బీహార్లోని అరారియా జిల్లాలో ఓ ఎల్ఐసీ మేనేజర్ను కొంతమంది దుండగులు తుపాకులతో బెదిరించి రూ. 18.9 లక్షలు దోచుకున్నారు. సోమ్నాథ్ మిశ్రా అనే సదరు మేనేజర్ సదర్ బజార్ ప్రాంతంలోని తన కార్యాలయం నుంచి డబ్బు తీసుకుని దాన్ని అదే భవనంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ చేసేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మేనేజర్తో పాటు ఆ సమయంలో ఓ ప్యూన్ కూడా వెంట ఉన్నాడు.
నలుగురు సాయుధులు ఎల్ఐసీ కార్యాలయం వెలుపల వేచి ఉన్నారు. మేనేజర్ బ్యాంకుకు వెళ్లేలోగానే తుపాకి చూపించి ఆయనను బెదిరించి డబ్బు ఉన్న బ్యాగ్ తీసుకుని అక్కడినుంచి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. అప్పటికే ఆ దొంగల సహచరులు బయట మోటార్ సైకిళ్లపై వేచి ఉన్నారని, వీళ్లు రాగానే ఎక్కించుకుని వేర్వేరు దారుల్లో పారిపోయారని అన్నారు. దోపిడీదొంగలను పట్టుకోడానికి పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. డబ్బు వస్తున్న విషయం వాళ్లకు ముందే ఎలా తెలిసిందని కూడా విచారిస్తున్నారు.
ఎల్ఐసీ మేనేజర్ నుంచి 19 లక్షల దోపిడీ
Published Sat, Jun 7 2014 2:38 PM | Last Updated on Tue, Oct 9 2018 5:34 PM
Advertisement
Advertisement