వనస్థలిపురం సహారా ఎస్టేట్ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో గురువారం అర్థరాత్రి దొంగలు చోరీకి యత్నించారు.
హైదరాబాద్: వనస్థలిపురం సహారా ఎస్టేట్ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో గురువారం అర్థరాత్రి దొంగలు చోరీకి యత్నించారు. ఏటీఎంను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. నగదు ఉన్న లాకర్ తెరుచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. ఆ విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఏటీఎంను పరిశీలించారు. పోలీసులు కేసు నమెదు చేస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.