మహిళా టీచర్‌తో ఎఫైర్‌.. తల్లిని చంపేసిన కూతురు! | Girl Kills Mother Over Relationship With Female Teacher | Sakshi
Sakshi News home page

మహిళా టీచర్‌తో ఎఫైర్‌.. తల్లిని చంపేసిన కూతురు!

Mar 12 2018 4:31 PM | Updated on Aug 21 2018 6:02 PM

Girl Kills Mother Over Relationship With Female Teacher - Sakshi

ఘజియాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. మహిళా ఉపాధ్యాయురాలితో సంబంధాన్ని నిలదీసినందుకు కన్నతల్లిని కడతేర్చిందో కిరాతకురాలు. ఈ ఘటనలో 18 ఏళ్ల అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఘజియాబాద్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి(18) తన కాలేజీలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలి (35)తో లైంగిక సంబంధాన్ని పెట్టుకుంది.

ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వద్దని వారించారు. ఒకటిరెండుసార్లు కూతురిని మందలించారు. అయినా.. వెనకకు తగ్గని ఆ అమ్మాయి కొన్ని నెలల కిందట ఇంటి నుంచి పారిపోయి.. ఆ టీచర్‌తో కలిసి సహజీవనం చేసింది. దీంతో కూతురిని గుర్తించి బలవంతంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. టీచర్‌తో తన అనుబంధాన్ని తల్లి తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపం పెంచుకున్న యువతి.. ఈ నెల 9వ తేదీన.. ఇంట్లో ఎవరులేని సమయంలో తల్లిపై కర్రలు, ఇనుపచువ్వలతో దాడి చేసింది.

కన్నతల్లి అన్న కనికరం చూపకుండా తీవ్రంగా కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ మహిళ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై మృతురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను కూతురే చంపేసిందని, టీచర్‌తో లైంగిక సంబంధాన్ని కాదన్నందుకు ఈ ఘాతుకానికి ఒడిగట్టిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న ఘజియాబాద్‌ కవినగర్‌ పోలీసులు.. నిందితురాలిని అరెస్టు చేశారు. టీచర్‌పై కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను కూడా విచారించాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement