గ్యాంగ్‌రేప్: నిందితుల్లో డీఆర్డీఏ పీడీ
లక్నో: డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌తోపాటు మరో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ప్రాంతంలోని షామిలిలో ప్రభుత్వ కార్యాలయంలో రెండు నెలల క్రితం ఈ దారుణం చోటు చేసుకుంది. దాంతో బాధితురాలు రాష్ట్ర మహిళ కమిషన్‌ను ఆశ్రయించింది. నిందితులను అరెస్ట్ చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని బాధితురాలు కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది.
ఈ ఘటనపై విచారణ జరిపిన కమిషన్ నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం నిందితులు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్ఞాన్ ప్రకాశ్,అసిస్టెంట్ ఇంజినీర్ దినేష్ కుమార్,గుమస్తాలు రాజ్‌కుమార్,ఆనంద్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎడిషన్ ఎస్పీ వి.కె.మిశ్రా వెల్లడించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మిశ్రా వివరించారు.