న్యూఢిల్లీ: కష్టాలు వచ్చినప్పుడే మనలోని అసలు మనిషి బయటకు వస్తాడు. బాగున్నప్పుడు విలువలు చెప్పి.. కష్టాల్లో ఉన్నప్పుడు తప్పులు చేస్తే ఇక విలువలకు అర్థం ఏం ఉంటుంది. ఇప్పడు ఈ ముచ్చట ఎందుకంటే పైన చెప్పిన డైలాగ్‌కు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి ప్రస్తుతం ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. చోటు అనే వ్యక్తి బండి మీద మామిడి పళ్లు పెట్టుకుని అమ్ముతుంటాడు. ఈ క్రమంలో నిన్న ఓ స్కూల్ దగ్గర పండ్ల బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటుండగా.. చోటుకు, పక్క దుకాణదారుకి గొడవ జరిగింది. వారిద్దరూ అలా కొట్టుకుంటుండగా ఆ పక్క వెళ్లే జనాలు దీన్ని అదునుగా భావించి చోటు బండి మీద ఉన్న మామిడి పళ్లను అందినకాడికి అందుకుని వెళ్లారు. కొందరు హెల్మెట్‌లో పెట్టుకుని మరి వెళ్లారు. చోటు వచ్చి చూసేసరికి బండి మొత్తం ఖాళీ అయ్యింది.
దాదాపు 30 వేల రూపాయల విలువైన మామిడి పళ్లను ఎత్తుకెళ్లారు జనాలు. ఖాళీ బండి చూసి లబోదిబోమంటున్నాడు చోటు. లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలుగా జనాలకు పనులు లేవు.. డబ్బులు కూడా లేవు. మరోవైపు మామిడి పళ్ల రేటు ఆకాశాన్ని తాకింది. ఈ క్రమంలో జనాలు.. ఇదే చాన్స్‌గా అందినకాడికి మామిడి పండ్లను ఎత్తుకుని వెళ్లారు. (ఈ ఏడాది నయమే..)
Comments
Please login to add a commentAdd a comment