పగలు ఆటోడ్రైవింగ్ రాత్రిళ్లు అఘాయిత్యాలు | Auto Drivers arrested in Gang Rape case | Sakshi
Sakshi News home page

పగలు ఆటోడ్రైవింగ్ రాత్రిళ్లు అఘాయిత్యాలు

Published Fri, Aug 29 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 12:35 PM

Auto Drivers arrested in Gang Rape case

* గ్యాంగ్‌రేప్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు  
* వెలుగు చూస్తున్న అరాచకాలు

 
సాక్షి, హైదరాబాద్: మృగాళ్ల ఆగడాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఒంటరి మహిళలను నమ్మిం చి ఆటోల్లో తీసుకువెళ్లి అఘాయిత్యాలకు పాల్ప డుతుంటారు. పగలంతా ఆటోలు నడపడం, రాత్రిళ్లు అసాంఘికచర్యలకు పాల్పడడం వారికి నిత్యకృత్యం. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్ల అకృత్యా లు బయటపడుతున్నాయి. భర్త, మరిదితో కలిసి కూలీ కోసం ఆటోలో వెళ్తున్న మహిళపై హైదరాబాద్ శివారులోని నారపల్లి సమీపంలో ఐదుగురు ఆటోడ్రైవర్లు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురిని మేడిపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు రవి (22)ని గురువారం అరెస్టు చేశారు.   రెండు రోజులుగా పరారీలో ఉన్న రవిని విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట ఆటోఅడ్డా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
ముందు రెక్కీ..: నారపల్లికి చెందిన ఇమ్ము అలియాస్ అక్రమ్ (22), అబ్బాస్ (24), జుబేర్(22), ఘట్‌కేసర్‌కు చెందిన షెహనాజ్ (20), ఫిర్జాదిగూడకు చెందిన సి.రవి(22) ఆటోడ్రైవర్లే. ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్, ఎల్‌బీ నగర్‌లకు షేరింగ్ ఆటోలు నడిపిస్తుంటారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వీరంతా ఉప్పల్‌లో కలుసుకుంటారు. విందులతో జల్సా చేస్తారు. రాత్రి 11 గంటలకు ఉప్పల్ బస్టాండ్‌కు వచ్చి ఒంటరి మహిళను టార్గెట్ చేస్తుంటారు. షెహ నాజ్ గుర్తించి మిగతా డ్రైవర్లకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తాడు.
 
ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొని ఆ మహిళను నమ్మించి ఆటోలోకి ఎక్కిస్తారు. ఆ తరువాత వీరు మేడిపల్లి దాటిన తరువాత అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌లకు పాల్పడుతుంటారు. తాజా ఘటనలో గిరిజన మహిళ తన భర్త, మరిదితో కలిసి ఘట్‌కేసర్ వెళ్లే షేరింగ్ ఆటో ఎక్కింది. అప్పటి వరకు ఈ ముగ్గుర్ని గమనిస్తున్న నిందితులు ఆ మహిళ ఎక్కిన ఆటోను తమ ఆటోలో అనుసరించారు. బాధితులున్న ఆటోను ఓవర్‌టేక్ చేస్తూ వెకిలిచేష్టలతో నిందితులు ఇబ్బంది పెట్టారు. నారపల్లి ప్రాంతంలో మహిళను, ఆమె భర్త, మరిదిని నడిరోడ్డు మీద దించి ఆటోవాలా వెళ్లిపోయాడు. నిందితులు ఆ మహిళను బెదిరించి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement