, అక్కడక్కడ నీటిగుంటలతో ఉండే గోదావరి.. ఈ సీజన్లో మాత్రం నీటి పరవళ్లతో కళకళలాడుతుంది. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా బ్రిడ్జికి ఇరువైపులా పుష్కరఘాట్లను అభివృద్ధి పరిచారు. సాధారణంగానే వారంలో నాలుగైదు రోజులు ఈ ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఇక బ్రిడ్జి పక్కనే ఉన్న సోన్ గ్రామం కూడా చారిత్రకంగా పేరొందినదే. ఇక్కడి పురాతన ఆలయాలు, చారిత్రక ఆనవాళ్లు ఆకట్టుకుంటాయి. సమీపంలోనే అభివృద్ధికి నోచుకోని సోన్‌గఢ్ గంభీరంగా కనిపిస్తుంటుంది. పరిశీలించిన పర్యాటక అధికారులు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పర్యాటకంగా జిల్లాను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పే ర్కొన్నారు. ఈమేరకు పర్యాటక శా ఖాధికారులు జిల్లాను సందర్శించా రు. పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రదేశాలను గుర్తించారు. ఇప్పటికే నిర్మల్‌లోని శ్యాంగఢ్లో కోట మరమ్మతులు, పర్యాటకాభివృద్ధి పనులు చేపట్టారు. గత కొంతకాలంగా ఈ పనులు కూడా ని లిచిపోవడం గమనార్హం. ఇక గోదావరిపై వృ థాగా ఉంటున్న చారిత్రక కట్టడమైన సోన్ బ్రిడ్జి ని పర్యాటకకేంద్రంగా మారుస్తామని, ఇక్కడ బంగిజంప్‌కు ఏర్పాట్లు చేస్తామని దాదాపు ఆరునెలల క్రితం పర్యాటకశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బంగిజంప్‌కు కావల్సిన అనువైన వాతావరణం, ఏర్పాట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు చర్యలు చేపడతామని కూడా చెప్పారు. కానీ.. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు ప్రారంభం కాలేదు. మరోవైపు అధికారుల ప్రకటనతో హర్షం వ్యక్తంచేసిన పర్యాటకులు.. ‘బంగిజంప్ చేసేదింకెప్పుడూ..’ అని ఎదురుచూస్తున్నారు. విదేశాల్లో క్రేజ్.. బంగిజంప్.. ఇది మాటల్లో చెప్పలేని ఓ రోమాంచితమైన అనుభూతినిచ్చే.. వీరోచితమైన సాహసం. అసలు బంగిజంప్ అంటే.. ఎత్తై కొండ ప్రాంతం నుంచి కాళ్లకు తాడు కట్టుకుని ఒక్కసారిగా లోయలోకి దూకేయడం. ఇలా గా ల్లో దూకిన తర్వాత నిర్ణీత దూరం వరకు వెళ్లిన తర్వాత మళ్లీ తాడు మనల్ని ఎక్కడినుంచైతే దూ కామో.. అక్కడికి చేరుస్తుంది. ఇలాంటి బంగి జంప్‌లు చేసేందుకు మనదేశంలో ఉత్తర భారతదేశంలో కొన్నిచోట్ల ఉన్నాయి. విదేశాల్లో మా త్రం బంగిజంప్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుం ది. మనవాళ్లు విదేశాలకు వెళ్లినప్పుడు ఇలాంటి ఫీట్లు చేస్తుంటారు. మన దగ్గర ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. కేంద్రం అనుమతి కోసం.. ఓ రకంగా ప్రమాదకరమైన బంగిజంప్ను ఏర్పాటు చేయాలంటే కేంద్రప్రభుత్వం అనుమతి కావాలని పర్యాటక శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఈమేరకు పర్యాటకశాఖ కార్యదర్శి బు ర్రా వెంకటేశం కేంద్రానికి అనుమతి కోసం పం పారని ఆ శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధి, బంగిజంప్లపై దృష్టిపెట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
40 వ అంతస్తు నుంచి దూకేసిన సల్మాన్ ఖాన్
కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కిక్కు కావలసి వచ్చింది. అందుకే ఏకంగా ఏడు సముద్రాలు దాటి పోలండ్ వెళ్లి, ఆ దేశంలోనే ఎత్తైన ఓ భవనం 40 వ అంతస్తు నుంచి కిందకి దూకాడు. బంగీ జంప్ చేసి అంతెత్తు భవనం నుంచి తలకిందులుగా వేలాడాడు. ఇదంగా కిర్రెక్కో లేక కిక్ ఎక్కో చేసిన పనికాదు. ఇది తెలుగు కిక్ హిందీ రీమేక్ లో సల్మాన్ ఖాన్ చేసిన ఫీటు. పోలండ్ లోని అత్యంత ఎత్తైన భవనం ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్ నుంచి సల్మాన్ బంగీజంప్ చేసే సీను షూట్ చేశారు. అయితే 'డూపు ఎందుకు, నేనే చేస్తాను' అని సల్మాన్ పట్టుబట్టాడు. చివరికి తన మాటే నెగ్గించుకున్నాడు. వందలాది సల్మాన్ అభిమానులు కేరింతలు కొడుతూండగా సల్మాన్ ఈ ఫీట్ చేసి చూపించాడు. వయసు మీరుతున్నా 'జియో జీ భర్ కే' అంటూ మైండ్ లో ఫిక్సై బ్లైండ్ గా దూకేశాడు. ఈ మొత్తం షూటింగ్ కి అయిదు గంటలు పట్టింది. ఈ సినిమాలో జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్.