పాదచారిని బెదిరించి నగదు దోపిడి | Pedestrian threatened to loot cash | Sakshi
Sakshi News home page

పాదచారిని బెదిరించి నగదు దోపిడి

Published Sun, Dec 18 2016 9:46 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Pedestrian threatened to loot cash

శంషాబాద్: రంగారెడ్డిజిల్లా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో ఓ వ్యక్తిని దుండగులు కత్తులతో బెదిరించి నగదు దోచుకెళ్లారు. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని రెండు బైకులపై వచ్చిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు కత్తులతో బెదిరించారు. అతని వద్ద ఉన్న రూ.8,500 నగదు, సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ప్రాంతంలో దుండగుల ఆగడాలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బాధితుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement