ఏటీఎంలో డబ్బు మాయం | Rs 32 lakhs theft of Money SBI atm | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో డబ్బు మాయం

Published Sun, Sep 13 2015 11:15 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

రావులపాలెం మండలకేంద్రంలోని సీఆర్‌సీ రోడ్డు వద్ద నున్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.32 లక్షల 75 వేల 200 మాయమయినట్లు బ్యాంకు అధికారులు రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు.

తూర్పుగోదావరి(రావులపాలెం): రావులపాలెం మండలకేంద్రంలోని సీఆర్‌సీ రోడ్డు వద్ద నున్న ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.32 లక్షల 75 వేల 200 మాయమయినట్లు బ్యాంకు అధికారులు రావులపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఏటీఎంను అమలాపురం డీఎస్పీ ఎల్ అంకయ్యతో పాటు స్థానిక సీఐ, ఎస్‌లు పరిశీలించారు.

అనంతరం ఎలాంటి లావాదేవీలు జరగకుండా ఏటీఎంను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏటీఎం కెపాటిసీ రూ.38 లక్షలు. బ్యాంకు సమయాన్ని బట్టి ఎంత మనీ తగ్గితే అంత మనీ ఏటీఎంలో పెడతారు. ఏటీఎంలో టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇలా జరిగిందా లేక ఏటీఎంలో డబ్బు పెట్టేవాళ్లు ఏమైనా గోల్‌మాల్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంను ధ్వంసం చేసిన ఆనవాళ్లు లేకపోవడంతో బ్యాంకుకు చెందిన ఉద్యోగులే ఏమైనా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement