ఢిల్లీలో కారులో గ్యాంగ్‌రేప్‌ | Gurgaon to Greater Noida via Delhi: another gangrape in NCR | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కారులో గ్యాంగ్‌రేప్‌

Published Wed, Jun 21 2017 2:31 AM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM

ఢిల్లీలో కారులో గ్యాంగ్‌రేప్‌

ఢిల్లీలో కారులో గ్యాంగ్‌రేప్‌

గుర్గావ్‌/నోయిడా: దేశ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్‌)లో మరో సామూహిక అత్యాచారం జరిగింది. 35 ఏళ్ల మహిళపై ముగ్గురు మృగాళ్లు కారులో గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. రాజస్తాన్‌కు చెందిన మహిళ గుర్గావ్‌లోని సోహ్న ప్రాంతంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో రోడ్డుపై నడచుకుంటూ వెళ్తుండగా ఆమెను దుండగులు స్విఫ్ట్‌ కారులోకి లాగారు. అనంతరం ఐదు గంటలపాటు ఆమెపై అత్యాచారం చేస్తూ ఢిల్లీ మీదుగా నోయిడా వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఆమెను నోయిడాలో వదిలేశారు.

నిందితులు అత్యాచారం చేస్తూ కారులో గుర్గావ్‌ నుంచి ఢిల్లీ మీదుగా నోయిడా వరకు వచ్చినా..ఏ ఒక్క పోలీసూ గుర్తించకపోవడం రాజధాని ప్రాంతంలోని భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ ఘటనపై నోయిడా, గుర్గావ్‌ పోలీసులు సంయుక్తంగా విచారణ జరుపుతున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు గౌతమ బుద్ధ నగర్‌ ఎస్సెస్పీ లవ్‌ కుమార్‌ చెప్పారు. 2012లో నిర్భయ ఘటన సమయంలో పెద్ద ఉద్యమమే జరిగినా ఎన్‌సీఆర్‌లో మహిళలకు నేటికీ భద్రత కరువైంది. ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో తరచూ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement