స్టేట్ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీ | cash looted at SBI ATM using Gas Cutter | Sakshi
Sakshi News home page

స్టేట్ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీ

Published Sat, Sep 2 2017 7:49 PM | Last Updated on Sun, Sep 17 2017 6:18 PM

స్టేట్ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీ

స్టేట్ బ్యాంకు ఏటీఎంలో భారీ చోరీ

సాక్షి, మదనపల్లి : చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం నక్కలదిన్నే తండాలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి  చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలో క్యాష్‌ చాంబర్‌ను గ్యాస్‌ కట‍్టర్‌తో కోసి డబ్బు ఎత్తుకెళ్లారు.

ఈ విషయం శనివారం మధ్యాహ్నం ఆలస్యంగా వెలుగుచూసింది. ఏటీఎంలో ఉంచిన నగదు రూ. 22లక్షలు చోరీకి గురయ్యాయని ఎస్‌బీఐ బ్రాంచి మేనేజర్‌ కెఎస్‌ఆర్‌ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గార్డు, సీసీ కెమెరా ఇద్దరూ ఏటీఎం కేంద్రం వద్ద లేకపోవటంతో ఈ ఘటనకు పాల్పడిందెవరనేది తెలియడం లేదు. శనివారం సాయంత్రం పోలీసులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement