మద్యం మత్తులో ఓ యువకుడు ఏటీఎంలో హల్ చల్ చేశాడు.
తెనాలి: మద్యం మత్తులో ఓ యువకుడు ఏటీఎంలో హల్ చల్ చేశాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తెనాలి రైల్వే స్టేషన్‌లో ఎస్‌బీఐ ఏటీఎంలో బుధవారం ఓ యువకుడు ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేస్తుండగా గమనించిన స్థానికులు అతనిని అడ్డుకున్నారు. అయినా యువకుడు వినకపోవడంతో చితకబాది అనంతరం రైల్వే పోలీసులకు అప్పగించారు. యువకుడు మద్యం మత్తులో ఉండడంతో ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తోంది. అతను ఏవరనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు