40 వ అంతస్తు నుంచి దూకేసిన సల్మాన్ ఖాన్ | Salman Khan hangs from 40th floor for kick | Sakshi
Sakshi News home page

40 వ అంతస్తు నుంచి దూకేసిన సల్మాన్ ఖాన్

Published Mon, Apr 21 2014 11:54 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

40 వ అంతస్తు నుంచి దూకేసిన సల్మాన్ ఖాన్ - Sakshi

40 వ అంతస్తు నుంచి దూకేసిన సల్మాన్ ఖాన్

కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కిక్కు కావలసి వచ్చింది. అందుకే ఏకంగా ఏడు సముద్రాలు దాటి పోలండ్ వెళ్లి, ఆ దేశంలోనే ఎత్తైన ఓ భవనం 40 వ అంతస్తు నుంచి కిందకి దూకాడు. బంగీ జంప్ చేసి అంతెత్తు భవనం నుంచి తలకిందులుగా వేలాడాడు.

ఇదంగా కిర్రెక్కో లేక కిక్ ఎక్కో చేసిన పనికాదు. ఇది తెలుగు కిక్ హిందీ రీమేక్ లో సల్మాన్ ఖాన్ చేసిన ఫీటు. పోలండ్ లోని అత్యంత ఎత్తైన భవనం ప్యాలెస్ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్ నుంచి సల్మాన్ బంగీజంప్ చేసే సీను షూట్ చేశారు. అయితే 'డూపు ఎందుకు, నేనే చేస్తాను' అని సల్మాన్ పట్టుబట్టాడు. చివరికి తన మాటే నెగ్గించుకున్నాడు.

వందలాది సల్మాన్ అభిమానులు కేరింతలు కొడుతూండగా సల్మాన్ ఈ ఫీట్ చేసి చూపించాడు. వయసు మీరుతున్నా 'జియో జీ భర్ కే' అంటూ మైండ్ లో ఫిక్సై బ్లైండ్ గా దూకేశాడు. ఈ మొత్తం షూటింగ్ కి అయిదు గంటలు పట్టింది. ఈ సినిమాలో జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement