రిక్షా డ్రైవర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళ: వీడియో వైరల్‌ | Viral Video: Noida Woman Arrested For Assaulting E Rickshaw Driver | Sakshi
Sakshi News home page

Viral Video:రిక్షా డ్రైవర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళ

Published Sun, Aug 14 2022 9:30 PM | Last Updated on Sun, Aug 14 2022 10:27 PM

Viral Video: Noida Woman Arrested For Assaulting E Rickshaw Driver - Sakshi

ఉత్తరప్రదేశ్‌: చిన్నప్రమాదానికి పెద్ద రాద్ధాంతం చేసింది నోయిడాలోని ఒక మహిళ. నోయిడాలోని ఒక రిక్షా డ్రైవర్‌ ఆమె కారు పైకి పొరపాటున తన రిక్షాని  పోనిచ్చాడు. అంతే ఒక్కసారిగా ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. సదరు రిక్షా డ్రైవర్‌ కాలర్‌ పట్టుకుని లాక్కెళ్లుతూ దుర్భాషలాడింది.  ఆ తర్వాత ఆ వ్యక్తిని పదేపదే చెంపదెబ్బలు కొట్టడం ప్రారంభించింది.

అతని జేబులోంచి డబ్బులు కూడా లాక్కొని అదేపనిగా చెంపదెబ్బలు కొట్టింది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు రికార్డు చేయడంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు సదరు మహిళని కిరణ్‌ సింగ్‌గా గుర్తించి అరెస్టు చేశారు. 

(చదవండి:  కారుపై 'హర్‌ ఘర్‌ తిరంగ' థీమ్‌తో హల్‌చల్‌ చేస్తున్న యువకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement