మహిళపై గ్యాంగ్‌ రేప్‌ | Gangrape In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

మహిళపై గ్యాంగ్‌ రేప్‌

Published Tue, Jun 27 2017 12:28 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

Gangrape In Uttar Pradesh

సంభాల్‌(యూపీ): బరేలి రైల్వే స్టేషన్‌ నుంచి ఓ మహిళను బలవంతంగా తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈనెల 16న పానిపట్‌ వెళ్లేందుకు బరేలి స్టేషన్‌కు వచ్చిన 40 ఏళ్ల మహిళకు ముగ్గురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి గిన్నార్‌ ప్రాంతంలోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు. ఆమెతోపాటు 13 ఏళ్ల కుమారుడు, 11 ఏళ్ల కుమార్తె ఉన్నారు. 
తన కుమారుడితో ఎలాగో బయటపడ్డానని, తన కుమార్తె ఇంకా అక్కడే ఉందని ఆమె పోలీసులకు తెలిపింది. ఆమెపై నాలుగు రోజులుగా ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ పంకజ్‌ పాండే తెలిపారు.   చాందౌసి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement