రాయితో కొట్టి.. బట్టలు చింపి..
అజ్మీర్: రాజస్థాన్ పర్యటనకు వచ్చిన నలుగురు విదేశీయులపై ఆరుగురు వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. అనంతరం వారిని దోచుకున్నారు. ఈ క్రమంలో వారికి గాయాలు కూడా అయ్యాయి. అయితే, ఆ ఆరుగురిలో ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. ఒక మైనర్ బాలికను అదుపులోకి తీసుకున్నారు. అజ్మీర్ ఎస్పీ నితీన్ దీప్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికా, బ్రిటన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు స్పెయిన్, టర్కీ కి చెందిన ఇద్దరు మహిళలు రెండు బైక్ లపై అజయ్ పాల్ దామ్ కు వెళ్లారు.
బాగా తాగిన ఆరుగురు దోపిడీ దారులు తొలుత వారిని వెంబడించారు. బాగా తాగి అనకూడని మాటలు అన్నారు. అదే సమయంలో ఓ టూరిస్టు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో రాయితో కొట్టారు. ఆ తర్వాత అందులో ఓ మహిళనకు కిందకు లాగి ఆమె దుస్తులు చింపేశారు. వారు ఏదో ఒకలా వారి నుంచి తప్పించుకొని స్థానికుల సహాయంతో బయటపడ్డారు. ఈ దాడిపై స్పందించిన పోలీసులు వేగంగా కదిలి ఆరుగురుని ఈరోజు అదుపులోకి తీసుకున్నారు.