మెదక్ జిల్లా జిన్నారం మండలం బొల్లారంలోని పారిశ్రామిక వాడలో ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు.
జిన్నారం: మెదక్ జిల్లా జిన్నారం మండలం బొల్లారంలోని పారిశ్రామిక వాడలో ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఏటీఎంలోకి చొరబడిన దుండగులు ముందుగా సీసీ కెమెరాలను కొట్టి ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎం యంత్రాన్ని తెరిచేందుకు ప్రయత్నించారు. కొంత మేర ధ్వంసం చేశారు. పెట్రోలింగ్ పోలీసుల రాకతో పరారయ్యారు. దీనిపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.