పశ్చిమగోదావరి: పాపం పోనిలే అని లిఫ్ట్ ఇస్తే..నిలువునా దోపిడీ చేశాడు. ఈ సంఘటన చేబ్రోలు దగ్గర ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. దంపతులు ప్రయాణిస్తున్న కారును లిఫ్ట్ అడిగి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎక్కాడు. ఆ తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత వారిని బెదిరించి రూ. 8 లక్షలు దోపిడీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదే చేసి దుండగుడి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.