తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది
ఏలేశ్వరం: తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఏటీఎంలోని ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కావడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
మంటలు ఒక్కసారిగా ఎగిసిపడి పక్కనే ఉన్న మరో రెండు దుకాణాలకు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు.