
సాక్షి, రంగారెడ్డి : అందరూ న్యూ ఇయర్ వేడుకలో మునిగి తేలుతుండగా.. దొంగలు మాత్రం అదే అదునుగా చూసుకున్నారు. తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం రగన్నగుడ గ్రామంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో దుండుగులు చోరికి ప్రయత్నించారు. బ్యాంకు వెనుక నుంచి గోడకు రంధ్రం చేసి బ్యాంకు లోపలికి ప్రవేశించారు. బ్యాంకు లోపల లాకర్ తెరవడంలో మాత్రం విఫలయత్నం పొందారు. లాకర్ తెరుచుకోకపోవడంతో, దుండగులు వెనుదిరిగి వెళ్లిపోయినట్టు తెలిసింది. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ఉండగా.. దుండగులు ఈ చోరికి ప్రయత్నించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అక్కడున్న సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment