tribal women
-
సమిధలవుతున్న సమరాంగనలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల ను నిర్మూలించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ అమల్లో.. ఈ ఏడాది ఆరంభం నుంచి కేంద్రప్రభుత్వం వేగం పెంచింది. దీంతో బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్లు నిత్యకృత్యంగా మారాయి. అయితే, ఈ ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టులు ఎ క్కువగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతతోనే దళాల్లోకి.. ఆది నుంచీ విప్లవ పోరాటాలు మహిళలకు ప్రాధాన్యమిస్తూనే వచ్చాయి. సాధారణ మహిళల సమస్యలకు తోడు.. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులపై మార్క్సిస్టు పార్టీలు గళం విప్పాయి, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే విధానాన్ని నాటి నక్సలైట్లు, నేటి మావోయిస్టులు అనుసరించారు. అయితే మార్క్సిస్టు విధానం చెప్పే సామాజిక మార్పులపై ఆకర్షితులైన మహిళలు ఆరంభంలో చేతన నాట్యమంచ్ (సీఎన్ఎం), దండకారణ్య క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘాల్లోనే ఎక్కువగా ఉండేవారు. కానీ 2006లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్ సర్కారు నెలకొల్పిన సల్వాజుడుం, అందులోని కొందరు స్పెషల్ పోలీస్ అధికారులు (ఎస్పీవోలు) అడవుల్లోని ఆదివాసీ గూడేలపై దాడి చేసి గ్రామాలను తగులబెట్టడం, అక్కడ కనిపించిన మహిళలపై అకృత్యాలకు పాల్పడటం వంటివి చేశారు. దీంతో ప్రభుత్వ బలగాలపై ఆదివాసీ మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. ఫలితంగా ఆదివాసీ స్త్రీలలో దళాల్లోకి చేరాలన్న ఆసక్తి పెరగడంతో.. మావోయిస్టు సాయుధ దళాల్లో మహిళల సంఖ్య ఎక్కువైంది. 40 శాతం మహిళలు ఇరవై ఏళ్ల చరిత్ర కలిగి మావోయిస్టు పార్టీ సాయుధ దళాల్లో ప్రస్తుతం 40 శాతం మేర మహిళలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ ప్రారంభించడానికి ముందు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వివిధ సందర్భాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 2,500 మంది సాయుధ మావోయిస్టులు ఉండగా.. ఇందులో మహిళల సంఖ్య సుమారు వెయ్యికి పైగానే ఉన్నట్టు సమాచారం. ఇందులో దక్షిణ బస్తర్ డివిజన్ ప్రాంతంలో 300కు పైగా, పశ్చిమ బస్తర్‌లో 150 మందికి పైగా, ఉత్తర బస్తర్ డివిజన్లో 100 మందికి పైగా మహిళా మావోయిస్టులున్నట్టు సమాచారం. ఇక మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా పరిగణించే మాడ్ డివిజన్లో 350 మంది వరకు మహిళా మావోయిస్టులున్నట్టు పోలీసుల వర్గాల అంచనా. మిగిలిన మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, ఏవోబీల్లో తక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. మృతుల్లో పెరుగుతున్న మహిళలు సాధారణంగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సందర్భాల్లో.. సాయుధులైన పురుష మావోయిస్టులే ఎక్కువగా చనిపోతుంటారు. కానీ ఈ ఏడాది జరిగిన పలు ఎన్కౌంటర్లలో మహిళా మావోయిస్టులు భారీగా చనిపోతుండటం మానవతావాదులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈనెల 4న జరిగిన తుల్తులీ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు చనిపోగా.. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. అంతకుముందు ఏప్రిల్ 16న కాంకేర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోతే.. అందులో 15 మంది మహిళలున్నారు. వీటితో పాటు సెప్టెంబర్ 3న బీజాపూర్/దంతెవాడల్లో జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది చనిపోతే.. వారిలో ఆరుగురు మహిళలున్నారు. సెప్టెంబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు నేలకొరిగిపోతే.. వారిలో ఇద్దరు మహిళలున్నారు. వెనుకబాటులో ఆదివాసీలే అధికం సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యం తదితర అనేక అంశాల్లో దేశంలో ఆదివాసీలే ఎక్కువగా వెనుకబాటుకు గురయ్యారు. అందులో ఆదివాసీ స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దుర్భర పరిస్థితుల మధ్య విప్లవ బాట పట్టి దళాల్లో చేరిన మహిళలపై పారా మిలిటరీ బలగాలతో దాడులు చేయించడం, నలువైపులా చుట్టుముట్టి ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని ప్రజాస్వామికవాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ మహిళలు చనిపోతుండడాన్ని దేశ అంతర్గత భద్రత సమస్యగా కాకుండా.. సామాజిక వెనుకబాటు సమస్యగా ప్రభుత్వం పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీ స్త్రీలపై కర్కశంగా ఉక్కుపాదం మోపడం సరికాదంటున్నారు. ఎన్కౌంటర్లలో ఆదివాసీ స్త్రీల మరణాలు ఎక్కువగా ఉంటున్న నేప«థ్యాన.. ఆయుధం పట్టిన ఆదివాసీ మహిళల భద్రత, ప్రాణ రక్షణ, వారి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చ మొదలైంది. -
సమిధలవుతున్న సమరాంగనలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల ను నిర్మూలించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ అమల్లో.. ఈ ఏడాది ఆరంభం నుంచి కేంద్రప్రభుత్వం వేగం పెంచింది. దీంతో బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్లు నిత్యకృత్యంగా మారాయి. అయితే, ఈ ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టులు ఎ క్కువగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతతోనే దళాల్లోకి.. ఆది నుంచీ విప్లవ పోరాటాలు మహిళలకు ప్రాధాన్యమిస్తూనే వచ్చాయి. సాధారణ మహిళల సమస్యలకు తోడు.. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులపై మార్క్సిస్టు పార్టీ లు గళం విప్పాయి, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే విధానాన్ని నాటి నక్సలైట్లు, నేటి మావోయిస్టులు అనుసరించారు. అయితే మార్క్సిస్టు విధానం చెప్పే సామాజిక మార్పులపై ఆకర్షితులైన మహిళలు ఆరంభంలో చేతన నాట్యమంచ్ (సీఎన్ఎం), దండకారణ్య క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘాల్లోనే ఎక్కువగా ఉండేవారు. కానీ 2006లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్ సర్కారు నెలకొల్పిన సల్వాజుడుం, అందులోని కొందరు స్పెషల్ పోలీస్ అధికారులు (ఎస్పీవోలు) అడవుల్లోని ఆదివాసీ గూడేలపై దాడి చేసి గ్రామాలను తగులబెట్టడం, అక్కడ కనిపించిన మహిళలపై అకృత్యాలకు పాల్పడటం వంటివి చేశారు. దీంతో ప్రభుత్వ బలగాలపై ఆదివాసీ మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. ఫలితంగా ఆదివాసీ స్త్రీలలో దళాల్లోకి చేరాలన్న ఆసక్తి పెరగడంతో.. మావోయిస్టు సాయుధ దళాల్లో మహిళల సంఖ్య ఎక్కువైంది. 40 శాతం మహిళలు ఇరవై ఏళ్ల చరిత్ర కలిగి మావోయిస్టు పార్టీ సాయుధ దళాల్లో ప్రస్తుతం 40 శాతం మేర మహిళలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ ప్రారంభించడానికి ముందు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వివిధ సందర్భాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 2,500 మంది సాయుధ మావోయిస్టులు ఉండగా.. ఇందులో మహిళల సంఖ్య సుమారు వెయ్యికి పైగానే ఉన్నట్టు సమాచారం. ఇందులో దక్షిణ బస్తర్ డివిజన్ ప్రాంతంలో 300కు పైగా, పశ్చిమ బస్తర్‌లో 150 మందికి పైగా, ఉత్తర బస్తర్ డివిజన్లో 100 మందికి పైగా మహిళా మావోయిస్టులున్నట్టు సమాచారం. ఇక మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా పరిగణించే మాడ్ డివిజన్లో 350 మంది వరకు మహిళా మావోయిస్టులున్నట్టు పోలీసుల వర్గాల అంచనా. మిగిలిన మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, ఏవోబీల్లో తక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. మృతుల్లో పెరుగుతున్న మహిళలు సాధారణంగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సందర్భాల్లో.. సాయుధులైన పురుష మావోయిస్టులే ఎక్కువగా చనిపోతుంటారు. కానీ ఈ ఏడాది జరిగిన పలు ఎన్కౌంటర్లలో మహిళా మావోయిస్టులు భారీగా చనిపోతుండటం మానవతావాదులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈనెల 4న జరిగిన తుల్తులీ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు చనిపోగా.. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. అంతకుముందు ఏప్రిల్ 16న కాంకేర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోతే.. అందులో 15 మంది మహిళలున్నారు. వీటితో పాటు సెపె్టంబర్ 3న బీజాపూర్/దంతెవాడల్లో జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది చనిపోతే.. వారిలో ఆరుగురు మహిళలున్నారు. సెపె్టంబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు నేలకొరిగిపోతే.. వారిలో ఇద్దరు మహిళలున్నారు. వెనుకబాటులో ఆదివాసీలే అధికం సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యం తదితర అనేక అంశాల్లో దేశంలో ఆదివాసీలే ఎక్కువగా వెనుకబాటుకు గురయ్యారు. అందులో ఆదివాసీ స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దుర్భర పరిస్థితుల మధ్య విప్లవ బాట పట్టి దళాల్లో చేరిన మహిళలపై పారా మిలిటరీ బలగాలతో దాడులు చేయించడం, నలువైపులా చుట్టుముట్టి ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని ప్రజాస్వామికవాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ మహిళలు చనిపోతుండడాన్ని దేశ అంతర్గత భద్రత సమస్యగా కాకుండా.. సామాజిక వెనుకబాటు సమస్యగా ప్రభుత్వం పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీ స్త్రీలపై కర్కశంగా ఉక్కుపాదం మోపడం సరికాదంటున్నారు. ఎన్కౌంటర్లలో ఆదివాసీ స్త్రీల మరణాలు ఎక్కువగా ఉంటున్న నేప«థ్యాన.. ఆయుధం పట్టిన ఆదివాసీ మహిళల భద్రత, ప్రాణ రక్షణ, వారి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చ మొదలైంది. -
నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు
నాగర్‌కర్నూల్: చెంచు మహిళపై జరిగిన దాడి ఘటన ఆటవిక చర్య అని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొలచింతలపల్లి తండాకు చెందిన బాధిత మహిళను మంత్రి శనివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నలుగురు వ్యక్తులు బాధిత మహిళపై పాశవికంగా దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారని, ఘటనకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించామని, నిందితులను అరెస్ట్ చేసి కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు వివరించారు. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని ఊపేక్షించేది లేదని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వారి ముగ్గురు ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్లో విద్యను అందిస్తామని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రస్తుతం రెండెకరాల భూమి ఉందని, ప్రభుత్వం తరఫున మరికొంత భూమిని కూడా ఇచ్చి ఆదుకుంటామని జూపల్లి హామీ ఇచ్చారు. -
గిరిజన మహిళల ఆరోగ్యంపై నివేదిక
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల మహిళల సమస్యలపై 2024–2025 యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జాతీయ మహిళా కమిషన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమహిళా కమిషన్ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం, భద్రత, ప్రభుత్వ విధానాలు, మహిళా కమిషన్ల కార్యాచరణపై జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హరియాణలో నిర్వహించిన రెండ్రోజుల జాతీయస్థాయి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల నుంచి మహిళా కమిషన్ చైర్ పర్సన్లు, సభ్యులు హాజరైన ఈ జాతీయస్థాయి సమావేశంలో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి నివేదికను సమర్పించారు.ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంత మహిళల హక్కులు, అక్షరాస్యత, ఆరోగ్యం, ఆర్ధిక, సామాజిక అవగాహన కార్యక్రమాలు, అనాదిగా కొనసాగుతున్న అనాగరిక ఆచార పద్ధతులపై పలు అంశాలను ఆ నివేదికలో వివరించారు. వెంకటలక్ష్మి మాట్లాడుతూ వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని మాతంగి, బసివిని, జోగిని వంటి అనాగరిక ఆచారాలతో తలెత్తే సమస్యలే పెద్ద సవాల్‌గా మారాయన్నారు. ఈ నివేదికపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ స్పందిస్తూ ఒక్క ఏపీలోనే కాకుండా అన్ని రాష్ట్రాల గిరిజన ప్రాంతాల్లో మహిళా కమిషన్ల సందర్శనతో పాటు అక్కడ మహిళా సమస్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకు జాతీయ మహిళా కమిషన్ తరఫున కొంత నిధిని కేటాయించి రాష్ట్ర కమిషన్లతో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేస్తామని తీర్మానం చేశారు. పనిప్రాంతం (వర్క్‌ప్లేస్)లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013 కింద ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని చైర్పర్సన్ రేఖా శర్మ అన్ని రాష్ట్రాల మహిళా కమిషన్ల చైర్ పర్సన్లకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. కమిషన్ కార్యదర్శి విద్యాపురపు వసంత బాల పాల్గొన్నారు. -
జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం
దేశాధినేతలు, పలువురు అధికారుల హాజరయ్యే జీ20 శిఖరాగ్ర సదస్సుకు సామాన్య గిరిజన మహిళలకు ఆహ్వానం లభించింది. గిట్టుబాటు ధరలేక, సకాలంలో వర్షాలు పడక తదితర కారణాల రీత్యా వ్యవసాయాన్ని వదిలేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయరీతిలో తృణధాన్యాలను పండించి చూపించారు. ఎందరో రైతులకు మార్గం చూపించారు. వారి విజయగాథను జీ20లో వినిపించేందకు ఈ ఇద్దరికి ఆహ్వానించారు. వ్యవసాయరంగానికి సంబంధించిన ప్రదర్శనలో భారత్ తరుఫున ఒడిశా నుంచి ఈ ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఇద్దరు సంప్రదాయ పద్ధతిలో తృణధాన్యాల సాగు గురించి ఆ సదస్సులో పాల్గొనే ప్రపంచనాయకులకు వివరిస్తారు. వాటి ప్రయోజనాలు, పోషక విలువలు గురించి కూడా వివరిస్తారు. ఇంతకీ అసలు ఈ ఇద్దరు మహిళలు ఎవరు?వారి విజయ గాథ ఏంటంటే.. రాయిమతి ఘివురియా కోరాపుట్ జిల్లాలోని కుంద్ర బ్లాక్‌కి చెందని రాయిమితి ఘివురియా 124 రకాల తృణధాన్యాలను భద్రపరిచారు. ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యి..తాను ఈ రంగంలో ఎలా విజయం సాధించిందో వివరించేందుకు జైపూర్‌లోని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా కేంద్రం నుంచి శిక్షణ తీసుకుంది. ఆమె దాదాపు 72 రకాల దేశీ వరి వంగడాలను, ఆరు రకాల వివిధ తృణధాన్యాలను సంరక్షించి విజయవంతమైన మహిళగా నిరూపించుకుంది. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ.. దాదాపు 2500 రైతులను ఈ వ్యవసాయంలోకి తీసుకొచ్చారు. ఈ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం 2012లో తన భూమిలోనే అగ్రికల్చర్ స్కూల్‌ని కూడా ప్రారంభించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఆమె చేసిన కృషికిగానూ ఆమెకు ఎన్నో సత్కారాలు, అవార్డులు వచ్చాయి. ఇప్పుడూ ఈ ప్రతిష్టాత్మక జీ20 సదస్సుకు ఆమెకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు మహిళా రైతు రాయిమితి ఘివురియా మాట్లాడుతూ..ఈ సదస్సులో పాల్గొనే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. సేంద్రియ వ్యవసాయం దాని ప్రయోజనాలు గురించి వివరిస్తాను. గిరిజన మహిళగా ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగం కావడం చాలా సంతోషం ఉందన్నారు రాయిమతి మరో మహిళా రైతు సుబాస మెహనత మయూర్భంజ్ జిల్లాలోని జాషిపూర్ బ్లాక్ పరిధిలోని గోయిలీ గ్రామంలో నివసించే సుబాస మోహనత కూడా ఆదివాసీ తెగకు చెందిన నిరుపేద మహిళ. ఒకప్పుడూ ఆమె గ్రామంలో వరి సాగు చేసేవారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల, ఇతర కారణాల వల్ల ఆ పంటలో విపరీతమైన నష్టాలను చూశారు అక్కడి ప్రజలు. ఇక వ్యవసాయ రంగాన్ని వదిలేద్దాం అనుకున్న సమయంలో ఒడిశా ప్రభుత్వం మిల్లెట్ మిషన్ తీసుకొచ్చింది. చాలమంది మిల్లెట్ సేద్యం పట్ల ఆసక్తి కనబర్చ లేదు అయినప్పటికి సుబాస వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం ఇచ్చిన మిల్లెట్ మిషన్ పథకంలో పాల్గొని తృణధాన్యాలను పండించి ఇతర మహిళలకు ఆదర్శవంతంగా నిలిచేలా విజయం సాధించింది. 2018 నుంచి తృణ ధాన్యాలను సేంద్రియ పద్ధతుల్లో పండించడం ప్రారంభించారు. మంచి లాభాలు వచ్చాయి ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆమె ఎకరం భూమిలో 250 గ్రాముల రాగులను విత్తించి, ఎనిమిది క్వింటాళ్లను పండించింది. అంతేగాదు ఆమె 2023 కల్లా ఆమె ఎనిమిది ఎకరాల భూమిని లీజుకు తీసుకుని 60 క్వింటాళ్ల రాగులను పండించాలని భావిస్తోంది. ఈ ఏడాది మార్చిలో తృణధాన్యాలపై జరిగిన ప్రపంచ సదస్సులో మొహంత కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీతో ఆమె కొంతసేపు మాట్లాడే అరుదైన అవకాశం వచ్చింది. తాజాగా జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వనం వచ్చింది. కాగా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సులో మిల్లెట్స్‌కు ప్రాధాన్యం కల్పించడంతో అందులో విజయవంతమైన ఈ గిరిజన మహిళా రైతులిద్దర్నీ ఆహ్వానించారు. (చదవండి: ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్‌గా కరువుకు చెక్!) -
రెడీమేడ్ బిస్కెట్స్ కు ధీటుగా ఆర్గానిక్ బిస్కెట్ల తయారీ
-
అరవైలో అల్లికలు
అభిరుచి ఏ వయసులోనైనా మనకు ఆదాయ వనరుగా మారవచ్చు. గుర్తింపును తీసుకురావచ్చు. ఈ మాటను ‘లక్ష’రాల నిజం చేసి చూపుతోంది ఆరు పదుల వయసులో ఉన్న కంచన్ భదానీ అనే గృహిణి. జార్ఖండ్ రాష్ట్రంలో ఉండే కంచన్ ఏడాది క్రితం వరకు గృహిణి. ఇప్పుడు వ్యాపారవేత్తగా మారింది. అదీ తనకు బాగా నచ్చిన అల్లికల బొమ్మలతో. యేడాదిలోనే రూ.14 లక్షల రూపాయలు సంపాదించడమే కాకుండా, యాభై మంది గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తూ తన సత్తా ఏంటో నిరూపించింది. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న కంచన్కు వచ్చిన ఈ ఆలోచన గురించి ఎవరైనా అడిగితే ఎన్నో విషయాలు వెలిబుచ్చుతుంది. ‘‘వస్త్ర పరిశ్రమ ఎంతో వేగవంతంగా మారిపోతోంది. అయినా ఇప్పటికీ ఇళ్లలో చేతితో కుట్టే ఎంబ్రాయిడరీకి, అల్లిన వస్తువులకు ఎనలేనంత డిమాండ్ ఉంది. ఒకప్పుడు తల్లులు, అమ్మమ్మలు చాలా సాధారణంగా రోజువారీ ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత టేబుల్ క్లాత్‌లు, సోఫా కవర్లు, బొమ్మల వరకు అనేక అలంకార వస్తువులను తయారుచేసేవారు. అలాంటి వస్తువులు కాలక్రమంలో తగ్గిపోతున్నాయి. ఇది గమనించే 2021లో ‘లూప్హూప్’ పేరుతో క్రోచెట్ బొమ్మల యూనిట్‌ను స్టార్ట్ చేశాను. దీనికి ముందు 50 మంది గిరిజన మహిళలకు క్రోచెట్ కళలో శిక్షణ ఇచ్చి, వారికి వర్క్స్ ఇస్తుండేదాన్ని. కోల్‌కతాలో పుట్టిన పెరిగిన నేను మా అమ్మమ్మ, అత్తలు తయారుచేసే క్రోచెట్ బొమ్మలు, టేబుల్ క్లాత్ తయారు చేయడం చూసి నేర్చుకున్నాను. ఆ రోజుల్లో ప్రతి ఆడపిల్లకు కుట్లు, అల్లికలు నేర్పేవారు. ► స్కూల్లోనూ నైపుణ్యం.. ఇంట్లోనే కాదు, స్కూల్లోనూ క్రోచెట్ వస్తువుల తయారీలో శిక్షణ ఉండేది. దీంతో ప్రాక్టీస్ బాగా అయ్యింది. పెళ్లయ్యాక పట్టణప్రాంతానికి వెళ్లాల్సి రావడం, బాధ్యతలు పెరగడంతో పై చదువులకు వెళ్లలేకపోయాను. కానీ, వచ్చిన క్రోచెట్ కళను ఇష్టంగా చేస్తుండేదాన్ని. మా వారి ఉద్యోగరీత్యా మేం జార్ఖండ్‌లోని జుమ్రీ తెలయాకు మారినప్పుడు అక్కడ గిరిజన స్త్రీలను చూశాను. వారు గనులలో పనులు చేసేవారు. రోజువారి కూలీ ఏ మాత్రం వారికి సరిపోదు. వారి బాధలను చూసి, ఏదైనా మార్పు తీసుకురాగలిగితే బాగుంటుందని ఆలోచించేదాన్ని. ఏదైనా చేస్తాను అనుకుంటాను, కానీ, ఏం చేయాలో కచ్చితంగా తెలిసేది కాదు. ► కుటుంబ బాధ్యతలలో.. ముగ్గురు పిల్లల తల్లిగా నాకు ఇంటి బాధ్యతలు ఎక్కువే ఉండేవి. ఎప్పుడూ తీరికలేకుండా ఉండేదాన్ని. దీంతో నా సామాజిక ఆకాంక్షలపై దృష్టి పెట్టలేకపోయేదాన్ని. పిల్లలు పెద్దయ్యి, వారి జీవితాల్లో స్థిరపడ్డాక నా అభిరుచిని కొనసాగించాలనే ఆలోచన పెరిగింది. క్రోచెట్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న మహిళలకు అప్పుడప్పుడు క్లాసులు తీసుకునేదాన్ని. 2021లో మా పిల్లలతో కూర్చొని చర్చిస్తున్నప్పుడు ఈ క్రోచెట్ బొమ్మల తయారీ పెద్ద ఎత్తున చేసి, అమ్మకాలు జరిపితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ► సోషల్ మీడియాలో.. క్రోచెట్ బొమ్మల అమ్మకాలను ఆన్లైన్ ద్వారా చేయాలనే ఆలోచనతో వెబ్సైట్, సోషల్ మీడియా సెటప్స్కి మా పిల్లలు సాయం చేశారు. నేను గిరిజన మహిళలకు క్రొచెట్ వర్క్ నేర్పిస్తూ, వారితో ఈ బొమ్మలను తయారుచేయిస్తుంటాను. యాభై మంది గిరిజన మహిళలు తమ ఇళ్ల వద్దే ఉంటూ సౌకర్యంగా ఈ పనులు చేస్తుంటారు. నా దగ్గర కావల్సిన మెటీరియల్ తీసుకెళ్లి, బొమ్మలతో వస్తారు. ఒక్కొక్కరు రోజుకు 2–3 గంటల క్రోచెట్ అల్లిక చేస్తే నెలకు ఐదు వేల రూపాయలు వస్తాయి. మా జట్టులో ఉండే కొందరు నెలలో 30 బొమ్మలకు పైగా చేస్తారు. దీంతో ఇంకొంత ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా ఏడాది కాలంలో మూడు వేల బొమ్మలను అమ్మగలిగాను. పద్నాలుగు లక్షల రూపాయలు సంపాదించగలిగాను. చదువుకునే పిల్లలు, తీరిక ఉండే గృహిణుల్ని ఈ పనిని ఎంచుకుంటున్నారు. ► మృదువైన బొమ్మలు తాబేళ్లు, కుందేళ్లు, ఆక్టోపస్‌లు, ఏనుగులు, మనుషుల బొమ్మలు వీటిలో ప్రధానంగా ఉంటాయి. వెబ్సైట్, సోషల్‌మీడియా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలోనూ ఈ బొమ్మలు అందుబాటులో ఉన్నాయి. ఏ పదార్థాలనూ వృథా చేయకుండా ఉన్నితో వీటిని తయారుచేస్తాం. పసిపిల్లలు వీటితో ఆడుకోవడం చాలా ఇష్టపడతారు. ఆదివాసీ సమాజం కోసం ఏదైనా చేయాలన్న నా కల ఇలా తీరడం సంతోషంగా ఉంది. ఏదైనా పనిని ప్రారంభించడానికి అభిరుచి ఉండాలి కానీ, వయసుపైబడటం ముఖ్యం కాదని నమ్ముతున్నాను’’ అని వివరిస్తుంది కంచన్. -
Khammam: సంచలనం సృష్టించిన గిరిజన మహిళా మృతి కేసులో ట్విస్ట్
ఖమ్మంక్రైం: సంచలనం సృష్టించిన గిరిజన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదింనట్లు తెలిసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం రామన్న గుట్ట తండాకు చెందిన ఓ మహిళ(45) గత నెల 27న తన అత్తమ్మను ఖమ్మంలోని ఆస్పత్రిలో చూపించేందుకు వచ్చింది. ఆస్పత్రిలో పరీక్షలు పూర్తయ్యాక ఆటోలో వెళ్తుండగా అత్త మూత్రవిసర్జన కోసం కిందకు దిగగా.. సదరు మహిళను ఆటోడ్రైవర్ తీసుకెళ్లి అత్యాచారం చేయడంతో అపస్మారకస్థితికి చేరుకుందని, ఆపై ఆస్పత్రిలో వదిలేశాడని ప్రచారం జరిగింది. ఈ ఘటన మంగళవారం వెలుగు చూడగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మహిళ బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. కానీ మహిళను ఆస్పత్రిలో వదిలి వెళ్లిన సమయానికి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, ఆమె అత్తకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో పోలీసుల కు చిక్కులు ఎదురయ్యాయి. చివరకు అన్ని కోణా ల్లో విచారణ చేపట్టిన పోలీసులు సదరు మహిళ రోడ్డు ప్రమాదంలోనే తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. రోడ్డు దాటుతుండగా... ఆస్పత్రిలో సదరు మహిళ తన అత్తను చూపించాక ఇద్దరూ కలిసి ప్రధాన రహదారిపైకి చేరుకున్నారని తెలిసింది. ఈక్రమంలో వైరా రోడ్డులోని రిలయన్స్ ట్రెండ్ వద్ద మహిళను ద్విచక్రవాహనదారుడు బలంగా ఢీకొట్టడంతో ఎగిరి పడినట్లు సమాచారం. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడం, ఆమె అత్తమ్మ మానసిక స్థితి బాగా లేనందున ఓ ఆటోడ్రైవర్ సదరు మహిళ వెంట ఎవరూ లేరనకుని జనరల్ ఆస్పత్రిలో వెళ్లినట్లు తెలిసింది. ఆతర్వాత ఎలాగోలా ఆమె అత్త స్వగ్రామానికి చేరుకున్నా వివరాలు సరిగ్గా చెప్పలేకపోవడం, ఆటోలో తీసుకెళ్లినట్లు మాత్రం చూచాయగా చెప్పడం, మూడు రోజులు గాలించినా ఆచూకీ లేకపోవడంతో కుటుంబీకులు కిడ్నాప్, ఆపై అత్యాచారం జరిగినట్లు భావించినట్లు సమాచారం. అన్ని కోణాల్లో విచారణ గిరిజన మహిళ కిడ్నాప్, ఆపై అత్యాచారం జరిగి నట్లు ప్రచారం జరగడంతో పోలీసులు కేసును ఛేదించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆమె ఫొటో ఆధారంగా జిల్లా కేంద్రంలోని అన్ని ఆటో అడ్డాలో విచారించారు. అలాగే, గిరిజన మహిళకు స్వగ్రామంలో ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, భర్తతో సఖ్యత ఎలా ఉందో ఆరా తీశారు. అదేరోజు ఆమె బంధువులు ఎవరైనా ఖమ్మం వచ్చారా అని కూడా విచారణ చేపట్టారు. చోరీ కోణంలో విచారణ చేపట్టగా, మహిళ ఒంటిపై అంతంత మాత్రంగానే బంగారం ఉండడంతో దొంగలు పని కాదని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. చివరకు వివిధ షాపుల్లో సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా విచారించి రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళ మృతి చెందినట్లు తేల్చిన పోలీసులు... గురువారం వివరాలు వెల్లడించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
లెమన్ గ్రాసే లచ్చిందేవి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వారందరూ ఓ చిన్న తండాకు చెందిన గిరిజన మహిళలు. రెక్కాడితే గానీ డొక్కాడదు. ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు, తమ కుటుంబాలను గాడిన పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు అందరూ ఏకమై దారులు వెతికారు. వినూత్న ఆలోచనను ఒడిసిపట్టి విజయబావుటా ఎగురవేశారు. లెమన్ గ్రాస్ (నిమ్మగడ్డి)తో సుగంధ ద్రవ్యాన్ని (నూనె) తయారుచేస్తూ.. ఓ అంతర్జాతీయ ఏజెన్సీ సహకారంతో మార్కెటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి యూనిట్ ఏర్పాటు చేసి ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న చీకరుచెట్టు తండా మహిళలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అడుగులు ఇలా.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని చీకరుచెట్టు తండా జనాభా 570 మంది. ఈ చిన్న తండాలో 14 మహిళా సంఘాలు ఉండగా.. ఇందులో సుమారు 150 మంది సభ్యులు ఉన్నారు. గతంలో బ్యాంకు లింకేజీ రుణాలతో చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు. ఆంధ్రప్రదేశ్‌లోని సెరా అనే సంస్థ మహిళా చైతన్యం, ఆర్థికాభివృద్ధిపై 2021 జనవరిలో జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లిలో జరిగిన సదస్సుకు చీకరచెట్టు తండాలోని మహిళలు హాజరయ్యారు. లెమన్ గ్రాస్‌తో సుగంధ ద్రవ్యంతో పాటు పలు ఉత్పత్తులు తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. పదిమంది మహిళలు గ్రూపుగా ఏర్పడి.. తమ ఆసక్తిని అప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్‌భాషా దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆర్థిక సాయంతో పాటు ప్రోత్సాహం అందించడంతో.. వారంతా ఝాన్సీలక్ష్మీబాయి మహిళా సంఘంగా ఏర్పడి సుగంధ ద్రవ్యం, ఇతర ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం మొత్తం యూనిట్ కాస్ట్ రూ.11.50 లక్షలు కాగా.. కలెక్టర్ నుంచి రూ.6.50 లక్షలు, సెరా సంస్థ రూ.2 లక్షలు సాయం లభించింది. మహిళలు తమవంతుగా రూ.3 లక్షలు వేసుకుని యూనిట్‌ను నెలకొల్పారు. మొదట లెమన్ గ్రాస్ సేకరించి సుగంధ ద్రవ్యం తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నూనెతో పలు ఉత్పత్తులకూ రూపకల్పన చేశారు. అంతేకాదు.. వీటిని మార్కెటింగ్ చేయడం ఎలా అని ఆలోచించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ట్రికా నుంచి ఇటీవల రూ.11.13 లక్షల సబ్సిడీ విడుదలైంది. లీటర్ ఆయిల్‌కు రూ.1,400 టన్ను నిమ్మగడ్డితో ఆ మహిళలు ఆరు లీటర్ల నూనె తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఈ ఆయిల్ లీటర్‌కు రూ.1,400 పలుకుతోంది. ఈ నూనెతో క్రిమినాశక సబ్బులు, షాంపూలు, పలు కాస్మోటిక్స్, ఫేస్ క్రీమ్, హెయిర్ ఆయిల్, లెమన్‌టీ పౌడర్ తయారు చేయవచ్చు. ప్రస్తుతం ఇక్కడి మహిళలు సబ్బులు, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సెంట్లు, లెమన్ టీ పౌడర్ తయారు చేసి విక్రయిస్తున్నారు. భవిష్యత్‌లో అగర్‌బత్తులతో పాటు ధూప్ స్టిక్స్ ఇతరత్రా తయారు చేయనున్నట్లు మహిళలు వెల్లడించారు. పెరుగుతున్న సాగు సంఘంలో ఉన్న సభ్యులు మొదట తమ తమ వ్యవసాయ పొలాల్లో నిమ్మగడ్డి సాగు చేశారు. తర్వాత తాము కొంటామంటూ చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడంతో పాటు రైతులను యూనిట్ వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ఈ క్రమంలో దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, చిలకటోనిపల్లి, పెద్దమందడి గ్రామాల్లో చాలామంది రైతులు లెమన్ గ్రాస్ సాగు చేపట్టారు. ఈ మేరకు టన్ను నిమ్మగడ్డికి రూ.4 వేలు ఇవ్వడంతో పాటు మంట కోసం ఉపయోగించిన గడ్డి కాలిపోగా వచ్చిన బూడిదను పొలాల్లో ఎరువుగా వినియోగించేందుకు సదరు రైతులకే అందజేస్తున్నారు. ఆదరణ లభిస్తోంది.. నిమ్మగడ్డి పంట రెండు నెలలకోసారి వస్తుంది. అయినా దీని సాగు ఇంకా పెరగాల్సి ఉంది. ఈ మేరకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రెండు నెలలకోసారి 80 నుంచి 100 లీటర్ల వరకు ఆయిల్ విక్రయిస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాం. మేం తయారు చేసే లెమన్ గ్రాస్ ఆయిల్, సబ్బులు ఇతరత్రా ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో మంచి ఆదరణ ఉంది. వనపర్తి కలెక్టరేట్లో లెమన్ టీ సెంటర్ ఏర్పాటు చేశాం. – మోతీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం.. మిన్ను మణి విజయగాథ ఇదే!
‘మా అమ్మా నాన్నలు ఇకపై నన్ను టీవీలో చూస్తారు’అని సంతోష పడింది మిన్ను మణి. దేశీయంగా ఆమె ఆడిన క్రికెట్ మేచ్లుటీవీలో టెలికాస్ట్ కాలేదు. ‘విమెన్స్ ప్రీమియర్ లీగ్’ కోసం 30 లక్షలకు మిన్ను మణిని ఢిల్లీ క్యాపిటల్స్ సొంతంచేసుకున్నాక ఆమె ఆట తప్పక టెలికాస్ట్ కానుంది. రోజుకు నాలుగు బస్సులు మారి 52 కిలోమీటర్ల దూరంలోని క్రికెట్ స్టేడియంకు వెళ్లిప్రాక్టీస్ చేసిన మణి కేరళలో ఈస్థాయికి ఎదిగిన తొలి గిరిజన మహిళా క్రికెటర్. మహిళా క్రికెట్ ఇప్పుడు విజయ పరంపరలో ఉంది. నిర్లక్ష్య వర్గాల నుంచి కూడా ఈ ఆటకు చేరొచ్చు అని చెబుతున్న మిన్ను మణిది కూడా ఒక విజయగాధ. ‘ముప్పై లక్షల రూపాయలు. నా జీవితంలో చూస్తానని అనుకోలేదు. మొదట నేనొక స్కూటీ కొనుక్కోవాలి. బస్సుల్లో తిరుగుతూప్రాక్టీసుకు ఇకపై వెళ్లను. ఆ తర్వాతే ఆ డబ్బుతో ఏం చేయాలో ఆలోచిస్తాను’ అంది మిన్ను మణి. ఫిబ్రవరి 13న ముంబైలో ‘విమెన్స్ ప్రీమియర్ లీగ్’ కోసం మహిళా క్రికెటర్ల వేలం జరుగుతున్నప్పుడు మిన్ను మణి హైదరాబాద్‌లో సౌత్ జోన్ తరపున ఇంటర్ జోన్ టోర్నమెంట్ ఆడుతోంది. ఆ రోజున 91 బాల్స్‌కు 74 కొట్టి నాటౌట్‌గా నిలిచింది. ఆట ఒకవైపు సాగుతూ ఉన్నా మనసంతా ముంబై ఆక్షన్ మీదే ఉంది. ‘పెద్ద పెద్ద మహిళా క్రికెటర్లకు కూడా వేలంలో ధర పలకకపోతుండే సరికి నిరాశ కలిగింది. నా బేస్ ప్రైస్ 10 లక్షలు పెట్టారు. ఎవరూ తీసుకోరేమో అనుకున్నాను. కానీ ఢిల్లీ, బెంగళూరు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 30 లక్షలకు ఢిల్లీ కేపిటల్స్ నన్ను సొంతం చేసుకుంది. అప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను’ అంది మిన్ను మణి. ‘ఆ విషయం ఫోన్లో చెప్తే మా అమ్మా నాన్నలు డబ్బు గురించి కాక నా ఆట గురించి అడిగారు. టీవీలో వస్తుందా అన్నారు. వస్తుంది అని చె΄్పాను’ అంది సంతోషంగా. కరూచియ 23 ఏళ్ల మిన్ను మణిది కేరళలోని వయనాడ్ జిల్లాలోని గిరిజన గూడెం. ఇది బ్రహ్మగిరి కొండల అంచున ఉంటుంది. మణిది ‘కరూచియ’ గిరిజన తెగ. వీళ్లు తమను తాము కొండ బ్రాహ్మణులుగా చెప్పుకుంటారు. తమ ఆచారాలు స్ట్రిక్ట్‌గా పాటిస్తారు. గురి చూసి బాణం వేయడంలో మేటిగా పేరు గడించారు. కాని ఇప్పుడు వారంతా చిన్న చిన్న పనులు చేసుకు బతుకుతున్నారు. మిన్ను మణి తండ్రి మణి రోజు కూలి. తల్లి వసంత గృహిణి. చిన్నప్పటి నుంచి మిన్ను మగపిల్లలతో కలిసి పొలాల్లో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడేది. ఎలిమెంటరీ స్కూల్లో రన్నర్‌గా ప్రతిభ చూపేది. 8 వ తరగతిలో హైస్కూల్లో చేరాక ఆమె ప్రతిభను ఆ స్కూల్లో ఎల్సమ్మ బేబీ అనే పీయీటీ టీచరు గుర్తించింది. ‘మిన్ను రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. రైట్ హ్యాండ్ బ్యాట్స్ఉమన్. బౌలింగ్‌లో బ్యాటింగ్‌లో ఆ అమ్మాయి టాలెంట్ చూసి చాలా దూరం వెళుతుందని అనుకున్నాను’ అంటుంది ఆ పీయీటీ టీచర్. ఆ పీయీటీ టీచరే పూనుకుని తిరువనంతపురంలోని కేరళ క్రికెట్ అసొసియేషన్ దగ్గరకు తీసుకువెళితే వారు పరీక్షించి ట్రయినింగ్ ఇచ్చారు. దాంతో మిన్ను మణి ముందు వయనాడ్ జిల్లా జట్టుతో అటు పిమ్మట అండర్ 16 జట్టుతో ఆ తర్వాత కేరళ రాష్ట్ర మహిళా జట్టుతో ఆడటం మొదలుపెట్టింది. కష్టే ఫలి అయితే మిన్ను మణి క్రికెట్ ఆడటానికి మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ‘కేరళలో అమ్మాయిలు అథ్లెట్లుగా రాణిస్తారు. నన్ను కూడా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా చూడాలని మా అమ్మానాన్నలు అనుకున్నారు. క్రికెట్ మగవాళ్ల ఆట అని వారి అభి్రపాయం. కాని మా పీయీటీ టీచరు వారిని ఒప్పించి నన్ను క్రికెట్లోకి తీసుకెళ్లింది. నేను క్రికెట్ బాగా ఆడుతున్నానని తెలిశాక వారు మనస్ఫూర్తిగా ్రపోత్సహించసాగారు’ అంది మిన్ను. కానీ క్రికెట్‌లాంటి ఖరీదైన ఆటకు కావలసిన మంచి కిట్ కూడా మిన్ను దగ్గర లేదు. వాళ్ల నాన్న అప్పులు చేసి మిన్ను ఆట కొనసాగేలా చూశాడు. మిన్నుప్రాక్టీసు చేయాలంటే వారి గూడేనికి 52 కిలోమీటర్ల దూరంలోని కృష్ణగిరి క్రికెట్ స్టేడియమే గతి. అంత దూరం వెళ్లడానికి మిన్ను తెల్లవారు జామునే లేచి ఇంటి పనుల్లో తల్లికి సాయం చేసి నాలుగు బస్సులు మారి స్టేడియంకు చేరుకునేది. తిరిగి ఇల్లు చేరే సరికి సాయంత్రం 7 అయ్యేది. ‘అలిసిపోయేదాన్ని. కాని పట్టుదలగా ఆట కొనసాగించాను’ అంటుంది మిన్ను. ఆటలో విజయాలు మిన్ను మణి కేరళ అండర్ 23లో ఆ తర్వాత భారత్ అండర్ 23 జట్టులో ప్రతిభ చూపింది. ఇండియా ఏ జట్టుకు ఎంపికై ఆడింది. విమెన్స్ ఆల్ ఇండియా ఒన్ డే టోర్నమెంట్లో 8 మేచ్‌లు ఆడి 246 పరుగులు చేసి 12 వికెట్లు తీసింది. దాంతో అందరి దృష్టి మిన్ను మీద పడింది. క్రికెట్ ఆడటం మొదలెట్టాక వచ్చిన కొద్ది పాటి డబ్బులో ప్రతి పైసా తన కోసం తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉపయోగించింది. మిగిలిన డబ్బుతో చిన్న ఇల్లు కడితే 2018 వరదల్లో ఆ ఇల్లు దెబ్బతింది. క్రికెట్ అభిమానులు ఆదుకుని రిపేర్లు చేయించారు. ఇప్పుడు 30 లక్షల సంపాదన స్థాయికి మిన్ను చేరింది. ‘దీని కంటే జాతీయ జట్టులో స్థానంపొందడమే నాకు ఎక్కువ ఆనందం. అదే నా లక్ష్యం’ అంటోంది మిన్ను మణి. -
Youth Parliament: అయామ్ మౌనిక
యూత్పార్లమెంటులో ప్రసంగించిన మన గిరిపుత్రిక పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా.. అయామ్ మౌనిక... ఫ్రం తెలంగాణ.. అని పరిచయం చేసుకుని వాజ్‌పేయి జీవితంపై అద్భుత ప్రసంగం చేసి సర్వత్రా ప్రశంసలు అందుకున్న మౌనిక గురించి... దివంగత ప్రధాని వాజ్‌పేయి జీవితంపై యూత్‌పార్లమెంట్ కార్యక్రమంలో ప్రసగించడానికి దేశ వ్యాప్తంగా 25 మందిని ఎంపిక చేయగా, వారిలో ఏడుగురికి భారత పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రసంగించే అవకాశం దొరికింది. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేతావత్ మౌనిక ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అంతేకాదు, ఈ ఆదివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొని, తన అద్భుతమైన ప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకుంది మౌనిక. చురుకైన ప్రసంగాలు... రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సొంత గ్రామమైన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారంకు చెందిన కేతావత్ నర్సింలు, సునీతల కుమార్తె మౌనిక. కామారెడ్డి పట్టణంలోని ఆర్కే పీజీ కాలేజీలో ఎంఎస్‌డబ్లు్య చదువుతోంది. తండ్రి నర్సింలు డీసీఎం డ్రైవర్‌గా, తల్లి సునీత బీడీ కార్మికురాలిగా కామారెడ్డి పట్టణంలో ఉండి తమ ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నారు. మౌనిక ఆర్కే కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, అదే కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు చురుకైన ప్రసంగాలతో కాలేజీలో అందరి మన్ననలను అందుకున్న మౌనికను కాలేజీ సీఈవో ఎం.జైపాల్‌రెడ్డి ప్రోత్సహించారు. దేశవ్యాప్తంగా యూత్ పార్లమెంటుకు కళాశాల విద్యార్థులను ఎంపిక చేయడానికి కళాశాల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పోటీలు నిర్వహించారు. అన్నింటా మౌనిక ప్రథమ స్థానంలో నిలిచింది. ఇతర రాష్ట్రాలకు చెందిన యూత్పార్లమెంటుకు ఎన్నికైన యువతులతో మౌనిక యూత్ పార్లమెంటు కోసం.. దేశవ్యాప్తంగా యూత్పార్లమెంటు ఎంపిక కోసం వివిధ దశల్లో వర్చువల్ పద్ధతిలో ప్రసంగ పోటీలు నిర్వహించారు. మౌనికతోపాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ నుంచి ఏడుగురికి అవకాశం కల్గింది. అందులో మౌనిక మూడోస్థానంలో మాట్లాడే అవకాశం వచ్చింది. మొదట కళాశాల స్థాయిలో పోటీలు నిర్వహించగా ‘మేకిన్ ఇండియా– మేడిన్ ఇండియా’ అంశాన్ని తీసుకుని ఉపన్యసించి ప్రథమ స్థానంలో నిలిచింది. తరువాత జిల్లా స్థాయి పోటీల్లో ‘స్టార్టప్ ఇండియా– స్టాండప్ ఇండియా’ అనే అంశంపై ప్రసంగించి ప్రథమ స్థానం సాధించింది. ఆ తరువాత రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా మొదటి స్థానం సాధించింది. తద్వారా పార్లమెంటులో మాట్లాడే అవకాశం లభించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ వేదికగా.... యూత్ పార్లమెంటులో భాగంగా ఈ నెల 25న పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో కేతావత్ మౌనిక మాట్లాడాలని నిర్వహకులు కోరారు. దీంతో ‘ఐ యామ్ మౌనిక ఫ్రం తెలంగాణ’ అంటూ ఇంగ్లీషులో తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది. దివంగత ప్రధాని వాజ్‌పేయి గురించి మౌనిక చేసిన ప్రసంగానికి అద్భుతమైన స్పందన వచ్చింది. సాధారణ గిరిజన కుటుంబంలో పుట్టిపెరిగిన మౌనిక తల్లిదండ్రులు తమ చదువుల కోసం పడుతున్న శ్రమను చూసి కష్టపడి చదువుతూనే ప్రతిభకు కూడా పదును పెట్టుకుంటోంది. ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయిలో నిలవాలన్న లక్ష్యంతో మౌనిక మామూలు చదువుతో పాటు ఇంగ్లీషు, హిందీ, తెలుగు భాషల్లో ప్రసంగాలు చేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకుంది. యూత్ పార్లమెంటుకు ఎంపికై, తన అద్భుత ప్రసంగంతో ఆకట్టుకున్న మౌనికను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, కళాశాల అధ్యాపకులు అభినందించారు. – సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి. -
Roundup 2022: మెరుపులు..మరకలు
ప్రగతి పథంలో సాగుతున్న ‘స్వతంత్ర’ కవాతుకు అమృతోత్సవ సంబరాలు... ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ప్రజాస్వామ్య సొగసులు... ‘ఆత్మ నిర్భర్’ లక్ష్యంతో రక్షణ రంగంలో అగ్ని, ప్రచండ, విక్రాంత్ మెరుపులు... అంతరిక్ష రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ చిమ్మిన నిప్పులు... బ్రిటన్ను దాటేసి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వడివడిగా పెట్టిన పరుగులు... కంటికి కనిపించని క్రిమిపై పోరాటంలో ప్రపంచ దేశాలకు చూపిన ఆదర్శం... ...ఇవన్నీ ఈ ఏడాది మనం సాధించిన ఘన విజయాల్లో కొన్ని. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు తెరలేపిన ‘అగ్ని’పథం, మైనార్టీ మహిళల హిజాబ్ ధారణపై వివాదం ...వంటి కొన్ని మరకలు. ఎంతో ఇష్టం, కొంచెం కష్టంగా సాగిన 2022లో ముఖ్య ఘటనలపై విహంగ వీక్షణం... మెరుపులు ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత పదవిని అధిష్టించడం ఒక చరిత్రగా నిలిచింది. సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి కొత్త చరిత్ర లిఖించారు. దేశ 15వ రాష్ట్రపతిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాకు చెందినవారు. ► భారత్ ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకొని యూకేను కూడా దాటేసి ప్రపంచంలోని అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నవంబర్ 15న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) తన నివేదికలో వెల్లడించింది. ► భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ నవంబర్ 18న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ► దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి, కాగితం కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చుని తగ్గించడం కోసం ఆర్బీఐ డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్ రుపీని అమల్లోకి తీసుకువచ్చింది. ► ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న కొచ్చితీరంలో జాతికి అంకితం చేశారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నౌక క్షిపణి దాడుల్ని తట్టుకోగలదు. ఇలాంటి సామర్థ్యం కలిగిన యుద్ధనౌకలున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకొని నిల్చున్నాం. భారత వాయుసేనలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండని అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. ఇక అణు పేలోడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని డిసెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించడంతో త్రివిధ బలగాలు బలోపేతమయ్యాయి. మరకలు ► సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. యువకులకు నాలుగేళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం మాత్రమే కల్పించడంతో పాటు పింఛన్ సదుపాయం కూడా లేని ఈ పథకానికి జూన్ 14న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసకు దారితీశాయి. ► కర్ణాటకలో ఉడిపిలో కళాశాలలో జనవరిలో హిజాబ్ ధరించి వచ్చినందుకు కొందరు ముస్లిం అమ్మాయిలను తరగతి గదుల్లోకి రానివ్వకపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీరికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి రావడంతో మతఘర్షణలకు దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై నిషేధం విధిస్తే మార్చి 15న హైకోర్టు దానిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అక్టోబర్ 13న సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించడంతో తుది నిర్ణయం భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ చేతుల్లోకి వెళ్లింది. ► గుజరాత్‌లోని మోర్బిలో అక్టోబర్ 30 కుప్పకూలిపోయిన కేబుల్ వంతెన దుర్ఘటనలో 138 మంది మరణించారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ఒకేసారి వంతెనపైకి వంద మంది వెళ్లడానికి మాత్రమే వీలుంటే, నిర్వాహకులు 500 మందిని పంపడంతో ప్రమాదం జరిగింది. ► ఢిల్లీలో నివాసముంటున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనెవాలె మే 18న గొంతు కోసి హత్య చేయడంతో పాటు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి చుట్టుపక్కల అడవుల్లో పారేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. మృతదేహం ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి కొన్ని పారేసిన వైనం ఒళ్లు జలదరించేలా చేసింది. నవంబర్ 11న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషాదాలు ► యావత్ భారతావనిని దుఃఖసాగరంలో ముంచేస్తూ భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్ (92); పద్మవిభూషణ్, కథక్ దిగ్గజం పండిట్ బిర్జు మహరాజ్ (83) తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ► సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉజ్జ్వల శకానికి తెర పడింది. యాత్రలు, విజయాలు, చీలికలు ► కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది. ► గాంధీ కుటుంబానికి చెందని సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ► ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా; చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... ఇలా ఐదు రాష్ట్రాల్లో నెగ్గి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్‌తో సరిపెట్టుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పంజాబ్‌లో అఖండ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నెగ్గి బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. జాతీయ పార్టీగానూ అవతరించింది! ► బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఆగస్టులో ఎన్డీయేకి గుడ్ బైకొట్టి తిరిగి మహాఘట్బంధన్లో చేరి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ► మహారాష్ట్రలో శివసేన కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీని ఏక్నాథ్ షిండే రెండు ముక్కలు చేశారు. భారీగా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. ► నేషనల్ హెరాల్డ్ కేసు గాంధీ కుటుంబాన్ని వెంటాడుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తొలిసారిగా ఈ ఏడాది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సీబీఐ ఈ ఏడాదంతా బిజీగా గడిపాయి. పలు విపక్ష పార్టీల నేతలను విచారించాయి. పలువురిని అరెస్టు చేశాయి. దీని వెనక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి. చరిత్రాత్మక తీర్పులు... ► అత్యంత వివాదాస్పదమైన దేశద్రోహ చట్టంపై 124ఏ అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం మే 11న తీర్పు చెప్పింది. 124ఏపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ► మహిళల శరీరంపై వారికే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ 24 వారాలవరకు సురక్షిత గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 29న ఈ తీర్పు చెప్పిన సుప్రీం అబార్షన్ చట్టాల ప్రకారం పెళ్లయినవారు, కాని వారు అన్న తేడా ఉండదని స్పష్టం చేసింది. ► భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారం చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎంటీపీ చట్టం ప్రకారం మారిటల్ రేప్‌లు కూడా అత్యాచారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ► ఇంటి అల్లుడు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండ్ చేసినా అది కట్నం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. విశ్వవేదికపై... ► ప్రపంచంలో అత్యంత శక్తిమంతదేశాల కూటమి జీ20కి అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. 2023 నవంబర్ 30 దాకా ఈ బాధ్యతల్లో కొనసాగనుంది. 50 నగరాల్లో 200 సన్నాహక భేటీల అనంతరం 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 సదస్సును నిర్వహించనుంది. ► ఐరాస భద్రతా మండలి అధ్యక్ష హోదాలో కౌంటర్ టెర్రరిజం కమిటీ (సీటీసీ) సదస్సును అక్టోబర్ 28, 29 తేదీల్లో ముంబై, ఢిల్లీల్లో జరిగింది. ► అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య డిసెంబర్ 9న ఘర్షణలు జరిగాయి. వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. -
ఎవరీ ద్రౌపది ముర్ము? రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఆమెనే ఎందుకు?
న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్రపతి అత్యున్నత పదవికి ద్రౌపది ముర్ముని ప్రతిపాదించడానికి ముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ని సంప్రదించి మరీ ఆమె పేరును ఖరారు చేసింది. అంతేకాదు రాబోయే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేడీ ఆమెకు మద్దతు ఇవ్వనుందని సమాచారం. ఈ మేరకు మోదీ ప్రభుత్వం ఆమె పేరునే ఎందుకు? ప్రస్తావించింది. ఆమెకే ఈ అత్యున్నత పదవిని ఎందుకు? పట్టం గట్టాలనుకుంటోంది వంటి రకరకాల ప్రశ్నలు అందరి మదిలోనే తలెత్తే ప్రశ్నలే... ఇంతకీ ఆమె ఎవరంటే... ఐతే గతంలో బీజేపి 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళితవ్యక్తిని రాష్ట్రపతిగా చేసి అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. మళ్లీ ఇప్పుడూ అందరీ అంచనాలను తారుమారు చేస్తూ... మోదీ చెబుతూ ఉండే సబ్కా సాథ్ సబ్ కా బిస్వాస్ నినాదానికి అద్దం పట్టేలా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి పదవికి నామినేట్ చేశారు. ఈ మేరకు ద్రౌపది ముర్ము జూలైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్ంత్ సిన్హా పై పోటీ చేయనున్నారు. ద్రౌపది ముర్ము ఒక సాధారణ గిరిజన మహిళ. ఆమె 1997లోఒడిశాలోని రాయరంగ్‌పూర్ నగర్ పంచాయితీలో కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె 2000లో బీజేపీ-బీజేడీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2015 లో జార్ఖంఖ్ గవర్నర్‌గా అత్యున్నత పదవిని అలంకరించారు. అంతేకాదు ఒడిశా ప్రభుత్వంలో రవాణా, వాణిజ్యం, మత్స్య పరిశ్రమ, పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఆమెకు విభిన్న పరిపాలనా అనుభవం ఉంది. ఈ మేరకు ద్రౌపరి ముర్ము మాట్లాడుతూ...ఎన్డీఏ తరుఫున రాష్ట్రపతి పదవికి నామినేట్ అయ్యానని తెలుసుకుని చాలా ఆనందించానన్నారు. తొలుత తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పారు. ఒక గిరిజన మహిళగా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలని కలలో కూడా అనుకోలేదన్నారు. ఒడిశా శాసనసభ్యులు, ఎంపీలు తనకు మద్దతిస్తారని విశ్వాసిస్తున్నాని చెప్పారు. అంతేకాదు తాను ఒక గిరిజన పుత్రికగా, ఒడియాగా నాకు మద్దతు ఇవ్వండని సభ్యులందరిని అభ్యర్థించే హక్కు కూడా ఉందని నొక్కి చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయనుందన్న వార్త తెలియగానే ఒడిశాలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ముఖ్యంగా ఆమె నివశించే మయుర్‌భంజ్ జిల్లాలో సంబరాలు మిన్నంటాయి. ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైతే గనుక గిరిజన మహిళగా ఎన్నికైన తొలి రాష్ట్రపతిగా ఖ్యాతీ గాంచుతుంది. (చదవండి: ‘మహా’ సంకటం: ఏక్నాథ్ షిండేకు ఊహించని షాక్!) -
ఆదివాసీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్/ములకలపల్లి: ఆదివాసీ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్న గూడెం పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు గొత్తికోయ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై ఆమె స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఆదివాసీ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలా న్యాయం జరుగుతుందని హామీఇచ్చారు. అడవిలో జీవనాధారం కోసం అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుమార్లు హెచ్చరించామని, అయినప్పటికీ కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, వారిని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. మంత్రి ఆదేశాలతో గిరిజన సంక్షేమ శాఖ.. భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని విచారణ అధికారిగా నియమించింది. దీంతో ములకలపల్లి తహసీల్దార్ వీరభద్రం ఐటీడీఏ అధికారులతో కలసి దాడి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అటవీ సిబ్బందిని విచారించారు. మరో పక్క బాధిత మహిళలు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు తమకు జరిగిన అన్యాయంపై తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. తమతోపాటు ఇద్దరు బాలికలపై కూడా అటవీ సిబ్బంది దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై గొత్తికోయ మహిళలతోపాటు అటవీ సిబ్బంది కూడా తమకు ఫిర్యాదు చేశారని స్థానిక ఎస్సై తెలిపారు. మహిళలు తమ విధులకు ఆటంకం కలిగించినట్లు అటవీ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారని ఆయన వెల్లడించారు. -
ప్రియాంక గాంధీ డ్యాన్స్ వీడియో వైరల్
Priyanka Gandhi Vadra danced with tribal women in Goa: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఇటీవలే గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఆమె మొర్పిర్ల గ్రామంలో గిరిజన మహిళలతో కలిసి జానపద నృత్యం చేశారు. అంతేకాదు ప్రియాంక గాంధీ ఎర్రటి చీరను ధరించి ధోల్ దరువులకు అనుగుణంగా గిరిజన మహిళల మాదిరి తలపై కుండ పెట్టుకుని డ్యాన్స్ చేశారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్‌చేశారు. (చదవండి: ఒంటెల అందాల పోటీలు!.... 40కి పైగా ఒంటెలకు అనర్హత వేటు!!) పైగా ఆమె మోర్పిర్ల గ్రామంలోని బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన గిరిజన మహిళలు గోవాలో పర్యావరణ పరిరక్షణ పచ్చదనాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్ అవుతుంది. అయితే అధికార పార్టీ బీజేపీ ఐటీ సెల్ ఇన్చార్జ్ అమిత్ మాల్వియా యావత్తు దేశం తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ చీఫ్ జనరల్ రావత్ మృతితో శోక సంద్రంలో ఉంటే మీరు గిరిజన మహిళలతో డ్యాన్స్‌లు చేస్తున్నారా అంటూ ప్రియాంక గాంధీ పై విమర్శలు ఎక్కుపెట్లారు. (చదవండి: పక్షిలా షి‘కారు’) Smt. @priyankagandhi joins the tribal women of Morpirla village during a phenomenal performance of their folk dance.#PriyankaGandhiWithGoa pic.twitter.com/p0ae6mKM9x — Congress (@INCIndia) December 10, 2021 -
అక్రమ ఆపరేషన్లపై సబ్‌కలెక్టర్ విచారణ
పాడేరు: విశాఖ ఏజెన్సీ పాడేరు మండలంలోని మారుమూల గ్రామం ఈదులపాలెంలో మెడికల్ షాపులో అక్రమంగా కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు నిర్వహించిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు కలెక్టర్‌ను ఆదేశించింది. విచారణాధికారిగా నియమితులైన పాడేరు సబ్ కలెక్టర్ వి.అభిషేక్ మంగళవారం ఉదయమే ఈదులపాలెం చేరుకుని విచారణ చేపట్టారు. ఏడీఎంహెచ్‌వో డాక్టర్ కె.లీలాప్రసాద్, తహసీల్దార్ ప్రకాష్‌రావు, ఇతర అధికారులు, ఈదులపాలెం వైద్యుల సమక్షంలో విచారణ నిర్వహించారు. గిరిజన మహిళలకు కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు నిర్వహించిన మెడికల్ షాపును తనిఖీ చేశారు. మెడికల్ షాపు నిర్వహకుడితోపాటు సమీప గిరిజనులను కూడా ఆయన విచారించారు. ఆపరేషన్లు చేయించుకున్న కొంతమంది మహిళలను సబ్ కలెక్టర్ పరామర్శించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఇక్కడే ఆపరేషన్లు చేయించుకోవడానికి దారితీసిన పరిస్థితులపై ఆరాతీశారు. ఆపరేషన్లు చేసిన అనకాపల్లికి చెందిన వైద్యుడు, ఫిమేల్ నర్సు వివరాలను సేకరించారు. స్థానికంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది ఒకరిద్దరు సహకరించారనే ఆరోపణలపైన కూడా విచారణ జరిపారు. మెడికల్ షాపులో అక్రమంగా ఆపరేషన్లు జరిపారని నిర్ధారణకు వచ్చిన ఆయన పాడేరు పోలీసులకు కూడా తగిన సమాచారం అందించారు. ఆయన సమగ్ర విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు. మరోవైపు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్లు మెడికల్ షాపును పరిశీలించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. షాపునకు తాళాలు వేశారు. -
అక్రమ కు.ని. ఆపరేషన్లపై విచారణ
పాడేరు: విశాఖ ఏజెన్సీలో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న ప్రైవేటు వైద్య బృందంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. విశాఖ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవోలకు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మారుమూల ఈదులపాలెం ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఓ మెడికల్ షాపులో అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించి గిరిజనుల నుంచి భారీగా డబ్బు గుంజుతున్న వైనంపై ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ ఏడీఎంహెచ్‌వో, ఇతర వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. మెడికల్ షాపులో ఇంతవరకు జరిగిన ఆపరేషన్ల వివరాలను సేకరించడంతో పాటు ఆపరేషన్ జరిగిన మహిళలందరితో మాట్లాడి పూర్తి నివేదికను తనకు అందజేయాలని ఏడీఎంహెచ్‌వో డాక్టర్ లీలా ప్రసాద్‌ను ఆదేశించారు. విచారణ అధికారిగా ఈదులపాలెం పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లకే శివప్రసాద్ పాత్రుడును నియమించారు. పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఈ వ్యవహారంపై కూపీ లాగుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసింది అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు, మరో ప్రభుత్వ స్టాఫ్ నర్సు అని గుర్తించారు. ఇందుకు ఈదులపాలెం ఆస్పత్రిలోని కొంతమంది వైద్య సిబ్బంది కూడా సహకరించినట్టు ఇంటెలిజెన్స్ విచారణలో తేలింది. ఇక్కడ రెండు విడతలుగా భారీ సంఖ్యలో కు.ని. ఆపరేషన్లు చేసినట్టు ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్‌కు ప్రాథమిక సమాచారాన్ని అందజేశారు. -
విశాఖ ఏజెన్సీలో ప్రైవేటు ముఠా
కాసుల కోసం కక్కుర్తిపడి ప్రైవేటు వైద్యులు చేస్తున్న కుటుంబ నియంత్రణ (సంక్షేమ) ఆపరేషన్లు గిరిజన మహిళలకు ప్రాణాంతకమవుతున్నాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఓ వైద్య ముఠా ప్రైవేటుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్న వైనం ‘సాక్షి’ పరిశోధనలో వెలుగు చూసింది. గిరిజన మహిళల అమాయకత్వాన్ని, అవగాహన రాహిత్యాన్ని ఆసరాగా చేసుకొని.. మత్తు మందు కూడా సరిగా ఇవ్వకుండా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం ఈదులపాలెం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఉన్న సలుగు రోడ్డులో ఓ మెడికల్ షాపు వద్ద నెలకు ఒకసారి కుటుంబ సంక్షేమ ఆపరేషన్లను విచ్చలవిడిగా నిర్వహిస్తూ భారీగా డబ్బు గుంజుతున్నారు. చిన్న ఆపరేషన్ జరగాలంటేనే మత్తు వైద్య నిపుణులు తప్పనిసరిగా ఉండాలి. అలాంటిది వారు లేకుండానే వైద్యులు, కొంతమంది సిబ్బంది గిరిజన మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. – పాడేరు ఒక్కో ఆపరేషన్‌కు రూ.8,500 అనకాపల్లిలో ఓ ప్రభుత్వాస్పత్రికి చెందిన గైనిక్ వైద్యుడితోపాటు ఇతర వైద్య సిబ్బంది ముఠాగా ఏర్పడి అక్రమంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక ఆపరేషన్‌కు రూ.20 వేలు ఖర్చవుతుందని, తామైతే కేవలం రూ.8,500లకే ఆపరేషన్ చేస్తామని ప్రచారం చేస్తున్నారు. గతనెలలో కూడా ఈదులపాలెం మెడికల్ షాపులో 35 మంది మహిళలకు ఆపరేషన్లు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈదులపాలెం మెడికల్ షాపు వెనుక మహిళలకు ఆపరేషన్లను చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ‘సాక్షి’ ప్రతినిధి అక్కడకు చేరుకుని ఆ తతంగాన్నంతా కెమెరాలో బంధించారు. మత్తు సరిగా ఇవ్వకుండానే.. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు మందు సరిగా ఇవ్వకపోవడంతో గిరిజన మహిళలు నరకయాతనతో పెద్దపెట్టున ఏడ్చారు. అయినా సరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వారికి ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ చేశాక వారిని క్షణమైనా కోలుకోనీయకుండా వెంటనే బయటకు తరలించేశారు. మహిళలను జీసీసీడీఆర్ డిపో ఆవరణలో, ఆటోల్లో పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆయా గ్రామాలకు తరలించేశారు. వీరికి స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది కూడా సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలో తాత్కాలిక నిషేధం గిరిజన ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ తాత్కాలికంగా నిషేధం విధించింది. ఏజెన్సీలో జనాభా తగ్గుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో వ్యాసెక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లను ప్రస్తుతం నిర్వహించడం లేదు. కోవిడ్ నిబంధనలు కూడా ఇందుకు కారణం. అయితే ఆపరేషన్లు చేయాలని గిరిజనుల నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పాడేరు, అరకులోయ ఆస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెస్తాం. ఈ నెల 15 నుంచి ఆపరేషన్ల నిర్వహణకు జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్లను పునఃప్రారంభిస్తాం. ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రైవేటు క్లినిక్‌లు, మెడికల్ షాపుల్లో మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్లు నిర్వహించడం చట్టరీత్యా నేరం. –డాక్టర్ కె.లీలాప్రసాద్, ఇన్చార్జి ఏడీఎంహెచ్‌వో, పాడేరు నా కుమార్తె ఆపరేషన్‌కు రూ.8 వేలు ఇచ్చాను నా కుమార్తె ఆపరేషన్‌కు డాక్టర్‌కు రూ.8 వేలు చెల్లించాను. ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ చేయడం లేదని ప్రచారం జరగడంతో ప్రైవేటు మెడికల్ షాపులో ఆపరేషన్‌కు సిద్ధమయ్యాం. మైదాన ప్రాంతాల్లోని పెద్ద ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉండడంతో ఈదులపాలెంలోనే నా కుమార్తెకు ఆపరేషన్ చేయించా. –సీదరి సీతమ్మ, తరగం గ్రామం, దేవాపురం పంచాయతీ, పాడేరు మండలం -
మామిడి తాండ్ర రుచి ... తినరా మైమరచి
తాండ్ర... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం(విజయనగరం జిల్లా): గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న కొండమామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకి.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే మేము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. – బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు గిరిజన గ్రామం, కురుపాం మండలం -
గిరి పుత్రిక.. గ్రేట్ జర్నీ
కన్నిబాయి... అచ్చమైన ఆదివాసీ అమ్మాయి. ప్రకృతి ఒడిలో పుట్టింది. ప్రకృతితో కలిసిపోయి పెరిగింది. చెట్లెక్కడం, కొమ్మలను చేత్తో గట్టిగా పట్టుకుని ఊయలూగడం, ఒక్క పరుగులో కొండ శిఖరాన్ని చేరడమే ఆమెకు తెలిసిన ఆటలు. అవి ఒట్టి ఆటలు కాదు, సాహస క్రీడలు అని తెలిసి ఆశ్చర్యపోయింది. వాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీలు జరుగుతాయని తెలిసినప్పుడు కలిగిన అబ్బురం అంతా ఇంతా కాదు. పోటీలో పాల్గొనాలని సరదా పడింది. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత తెలిసింది... వచ్చిన వాళ్లంతా అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన వాళ్లని. వాళ్ల భాష నాగరకం గా ఉంది. తానందుకున్న జ్ఞాపికలు... అవార్డులు... పతకాలతో కన్నిబాయి వాళ్లు ఉపయోగించే పదాలు కొత్తగా ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లనిపించింది. పోటీలు మొదలయ్యాయి. అత్యంత సులువుగా, అలవోకగా లక్ష్యాలను సాధించింది. ‘మీ కోచ్ ఎవరు? ఎంత కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు’ అని అడిగినప్పుడు ఆమె ఒక్క మాటలో ‘‘ఈ పోటీలు ఉంటాయని పేపర్లో చూసి తెలుసుకున్నాను. శిక్షణ ఇస్తారని ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు. మమ్మల్ని కడుపులో పెట్టుకుని బతికించుకునే అడవి తల్లే నాకు శిక్షణ ఇచ్చింది’’ అని సమాధానం చెప్పింది. ఇంతకీ కన్నిబాయి ఎవరు? ఆమె ఆడిన ఆటలేంటి? ఆ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆమె గెలుచుకున్న పతకాలెన్ని? ఆమె అధిరోహించిన విజయ శిఖరాలేవి? ∙∙ కన్నిబాయిది కుమ్రుం భీము ఆసిఫాబాద్ జిల్లా, కెరమెరి మండలం, భీమన్ గొంది గ్రామం. కోలామ్ ఆదివాసీ కుటుంబంలో చిన్నమ్మాయి. తండ్రి పోడు వ్యవసాయం చేసేవాడు. తల్లి ఆదివాసీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో వంట చేసేది. తల్లితోపాటు స్కూలుకు వెళ్లడంతో ఆ ఇంట్లో తొలి విద్యావంతురాలు పుట్టింది. అలా కన్నిబాయి పదవ తరగతి వరకు ఆశ్రమ పాఠశాలలో, ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో చదివింది. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సహాయ కార్యదర్శి, ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది. కన్నిబాయి అప్పుడు పేపర్లో తెలంగాణ అడ్వెంచర్ క్లబ్, నెహ్రూ యువజన కేంద్రం ఇచ్చిన ప్రకటనను చూసింది. పోటీలకు దరఖాస్తు చేసింది. ఆ పోటీలో మొత్తం పదహారు కేటగిరీలున్నాయి, అన్నీ సాహసక్రీడలే. ఎనిమిదింటిలో తొలిస్థానంలో నిలిచింది. ఆ ఆటలేవీ నేల మీద ఆడేవి కాదు. కొండ కోనల నుంచి లోయలోకి దిగాలి, లోయలో నుంచి కొండ మీదకు ఎక్కాలి. రాపెల్లింగ్ రెండు రకాలు, క్లైంబింగ్, జంపింగ్, బోటింగ్, జుమ్మరింగ్, బ్లైండ్ఫోల్, పారాషూటింగ్... అన్నింటిలోనూ పాల్గొన్నది. ఎనిమిదింటిలో తొలి స్థానంలో నిలిచిన జిల్లాస్థాయి పోటీలవి. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ తొలిస్థానమే ఆమెది. ఇది ఐదేళ్లనాటి మాట. పతకాల పంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్, రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్ సంయుక్తంగా 2019లో నిర్వహించిన పోటీల్లో పద్దెనిమిది దేశాల నుంచి వందకు పైగా సుశిక్షితులైన క్రీడాకారులు పాల్గొన్నారు. అరకులోయ దగ్గరున్న 350 అడుగుల కటికి జలపాతం రాపెల్లింగ్ పోటీల్లో వరల్డ్ కప్‌లో కన్నిబాయికి కాంస్య పతకం వచ్చింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకుని అదే ఉత్సాహంతో 2020లో జరిగిన సెకండ్ వరల్డ్ వాటర్ఫాట్ రాపెల్లింగ్ వరల్డ్ కప్ పోటీల్లో ఒక బంగారు, వెండి, రెండు కాంస్యం... మొత్తం నాలుగు పతకాలను సాధించింది. ఆ పోటీలకు తెలంగాణ రాష్ట్రానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఈ యంగ్ అచీవర్... అదే ఏడాది ఆగస్టు లో వాటర్‌ఫాల్ రాపెల్లింగ్ వరల్డ్ కప్ ఆర్గనైజింగ్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్‌గా నియమితమైంది. భగీరథ ప్రయత్నం ఇంటర్ తర్వాత చదువులో కొంత విరామం తీసుకున్న కన్నిబాయి ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదువుతోంది. ఆమె ఆటలపోటీలతోపాటు పర్వతారోహణలో కూడా ఓ మైలురాయిని చేరుకుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 6,512 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ భగీరథ శిఖరాన్ని అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. పద్దెనిమిది రోజులపాటు సాగిన ఆ సాహసయాత్ర అనుభవాలను ఆమె గుర్తు చేసుకుంటూ పోరాడే మొండితనమే తనను గెలిపించిందని చెప్పింది కన్నిబాయి. సాహస యాత్ర కూడా పోరాటం వంటిదే. ఈ పోరాటం లో లక్ష్యం తప్ప మరేమీ గుర్తుండ కూడదు, ఇతరత్రా ఏం గుర్తుకు వచ్చినా పోరాటాన్ని మధ్యలోనే ఆపేస్తాం. అందుకే మరేమీ గుర్తు తెచ్చుకోకూడదు అని సందేశాత్మక జీవిత సత్యాన్ని కూడా చెప్పిందీ పాతికేళ్ల అమ్మాయి. భవిష్యత్తులో ఎవరెస్టును అధిరోహించాలనేది తన కల అని చెప్పిన కన్నిబాయి ప్రస్తుతం పాంచులీ పర్వతారోహణకు సిద్ధమైంది. ఈ నెల తొమ్మిదో తేదీన మొదలయ్యే ఆమె గ్రేట్ జర్నీకి ఆల్ ది బెస్ట్. పోరుబిడ్డ ఆదివాసీ బిడ్డను, ఆదివాసీలకు అన్యాయం జరిగితే ఊరుకోను అని చెప్పే కన్నిబాయి పోరాట యోధ కూడా, నాయ క్పోడు తెగకు చెందిన అమ్మాయిలు ట్రాఫికింగ్‌కు గురయినప్పుడు కన్నెర్ర చేసింది. పోలీసులు ఆ అమ్మాయిలను వెతికి తీసుకువచ్చే డెబ్బయ్ మంది ఆదివాసీలతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసింది. ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని మరణించినప్పుడు ‘ఆమె మరణానికి అనారోగ్యమే కారణం’ అని కేసు ముగించడానికి సిద్ధమవుతున్న అధికారుల ప్రయత్నాన్ని అడ్డుకుని పార్థివ దేహాన్ని కదలనివ్వకుండా అడ్డుపడి, దర్యాప్తుకోసం పట్టుపట్టింది. కుమ్రుం భీము మొదలుపెట్టిన ఆదివాసీల భూమి హక్కు పోరాటాన్ని ఈ తరంలో కన్నిబాయి కొనసాగిస్తోంది. కొంతమందికి పట్టాలిప్పించింది. కరెంటు లేని ఆదివాసీ గ్రామాలకు ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సోలార్ లైట్లు శాంక్షన్ చేయించి స్వయంగా మోసుకెళ్లి లైట్లు వేయించిన ధీర కన్నిబాయి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Sita Vasuniya: చేనేత సీతమ్మ
ఫ్యాషన్ ప్రపంచం ప్యారిస్ అంటారు కానీ, ఫ్యాషన్‌కి ఇప్పుడు ఇటలీ కూడా. ‘వోగ్’ మాస పత్రిక పేరు వినే ఉంటారు. ఆ అమెరికన్ పత్రికకు ఇటలీలో ఒక ఎడిషన్ ఉంది. ‘వోగ్ ఇటాలియా’. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ రెండూ ఉంటాయి అందులో. ఒక్క ఇటలీవే కాదు. ఫ్యాషనబుల్‌గా ఉన్న ఏ దేశంలోని మహిళ అయినా, ఆఖరికి ఆమె ఆదిమవాసీ మహిళ అయినా.. ఆమె ధారణలో అత్యాధునికత కనిపిస్తూ ఉంటే ఆమె అందులో ప్రత్యక్షం అవుతుంది! వోగ్ ఇటాలియా తాజా సంచికలో సీతా వసూనియా కనిపించింది కూడా అందుకే. ఆమె ధరించిన చీర ఆమె నేసిందే. పైకి సాదాసీదాగా ఉన్న ఆ చీర ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త షో కేస్ డిజైన్ అయింది! సీత మధ్యప్రదేశ్‌లోని ఓ గిరిజన గూడెం యువతి. తను, తన చేనేత, స్వయం సహాయ బృందంలోని తన తోటివారు... ఇదే ఆమె ప్రపంచం. ఆ ప్రపంచంలో జీవనం, జీవితం తప్ప ఫ్యాషన్ అనే మాట ఉండదు. జీవనం అంటే బతుకు తెరువు. జీవితం అంటే లైఫ్ స్టైల్. అంటే.. కష్టపడం, ఇంటికి చేదోడు అవడం. పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని వీలాంచల్ ప్రాంతంలోని ఆదివాసీ మహిళలు ఎలా ఉంటారో సీత కూడా వేరే మాట లేకుండా అలాగే ఉంటుంది కానీ.. ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతంలో ఆమె ఒక విశేషం అయింది. ఆ ప్రాంతంలోనే కాదు. ఇండియాలో, ఇటలీలో, అమెరికాలో.. ఇంకా అనేక ఆధునిక దేశాలలో ఆమె ధరించిన చీర ఫ్యాషన్‌కు సరికొత్త ప్రతీక అయింది. తను కట్టుకోడానికి నేసుకున్న చీర తనకొక గుర్తింపును కట్టబెట్టింది! ఇంతలా గుర్తింపు రావడానికి కారణం.. ఆమె జీవితంలో ఎలాంటి ప్రాముఖ్యమూ లేని ఒకానొక రోజు. ఆ రోజు జరిగిన ఒక ఘటనే.. రెండేళ్ల కొడుకున్న ఈ యువ మాతృమూర్తిని ‘ఎంపవరింగ్ సెలబ్రిటీ’గా మార్చేశాయి. వోగ్ ఇటాలియా పత్రికలో వచ్చిన ఫొటోలో ఆమె మహేశ్వరం చేనేత అద్దకం చీర ధరించి ఉన్నారు. ఆ ఫొటోను తీసింది ఢిల్లీలో పేరున్న ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్. ధార్ జిల్లాలోని పర్యాటక స్థలం ‘మండు’లో ఆ ఫొటోగ్రాఫర్ కెమెరా పట్టుకుని తిరుగుతున్నప్పుడు అదే చోట స్వయం సహాయ బృందంలో సీత కనిపించింది. కనిపించడం కాదు. సీత ఉండేదే అక్కడ. ధార్ జిల్లాలోని పనల గ్రామ్ సీతది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆత్మ నిర్భర్ మిషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రారంభించిన ‘ఏక్ జిల్లా ఏక్ ఉత్పాద్’ పథకంలో భాగంగా పదిమందిలో ఒకరిగా సీత ఆ రోజు ‘మండు’లో ఉంది. ఆ అదివాసీ యువతి చీరకట్టులోని అత్యాధునికతను ఆమె అనుమతితో తన కెమెరాలోకి షూట్ చేసుకున్నారు ఆ ఫొటోగ్రాఫర్. మండులోని రాణి రూపమతి మహల్ మ్యూజియం ఫొటో షూట్ జరిగింది. అది ఫిబ్రవరి నెల. ఆ వెంటనే మార్చి సంచికలో సీత ఫొటో వచ్చింది! ‘‘మండు కు మేమంతా శిక్షణ కోసం వచ్చాం. అప్పుడే ఆ ఫొటోగ్రాఫర్ నా ఫొటో తీసుకున్నారు. కానీ ఇలా నా ఫొటో ప్రపంచంలో అందరూ చూసే పుస్తకంలో వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మా ఊళ్లోకొచ్చే వార్తా పత్రికల్లోని గ్రూప్ ఫొటోల్లో కూడా నేను ఏ రోజూ రాలేదు’’ అని సంభ్రమంగా అంటోంది సీత. మండులో వారికి లభించిన శిక్షణ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఆర్ట్, బాగ్ ప్రింట్, ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన ధారానేత.. మొదలైన వాటి మీద. వాటిని ధ్యాసగా నేర్చుకుంటున్న సీతలో ఆ రోజు ఆమె కట్టుకున్న చీర ఫొటోగ్రాఫర్‌కి నచ్చింది. చివరికి సీతకు పేరు తెచ్చింది. సీత ఒక్కరే కాదు. ఇక ముందు ప్రాంతంలోని చేనేతలన్నిటికీ ప్రాచుర్యం తేచ్చే ప్రయత్నాలు మొదలు పెడతాం. ఇందుకు ప్రేరణ మాత్రం మాకు ‘వోగ్ ఇటాలియా’ లో వచ్చిన సీత ఫొటోనే’’ అంటున్నారు ధార్ జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సలోనీ సిదానా. -
గిరిజన మహిళలకు 118 ఎకరాలు
సాక్షి, అమరావతి: గిరిజన మహిళలకు భూమి కొనుగోలు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి రెండెకరాల వరకు మాగాణి, ఐదెకరాల వరకు మెట్ట భూముల్ని ఈ పథకం కింద కొనుగోలు చేసి ఇస్తారు. రూ.6.67 కోట్లతో సాగుకు అనువైన 118 ఎకరాలు కొని 57 మంది గిరిజన మహిళలకు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం కింద రైతులకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 25 శాతాన్ని బ్యాంకుల ద్వారా రుణంగా ఇప్పిస్తుంది. ఒక్కో రైతుకు రూ.15 లక్షల వరకు యూనిట్ ఖరీదుగా ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీ అనంతరం నీటిపారుదల వసతి లేని భూముల్లో.. భూగర్భ జలాలను పరిశీలించి వైఎస్సార్ జలకళ పథకం కింద బోరు వేయించి మోటారు కూడా బిగించి ఇస్తుంది. గిరిజన రైతుల కోసం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ట్రైకార్ స్పెషల్ ప్రాజెక్టుల్లో భాగంగా 23,923 మందికి రూ.11.73 కోట్లతో పెద్ద ట్రాక్టర్లు, స్ప్రింక్లర్లు, టార్పాలిన్లు, బోర్లు, సబ్ మెర్సిబుల్ మోటార్లను అందించింది. గిరిజన రైతులకు వ్యవసాయం కోసం ఎటువంటి సాయం కావాలన్నా అందించేందుకు ట్రైకార్ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేయడంతోపాటు రైతుకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడంలో ముందంజలో ఉంది. -
గంజాయి కేసు; మహిళకు నోటీసులు
ఒడిశా, జయపురం: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో నమోదైన గంజాయి కేసులో ఒడిశాకు చెందిన ఆదివాసీ నిరుపేద మహిళను నిందితురాలిగా చేసి కోర్టుకు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నోటీసులు పంపింది. అవిభక్త కొరాపుట్‌లోని నవరంగపూర్ జిల్లా పపడహండి సమితిలో చిన్న కుగ్రామం సన్యాసిగుడలో పశువులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న గౌరిమణి భొత్ర అనే మహిళకు నాలుగు రోజుల క్రితం ఈ నోటీసులు అందాయి. గంజాయి కేసులో నిందితురాలు లక్నోలోని కార్యాలయంలో హాజరుకావాలని నోటీసు సారాంశం. ఇంతవరకూ ఆమె తన జిల్లా కేంద్రాన్నే చూసి ఎరుగదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉందో తెలియని నిరక్షరాస్య, నిరుపేద మహళా పశువుల కాపరికి ఆ నోటీసు ఎందుకు వచ్చిందో? ఎవరు పంపారో తెలియక, అందులో ఏముందో అర్థం కాక ముచ్చెమటలు పట్టి అందరి వద్దకు తిరిగి చదివి వినిపించమని వేడుకుంది. ఆ గ్రామంలోనే కాదు పరిసర గ్రామాలలో ఆ నోటీసు చదవగల వారు ఎవరూ లేక పోవడంతో మంత్రిగుడలో ఒక ఉపాధ్యాయుడితో చదివించుకుంది. ధైర్యం చెప్పిన ఎస్పీ కుశలకర్ నోటీసులో విషయం తెలిశాక తాను గంజాయి కేసులో ఎప్పుడు? ఎక్కడ? పట్టుబడ్డానంటూ తల పట్టుకుంది. మూడు నాలుగు రోజులు మానసిక వ్యధ పొందిన ఆమె చివరికి ఉపాధ్యాయుని సలహా మేరకు గురువారం నవరంగపూర్ వచ్చి ఎస్పీ కుశలకర్‌ను కలిసి నోటీసు చూపింది. నోటీసు చదివిన ఎస్పీ ఏమీ కాదని భరోసా ఇవ్వడంతో ఊరట చెంది ఇంటికి మళ్లింది. -
నువ్వు నా చెల్లివంటి దానివి...
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: ‘అమ్మా రాజేశ్వరి.. నువ్వు నా చెల్లివంటి దానివి... నాటువైద్యం మంచిదికాదు... నన్ను నమ్ము... నీ ఆరోగ్యం మా బాధ్యత’ అని సీతంపేట ఐటీడీఏ పీవో ఎం సాయికాంత్‌వర్మ గిరిజన బాలింత సవర రాజేశ్వరిని బతిమలాడారు. ఆది వారం రాజేశ్వరి వైద్యానికి నిరాకరించటం, ఆమెను ఒప్పించేందుకు ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఆర్డీవో, ఇతర అధికారులు శతవిధాలా ప్రయత్నించిన విషయం విదితమే. ఈ క్రమంలో విషయాన్ని పర్యవేక్షిస్తున్న పీవో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విశాఖ నుంచి పాలకొండ ఏరియా ఆస్పతికి చేరుకుని తనవంతు ప్రయత్నం చేశారు. దాదాపు గంట పాటు బాలింతను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఎంతసేపటికి ఆమె ససేమిరా అనటంతో తానే స్వయంగా మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పటంతో ఎట్టకేలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాత్రి 12 గంటల సమయంలో పీవో తన సొంత వాహనంలో రాగోలు జెమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగలిగారు. సోమవారం అక్కడి వైద్యులు రాజేశ్వరికి అవసరమైన వైద్య పరీక్షలు చేశారు. ఒక యూనిట్ రక్తాన్ని అందించారు. అదేవిధంగా వైద్య ఖర్చులకు కొంత ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం రాజేశ్వరి ఆరోగ్యం నిలకడగా ఉందని జెమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. పీవో వెంట ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో ఈఎన్‌వీ నరేష్ రాత్రంతా ఉన్నారు. ఏదేమైనా బాలింత ఆరోగ్యం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకున్న శ్రద్ధ ప్రశంసలు అందుకుంటున్నాయి. గిరిజన బాలింతను ఒప్పించిన ఎమ్మెల్యేకు అభినందన సీతంపేట: అవగాహన లేమి, మూఢవిశ్వాసాలతో వైద్యానికి నిరాకరించిన సీదిగూడకు చెందిన గిరిజన బాలింత రాజేశ్వరిని ఒప్పించిన పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిని ఐటీడీఏ పీవో సాయికాంత్ వర్మ అభినందించారు. సోమవారం సాయంత్రం ఐటీడీఏలో పుష్పగుచ్ఛం అందజేసి దుశ్శాలువాతో సన్మానించారు. అధికార యంత్రాంగం వేడుకున్నా ఇంటికి వెళ్లిపోతానని మొండిపట్టు పట్టి వైద్యానికి నిరాకరించిన ఆమెను ఓ దారికి తెచ్చి వైద్యం చేయించారని పీవో ఆనందం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ఆమెను ఒప్పించలేకపోయామని, చివరకు ఎమ్మెల్యే నచ్చచెప్పడంతో అంగీకరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో ఆనందరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛంతో అభినందిస్తున్న పీవో సాయికాంత్ వర్మ -
‘గురుకుల’ విద్యార్థినికి గర్భం
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లోని గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని గర్భం దాల్చడం కలకలం సృష్టించింది. అయితే.. ప్రేమ వ్యవహారమే కారణమని అధికారుల విచారణలో తేలింది. వివరాలు.. గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతున్న 10 మంది విద్యార్థినులకు ఇటీవల రుతుస్రావం సమస్య ఎదురైంది. దీంతో నవంబర్ 21న కళాశాల సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్‌లో పరీక్షలు చేయించారు. ఇందులో ముగ్గురిపై అనుమానంతో గర్భనిర్దారణ పరీక్షలు చేయించారు. వారికి మొదట పాజిటివ్ వచ్చింది. ధ్రువీకరణ కోసం మళ్లీ వారం తర్వాత రావాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే.. కళాశాల సిబ్బంది మళ్లీ రిమ్స్‌కు వెళ్లకుండా స్థానికంగా ఉన్న ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో ఒక విద్యార్థిని మాత్రమే గర్భం దాల్చినట్లు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆదివాసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కాగా, శనివారం ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు, గిరిజన సంక్షేమ శాఖ జీసీడీవో శంకుతల, డీసీపీవో మహేశ్, ఐసీడీఎస్ పీడీ సావిత్రి శనివారం విచారణ చేపట్టగా.. గర్భానికి ప్రేమ వ్యవహారమే కారణమని సదరు విద్యార్థిని ఒప్పుకుంది. మా కళాశాలను బద్నాం చేస్తారా? గురుకుల కళాశాలలో విద్యార్థిని గర్భం దాల్చడంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆ కళాశాల విద్యార్థినులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కళాశాల పేరుప్రఖ్యాతులు భంగం కలిగేలా మీడియాలో ప్రచారం చేశారని, ఇందులో ప్రిన్సిపాల్ పాత్ర ఏమీ లేదని వసతిగృహ భవనం ఎదుట ధర్నాకు దిగారు. ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ విద్యార్థినులతో మాట్లాడి శాంతిపజేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ కోసం ఆర్డీఓ లక్ష్మయ్య ఆలస్యంగా రావడంపై విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని ఆందోళన చేశారు. -
కుదరకపోయినా ఓ కప్పు
మంచి కాఫీ కావాలంటే మద్రాసు కాఫీ హౌసుకి వెళ్లాల్సిందే అంటారు కాఫీ ప్రియులు. మరీ అంత దూరమైతే అక్కర్లేదు. విశాఖపట్టణం దగ్గరలో ఉన్న అరకులోనే మంచి కాఫీ చాలా సంవత్సరాలుగా దొరుకుతోంది. కిందటి ఏడాది ఈ అరకు కాఫీకి పారిస్‌లో ‘ప్రిక్స్ ఎపిక్యూర్స్’ అవార్డు కూడా వచ్చింది! ఆ అవార్డును అందుకున్నది కాఫీ గింజల్ని పండించిన అరకు గిరిజన మహిళలు కావడం విశేషం. ఇంకొక విశేషం ఏంటంటే.. పారిస్‌లో ఇప్పుడు ‘అరకు’ అనే పేరున్న కాఫీ స్టాల్ ముందర జనం ఆగిపోతున్నారు. అరకు కాఫీ ఘనతను కేవలం కొన్ని కాఫీ గింజలు ప్రపంచానికి చాటుతున్నాయి. అరకు ప్రాంతంలో ఉండే గిరిజనులు పండించిన నాణ్యమైన కాఫీ గింజలు అవి! అరకు లోయలో గిరిజన మహిళల చేతి మీద సుమారు ఒకటిన్నర లక్షల ఎకరాల్లో కాఫీ గింజలు పండుతున్నాయి. అయితే ఈ గింజలకు అంతర్జాతీయంగా మార్కెట్ ఉన్నా, ఈ గిరిజనులు మాత్రం ఆర్థికంగా నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘‘మేం చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరం పది బస్తాల గింజలు పండించుకుంటాం. వాటి నుంచి ఒక్కొక్కరం కనీసం సీజన్‌కి రెండు లక్షల రూపాయలు సంపాదించుకుంటేనే గిట్టుబాటు అవుతుంది. కానీ మాకు ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు మాత్రమే వస్తోంది. ఖర్చులన్నీ పోగా, తిండి తినటానికి సరిపడేంత డబ్బు మాత్రమే మిగులుతోంది. మా ఆర్థికస్థితిలో ఎటువంటి ఎదుగుదల లేదు. దానితో మాలో చాలామందికి కాఫీ పండించాలనే ఆసక్తి సన్నగిల్లిపోతోంది’’ అంటున్నారు అరకు గిరిజన మహిళలు. చరిత్రలోకి వెళ్తే.. 1898లో తూర్పుగోదావరి తీర ప్రాంతంలో ఒక బ్రిటిష్ అధికారి ఉండేవారు. ఆయన అక్కడి వాతావరణం చూసి, అది కాఫీ పంటకు అనుకూలంగా ఉంటుందని కాఫీ పంట వేశారు. 1950లలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కాఫీ పంటను సాగు చేయడం మొదలైంది. అలా క్రమేపీ అరకు కాఫీ రుచికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ‘అరకు కాఫీ’ అన్న పేరూ వచ్చింది. 1980 నాటికి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ప్రారంభించి, కాఫీ పంటను ప్రోత్సహించింది. ఒకానొక సమయంలో వరి పంట కంటే కాఫీ పంట మీద లాభాలు వచ్చాయి. దాంతో చాలామంది రైతులు కాఫీ పండించడం మొదలుపెట్టారు. రెండేళ్ల క్రితం పారిస్‌లో అరకు కాఫీ స్టోర్ తెరుచుకుంది. ఈ స్టోర్ కారణంగానే కిందటి ఏడాది అరకు గిరిజన మహిళలకు అవార్డు వచ్చింది. ఇంత కమ్మని కాఫీని పండిస్తున్న ఈ గిరిజన మహిళలకు మాత్రం శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదు! -
అడవి కాచిన వన్నెలు
అడవి కాచిన వెన్నెల అడవికే పరిమితం అవుతుంది. డేబ్భయ్ ఏళ్ల వయసులో ఈ గిరిపుత్రిక నేర్చుకున్నచిత్రలేఖనం మాత్రం విశ్వ విధిలో కాంతులు విరజిమ్ముతోంది. ఖండాంతర ఖ్యాతిని సముపార్జిస్తోంది. పుట్టినప్పటి నుంచి డెబ్బై ఏళ్ల వరకు జీవించిందామె. అన్నేళ్లలో తనకు చెప్పుకోవడానికంటూ ఏ ప్రత్యేకతా లేదు. మధ్యప్రదేశ్‌లోని ‘లోరా’ అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది. భర్త, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అడవిలో దొరికే పనులతో బతుకు వెళ్లదీసింది. ఆమెకు నలబై ఏళ్ల వయసులో భర్త పోయాడు. ముగ్గురు పిల్లల్ని ఒక ఇంటి వాళ్లను చేసే బాధ్యత ఆమె భుజాల మీద పడింది. భర్త వదిలి వెళ్లిన ఆ బాధ్యతలను పూర్తి చేసిందామె. అయితే డెబ్బై ఏళ్ల వయసులో ఆమె జీవితం ఆమెకు కూడా తెలియకుండా ఊహించని మలుపు తిరిగింది! ఇప్పుడామెకి ఎనబై ఏళ్లు. ఈ పదేళ్లలో ఆమె అంతర్జాతీయ స్థాయి చిత్రకారిణి అయింది! రాష్ట్రం దాటి బయటకు రాని జీవితం ఆమెది. ఆమె వేసిన బొమ్మలు ఖండాంతరాలు దాటి ఇప్పుడు పారిస్‌లోనూ, ఇటలీలోని మిలన్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లోనూ ప్రఖ్యాత చిత్రకారుల చిత్రాల వరుసలో స్థానం సంపాదించుకున్నాయి. ప్రైజులు కూడా గెలుచుకున్నాయి. దేశంలో అనేక ఆర్ట్ గ్యాలరీలలో అంతకంటే ముందునుంచే ప్రదర్శితమవుతున్నాయి. ఈ ఎనబై ఏళ్ల చిత్రకారిణి పేరు జుధైయా బాయ్ బైగా. ‘‘పెయింటింగ్ నన్ను మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అక్కడ నేను స్వేచ్ఛావిహంగాన్ని’’ అంటోంది బైగా. ఆమె అంటున్నట్లే ఆకాశమే హద్దుగా తన కుంచె శక్తితో మేధా యుక్తితో సృజనాత్మక లోకంలో విహరిస్తోందామె. జీవితమే థీమ్ బైగా కి బొమ్మలు వేయడానికి థీమ్ గురించి మేధామథనం చేయాల్సిన అవసరమే ఉండదు. తన చుట్టూ కనిపించే సామాన్య గిరిజన జీవితాన్నే కాన్వాస్ మీదకు తెస్తుంది. గిరిజన సంప్రదాయ జీవనశైలికి ప్రతిబింబాలవి. ఒక్కో బొమ్మకు మూడు వందల నుంచి ఎనిమిది వేల వరకు ధర పలుకుతోంది. గ్రామస్థులు ఆమె ధరిస్తున్న రంగురంగుల కొత్త దుస్తులను చూస్తూ ‘‘బైగా అవ్వ జీవితం రంగులమయం అయింది’’ అని చమత్కరిస్తున్నారు. ‘‘ఆమె నుంచి నేర్చుకోవలసింది డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు. డెబ్బై ఏళ్ల వయసులో చిత్రలేఖనం నేర్చుకోవడానికి ముందుకు రావడమే’’నన్నారు ఆషిశ్ స్వామి. అడవి బిడ్డలకే సొంతం బెంగాల్‌కు చెందిన ఆషిశ్ ప్రముఖ చిత్రకారుడు, శాంతినికేతన్ విద్యార్థి. ఆషిశ్ తన ఆర్ట్ స్టూడియో ‘జన్‌గాన్ తస్వీర్‌ఖానా’లో ప్రదర్శన కోసం మధ్యప్రదేశ్‌లోని గిరిజన గ్రామాలను సందర్శిస్తూ పదేళ్ల కిందట లోరా వచ్చాడు. ఉచితంగా చిత్రలేఖనం నేర్పిస్తున్నాడని తెలియడంతో పదిహేను మంది మహిళలు నేర్చుకోవడానికి వచ్చారు. డెబ్బై ఏళ్ల బైగా కూడా. ‘‘కుంచె పట్టుకున్న తొలిరోజు నుంచే ఆమె దీక్షతో బొమ్మలు వేసింది. ఒకటి వేసిన తర్వాత మరింకేదో కొత్తగా వేయాలనే తపన కూడా కనిపించేదామెలో. శిక్షణ తీసుకున్న నాగరిక చిత్రకారులకు సాధ్యం కానిది, అడవి బిడ్డలకు మాత్రమే ఒంటపట్టే మెళకువ ఒకటుంది. వాళ్లు అడవిలో సంచరించే జంతువుల కళ్లలోని భావాన్ని ఇట్టే పసిగట్టేస్తారు. బైగా ఆ భావాన్ని బొమ్మలోకి పట్టుకొస్తుంది’’ అన్నాడు ఆషిశ్ స్వామి. ‘నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదు’ అని ఇప్పటికే ఎందరో నిరూపించారు. జుధైయా బాయ్ బైగా మరోసారి నిరూపించింది, తన కుగ్రామం లోరా పేరును ప్రపంచస్థాయి వేదికల మీదకు తీసుకెళ్లింది. – మంజీర -
అడవి ‘తల్లి’కి ఆలంబన
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అందుబాటులో లేక ప్రజలు నిత్యం నరకం అనుభవించేవారు. గిరిజన స్త్రీలు గర్భందాల్చితే వారిని అత్యవసర వైద్యానికి ‘డోలీ’ కట్టి కొండలు, గుట్టల మీదుగా మోసుకెళ్లాల్సిన దుస్థితి ఉండేది. జిల్లాలో గత మూడేళ్లలో 60 మంది తల్లులు, 673 మంది శిశువుల మరణాలు సంభవించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో గిరిశిఖర గర్భిణుల ప్రాణాలకు పూర్తి భరోసా లభిస్తోంది. పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పని చేసిన లక్ష్మీషా గతేడాది కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. గిరిజన గర్భిణుల కోసం సాలూరులో ప్రత్యేక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గర్భిణులను ఈ కేంద్రానికి తరలించి, అవసరమైన వైద్యం, పౌష్టికాహారం అందించటంతో పాటు ప్రసవం కూడా ఇక్కడే జరిగేలా వసతులు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజన సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలోని మిగతా ఏజెన్సీ ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో గర్భిణుల కోసం వసతి కేంద్రాల ఏర్పాటు చేయాలని సంకల్పించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి వసతి కేంద్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచించడం గమనార్హం. అంకురార్పణ జరిగిందిలా.. సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధిలోని సిరివర గ్రామంలో కొండతామర గిందె అనే మహిళకు పుట్టిన బిడ్డ మరణించడం, ఆ బాలింతను డోలిలో గ్రామస్తులు తీసుకురావడంపై 2018 జూలై 31న ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘జోరువానలో 12 కిలోమీటర్లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కథనంపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. దీన్ని సుమోటో ఫిర్యాదుగా స్వీకరించి, అప్పటి టీడీపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కలెక్టర్ ఎం. హరిజవహర్‌లాల్ సూచనలతో అప్పటి పార్వతీపురం ఐటీ డీఏ పీఓ లక్ష్మీషా 2018 ఆగస్టు 2న కాలినడకన అటవీమార్గం గుండా సిరివర గ్రామానికి వెళ్లారు. మాతా, శిశుమరణాలు సంభవించకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. వసతి గృహంలో యోగా చేస్తున్న గర్భిణీలు ముఖ్యమంత్రి చొరవతో విస్తరిస్తున్న సేవలు ప్రసవ సమయానికి నెలన్నర, రెండు నెలలు ముందు ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన గర్భిణులకు తగిన రక్షణ, వైద్యం కల్పించాలని లక్ష్మీషా భావించారు. 2018 సెప్టెంబరు 17న సాలూరులో ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఇప్పటిదాకా 291 మంది చేరారు. వీరిలో 250 మందికి సుఖ ప్రసవం జరిగింది. ప్రస్తుతం 41 మంది గర్భిణులు వసతి పొందుతున్నారు. సాలూరు వసతి కేంద్రం సత్ఫలితాలు ఇవ్వడంతో ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం సందర్భం అరకులో మరో వసతి కేంద్రాన్ని ప్రారంభించారు. పాడేరు, చింతపల్లికి కూడా విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు వసతి కేంద్రాన్ని సందర్శించనున్న గవర్నర్ విజయనగరం జిల్లాలో ఒకరోజు పర్యటనలో భాగంగా సాలూరులోని గర్భిణుల వసతి కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఇక్కడ గర్భిణులకు అందుతున్న సేవలను గవర్నర్ స్వయంగా పరిశీలించనున్నారు. గర్భిణులకు సకల వసతులు గర్భిణులకు పురిటి నొప్పులు ప్రారంభం కాగానే సాలూరు సీహెచ్‌సీకి నిమిషాల వ్యవధిలోనే తరలించే ఏర్పాట్లు చేశారు. దీనికోసం అంబులెన్స్ ఉంది. వసతి కేంద్రంలో గర్భిణులకు సమయానికి పౌష్టికాహారం అందుతుంది. ఉదయం పాలు, గుడ్లు, కిచిడి, లెమన్ రైస్.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాగిజావ, మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం (ఆదివారం, బుధవారం మాంసాహారం), సాయంత్రం వేరుశనగ చక్కిలు, నువ్వుల చక్కిలు, పండ్లు, రాత్రి భోజనం అందజేస్తున్నారు. పరీక్షల కోసం వైద్య సిబ్బందిని నియమించారు. ఉదయం గర్భిణులతో యోగా చేయిస్తున్నారు. వినోదం కోసం టీవీ ఉంది. చీరలపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కుట్లు, అల్లికలు వంటివి నేర్పిస్తున్నారు. గర్భిణులకు ఇంతకుముందే పిల్లలు ఉంటే, వారిని వసతి కేంద్రంలో తమతో పాటే ఉండనివ్వొచ్చు. వసతి కేంద్రం చాలా సౌకర్యంగా ఉంది ‘‘నేను 13 రోజులుగా సాలూరు వసతి కేంద్రంలో ఉంటున్నాను. ఇంటి వద్ద కంటే ఇక్కడే చాలా సౌకర్యంగా ఉంది. ఇక్కడ సమయానికి అన్ని రకాల పౌష్టికాహారం అందిస్తున్నారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు’’ – సీదరపు నర్సమ్మ, గర్భిణి, బొడ్డపాడు, జిల్లేడువలస గ్రామం, సాలూరు మండలం ఇక్కడ ఉంటే భయం లేదు ‘‘మా గిరిజన గ్రామాల్లో పురుడు అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సరైన రోడ్డు లేకపోవడంతో, పురిటి నొప్పులు వస్తే సమయానికి ఆసుపత్రికి వెళ్లే అవకాశం కూడా ఉండదు. వసతి కేంద్రంలో ఉండడం వల్ల ఎలాంటి భయం లేకుండా పోయింది. తరచూ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. సమయానికి మంచి ఆహారం అందిస్తూ గర్భిణులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తున్నారు’’ – పేటూరి కాంతమ్మ, గర్భిణి, ఊబిగుడ్డి, కేసలి పంచాయతీ, పాచిపెంట మండలం తల్లీబిడ్డల ప్రాణాలు పోకూడదనే... ‘‘గిరిజన గ్రామాల్లోని గర్భిణులు పురిటి సమయంలో తరుచూ ఇబ్బందులు పడడం, మాతా శిశుమరణాలు నమోదవుతుండడం చాలా భాద కలిగించేది. ప్రసవ సమమంలో తల్లీ బిడ్డల ప్రాణాలు పోకూడదన్న లక్ష్యంతో గర్భిణుల కోసం సాలూరులో వసతి కేంద్రం ఏర్పాటు చేశాం’’ – డా.జి.లక్ష్మీషా, గిరిశిఖర గర్భిణుల వసతి కేంద్రం రూపకర్త -
మహిళలే అంబులెన్స్‌లా మారి 4 కిలోమీటర్లు..
సాక్షి, భువనేశ్వర్ : మాటలు కోటలు దాటుతున్నా.. కాలు గడప దాటని చందంగా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలు తీరు ఉందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. గర్భిణులు, గ్రామీణ రోగులకు వైద్య సౌకర్యాలు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తున్నట్లు చెబుతున్నా.. అవేమీ బాధితుల దరి చేరడం లేదు. ప్రసూతి కోసం కిలోమీటర్ల దూరం మోసుకు వచ్చే పరిస్థితి అవిభక్త కొరాపుట్ జిల్లాలో ఇంకా కొనసాగుతుంది. గ్రామాలకు అందుబాటులో వైద్య, రోడ్డు సౌకర్యాలు లేకపోవడంతో రోగులను ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు గ్రామస్తులకు అవస్థలు తప్పడం లేదు. నిండు గర్భిణిని మహిళలు 4 కిలోమీటర్లు భుజాలపై మోసుకు వచ్చిన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... కొరాపుట్ జిల్లా నారాయణపట్నం బ్లాక్ సమితి బిజాపూర్ పంచాయతీ ఉప్పరగొడితి గ్రామానికి చెందిన మీణంగి జానికి శనివారం పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు స్థానిక ఆశ కార్యకర్తకు సమాచారం అందించగా.. ఆమె వెంటనే 102 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ చేరుకోలేదని సంబంధిత అధికారులు తెలిపారు. అప్పటికే మీణంగికి నొప్పులు తీవ్రం కావడం, మగవారు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లకు చెందిన మహిళలు గుమిగూడారు. ఎలాగైనా తామే ఆస్పత్రికి చేర్చాలని నిర్ణయానికి వచ్చారు. స్ట్రైచర్‌పై ఘాట్ రోడ్లో.. ఉప్పరగొడితి నుంచి సుమారు 4 కిలోమీటర్ల వరకు రోడ్డు సౌకర్యం లేదు. దీంతో వాహనాలు తిరిగే అవకాశం లేకపోయింది. దీంతో మహిళలు ఇంద్రా సీత, తులసీ జానీ, బిరమ జానీ, కుమారి జానీ, సిందే జానీ, హికమే పూజారి, సిలా జానీ, పరమ జానీ, టీకే జానీ, ఎప్తా పూజారి, సిలా జానీ తదితరులు స్ట్రైచర్‌పై మీణంగిణి కూర్చోబెట్టి, భుజలపై మోస్తూ ఘాట్ రోడ్లో కొండ దిగి, మతలాపుట్ ఆస్పత్రికి చేర్చారు. అక్కడ ఆమె పండంటి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, సకాలంలో తీసుకు రావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా... ఆ ప్రాంతంలో ఉప్పర గొడితి, తొలగొడితి, మఝిగొడితి, ఉప్పర రంగపాణి, తొలరంగపాణి, కుతుడి తదితర గ్రామాలకు రహదారులు లేవని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో అత్యవసర సమయంలో వైద్యం అందక, ప్రాణాలు కోల్పోతున్నామని వాపోతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా స్పందించాలని పరిసర గ్రామాలకు చెందిన వారు కోరుతున్నారు. అలాగే ఎంతో కష్టానికి ఓర్చి, గర్భిణిని భుజాలపై మోస్తూ ఆస్పత్రికి చేర్చిన మహిళలను పలువురు ప్రశంసిస్తున్నారు. -
గిరిజన మహిళ దారుణ హత్య
సాక్షి, మెదక్: పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన మహిళ హత్యకు గురైన సంఘటన మెదక్ మండలం అవుసుపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హవేలిఘనాపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన విజయ (విజ్జి) (26) శనివారం కూలిపని కోసం మెదక్‌కు వెళ్లింది. శనివారం రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు తెలిసిన వారిని విచారించగా ఆచూకి లభించలేదు. ఆదివారం ఉదయం అవుసులపల్లి శివారులోని ఓ మర్రిచెట్టు కింద మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి చూడగా శవం విజయగా గుర్తించారు. సంఘటన స్థలంలో బిర్యాని, మద్యం బాటిళ్లు పడి ఉన్నాయి. పనికోసం వెళ్లిన విజయను గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి అత్యాచారం చేసి, చీరతో మెడకు బిగించి హత్యచేసినట్లు గుర్తించారు. సంఘటన స్థలాన్ని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, మెదక్‌రూరల్ సీఐ రాజశేఖర్, రూరల్ ఎస్ఐ లింబాద్రిలు, పరిశీలించి డాగ్‌స్క్వాడ్‌ను తీసుకొచ్చారు. డాగ్‌స్క్వాడ్ మెదక్ మండలం అవుసులపల్లి గేటు వరకు వెళ్లి అక్కడే ఆగిపోయింది. మృతురాలి సోదరుడు బద్యా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
రూ.1.30 లక్షలకు మహిళ అమ్మకం!
సాక్షి, ఆసిఫాబాద్: అమాయక గిరిజన మహిళలను ఉపాధి పేరుతో కొంత మంది దళారులు ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు. ఆర్థికంగా నిరుపేదలైన వారిని అమ్మాయిల కొరత ఉన్న రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. తాజాగా తిర్యాణి మండలానికి చెందిన ఓ వివాహితను ఉపాధి పేరుతో మధ్యప్రదేశ్‌కు రూ. 1.30 లక్షలకు విక్రయించారు. గత జూలైలో తన కూతురు కనిపించడం లేదని ఆ మహిళ తండ్రి తిర్యాణి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో మహిళా విక్రయం వెలుగులోకి వచ్చింది. దళారుల చేతిలో మోసపోయి ప్రాంతం కానీ ప్రాుతంలో ఇతరుల చేతిలో చిక్కిన ఆ మహిళ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి పోలీసులకు అంతా చెప్పడంతో మరిన్ని విషయాలు తెలిశాయి. దీంతో జిల్లాలో మానవ అక్రమ రవాణా బయటకు తెలిసింది. తిర్యాణి మండలం మారుమూల గిరిజన గూడెం కొలం తెగకు చెందిన ఓ మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్తకు పెళ్లి అయిన రెండేళ్లకే మతి స్థిమితం కోల్పోవడంతో గత కొన్నాళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. ఇది గమనించిన బాధితురాలు సమీప బంధువు తిర్యాణి మండలం చాపిడికి చెందిన ఓ మహిళ, రెబ్బెన మండలం ఇందిరా నగర్‌కు చెందిన వ్యక్తి, ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్లో కోర్టు కానిస్టేబుల్‌గా పని చేస్తున్న మరో వ్యక్తి కలసి బాధితురాలకి మాయ మాటలతో ఉద్యోగం ఇప్పిస్తామని ఇతర ప్రాంతానికి అమ్మేసేందుకు ప్రణాళిక వేశారు. ఈ ముగ్గురు కలసి బాధితురాలి ఇంటికి గత నెల 1న రాత్రి వెళ్లి ఉద్యోగం పెట్టిస్తామని ఈ రాత్రే బయలు దేరి రావాలంటు ఆమె తండ్రికి చెప్పి ఒప్పించారు. అదే రాత్రి ఇంటి నుంచి తీసుకొచ్చి ఆసిఫాబాద్‌లోని పోలీసు కానిస్టేబుల్ ఇంట్లో ఉంచారు. ఆ మర్నాడు కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి మధ్యప్రదేశ్ వెళ్లే ట్రైన్ ఎక్కించారు. దాదాపు రెండు రోజుల రైలు ప్రయాణం తర్వాత బాధితురాలు మధ్యప్రదేశ్‌లోని మంద్‌సూద్ జిల్లా గరవాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లారు. మధ్యవర్తిగా మరో వ్యక్తి బాధితురాలిని జిల్లా దాటించడంలో ఈ ముగ్గురికి తోడ్పాడ్డాడు. ఇందుకు ఆ మధ్యవర్తికి రూ.10 వేలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రూ.1.30లక్షలకు అమ్మకం మధ్యప్రదేశ్‌లో గరవాద్‌కు చెందిన రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బాధితురాలిని శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఇంటి పనులు చేయిస్తూ నరకం చూపించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలి తండ్రి తన కూతురు కనిపించడం లేదని తన ఇంటికి వచ్చి తీసుకెళ్లిన వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కొంత కాలం పాటు ఆయనకు ఆదిలాబాద్‌లో ఉన్నట్లు అబద్దం చెబుతూ కానిస్టేబుల్ నమ్మించసాగాడు. మరో వైపు మధ్యప్రదేశ్‌లో ఉన్న బాధితురాలు కనీసం ఫోన్ చేసేందుకు తన వారిని కలిసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో అతి కష్టం మీద తప్పించుకుని తిరిగి వచ్చింది. బాధితురాలు ఆ వ్యక్తిని గట్టిగా నిలదీయడంతో తనను రూ.1.30 లక్షలు కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో ఎలాగైనా అతని బారి నుంచి తప్పించుకోవాలని చూసిన ఆమె ఎట్టకేలకు ఇంటికి చేరి పోలీసులకు విషయాలన్ని తెలిపింది. ప్రస్తుతం ఓ మహిళ, ఇద్దరు నిందితులను పోలీసులు అదపులోకి తీసుకుని కోర్టులో హాజరు పర్చగా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. రిమాండ్‌లో ఉన్న ముగ్గురు వ్య క్తులకు సహకరించిన మధ్యవర్తి కోసం పోలీ సులు గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కి చెందిన వ్యక్తి సైతం మహిళను కొనుగోలు చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. దీంతో నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాపింగ్, రేప్, మానవ అక్రమ రవాణా తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. మహిళలు లేక మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లో మహిళా లింగ నిష్పత్తి మగ వారితో పోలిస్తే తక్కువగా ఉండడంతో అనేక మందికి యువకులకు వివాహాలు కావడం లేదు. దీంతో ఎలాగైనా మహిళలను తీసుకొచ్చి తమ ఇళ్లలో పెట్టుకో వాలని శారీరకంగా వాడుకోవడంతో పాటు తమ వంశం వారసులను కని పెంచుకునేందుకు అమాయక గిరిజన మహిళలను పావుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మూడేళ్ల క్రితం కెరమెరి మండలంలో మానవ అక్రమ రవాణా సంబంధించి రెండు కేసులు నమోదైయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి. కఠిన శిక్షపడేలా చూస్తాం.. మహిళలకు మాయ మాటలు చెప్పి మానవ అక్రమ రవాణాకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించాం. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు. తప్పు చేసిన వారందరికి కఠిన శిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. గిరిజన మహిళలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. –సత్యనారాయణ, డీఎస్పీ, ఆసిఫాబాద్ ( కేసు విచారణ అధికారి) -
ఎవరెస్ట్ ఎక్కనున్న ‘అడవి’ బిడ్డలు
కెరమెరి(ఆసిఫాబాద్): సాహసకృత్యాలంటే వారికి మహాఇష్టం.. పరుగుపందెం, గుట్టలు ఎక్కడం, దిగడం, నీటి సాహసం.. ఇలా ఎన్నో రకాల సాహసకృత్యాలు చే సి ప్రజల మన్ననలు పొందిన ఈ అడవిబిడ్డలు మరో సాహాసం చేయబోతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఇచ్చో డ అడవుల్లో గాయత్రీగుండం సాహసకృత్యం.. హైదరా బాద్‌లోని సైక్లింగ్ పరుగుపందెం.. అరకు లోయలో కటక వాటర్‌వాల్ రాఫ్లింగ్ పోటీల్లో పాల్గొని వేగంగా వ స్తున్న నీటిలో 425 ఫీట్ల లోతులో దిగడం ఇలాంటి ఎన్నో సాహకృత్యాలు చేసిన.. వీరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కేందుకు రేపు బయలుదేరుతున్నారు. కెరమెరి మండలంలోని భీమన్‌గొంది గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి, కొలాం కొఠారి గ్రామానికి చెందిన మడావి కల్పన సాహసకృత్యాలు చేయడంలో దిట్ట.. చిన్నతనం నుంచే సాహసం చేయడం అటవాటుగా ఉన్న వీరు ఇప్పటి వరకు ఎన్నో సహాసోపేత కృత్యాల్లో పాల్గొన్నారు. గతంలో ఇచ్చోడ మండలంలోని గాయత్రీదేవి గుండంలో అత్యంత లోతైన లోయలో దిగి ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే గతేడాది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లా అరకు లోయలో ఉన్న కటక వాటర్‌పాల్ రాఫ్లింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అత్యంత వేగంగా పైనుంచి పడుతున్న జలధార తట్టుకుంటూ సుమారు 425 ఫీట్ల లోతులో 2.35 సెకండ్లలో చేరి ప్రథమ బహమతి సాధించారు. అనంతరం ఇటీవల మహబూబ్‌నగర్‌లో మయూరి పార్క్‌లో నిర్వహించిన సైక్లింగ్‌లో పాల్గొని భేష్ అనిపించారు. తమతోపాటు మరో ఆరుగురిని ఈ సైక్లింగ్‌లో పాల్గొనేలా చేశారు. ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం సోమవారం సాయంత్రం వీరు అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కెందుకు బయలుదేరుతున్నారు. హైదరాబాద్‌లోని అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో వీరు ఎంపికయ్యారు. దేశం నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మందిని ఈ క్లబ్ ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గిరిపుత్రికలు కన్నీబాయి, కల్పన ఎంపియ్యారు. గతంలో వీరు ఎన్నో సాహసకృత్యాలు చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వీరికి అవకాశం కల్పించినట్లు వారు తెలుపుతున్నారు. వీరికి ఐటీడీఏ పీవో కృష్ణఆదిత్య ప్రోత్సాహం, సహకారమందిస్తున్నారు. వారికి కావల్సిన దుస్తులు, షూలు సమకూరుస్తున్నారు. వీరికి సుమారు 10 రోజులు శిక్షణ ఇస్తారు. ఎలా నడవాలి అనే దానిపై శిక్షణ ఉంటుంది. ఒక్కొక్కరికి ఎవరెస్ట్ ఎక్కేందుకు రూ.1.50 లక్షల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఐటీడీఏ పీవో రూ.1.80 లక్షలు చెల్లించారని కన్నీబాయి తెలిపారు. ఆర్థికసాయం కోసం వేడుకోలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే రుసుము చెల్లించాలి. అలాగే సుమారు పక్షం రోజులకు కావల్సిన ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అందుకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. దాతలు, మనసున్న మహారాజులు ఆరిక్థ సహాయం అందించాలని కన్నీబాయి, కల్పనలు కోరుతున్నారు. మరో మూడు లక్షలు తక్షణం అవసరముందని చెబుతున్నారు. దాతలు స్పందించాలని వేడుకుంటున్నారు. -
గిరిజన మహిళ దారుణహత్య
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: బుట్టాయగూడెం బస్టాండ్ వె నుక వీధిలో గిరిజన మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. మృతురాలి ఎడమచేతి వైపు చాకుతో పొడవడంతో తీవ్ర రక్తశ్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. భర్తే హత్య చేశారంటూ మృతురాలి కు టుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, మృతురాలి సోదరి సుశీల తెలిపిన వివరాల ప్రకా రం.. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరానికి చెందిన తడికమళ్ల లెనిన్, అంతర్వేదిగూడెంకు చెందిన కొవ్వాసి సత్యవతి 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లెనిన్ ఓ టీవీ చానల్లో విలేకరిగా పనిచేస్తుండగా సత్యవతి పులిరామన్నగూడెం ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం సత్యవతి సెలవు పెట్టి పుట్టింటికి వచ్చింది. గురువారం తిరిగి ఉద్యోగానికి వెళుతున్న సమయంలో హత్యకు గురైంది. ఎస్సై ఆనందరెడ్డి సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. సీఐ రమేష్‌బాబు ఇక్కడికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాల వల్ల హత్య జరిగినట్లు భావిస్తున్నామని సీఐ చెప్పారు. తన అక్క సత్యవతిని భర్త లెనిన్ హత్య చేశాడంటూ మృతురాలి చెల్లెలు సుశీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి నుంచి డ్యూటీకి పులిరామన్నగూడెం వెళ్తుండగా బుట్టాయగూడెం బస్టాండ్ సమీపంలో ద్విచక్రవాహనం ఎక్కమని లెనిన్ అడిగాడని అందుకు ఆమె నిరాకరించడంతో బస్టాండ్ వెనుక వీధిలో త్రిశక్తి పీఠంవైపు రావాలని పిలిచాడని ఆ సమయంలో కత్తితో పొడిచి పారిపోయాడని సుశీల ఫిర్యాదులో పేర్కొన్నట్టు ఎస్సై ఆనందరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గిరికుల పాఠశాల
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఎల్లమ్మ తండా గిరిజన మహిళలు పాఠశాల స్థాయిలో కూడా చదువుకోనప్పటికీ ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సృజనాత్మక సహకారం అందిస్తున్నారు! వీరు డిజైన్ చేస్తున్న లంబాడీల సంప్రదాయ దుస్తులు, బ్యాగులు, సెల్‌ఫోన్ ప్యాకెట్లు, చీరలు, జాకెట్లు.. అందమైన కుట్లు, అల్లికలతో ఆకట్టుకుంటూ దేశ, దేశాలలో విక్రయం అవుతుండటం విశేషం. ఒక్కరితో మొదలై ఇరవై ఏళ్ల క్రితం (1998లో) అంగన్వాడీ కేంద్రం వద్ద ఆయాగా పని చేస్తుండేది కేతావత్ లక్ష్మి. ఖాళీ సమయంలో తమ గిరిజన సంప్రదాయ దుస్తులపై అందమైన ఎంబ్రాయిడరీ కుట్టు పనిని చేస్తూ ఉండేది. అంగన్ వాడీ తనిఖీ నిమిత్తం ఓ మాతాశిశు సంక్షేమ శాఖ అధికారి అక్కడికి వచ్చారు. లక్ష్మి చేస్తున్న అందమైన అల్లికలను పరిశీలించారు. అనంతరం ఆయన లక్ష్మితో మాట్లాడి ఆమె ప్రతిభ గురించి చేనేత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. చేనేత చేతివృత్తుల అధికారి సత్యవతి ఎల్లమ్మతండాకు వచ్చి, లక్ష్మి చేస్తున్న ఎంబ్రాయిడరీ వర్క్‌ను చూసి ఈ పనిని మరికొంత మంది కలిసి చేస్తే తమ సంస్థ నుండి ప్రత్యేక తర్ఫీదు ఇస్తామని చెప్పారు. అలా 2000 సంవత్సరంలో పది మంది జట్టుగా ఏర్పడిన గిరిజన మహిళలు సంప్రదాయ కుట్లు, అల్లికలు నేర్చుకున్నారు. వారందరికీ కేతావత్ లక్ష్మి కో–ఆర్డి్డనేటర్గా వ్యవహరించింది. ఇప్పుడు ఆ తండాలో 200 మందికి పైగా గిరిజన మహిళలు సంప్రదాయ అల్లికలు, కుట్లు నేర్చుకుని పనులను చురుగ్గా చేస్తున్నారు. వందకు చేరువై ఏమాత్రం చదువురాని అంగన్వాడీ ఆయా లక్ష్మి ఎల్లమ్మ తండా మహిళలకే కాకుండా బోడకొండ, కొర్రంతండా, లోయపల్లి, అంభోత్ తండా గ్రామాల్లో దాదాపు వంద మంది మహిళలకు అల్లికలపై తర్ఫీదు ఇస్తోంది. ప్రభుత్వం ప్రత్యేక భవన సదుపాయం కల్పించింది. వీరి నైపుణ్యం గురించి తెలుసుకున్న రాష్ట్ర గోల్కొండ చేనేత సంస్థ 75 మంది మహిళలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు అందిస్తోంది. ఇక్కడ తయారు చేసిన వస్తువులకు హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాలలోనూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, లక్ష్మి 2006లో ఇరాన్, 2012లో లండన్ దేశాలు వెళ్లి అక్కడ తమ బృందం తయారు చేసిన డిజైనింగ్ దుస్తులను విక్రయించింది. ఎల్లమ్మ తండా మహిళల హస్తకళా నైపుణ్యం నగరంలోని ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నత విద్యార్థులను తండాకు రప్పించేలా చేసింది. హైదరాబాద్ నుంచి ప్రతియేటా ఐదారు బృందాలుగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేసే విద్యార్థులు ఎల్లమ్మతండా మహిళల వద్ద డిజైనింగ్ మెళకువలు నేర్చుకోవడానికి వస్తున్నారు! నగరంలో వివిధ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాలల నుండి విద్యార్థులు తండాకు వచ్చి ఇక్కడి మహిళల సహకారం తీసుకోవడంతో ‘‘మా తండా వాసుల ఎంబ్రాయిడరీ కళ బయటి ప్రపంచానికి తెలియడం, ఆదరణ లభించడం మాకు ఆనందంగా, ఎంతో గర్వంగా ఉంది’ అంటున్నారు తండా మహిళలు. భరోసాతో భేషుగ్గా తండాల మహిళలు చేస్తున్న అల్లికలు, చేతి కుట్ల గురించి తెలుసుకున్న గోల్కొండ చేనేత సంస్థ రాష్ట్ర డైరెక్టర్ శైలజా రామయ్యర్ గిరిజన మహిళలతో మాట్లాడి ఢిల్లీ నుండి దారాలు, అల్లికలకు సంబంధించిన మెటీరియల్‌ను అందించారు. 2017 సెప్టెంబర్ 17న కేంద్ర చేనేత (చేతివృత్తుల) శాఖ ముఖ్య కార్యదర్శి అనంతకుమార్ సింగ్ కూడా ఎల్లమ్మతండాకు వచ్చి గిరిజనుల చేతి అల్లికల గురించి తెలుసుకున్నారు. వారికి తగినన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్వయంగా తర్ఫీదు ఇక్కడి గిరిజన మహిళలు అల్లికలు, డిజైనింగ్ పై మాకు ప్రత్యేకంగా తర్పీదు ఇస్తున్నారు. తరగతి గదుల్లో, కంఫ్యూటర్లో విని, చూసి నేర్చుకుంటున్నప్పటికీ, ఈ తండా మహిళలు నేర్పే విద్య మాకెంతో ప్రయోజనకరంగా ఉంది. – అమ్రిత, ‘నిఫ్ట్’ విద్యార్థిని, హైటెక్ సిటీ మెళకువ నేర్చుకుంటున్నాం హైదరాబాద్ నుండి ఎల్లమ్మతండాకు వచ్చి అల్లికలు, డిజైనింగ్ దుస్తులపై ఎలా చేయాలో తెలుసుకుంటున్నాం. రంగు, రంగుల దారాల మార్పులు చేయడం వంటి మెళకువలు వీళ్లు మాకు నేర్పిస్తున్నారు. మాకు ఇష్టమైన డిజైన్‌లో దుస్తులను అందంగా రూపొందించి చూపుతున్నారు. – జాహీ, ఫైనల్ ఇయర్, ‘నిఫ్ట్’ ఇక్కడ ప్రాక్టికల్‌గా చూస్తున్నాం ఒక్కోసారి ప్రొఫెసర్లు చెప్పిన ఆర్ట్‌ఫామ్ అర్ధం కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సంప్రదాయ కళలను నేరుగా చూస్తే వాటి మూలాలను కూడా మన డిజైన్‌లో పొందుపర్చవచ్చు. ఎల్లమ్మతండాలో మహిళల ద్వారా మేం ఆ కళను నేర్చుకుంటున్నాం. – శుభం చేరీషీయా, ‘నిఫ్ట్’ మరింత సహకారం అవసరం మా తండాలో ప్రతి ఇంటిలో మహిళలు దుస్తులపై అందమైన అల్లికలు చేయడంలో నిష్ణాతులు. ఎవరికి వారే సాటి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మా కళకు మరింత ప్రోత్సాహం అందించాలి. తండాలో తయారు చేసిన దుస్తులు, వస్తువులకు ఇక్కడి నుండే మార్కెటింగ్ కల్పించి, బ్రాండ్‌గా గుర్తించాలి. దీని వల్ల తండా మహిళల ఉపాధి మెరుగుపడుతుంది. దీంతో మరింతమంది ఈ కళను అందుకోవడానికి ఉత్సాహం చూపుతారు. – కేతావత్ లక్ష్మి, ఎల్లమ్మతండా – యాట మహేష్, సాక్షి, మంచాల -
వాకపల్లి పదేళ్లుగా పోరుపల్లి
కొన్ని దారుణాలపై.. సమరశంఖం పూరిస్తే సరిపోదు. విప్లవ నినాదాలిస్తే సరిపోదు. పిడికిలి బిగిస్తే సరిపోదు. ప్రసంగాలు వినిపిస్తే సరిపోదు. మరేం చేయాలి? అక్షరాస్త్రాలుసంధించాలి. ప్రొఫెసర్ మల్లీశ్వరి అదే పని చేస్తున్నారు. వాకపల్లి గిరిజన మహిళల మీద జరిగిన దాడి గురించిన కథనాలు చదవడం, వినడమే కాకుండా వాస్తవిక పరిస్థితులను పరిశీలించడానికి వాకపల్లి వెళ్లారు ప్రొఫెసర్ కె.ఎన్.మల్లీశ్వరి. ఆ పరిశీలనను సాక్షి పత్రికలో వ్యాసంగా రాశారు. ఆ వ్యాసానికి ఇటీవలే ప్రతిష్ఠాత్మకమైన లాడ్లి మీడియా అవార్డు అందుకున్నారు. ‘వాకపల్లి మహిళల పోరాటానికి సామాజిక మద్దతు తగినంతగా లభించడం లేదు. ఇతర రాష్ట్రాలకు, జాతీయ స్థాయి పాత్రికేయుల దృష్టికి విషయాన్ని చేరవేయాలనే సంకల్పంతోనే ఈ వ్యాసాన్ని అవార్డుకు పంపించాను’ అంటారు మళ్లీశ్వరి. సామాజిక ఉద్యమకారిణి ఏలూరు దగ్గర కొక్కిరపాడులో పుట్టిన మల్లీశ్వరి ప్రస్తుతం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) జాతీయ కార్యదర్శి. సామాజికాంశాల మీద రచనలు చేస్తారు. అందుకోసం స్వయంగా ఆయా ప్రదేశాల్లో పర్యటించి పరిస్థితులను అవగాహన చేసుకుని వ్యాసాలు రాస్తుంటారు. అలా గోదావరి ఆక్వా ఫుడ్ పార్క్, పోలవరం నిర్వాసితులు, గంగవరం పోర్టు అంశాల మీద కూడా వ్యాసాలు రాశారు. ఆంధ్రా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్న సమయంలో సారా ఉద్యమం ఊపందుకుంది. అప్పుడు యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులను సమీకరించి ఉద్యమానికి మద్దతు తెలిపారు. అలాగే యూనివర్సిటీలలో పిహెచ్డి చేస్తున్న అమ్మాయిలకు ఎదురయ్యే బయటకు కనిపించని లైంగిక వేధింపుల మీద గళం విప్పారు. వేధింపులు తీవ్రమైతే పోరాడటానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాన్ని గట్టిగా ఇవ్వగలిగారు మల్లీశ్వరి. ‘‘నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు సమాజం మీద స్త్రీవాద ఉద్యమాలతోపాటు రచయిత్రుల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆ ప్రభావంతోనే రచయిత్రులను ఒక వేదిక మీదకు తీసుకురావడానికి ‘మనలో మనం’ అని ఒక ప్రయత్నం చేశాను. అది నేను ఊహించనంత విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా (సమైక్యాంధ్రప్రదేశ్) దాదాపు రెండు వందల మంది మహిళలు హాజరయ్యారు. దాంతో కొత్త ఉత్సాహం వచ్చింది. భావసారూప్యం కలిగిన వారితో కలిసి ప్రరవే ని ప్రారంభించాం. తన వృత్తి పాఠాలు చెప్పడం, ప్రవృత్తి సామాజికాంశాల మీద స్పందించడం’’ అంటారు మల్లీశ్వరి. ‘వాకపల్లి’ పై అక్షరయుద్ధం ‘‘నా తొలి రచన మెర్సీకిల్లింగ్ కథాంశంగా రాసిన ‘మరణం నా నేస్తం’. 1991లో రాశాను. ఆ తర్వాత కూడా రాస్తూనే ఉన్నాను. కానీ అత్యంత సంతృప్తినిస్తున్న రచన మాత్రం ‘నీల’ మాత్రమే. నీల కోసం ఐదారేళ్లు సమాజాన్ని అధ్యయనం చేశాను. అందుకే అంత సంతృప్తి కలుగుతోంది. వాకపల్లి మహిళల పోరాటానికి నా వంతు మద్దతుగా వ్యాసాలు రాస్తున్నాను. వారికి న్యాయం జరిగే వరకు రాస్తూనే ఉంటాను. సోషల్ యాక్టివిస్టు అంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఆవేశంగా స్పందించి నాలుగైదు రోజుల తర్వాత ఆ సంగతి మర్చిపోవడం కాదు. ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు అది పూర్తయ్యే వరకు ఆ అంశాన్ని వదలకూడదు. నేనదే నమ్ముతాను. వాకపల్లి సంఘటనను జాతీయ వేదిక మీదకు తీసుకెళ్లడం ద్వారా ఆ మహిళలకు మరికొంత మంది మద్దతు లభిస్తుంది. పత్రికల్లో వీలయినన్ని ఎక్కువ వ్యాసాలు వస్తుంటే కోర్టు తీర్పు త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆ మహిళల్లో ఇద్దరు చనిపోయారు. ఒకామె పాము కాటుతో మరణించగా, మరొకామెది సహజ మరణం. తీర్పు ఆలస్యంగా వస్తే అది న్యాయమైనా సరే, వారికి జరిగేది అన్యాయమే. అందుకే న్యాయపోరాటంలో వాకపల్లి గిరిజన మహిళలకు అండగా అక్షరపోరాటం చేస్తున్నాను’’ అని తెలిపారు మల్లీశ్వరి. ఆగని పోరాటం విశాఖ ఏజెన్సీలో మాడుగుల మండలంలో ఉంది వాకపల్లి గ్రామం. గడచిన పదేళ్ల వరకు ఆ పేరుతో ఒక గ్రామం ఉందనే సంగతి కూడా బయటి ప్రపంచానికి తెలియదు. అయితే పదేళ్ల నుంచి వాకపల్లి పేరు వినని తెలుగు వాళ్లు లేరు. ఇప్పటికీ వాకపల్లి పేరు తరచూ వినిపిస్తూనే ఉంది. అప్పటి దురాగతం తరచూ గుర్తుకు వస్తూనే ఉంది. ఏజెన్సీ ఏరియా దాటి బయటకు రాకుండా బతుకులను వెళ్లబారుస్తున్న అడవి తల్లులు న్యాయం కోసం పదేళ్లుగా కోర్టుల మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. న్యాయాన్ని అర్థ్ధిస్తూనే వారిలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన తొమ్మిది మంది.. పోయిన తమవారి తరఫున కూడా పోరాడుతున్నారు. కల్మషం తెలియని గిరిజనానికి జరిగిన ఆ అన్యాయాన్ని చెప్పడానికి మాటలు రావు, రాయడానికి పేజీలు చాలవు. (నిందితులను అరెస్టు చేయాలని గళమెత్తిన మహిళాలోకం (ఫైల్ ఫొటో)) పాశవికంగా లైంగిక దాడి కొందు, కొండదొరలు నివసించే గ్రామం వాకపల్లి. పోడు వ్యవసాయం చేసి జీవిస్తారు. రాగి, పసుపు, వరి పండిస్తారు. 2007, ఆగస్టు 20 వ తేదీకి ముందు రోజు వరకు అది అత్యంత ప్రశాంతమైన గ్రామం. ఆ రోజు ఉదయం ఆరు గంటల సమయం. మగవాళ్లు అప్పటికే పొలాల్లోకి వెళ్లిపోయారు. ఆడవాళ్లు ఇంటి పనుల్లో ఉన్నారు. ఇంటి పనులు చేసుకుని, అన్నం వండుకుని వాళ్లు కూడా పొలానికి పోవాలి. సరిగ్గా ఆ సమయంలో హటాత్తుగా ఊరిమీదకొచ్చి పడింది యాంటీ–నక్సల్స్ గ్రేహౌండ్స్ పోలీస్ బృందం. మొత్తం 21 మంది ఉన్నారు! ఊరిలోని ఆడవాళ్ల మీద లైంగికదాడికి పాల్పడ్డారు. అంతా 20 నుంచి 30 ఏళ్ల లోపు మహిళలే. పదకొండు మంది మహిళలు ఆ రోజు పోలీసు పైశాచికత్వానికి బలయ్యారు. కొందరు పోలీసులు గుడిసెల్లో దూరారు, మరికొందరు మహిళలను పసుపు పొలాల్లోకి లాక్కువెళ్లారు. వాళ్ల కణతలకి తుపాకీ గురిపెట్టి, వాళ్లను నిస్సహాయులను చేసి పాశవికంగా లైంగిక దాడి చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాజారావుకి సమాచారం తెలిసిన వెంటనే ఆయన పాడేరు నుంచి పాత్రికేయులను వెంటబెట్టుకుని మధ్యాహ్నం మూడింటికి వాకపల్లికి చేరుకున్నారు. బాధిత మహిళలు ఎమ్మెల్యేతో కలిసి పాడేరు సబ్‌కలెక్టర్‌ని కలిసి భోరున విలపిస్తూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. గ్యాంగ్‌రేప్, ఎస్సి ఎస్టి (ప్రివెన్షన్ ఆఫ్) అట్రాసిటీస్ యాక్ట్‌లతో కేసు రిజిస్టర్ అయింది. సామూహిక క్లీన్ చిట్! అప్పటి నుంచి ఆ గిరిజన మహిళలు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సిబి సిఐడీ విచారణలో ఆ పోలీసులకు క్లీన్ చిట్ రావడంతో సమాజం ఇంత భయంకరంగా ఉంటుందా అని తల్లడిల్లిపోయారు. మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించారు. ‘‘పేద గిరిజన మహిళలకు జరిగిన అన్యాయాన్ని.. అన్యాయంగా గుర్తించదా సభ్య సమాజం? విచారణ చేసే అధికారులకు ఆ నిస్సహాయులైన మహిళల దీన వదనాల్లో తమింటి ఆడబిడ్డ కనిపించదో ఏమో. అలా కనిపిస్తే అత్యంత పాశవికంగా లైంగిక దాడికి పాల్పడిన నిందితులకు క్లీన్ చిట్ ఎందుకు వస్తుంది?’’ అని నివ్వెరపోయి, ఆ అడవిబిడ్డలు న్యాయం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. తమ ఆవేదన న్యాయదేవత చెవులకు చేరేలా చెప్పడానికి తమకు అంతంత పెద్ద మాటలు రాకపోవచ్చు, కానీ ఆ దేవత ఒక్కసారి కళ్ల గంతలు విప్పి తమ కళ్లలో సుడులు తిరుగుతున్న ఆవేదనను చూడగలిగితే... క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా తీర్పునిస్తుందనే ఆశతో పోరాడుతున్నారు ఆ గిరిజన మహిళలు. – వాకా మంజులారెడ్డి -
ఇంటికే ఆరోగ్య సేవకులు!
గర్భం దాల్చిన తర్వాత పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న గిరిజన మహిళలు 15 శాతమే. 81.8 శాతం గర్భిణులు ఒక్కసారే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. 27 శాతం మంది ఇప్పటికీ ఇళ్లల్లోనే పురుడు పోసుకుంటున్నారు. ప్రసవానంతర ఆరోగ్య సేవలు అందుకుంటున్న ఎస్టీ మహిళలు 37 శాతమే.. ఇవీ గిరిజనుల ఆరోగ్యంపై నిపుణులు కమిటీ వెలువరించిన నివేదికలోని బాధాకరమైన విషయాలు. గ్రామీణ వైద్య నిపుణుడు డాక్టర్ అభయ్ బంగ్ నేతృత్వంలో 2013లో ఆరోగ్య, గిరిజన శాఖలు ఏర్పాటు ఈ కమిటీ గత ఆగస్టులో నివేదిక సమర్పించింది. ‘ట్రైబల్ హెల్త్ ఇన్ ఇండియా’ శీర్షికన వెలువడ్డ ఈ నివేదిక ప్రకారం ఆరోగ్య కార్యకర్తలు స్నేహపూర్వకంగా ఉండక పోవడం, భాషను, వారు చెబుతున్న విషయాలను అర్థం చేసుకోలేకపోవడం వంటి అంశాలు ఎస్టీ మహిళలను ఆరోగ్య కేంద్రాలకు దూరంగా ఉంచుతున్నాయి. గర్భిణులు ఎక్కడ కోరుకుంటే అక్కడ ప్రసవానికి అనుమతించాలని సూచించింది. తల్లీ బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం వారి ఇళ్లకు వెళ్లి సేవలు అందించే సుశిక్షిత ఆరోగ్య కార్యకర్తల్ని తయారుచేయాలని పేర్కొంది. స్థానిక గిరిజనుల్ని ఆరోగ్య సేవకుల్లో భాగం చేయడం ద్వారా మరణాల రేటు తగ్గించొచ్చనిపేర్కొంది. 65శాతం మహిళల్లో రక్తహీనత చిన్న వయసులోనే పెళ్లిళ్లు, తల్లులు కావడం, తక్కువ బరువు, రక్తహీనత తల్లుల మరణాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయి. ♦ దాదాపు 50 శాతం మంది కిశోర బాలికలు (15–19 వయోశ్రేణి) తక్కువ బరువున్నారు. మూడో విడత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 15–49 వయసున్న మహిళల్లో 65శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 6–59 నెలల వయసున్న పిల్లల్లోఇతరుల (64శాతం) కంటే ఎక్కువగా ఎస్టీ పిల్లలు (77శాతం) రక్తహీనత బారిన పడుతున్నారు. ♦ కుళాయి నీరు 10.7 శాతం మంది గిరిజనులకే అందుబాటులో ఉంది. ప్రతి నలుగురిలో ముగ్గురు (74.7శాతం) మరుగు దొడ్ల వాడకానికి దూరంగా ఉన్నారు. ఆహార భద్రత కల్పించడం, స్థానికంగా దొరికే ఆహారంపై, ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడం, సమీకృత శిశు అభివృద్ధి పథకాన్ని (ఐసీడీఎస్) బలోపేతం చేయడం, వ్యాధుల నివారణ, చికిత్సపై దృష్టి పెట్టడం ద్వారా ఎస్టీ స్త్రీలు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించాలని సూచించింది. 26 ఏళ్లలో సగం.. నాలుగు విడతల జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల(1988–2014) ప్రకారం 26 ఏళ్ల కాలంలో గిరిజన శిశు మరణాల రేటు (ప్రతి వెయ్యి జననాలకు) 90 నుంచి 44కి తగ్గిందని, ఇది కచ్చితంగా చెప్పుకోదగ్గ విజయమేననీ కమిటీ అభిప్రాయపడింది. నివేదిక ప్రకారం ఇదే కాలంలో ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు 135 (1988) నుంచి 57 (2014)కు తగ్గింది. అయితే ఇతరులతో పోల్చుకుంటే గిరిజన పిల్లల మరణాల రేటు ఎక్కువే. 1988లో మిగిలిన సామాజిక తరగతులకు, ఎస్టీలకు పిల్లల మరణాలపరంగా ఉన్న అంతరం 21 శాతం. 2014 నాటికి అది 48 శాతానికి పెరిగింది. 44 శాతం మంది ఎస్టీ పిల్లలు వ్యాధి నిరోధక టీకాలకు దూరమవుతుండటం మరో ఆందోళనకరమైన విషయం. -
గిరిజన మహిళపై టీడీపీ నేతల దాడి
వంగర: మండల పరిధి మగ్గూరు గ్రామంలో టీడీపీ వర్గీయులు తమ ప్రతాపం చూపారు. మహిళ అనే కనికరం లేకుండా రెచ్చిపోయారు. వైఎస్సార్ సీపీకి చెందిన గిరిజన మహిళ తూడి అప్పలనర్సమ్మను కులం పేరుతో దూషించడంతో పాటు దాడికి తెగబడ్డారు. గ్రామానికి చెందిన సర్పంచ్ గంటా ఖగేంద్రనాయుడు, మరడాన సత్యంనాయుడు, చింత అప్పలనాయుడు, గంటా గాయత్రినాయుడు తనపై దాడికి పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలం క్రితం అప్పలనర్సమ్మకు చెందిన స్థలంలో రోడ్డు నిర్మించారు. దీనికి ఆనుకుని ఉన్న మట్టి, చెత్త తొలగించాలని సర్పంచ్‌కు చాలాసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. శనివారం కూడా ఈ విషయంపై సర్పంచ్‌కు విన్నవించారు. ‘నాకే గట్టిగా చెబుతావా? నన్నే నిలదీస్తావా?’ అంటూ తనపై సర్పంచ్ దాడికి పాల్పడ్డారని ఆమె వాపోయారు. ఇంటి నుంచి సమీపంలో ఉన్న పెద్దింటి అప్పలనాయుడు ఇంటి వరకు ఈడ్చుకుంటూ వెళ్లి కొట్టి గాయపర్చారని వాపోయారు. ఈ ఘటనలో అప్పలనర్సమ్మ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. తన భర్త ఓనె అగ్రహారం గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారని, ఆయన మరణించాక మగ్గూరులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నానని తెలిపారు. తనపై ఇటువంటి దాడులు అన్యాయమని పోలీసుల ఎదుట వాపోయారు. అప్పలనర్సమ్మపై దాడి ఘటన తెలుసుకున్న సంగాం, తలగాం, శ్రీహరిపురం, పటువర్ధనం, మగ్గూరు గ్రామాలకు చెందిన గిరిజనులు వంగర పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడే బైఠాయించారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తూడి అప్పలనర్సమ్మను కులం పేరుతో దూషించిన నలుగురు వ్యక్తులపై అట్రాసిటీ కేసు నమోదుచేశామని ఎస్సై కోట వెంకటేష్ తెలిపారు. మహిళలపై దాడులు ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. అప్పలనర్సమ్మను రాజాం సీహెచ్‌సీకి వైద్యం కోసం తరలించామన్నారు. అప్పలనర్సమ్మపై కేసు మగ్గూరు గిరిజనులు తమపై దాడికి పాల్పడ్డారని సర్పంచ్ గంటా ఖగేంద్రనాయుడు వంగర ఎస్సై కు ఫిర్యాదుచేశారు. గిరిజన మహిళతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేయనున్నామని ఎస్సై తెలిపారు. వైఎస్సార్ సీపీ నేత, గిరిజన మహిళ తూడి అప్పలనర్సమ్మపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడటం దాష్టీకమని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శులు ఉత్తరావెల్లి సురేష్‌ముఖర్జీ, ఉదయాన మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు కరణం సుదర్శనరావు విమర్శించారు. -
వారం రోజులుగా గిరిజన మహిళ ప్రసవ వేదన
అశ్వారావుపేట: ‘అన్ని సేవలు ఉచితంగా అందిస్తున్నాం. కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. సర్కారు ఆస్పత్రుల్లో ప్రసవిస్తే నగదు ప్రోత్సాహమిస్తున్నాం.’అని ప్రభుత్వం డాంబికాలు పలుకుతోంది. కానీ ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లేదు. ఇందుకు నిదర్శనమే ఈ గిరిజన మహిళ ప్రసవ వేదన.. అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన గిరిజన మహిళ సోయం బేబీరాణి తొలిసూరు కాన్పు కోసం వారం క్రితం అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అక్కడ వైద్యం అందించలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించాలని సూచించారు. భద్రాచలంలో కూడా ఇదే దుస్థితి ఎదురైంది. అక్కడి నుంచి కొత్తగూడెం, ఆ తర్వాత ఖమ్మం ఆస్పత్రులకు తిరిగారు. కానీ ఎక్కడా వైద్యం అందలేదు. వరంగల్ లేదా హైదరాబాద్ వెళ్లాలని ఖమ్మం వైద్యులు సూచించారు. తీవ్ర రక్తహీనత, గుండె సంబంధ వ్యాధి ఉందని, తాము వైద్యం చేయలేమని ఎక్కడికక్కడే తేల్చేశారు. కనీసం అంబులెన్స్ కూడా ఇవ్వలేదు. చేతిలో చిల్లిగవ్వ లేని నిరుపేద గిరిజన కుటుంబం కావడంతో దేవుడిపై భారం వేసి స్వగ్రామమైన ఊట్లపల్లికి తిరిగి వచ్చేశారు. విషయం తెలిసిన గ్రామస్తులు చందాలు పోగుచేసి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఆస్పత్రులను ఆశ్రయించారు. అక్కడా చేర్చుకోలేమని తేల్చేయడంతో ఆదివారం అశ్వారావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడా అదే పరిస్థితి. పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. సోమవారం రాత్రి 2 గంట ల సమయంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైదరాబాద్ వెళ్లాలని అక్కడి వైద్యులు బయటకు పంపేశారు. చేతిలో రూ.500కు మించి లేవు. ఇంటికి రాలేరు.. వరంగల్ ఆస్పత్రిలో వైద్యం చేయబోమన్నారు. హైదరాబాదు ఎలా వెళ్లాలో.. తెలియని గిరిజనులు దారి ఖర్చులకు డబ్బులు లేక ఊరు కాని ఊర్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు నిలిచిపోయారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేటకు చెందిన జ్ఞానదృష్టి ప్రసాద్ తన సోదరుడు, వరంగల్ జిల్లాలో సీఐగా పనిచేస్తున్న రామకృష్ణకు చెప్పగా.. ఆయన ఖమ్మంలో ఉన్నప్పటికీ తనకు తెలిసిన వారి ద్వారా రూ.1000 ఇప్పించడంతో ఇంటికి తిరిగి వచ్చారు. మళ్లీ బుధవారం గ్రామస్తుల వద్ద కొంత ఆర్థిక సహాయాన్ని పొంది గర్భిణిని తీసుకుని హైదరాబాదుకు పయనం అయ్యారు. పేరుకే గిరిజన నియోజకవర్గ కేంద్రంలో సీమాంక్ సెంటర్, జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, భద్రాచలంలో పెద్దాసుపత్రి.. ఓ గిరిజన మహిళకు సురక్షితంగా పురుడు పోయలేని ఈ వ్యవస్థ ఎవరి కోసం..? నెలలు నిండే వరకు గర్భిణికి పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేయని ఏఎన్ఎం, పీహెచ్సీ వ్యవస్థలు ఏం చేస్తున్నాయనే ప్రశ్నలు ఆదివాసీ గిరిజనుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గ కేంద్రంలో గిరిజనులకు వైద్యం అందట్లేదంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
పీహెచ్సీ ఎదుట మహిళ ప్రసవం
మహదేవపూర్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఓ గిరిజన మహిళ పీహెచ్సీ ఎదుట రోడ్డుపైన ప్రసవించింది. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి పీహెచ్సీ ఎదుట మంగళవారం జరిగింది. ప్రస్తుతం మహదేవపూర్ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో తల్లీపాప చికిత్స పొందుతున్నారు. బాధితురాలు సమ్మక్క భర్త ఎర్రయ్య కథనం ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కిష్టరావుపేట గ్రామానికి చెందిన గిరిజన మహిళ సమ్మక్క ఏడు నెలల గర్భిణి. రోజు మాదిరిగానే కూలీ పనికి వెళ్లింది. పని చేసే చోటనే సమ్మక్కకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో తోటి కూలీలు, భర్త సమ్మక్కను సమీపంలోని అంబట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పీహెచ్సీలో ఉండాల్సిన ఇద్దరు డాక్టర్లు లేరు. దీంతో సిబ్బంది కూడా విధులకు ఎగనామం పెట్టారు. స్టాఫ్ నర్స్‌స్రవంతి సెలవులో ఉన్నారు. దీంతో పురిటి నొప్పులతో వచ్చిన సమ్మక్కకు వైద్య సేవలు అందలేదు. దీంతో అక్కడి నుంచి మహదేవపూర్ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సమ్మక్కను పీహెచ్సీ ముందుకు తీసుకురాగా రోడ్డుపైనే ప్రసవించింది. చికిత్స కోసం మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా విధులకు డుమ్మా కొట్టిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. -
లక్ష్మీ మందరకు సరస్వతీ కటాక్షం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ బ్లాక్ మఝిగుడ గ్రామానికి చెందిన లక్ష్మీ మందర్ అక్షరజ్ఞాన మెరుగని ఆదివాసీ మహిళ. అయితేనేమి ఆశు కవయిత్రిగా ఆమెకు ప్రత్యేకత సాధించింది. గంటల తరబడి అనర్గళంగా, ఆశువుగా పాడగలిగే సామర్థ్యం ఆమె కలిగి ఉంది. ఆశువుగా ప్రకృతి వర్ణనలో ఆమెకు ఆమెసాటి. ఆదివాసీ జనజీవన విధివిధానాలు, సంప్రదాయ పండగలను ఇతి వృత్తాలుగా చేసి పాటలుగా మలిచి అక్కడికక్కడే ఆశువుగా పాడుతూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆదివాసీ జానపద గీతాలాపనకు ఆమె పెట్టింది పేరు. ఆదివాసులు ఆమెను కారణజన్మురాలుగా చూస్తారు. తన నిజ జీవితంలో ఎదురొచ్చిన సమస్యలను లెక్కచేయక, అలుపెరుగని రీతిలో పాటలు పాడడం ఆమె నైజం. ఆశువుగా పాడడం తనకు భగవంతుడిచ్చిన వరమని, కొండ కోనల్లో కర్రలు సేకరిస్తున్నప్పుడు, పశువులను కాస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, కడకు పరుల పొలాల్లో కూలి పని చేస్తున్నప్పుడు తన నోట పాటలు జాలువారుతాయని, తాను ఏమాత్రం మౌనంగా ఉన్నా తన తోటివారు పాడమని పురమాయించడం పరిపాటి అని తన పాటల ఒరవడిని వివరించింది. గృహయోగం లేదు తన భర్త పేదవాడై దారిద్య్రంలో ఉన్నప్పటికీ, కన్న పిల్లలు పెద్దవారై ఎవరంతట వారు బతుకుతున్నారని, ప్రస్తుతం భర్తతో పాటు ఏ పూటకాపూట కూలి చేస్తూ బతుకు బండి లాగిస్తున్నట్లు ఆమె చెప్పింది. ఉండేందుకు సరైన ఇల్లు లేక ఒక పూరి గుడిసెలో కాపురం చేస్తున్నట్లు చెప్పింది. గ్రామంలో అనేక మంది ఇందిరా ఆవాజ్ యోజన పథకంలో ఇళ్లను పొందారని, తనకు మాత్రం మంచి ఇంట్లో ఉండే యోగాన్ని భగవంతుడు కలిగించలేదని వాపోతోంది. ప్రభుత్వం తనకు అందిస్తున్న రూ.300 వృద్ధాప్య పింఛన్ తనకు ప్రస్తుతం ఆధారమని చెప్పింది. ఇటీవల ఈ నెల 7,8 తేదీలలో కొరాపుట్‌లో జరిగిన జాతీయ స్థాయి కళింగ సాహిత్య ఉత్సవంలో తన ప్రతిభను మెచ్చిన పెద్దపెద్దోళ్లందరు తనకు చేసిన సన్మానం తన జీవితానికి లభించిన పరమార్థమని చెప్పింది. సభికుల కోరికపై ఆమె తనకు జరిగిన సన్మానాన్ని ఆశువుగా పాడి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపింది. -
సహజీవనం చేసి చంపేశాడు
ఖానాపూర్: సహజీవనం సాగిస్తున్న వ్యక్తే ఆ మహిళ పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో క్షణికావేశానికి లోనై నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఖానాపూర్ సీఐ ఆకుల అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలం పెద్దూరుకు చెందిన టేకం బుజ్జిబాయి(43)కు ఇరవై ఏళ్ల క్రితం రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది. గత కొన్నేళ్లుగా భర్తతో దూరంగా ఉంటున్న బుజ్జిబాయికి మండల కేంద్రంలోని ఓ వసతిగృహంలో పనిచేసే టేకం బాపురావుతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆరు నె లల క్రితం ఉపాధి నిమిత్తం ఖానాపూర్లోని మండలం రాజురా గ్రామంలోని బుజ్జిబాయి సోదరుడు ఆ త్రం గంగారాం వద్దకు వెళ్లారు. గంగారాం వారిని గ్రామానికి చెందిన గోగు రాజలింగు వద్ద మొక్కజొన్న కావలి పనికి కుదిర్చాడు. గత నెల 24న బుజ్జిబాయి, బాపురావు మొక్కజొన్న చేను వద్దకు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న బాపురావు బుజ్జిబాయితో గొడవకు ది గాడు. క్షణికావేశంతో పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై దాడి చేశాడు. రక్తం మడుగులో ఉన్న బుజ్జిబాయిని చూసి అక్కడినుంచి పారిపోయాడు. మరునాడు సం ఘటన స్థలానికి వచ్చి చూడగా బుజ్జిబాయి మృతి చెందడం గమనించి పారిపోయాడు. అదే రోజు య జమాని గోగు రాజలింగు బుజ్జిబాయి మృతదేహాన్ని చూశాడు. సోదరులు మల్లేశ్, చిన్నరాజన్న, నారాయణ సహకారంతో మృతదేహాన్ని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పడేశాడు. 29న బుజ్జిబాయి తమ్ముడు గంగారాంకు తెలియజేసి ఇరువురు కలిసి మృతదేహాన్ని అక్కడే ఖననం చేశారు. అనంతరం ఈ నెల 2న కడెంలో ఉండే మరో సోదరుడు ఆత్రం బాపురావు, గంగారాం కలిసి పెంబి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు రాజూరాలోని గంగారాం ఇంటికి వచ్చిన టేకం బాపురావును అరెస్టు చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేశారు. అలాగే సాక్ష్యాధారాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించిన ఆత్రం రాజలింగు, గోగు రాజలింగు, గోగు మల్లేశ్, గోగు చిన్నరాజన్నలపై ఐపీసీ 201 కింద కేసులు నమోదు చేశారు. గోగు నారాయణ పరారీలో ఉండగా, మిగతా నిందితులను రిమాండ్ చేశామని సీఐ అశోక్, ఎస్సై సంజీవ్‌కుమార్ తెలిపారు. -
స్పెషల్ పీపీగా రాజేంద్ర ప్రసాద్ ఓకే
సాక్షి, హైదరాబాద్: గ్రేహౌండ్స్ పోలీసుల అత్యాచార ఘటనకు సంబంధించి నమోదైన కేసులో కింది కోర్టులో వాదనలు వినిపించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విజయవాడకు చెందిన సుంకర రాజేంద్రప్రసాద్ నియామకానికి బాధిత గిరిజన మహిళలు మొగ్గు చూపారు. హైకోర్టు రూపొందించిన ఆరుగురు ప్రముఖ క్రిమినల్ లాయర్ల జాబితా నుంచి సుంకర రాజేంద్రప్రసాద్‌ను ఎంపిక చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్‌ను స్పెషల్ పీపీగా నియమించవచ్చునని బాధిత మహిళల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. రాజేంద్రప్రసాద్ నియామకం పట్ల ప్రభుత్వ న్యాయవాది సైతం ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో స్పెషల్ పీపీ నియామకం విషయంలో రాజేంద్రప్రసాద్ అంగీకారం తెలుసుకోవాలని రిజిస్ట్రా్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఫీజుపై కూడా స్పష్టత తీసుకోవాలని రిజిస్ట్రా్టర్ జనరల్‌కు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
గూడెం గుబాళిస్తోంది..!
సాక్షి, జగిత్యాల: అవి జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రం నుంచి 25 కి.మీల దూరంలో ఉన్న మారుమూల గిరిజన గ్రామం జగన్నాథ్‌పూర్. దానికి ఆనుకునే నాయికపుగూడెం. రెండు దశాబ్దాల క్రితం వరకు నక్సల్స్ సమావేశాలు.. పోలీసుల బూట్ల చప్పుళ్లతో అల్లకల్లోలంగా ఉన్న ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొంది. ఒకప్పుడు పోలీసులంటేనే భయంతో పరుగులు పెట్టిన ఆ గిరిజనులు.. ఇప్పుడు వారికి దోస్తులుగా మారారు. వారితో కష్టసుఖాలను పంచుకుం టున్నారు. తాము అభివృద్ధి చెందడంతో పాటు గ్రామాభివృద్ధికి బాటలు వేసుకున్నారు. ఏడాది క్రితం వరకు కనీసం ఎర్రబస్సు ఎరుగని ఆ ఊరికి రోజుకు రెండుసార్లు పరుగులు పెడుతోంది. ఏళ్ల తరబడి ఏ సదుపాయం లేకుండా ఓ గుడిసెలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలకు కొత్త భవనం వరించింది. ఏటా వర్షాకాలంలో వాగును తలపించే జగన్నాథ్‌పూర్–నాయికపుగూడం 2 కి.మీ రోడ్డుకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెం ఇప్పుడు అభివృద్ధి బాట పడుతున్నాయి. జగిత్యాల జిల్లా ఎస్పీ అనంతశర్మ దత్తత గ్రామంపై ‘సాక్షి’ఫోకస్.. మార్పుదిశగా..! సుమారు 850 మంది ఉన్న జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెంలో 90 శాతం మంది నిరక్షరాస్యులే. కొందరు పత్తి, మిర్చి పండిస్తే.. అనేక మంది వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. సరైన సౌకర్యాలు లేక గిరిజన విద్యార్థులు ప్రాథమిక విద్యకూ నోచుకోలేదు. అయితే ఎస్పీ అనంతశర్మ ఏడాది క్రితమే ఈ గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆదివాసీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. గతేడాది మార్చి 8న గ్రామానికి చెందిన గిరిజన మహిళలతో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకున్న ఎస్పీ వారికి మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. పురుషులతో సమానంగా పోటీ పడేతత్వం గురించి వివరించారు. నాయికపుగూడెంలో రూ. 2 లక్షలతో నిర్మించనున్న పాఠశాలను నిర్మించారు. ప్రస్తుతం గిరిజన విద్యార్ధినీవిద్యార్థులు 23 మంది చదువుకుంటున్నారు. ఎస్పీతో కలసి గిరిజనులు తొలిసారిగా దీపావళి పండుగను జరుపుకున్నారు. జగన్నాథ్‌పూర్ టు హైదరాబాద్ పోలీసులు.. నక్సలైట్ల భయంతో జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెం గిరిజనులు ఏనాడూ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టలేదు. జగిత్యాల వరకు వచ్చిన వారు కొందరు మాత్రమే ఉన్నారు. అడవిలో ఉంటూ జీవనం సాగిస్తున్న వారిని గుర్తించిన ఎస్పీ అనంతశర్మ.. తొలిసారిగా గతేడాది జులై 4న ప్రత్యేకంగా వారి కోసం ‘సందర్శనయాత్ర’ నిర్వహించి ఏకంగా హైదరాబాద్‌కు పంపించారు. గోల్కొండ, చార్మినార్ చరిత్రాత్మక కట్టడాలను చూసిన గిరి జనులు మురిసిపోయారు. అసెంబ్లీ, ట్యాంక్ బండ్, హైటెక్ సిటీ, విమానాశ్రయాలను చూసి ఆనందంతో పరవశించిపోయారు. స్వయం సాధికారిత వైపు అడుగులు గిరిజన మహిళా సాధికారిత కోసం నడుంబిగించిన ఎస్పీ అనంత శర్మ.. స్వయంగా కలకత్తాకు చెందిన నేషనల్ జ్యూట్ బోర్డును సంప్రదించారు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో జగన్నాథ్‌పూర్‌లో జాతీయ జనపనార శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 50 మంది మహిళలకు జనపనారతో వస్తువుల తయారీ, కుట్టుమిషన్లు, అల్లికలు వంటి వాటిపై రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. నెలరోజుల లోపే గిరిజన మహిళలు జనపనారతో లగేజీ బ్యాగు, హ్యాండ్‌బ్యాగ్, మార్కెట్బ్యాగ్, గిఫ్ట్బ్యాగ్, షాపింగ్ బ్యాగ్, మనీపౌచ్, చిల్డ్రన్ హ్యాండ్‌బ్యాగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు తయారు చేయడం మొదలుపెట్టారు. మొత్తం వెయ్యికి పైగా బ్యాగులు తయారు చేసి రూ.60 వేలు సంపాదించారు. జియో నెట్వర్క్ అధికారులతో మాట్లాడి ఆ గిరిజన గ్రామంలో జియో 4జీ సేవలను సైతం ఎస్పీ ప్రారంభించారు. గిరిజనుల్లో చిరునవ్వు చూడాలని.. : అనంతశర్మ జగన్నాథ్‌పూర్.. నాయికపుగూడెం గిరిజనులు ఎంతో అమాయకులు. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవిలో జీవిస్తున్న విషయం తెలుసుకున్న నేను ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న. ముఖ్యంగా మహిళలు ఆర్థి కంగా ఎదిగేలా.. సాధికారిత సాధించేలా వారికి జనపనార శిక్షణ ఇప్పించా. అనతికాలంలో తాము తయారు చేసిన బ్యాగులతో రూ. 60 వేలు సంపాదించుకున్నారు. మహిళల్లో చైతన్యం కోసం సదస్సులు నిర్వహించాం. విజ్ఞానయాత్ర ద్వారా హైదరాబాద్ తిప్పించాం. గూడెంలో రక్షిత తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూ. 5 లక్షలతో మినరల్ ప్లాంట్ కొనుగోలు చేశాం. త్వరలోనే దీన్ని ఇన్స్టాల్ చేస్తాం. పురుషులకు ఇటుకల తయారీకి సంబంధించి మిషనరీ ఇప్పించాలని నిర్ణయించా. ఎంపీ కవిత సహకారంతో జగన్నాథ్పూర్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తా. -
యోగి ఆదిత్యనాథ్‌పై గిరిజన మహిళ కేసు
బిస్వనాథ్(అస్సాం): తనను వివస్త్రను చేసి కొందరు కొడుతున్న చిత్రాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం లోక్‌సభ ఎంపీ రాం ప్రసాద్ సర్మాలు సోషల్ మీడియాలో పోస్టు చేశారని ఆరోపిస్తూ.. అస్సాంకు చెందిన గిరిజన మహిళ లక్ష్మీ ఒరాంగ్ కోర్టును ఆశ్రయించారు. ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద బిస్వనాథ్‌లోని సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. నవంబర్ 24, 2007న ఆల్ ఆదివాసీ స్టూడెంట్స్ అసోషియేషన్ ఆఫ్ అస్సాం ఆందోళన సందర్భంగా కొందరు ఆమెను వివస్త్రగా చేసి దాడికి పాల్పడ్డారు. అయితే ఆ ఫొటోను అస్పష్టంగా మార్చకుండానే జూన్ 13న ఆదిత్యనాథ్ తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేశారని ఆమె ఆరోపించారు. సర్మా కూడా ఆ చిత్రాన్ని పోస్టు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన మేజిస్ట్రేట్ తదుపరి విచారణను జూన్ 22కు వాయిదా వేశారు. కోర్టు వెలుపల ఒరాంగ్ మాట్లాడుతూ.. బీజేపీ తరఫున ఆందోళనలో పాల్గొన్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారని సోషల్ మీడియాలో పోస్టులో ఆదిత్యనాథ్ పేర్కొన్న విషయం నిజం కాదని.. తాను ఏ పార్టీ తరఫున ఆందోళనలో పాల్గొనలేదని చెప్పారు. -
రెండు రోజుల్లో ఇద్దరు మహిళల మృతి
మరో ముగ్గురి పరిస్థితి విషమం ఆందోళనలో గిరిజనులు హుకుంపేట: ఏజెన్సీలో మలేరియా తీవ్రత అధికంగా ఉంది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు గిరిజన మహిళలు మృతిచెందగా.. ప్రతి గ్రామంలో ఒకరిద్దరు వ్యాధితో బాధపడుతున్నారు. తీగలవలస పంచాయతీ మారుమూల ఓలుబెడ్డ గ్రామంలో పదిరోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కిల్లో రంభో (35) అనే ఆదివాసీ మహిళ బుధవారం మృతిచెందింది. సెరిబ్రల్ మలేరియాతో రాప గ్రామానికి చెందిన దేముడమ్మ అనే గిరిజన మహిళ మంగళవారం విశాఖ ఆస్పత్రిలో మృతిచెందగా బుధవారం మృతదేహాన్ని తీసుకువచ్చారు. వేర్వేరు గ్రామాలకు చెందిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని మారుమూల ఓల్డా పంచాయతీ రాప గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రాజారావు భార్య కాండ్రంగి దేముడమ్మ, ఆమె పెద్ద కుమారుడు నాని(13) వారం రోజుల నుంచి తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. స్థానికంగా మందులు వాడినా తగ్గుముఖం పట్టక, వారి పరిస్థితి మరింత విషమంగా మారింది. దీంతో రాజారావు తన భార్య, కుమారుడిని ఆదివారం విశాఖపట్నంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. వారిని ఐసీయూలో ఉంచి వైద్యసేవలు అందిస్తుండగా, దేముడమ్మ మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఆమె కుమారుడు నాని పరిస్థితి కూడా విషమంగా ఉందని బంధువులు చెబుతున్నారు. దేముడమ్మ మృతదేహన్ని బుధవారం రాప గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు జరిపారు. రాప ఎంపీటీసీ సభ్యుడు దర్మయ్యపడాల్, పలువురు సీపీఎం నాయకులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం వ్యక్తంచేశారు. గ్రామాలలో ఉన్నత వైద్యసేవలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే పంచాయతీలోని కాంగుపుట్టు గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి బోయిన విజయలక్ష్మిని పాడేరు ఆస్పత్రికి తరలించగా వైద్యులు సెరిబ్రల్ మలేరియాగా నిర్ధారించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు మంగళవారం తరలించారు. ఇదే ప్రాంతంలోని బొడ్డాపుట్టు పంచాయతీ బందమామిడి గ్రామానికి చెందిన గలుంగుబోయిన గౌరి అరునెలల గర్భవతి కావడంతో ఆమెకు రక్తపరీక్షలు నిర్వహించి మలేరియాగా నిర్ధారించి పాడేరు ఆస్సత్రిలో వైద్యసేవలు కల్పిస్తున్నారు. కొట్నాపల్లి పంచాయతీ బిసాయిపుట్టు గ్రామానికి చెందిన గెమ్మెలి కొండబాబు(25) అనే యువకుని పరిస్థితి విషమంగా ఉండటంతో బుధవారం హుకుంపేట ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యుడు లీలాప్రసాద్ రక్తపరీక్షలు నిర్వహించి సెరిబ్రల్ మలేరియాగా నిర్ధారించారు. మలేరియా సోకిన వెంటనే రక్తపరీక్షలు చేయించుకొని తగిన చికిత్స చేయించుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదని, నిర్లక్ష్యం చేస్తే మలేరియా కాస్తా ప్రాణాంతక సెరిబ్రల్ మలేరియాగా మారి ,పరిస్థితి విషమంగా ఉంటుందని లీలాప్రసాద్ తెలిపారు. హుకుంపేట మండలంలో ఇప్పటికే మూడు నెలల వ్యవధిలో 50 వరకు మలేరియా కేసులు నమోదయ్యాయి. -
స్త్రీ శక్తికి ప్రతీక గిరిజన మహిళ
స్వయం ఉపాధితో జీవనం పేదరికం వల్ల కానని ప్రగతి పాడేరు: స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచే గిరిజన మహిళలు ప్రగతిలో వెనుకబడి ఉన్నారు. నిరక్షరాస్యులైన వేలాదిమంది గిరిజన మహిళలు తమ సంస్కృతి సంప్రదాలయాలకు ప్రతిరూపంగా స్వయం ఉపాధితో కొండకోనల్లో శ్రమైక్య జీవనం సాగిస్తున్నారు. మన్యంలో పురుషులతో సమానంగా నిలిచే గిరి మహిళల పురోభివృద్ధికి పేదరికం, నిరక్ష్యరాస్యత అడ్డుగోడలుగా ఉన్నాయి. దశాబ్దాల కాలంగా మన్యంలో గిరిజన మహిళలకు ఉపాధి రంగంలో అవకాశాలు మెరుగుపడటం లేదు. మైదాన ప్రాంతాలతో పోల్చితే మన్యంలో మహిళాభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగేది అంతంత మాత్రమే! మన్యంలో శ్రమజీవులుగా కనిపించే గిరిజన మహిళలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వపరంగా చిన్నతరహ ,కుటిర పరిశ్రమలు అందుబాటులో లేవు. సాంకేతిక ఉపాధి రంగాల్లో గిరిజన మహిళాలకు తోడ్పటునందించడం కోసం నేటికీ ప్రత్యేక కార్యక్రమాలు అమలు జరగడం లేదు. అక్షరాస్యతకు దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన మహిళలు ఒక శ్రామిక శక్తిగా జీవనం సాగిస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. నేటికీ వీరి జీవనానికి కూలీపనులు, వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ అధారంగా ఉన్నాయి. విద్య అవకాశాలను అందిపుచ్చుకున్న గిరిజన మహిళలు కూడా నేడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందడం లేదు. కాఫీ కార్మికులుగా, అరోగ్యకార్యకర్తలుగా, అంగన్వాడీకార్యకర్తలుగా,హాస్టల్వర్కర్లుగా. జీవనోపాధికి కష్టపడుతూ ఉద్యోగభద్రత లేక శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఉపాధి అవకాశాలు విస్తరించకపోవడం వల్ల ఆర్థికాభివృద్ధి సాధించడంలో గిరిజన మహిళలు వెనుకబడి ఉన్నారు. పేదరికం నుంచి విముక్తి పొందడం లేదు. ఆర్థిక తోడ్పాటు అందించాలి. గిరిజన మహిళలకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రత్యేక పథకాలు చేపట్టాలి. మన్యంలో మహిళల ప్రగతి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. విద్యావకాశాలు విస్తరించడం లేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను కూడా అందుకోలేకపోతున్నారు. మన్యంలో మహిళల కోసం ప్రభుత్వ పథకాలు పరిమితంగానే ఉన్నాయి. ప్రభుత్వ విధానాల వల్ల డ్వాక్రా సంఘాలు వెనుకబడ్డాయి. రుణసౌకర్యాలు అంతంతమాత్రమే. అటవీ ఉత్పత్తులు అంతరించి ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తోడు విద్య, వైద్యం, ఆహార కొరత వంటి సమస్యల వల్ల పేదరికం సమసి పోవడం లేదు. మహిళలకు అవసరమైన రంగాలలో, పురుషులతో సమాన హక్కు కల్పించాలి. -ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి(పాడేరు) -
గిరిజన మహిళ ఆత్మహత్యాయత్నం
► నర్రవాడ పీహెచ్సీలో అందని వైద్యం ► ఉదయగిరిలో మృత్యువుతో ► పోరాడి ఓడిన వైనం ఉదయగిరి : భర్తకు తెలియకుండా అప్పు చేసిన ఓ గిరిజన మహిళ భర్త మందలిస్తాడని భయపడి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రాణాపాయంతో నర్రవాడ పీహెచ్‌సీకి వస్తే వైద్యం అందక మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసింది. వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్టకు తార్కాణంగా మిగిలిన విషాద ఘటన శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. కలిగిరి మండలం నరసారెడ్డిపాళెంకు చెందిన కావేటి నాగరాజు, భార్య చెంచమ్మ(23) నాలుగు నెలల క్రితం పచ్చిశనగ పైరు వద్ద కాపలా కోసం దుత్తలూరు మండలం కమ్మవారిపాళెం వచ్చారు. పొలాల్లోనే కాపలా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చెంచమ్మ భర్తకు తెలియకుండా తన సోదరుడికి వేరే వారి వద్ద కొంత నగదు అప్పు ఇప్పించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు శుక్రవారం ఆమె వద్దకు వచ్చి కూతురిని మందలించారు. ఈ విషయం తెలిస్తే తన భర్త మందలిస్తాడన్న భయంతో పొలానికి పిచికారీ చేసేందుకు తెచ్చిన మోనోక్రొటోపాస్ పురుగు మందు తాగింది. అప్పుడే పొలం నుంచి వచ్చిన భర్త అపస్మారక స్థితిలో ఉన్న భార్యను గుర్తించి సమీపంలో ఉన్న నర్రవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తీసుకువచ్చాడు. అక్కడ ఇద్దరు వైద్యులు ఉండాల్సి ఉన్నా ఒక్కరూ లేరు. ఉన్న ఏఎన్ఎంలు కూడా ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయలేదు. కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లే స్థోమత లేని ఆ గిరిజనులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గంటకుపైగా వైద్యశాల ముందే ప్రాణం కాపాడాలంటూ ప్రాధేయపడ్డారు. కానీ వారిని కనికరించిన వైద్య సిబ్బంది లేరు. అక్కడున్న వారు 108కు సమాచారం అందించడంతో రెండు గంటల ప్రాంతంలో 108 వచ్చింది. వారు సెలైన్ కట్టి వాహనంలో 2.50కి ఉదయగిరి సీహెచ్‌సికి తీసుకుచ్చారు. సీహెచ్‌సీలో వైద్యుడు సంధాని బాషా చికిత్స చేసేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న మరో దంత వైద్యురాలి సాయంతో ఆమె ప్రాణాలు కాపాడేందుకు శతధా ప్రయత్నించారు. అప్పటికే పరిస్థితి విషమించిపోవడంతో 3.45 గంటల ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయింది. సరైన సమయంలో వైద్యం అందక ఆ పేద మహిళ శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. మృతురాలికి ఏడాదిన్నర బిడ్డ ఉంది. సూపర్‌వాస్మోల్ తాగిన మరో మహిళ.. గిరిజన మహిళ ఓవైపు మృత్యువుతో పోరాడుతుండగానే సీతారామపురం మండలం నారాయణప్పపేటకు చెందిన మరో మహిళ షేక్ జానీ సూపర్‌వాస్మోల్ తాగడంతో 108 ద్వారా వైద్యశాలకు తీసుకుచ్చారు. వైద్యుడు ఒక్కరే ఉండటంతో ఇద్దరికీ ఒకేసారి చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. సహాయం చేసేందుకు ఏఎన్‌యంలు ఎవరూ లేకపోవడంతో వైద్యం అందించడంలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఆమెను ఆత్మకూరు ఏరియా వైద్యశాలకు 108 ద్వారా తరలించారు. డ్యూటీలో ఉండవలసిన ఏఎన్ఎం తమ పై అధికారికి సమాచారం ఇవ్వకుండానే విధులకు గైర్హాజరు కావడంపై జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ సుబ్బారావును సాక్షి అడగ్గా విధులపట్ల నిర్లక్ష్యం వహించే వారిని క్షమించేది లేదన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యాధికారి నివేదిక ఇస్తే ఆమెపై చర్య తీసుకుంటామన్నారు. -
ఊరి నుంచి పంపేయండి
మద్యం సేవించిన వాళ్లను తరిమేయండి గిరిజన మహిళలకు గవర్నర్ ఉద్బోధ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మద్యం సేవించి ఇబ్బంది పెడుతున్నవాళ్లను ఊరినుంచి బయటకు పంపించేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గిరిజన మహిళలకు ఉద్బోధ చేశారు. చదువు మానేసి ఖాళీగా ఉన్న పిల్లలతో మాట్లాడొద్దని ఆయన సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న గవర్నర్ దంపతులు సోమవారం సీతంపేటలోని ఐటీడీఏను రెండోరోజు సందర్శించారు. అక్కడకు వచ్చిన గిరిజన మిహ ళల కష్టసుఖాల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ఊళ్లో ఎంతమంది మహిళలుంటున్నారు, ఏ పనులు చేస్తున్నారు, సంపాదన, ఖర్చెం త ఉంటోంది, పిల్లల బాగోగుల కోసం తల్లిదండ్రులు ఏం చేస్తున్నారన్న విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, వాటిల్లో చదువుకుంటున్న పిల్లల సంఖ్య, డ్రాపౌట్స్ తదితర వివరాల్ని ఐటీడీఏ పీఓ జె.వెంకటరావు సమక్షంలో అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు లింకేజీలు, స్వయం శక్తి సంఘాల సభ్యుల పరిస్థితి అంశాపై అధికారులతో ఆరా తీశారు. గవర్నర్ సతీమణి కూడా గిరిజన మహిళలతో మాట్లాడారు. మీ సంపాదన తక్కువగా ఉంటోంది, అందులో కొంత సొమ్మును మీ భర్తలు మద్యానికే తగలేస్తుంటే మీరెలా బాగుపడతారని సీతంపేటకు చెందిన రాధమ్మ అనే మహిళనుద్దేశించి కలెక్టర్, గవర్నర్ అడిగారు. సొమ్ము భద్రపర్చుకుంటే ఆదాయం రెండింతలవుతుందని సూచించారు. -
మంత్రి సభ రభస
- పోడుదారులు, పోలీసుల తోపులాట - తుమ్మల కాన్వాయ్‌ను అడ్డగించిన గిరిజన మహిళలు - గుడితండాలో ఉద్రిక్తత, తోపులాటలో ఒకరి గాయాలు - పోడుదారులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సీపీఎం - పోలీసుల అదుపులో వైఎస్ఆర్సీపీ నేత కుర్సం కారేపల్లి: కారేపల్లి మండలంలో రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పోడుదారుల నుంచి చుక్కెదురైంది. మంగళవారం సాయంత్రం మండలంలోని గుడితండా నుంచి చీమలపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల సభా వేదిక పైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్ మాట్లాడుతుండగా...పోడుదారులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలని నినదిస్తూ సభావేదిక వైపు దూసుకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న ఇల్లందు డీఎస్పీ వీరేశ్వర్‌రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు పోడు దారులను తోసివేశారు. అదేవిధంగా పోడుదారుల పక్షాన వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు కుర్సం సత్యనారాయణ, కారేపల్లి సోసైటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు ఈసాల నాగేశ్వరరావు, సీపీఎం మండల కార్యదర్శి కొండబోయిన నాగేశ్వరరావులు సభావేదిక వద్దకు వినతి పత్రాలతో రావడంతో...పోలీసులు వారిని సైతం నెట్టి వేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో గిరిజన రైతులతో పాటు, మహిళా గిరిజన రైతులు రోడ్లు మాకు వద్దు..పోడు భూములు కావాలని నినదిస్తూ సభా వేదిక వైపు వచ్చేందుకు ప్రయత్నించారు. మహిళా పోలీసులు వారిని అక్కడి నుంచి నెట్టి వేశారు. దీంతో పోలీసులకు , పోడు దారులకు తోపులాట జరిగింది. అంతకుముందు తోపులాటలో పోడుదారుడు భూక్యా హుస్సేన్ కిందపడటంతో కాలికి గాయమైంది. పోలీసుల అదుపులో వైఎస్ఆర్సీపీ నేత పోడుదారుల పక్షాన నిలిచిన వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు కుర్సం సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కుర్సం సత్యనారాయణను వదిలి వేయాలని పోడుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనికి స్పందించిన ఇల్లందు రూరల్ సీఐ రమేష్ మంత్రి కార్యక్రమం పూర్తి అయ్యాక వదిలేస్తామని హామీ ఇస్తూ వారికి సర్ది చెప్పారు. కార్లను అడ్డుకున్న మహిళలు సభ ముగించుకొని వెళుతున్న మంత్రి తుమ్మల కాన్వాయ్‌ను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఇల్లందు రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు వారిని పక్కకు నెట్టి వేశారు. పోడు భూములు లాక్కుంటే...మా బ్రతుకులు ఏం కావాలని, ఇది మీకు న్యాయం కాదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అరుచుకుంటే, కరుచుకుంటే ఏం జరగదు : మంత్రి అరుచుకుంటే, కరుచుకుంటే ఏం జరగదని, ఎవరూ హైరానా పడాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల గుడి తండా సభా వేదిక పై మాట్లాడారు. సమస్యలను పరిష్కరించేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని, రాజకీయాలు చేస్తే సహించమన్నారు. పేదలకు భయపడతాం కానీ, రాజకీయాలకు కాదని, కారేపల్లి మండలంలో గతంలో ఇల్లందు నియోజక వర్గంలో ఉండటం వల్ల ఎలాంటి అభివృద్ధికి నోచుకోక నిర్లక్ష్యానికి గురైందన్నారు. పోడు భూముల విషయమై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, గిరిజన రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. మీరు ఆందోళనలు, రసాభాస చేయాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం పోలంపల్లి నుంచి పేరుపల్లి , గేటుకారేపల్లి నుంచి గంగారం తండా గ్రామాల్లో బీటీ రోడ్డు నిర్మాణాలకు మంత్రి తుమ్మల శంకుస్థాపనలు చేశారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్, జడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, టీఆర్ఎస్ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, బిక్కసాని నాగేశ్వరరావు, జడ్పీటీసీ ఉన్నం వీరేందర్, ఆర్అండ్బీ అధికారులు , తహశీల్దార్ మంగీలాల్, ఎంపీడీఓ ఎన్ శాంతాదేవి, సర్పంచ్ భూక్యా సైదా తదితరులు పాల్గొన్నారు. -
ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లల జననం...!
పార్వతీపురం: పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో ఓ గిరిజన మహిళ ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. మక్కువ మండలం విజయరామపురం గ్రామానికి చెందిన సీదారపు కుంబమ్మ అనే మహిళ సోమవారం ప్రసవానికి ఆస్పత్రిలో చేరింది. తొలుత ఇద్దరు పాపలకు జన్మనిచ్చిన ఆమె, తరువాత మూడో పాపకు కూడా జన్మనిచ్చింది. అయితే అప్పటికే కడుపులో ఆ పాప చనిపోయింది. కుంబమ్మ తొలి కాన్పు నార్మల్ డెలివిరీలో ఒక బాబుకు జన్మనీయగా, రెండో కాన్పులో కూడా నార్మల్ డెలివిరీలో ముగ్గురు పాపలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరు పాపలు, తల్లీ క్షేమంగానే ఉన్నారు. -
ఓడిపోతున్న అమ్మతనం
వంశోద్ధారకుడు కావాలన్న ఆరాటం.. ఆడపిల్లను సాకలేమన్న నిస్సహాయత.. ఏదైతేనేమీ.. జిల్లాలో శిశు విక్రయాల దుష్ట సంప్రదాయం కొనసాగుతుండడం దురదృష్టకరం. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం తండాలను వీడడం లేదు. ఇక..ఆధునికతకు పేరొందిన పట్టణ ప్రాంతాల్లో ‘కని’కరం లేకుండా ఆడశిశువులను రోడ్డు పక్కన, చెత్తకుప్పల్లో.. మురుగు కాల్వల్లో వేస్తున్న సంఘటనలు అనేకం.. ఆడశిశువులను ‘కని’కరం లేకుండా వదిలించుకుంటున్న విషాదాలకు జిల్లాలో ఇక.. ముగింపు లేదా...? విషసర్పాలైన పాములు కూడ గత్యంతర లేని పరిస్థితుల్లో మాత్రమే తాము కన్న పిల్లలను వధిస్తాయని తెలిసిందే. పేదరికం, అధిక సంతానం మనుషులను కూడ కర్కోటకులుగా మారుస్తోంది. నవమాసాలు మోసి కన్న మాతృమూర్తి సైతం ప్రేమను త్వజించి పేగు తెంచుకుపుట్టిన పసిగుడ్డును పాషాణంగా వదిలేస్తోంది. ⇒ పసిగుడ్డులను పడేస్తున్న కొందరు.. ⇒ దత్తత పేరుతో విక్రయిస్తున్న మరికొందరు ⇒ జిల్లాలో ఇంకా కొనసాగుతున్న దుష్ట సంప్రదాయం నల్లగొండ అర్బన్: రోజులు, నెలలు, సంవత్సరాలతోపాటు క్యాలెండర్లు మారుతున్నాయి. కానీ అడశిశువులను వదిలించుకునే అనాచారం నుంచి గిరి‘జనం’ బయటపడలేకపోతోంది. ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించినా, బంగారుతల్లి, కల్యాణ లక్ష్మి తదితర పథకాలను ప్రవేశపెట్టినా ఈ దుష్ట సంప్రదాయాన్ని నిలువరించలేకపోతున్నారు. పుట్టింది ఆడశిశువైతే ఏదోరకంగా వదిలించుకునే అనాచారం గిరిజన తండాలను వీడడం లేదు. శిశు విక్రయాలతో దశాబ్దన్నర క్రితమే పత్రికల్లో పతాక శీర్షికల్లోకెక్కిన దేవరకొండ ప్రాంతంలో తరచు ఇలాంటి అనాచారపు ఆనవాళ్లు మెదలుతూనే ఉండగా, దుష్ట సంస్కృతి తాజాగా జిల్లా కేంద్రమూ మినహాయింపుకాదనే సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. రైల్వేస్టేషన్‌కు వెళ్లేదారిలో అవాంఛిత మృతశిశువు ఉదంతం వెలుగులోకిచ్చి పదిరోజులైనా కాకముందే దత్తత ముసుగులో శిశు విక్రయ సంఘటన కలకలం రేపడం చర్చనీయాంశమైంది. వదిలించుకుంటున్న శిశువులు రోజుల వయస్సు వారు కావడంతో తల్లిపాలు పొందడం, తల్లిదండ్రుల వద్ద సహజ వాతావరణంలో పెరగడంలాంటి ప్రాథమిక హక్కులు కోల్పోతున్నారు. 1999 నుంచి.. 1999 మార్చిలో దేవరకొండ మండలం కొండమల్లేపల్లి శివారు గౌరికుంట తండాలో ఇంద్రావత్ మంగ్లి అనే గిరిజన మహిళ 3 నెలల పసికందును భర్తకు తెలియకుండా అమ్మిన సంఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఐదేళ్ల కాలంలో దాదాపు 75 మంది శిశు విక్రయాలు జరిగాయని పరిశోధనల్లో తెలింది. ‘‘ఆడశిశువులను అమ్ముకుంటే ఎంతో కొంతలాభం...లేకుంటే పెంచి పెద్దచేసి పెళ్లిచేస్తే లక్షలవుతది. అందుకే అమ్ముకుంటున్నాం’’ అని పలువురు గిరిజన మహిళలు పేర్కొనడం వారి పరిస్థితులకు అద్దంపట్టింది. అత్యధికంగా చందంపేట మండలంలో ఆ తర్వాత డిండి, చింతపల్లి, పీఏపల్లి మండలాల్లో విక్రయాలు జరిగినట్లు తేలాయి. ప్రత్యేక ప్యాకేజీ అనంతరం కొంతమేర తగ్గడం, ఆతర్వాత ‘ఊయల’ పేరుతో శిశుగృహలకు తరలించే ఏర్పాటు చేయడంతో మరికాస్త చైతన్యం వచ్చినా, దత్తత పేరుతో అడపాదడపా శిశు విక్రయాల ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. సాటుమాటుగా కొనసాగుతున్న విక్రయాలు.. పెంపకానికనో, దత్తత ఇచ్చామనే సాకులతో శిశు విక్రయాలు సాటుమాటుగా కొనసాగుతూనే ఉన్నాయి. వెలుగుచూసేవి కొన్నైతే...వెలుగులోకి రానివి ఇంకొన్ని. చందంపేట మండలం పోలేపల్లి శివారు ఫకీర్‌నాయక్ తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానమైన నెలవయస్సు దాటని ఆడశిశువును మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు రూ. 15వేలకు కొండమల్లేపల్లి విద్ద విక్రయించారు. విషయం పోలీసులకు తెలియడంతో శిశువును స్వాధీనం చేసుకుని దేవరకొండలోని శిశు గృహకు తరలించిన సంఘటన తెలిసిందే. తాజాగా హాలియా మండలంలోని రంగుండ్ల తండాకు చెందిన గిరిజన దంపతులు మూడో సంతానంలో జన్మిం చిన ఆడశిశువును మునుగోడు మండలానికి చెందిన ఓవ్యక్తి అప్పగించడం.. నల్లగొండలో జరిగిన వాగ్వివాదంతో విషయం అధికారుల దాకా వెళ్లి పాపను శిశుగృహకు తరలించారు. ఒకప్పుడు గొంతులో వడ్లగింజవేసి అక్కడిక్కడే అవాంఛిత శిశువుల ఉసురు తీసిన సంఘటనల నుంచి శిశు విక్రయాలు, దత్తత ముసుగులో వ్యాపారాలు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ‘కల్యాణలక్ష్మి’తోనైనా ఆగేనా... ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేందుకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తల్లి పథకాన్ని ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వం ఏటా కొంత నగదును ఇస్తూ మొత్తంగా రూ.2.16లక్షలను అందజేయడం ఈ పథకం లక్ష్యం. కానీ ప్రస్తుతం ఈ పథకం కొనసాగింపు అస్పష్టంగానే ఉంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కుటుంబాల వారి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి పథకాన్ని తెలంగాణప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారానైనా ఆడపిల్లల జీవితాలకు భరోసా కలగాలని ఆశిద్దాం. ఆడశిశువైతే వీడాల్సిందే...! వంశోద్ధారకుడు కావాలనే తాపత్రయంతో రెండు, మూడు కాన్పుల వరకు చూసి ఆపై కూడ ఆడ సంతానమే కలిగితే వదిలించుకుంటున్న సంఘటనలే ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. ఆస్తి, యాజమాన్యత, దారిద్య్రం, లింగవివక్షలు, వరకట్న సమస్యలు ప్రధానంగా కనిపిస్తున్న విపత్కర పరిస్థితుల ప్రేరేపణతో నవమాసాలు మోస్ఙికన్న’ ఆ పేగే బరువైపోతోంది. ఈ అనాచారం విశృంఖలంగా మారి పరిస్థితి ఘోరంగా తయారవ్వడంతో జాతీయ మహిళా కమిషన్ మొదలు అసెంబ్లీ కమిటీల వరకు గిరిజన తండాల్లో పర్యటించి శిశు విక్రయ నిరోధానికి సలహాలు, సూచనలిచ్చాయి. రూ.26 కోట్ల ప్యాకేజీతో కొంతతగ్గినా... శిశు విక్రయాల సంఘటనలను తీవ్రంగా పరిగణించిన అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ 2001లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ పర్యటన తర్వాత..దాని నివేదిక ప్రకారం 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దేవరకొండ నియోజకవర్గానికి 26 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. పేదరికంలో మగ్గుతున్న గిరిజన కుటుంబాలను ఆదుకునేందుకు ఉపాధి పథకాలను ప్రవేశపెట్టి మరికొంత ఆర్థిక సాయం అందించింది. దీంతో కొన్నాళ్లపాటు ఈ అనాచార, ఉదంతాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తర్వాత యథాతధమయ్యాయి. -
ఆర్నెళ్ల తర్వాత ఆచూకీ లభ్యం
కెరమెరి : మతిస్థిమితం కోల్పోయిన గిరిజన మహిళ ఇంటి నుంచి అదృశ్యమైంది. ఆరు నెలలపాటు భర్త, కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు కనిపించగా వారు ఐసీపీఎస్ అధికారులకు అప్పగించారు. వారు ఆమె ఆచూకీ కనుగొని ఇంటికి చేర్చడంతో కథ సుఖాంతమైంది. మండలంలోని కొఠారి గ్రామానికి చెందిన మడావి దేవ్‌రావు, పగ్గుబాయి దంపతులు కొంతకాలంగా కెరమెరి సమీపంలోని చిన్నుగూడలో ఉంటున్నారు. కుటుంబ కలహాలతో ఏడాది క్రితం పగ్గుబాయి భర్త నుంచి విడిపోయింది. చిన్నుగూడలోని తన అన్నయ్య కుడ్మిత పోసిగా ఇంట్లో ఉంటోంది. ఆరు నెలల క్రితం ఆకస్మాత్తుగా జాడ లేకుండా పోయింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త, అన్నయ్యలు చాలా చోట్ల వెతికినా ఆచూకీ లభించ లేదు. పదిహేను రోజుల క్రితం హాజీపూర్ పోలీసులు అడవుల్లో పెట్రోలింగ్ చేస్తుండగా పగ్గుబాయి కనిపించింది. వారు ఆమెను ఆదిలాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్‌ప్రొటెక్షన్ స్కీం(ఐసీపీఎస్) అధికారులకు అప్పగించారు. వారు ఓల్డేజ్ హోంలో ఆశ్రయం కల్పించి కుటుంబ సభ్యుల విషయమై ఆరా తీశారు. చివరికి సగ్గుబాయి చిన్నుగూడలోని తన భర్త, అన్నయ్య పేరు చెప్పడంతో ఐసీపీఎస్ అధికారి సురేఖ కెరమెరి ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీకి సమాచారం అందించారు. శుక్రవారం రాత్రి రాజశ్రీ, కేస్లాగూడ అంగన్వాడీ కార్యకర్త తింగుబాయి కెరమెరి పోలీసుస్టేషన్లో ఇన్చార్జి ఎస్సై దేవిదాస్ సమక్షంలో పగ్గుబాయిని ఆమె భర్త దేవ్‌రావుకు అప్పగించారు. వీరికి మూడేళ్ల కూతురు కన్నిబాయి ఉంది. -
నిందితులను శిక్షించాల్సిందే
దుబ్బాక: దుబ్బాక మండలం రామక్కపేటలో గిరిజనులైన తల్లీ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలంటూ ఆదివారం అఖిల పక్షం నేతలు ఇచ్చిన పిలుపు మేరకు దుబ్బాక బంద్ పిలుపు ప్రశాంతంగా జరిగింది. అఖిల పక్ష నాయకులు ఉదయమే దుబ్బాక బస్ డిపో ఎదుట ఆందోళన చేపట్టి డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు పలికారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలు దుబ్బాక ప్రధాన వీధుల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. ఏకలవ్య ఎరుకల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం దుబ్బాక పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళలు బైఠాయించి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మద్దుల ఉమాదేవి మాట్లాడుతూ గిరిజన మహిళలపై అత్యాచారం జరిగి 24 గంటలు గడిచినా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కేసును తప్పు దోవ పట్టించేందుకే దుండగులను అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ డెమోక్రటిక్ టీచర్స ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రభాను మాట్లాడుతూ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాల్సి ఉన్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాధితులకు తక్షణ సాయంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పెన్షన్, వంట పాత్రలు, మూడు నెలలకు సరిపోయే రేషన్ ఇవ్వాలన్నారు. బాధితులను ప్రలోభపెట్టి కేసును తారుమారు చేసేందుకు నిందితులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ సామాజిక వేదిక జిల్లా కన్వీనర్ జాన్‌వెస్లీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్. రాంరెడ్డి, నాయకులు సెంట్రింగ్ దుర్గయ్య, చెక్కపల్లి పద్మయ్య, టీడీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కరికె శ్రీనివాస్, నాయకులు కాశయ్య, దుబ్బాక రాజయ్య, ఏకలవ్వ, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిందితుల దిష్టిబొమ్మ దహనం దుబ్బాక రూరల్: గిరిజన మహిళలపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత మహిళా సమఖ్య ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఆదివారం దుబ్బాక బస్టాండ్ ప్రధాన రహదారిపై నిందితుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా మండల నాయకురాలు నవీన మాట్లాడుతూ నిర్భయ వంటి కఠినమైన చట్టాలను ప్రభుత్వాలు తీసుకు వస్తున్నా మహిళల పట్ల అరాచకాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళలతో కలిసి బెల్టుషాపులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు జమున, భారతమ్మ, రాధిక, బాల్‌లక్ష్మి, మమత, బాలమల్లవ్వ, సిద్దవ్వ పాల్గొన్నారు. కేసును సీబీసీఐడీకి అప్పగించాలి రామక్కపేట గ్రామానికి చెందిన గిరిజన తల్లి కూతళ్లపై దసరా పండుగ రోజున జరిగిన అత్యాచార కేసును సీబీసీఐడీకి అప్పజెప్పాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతాడి రాములు, లోకిని రాజు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరమార్శించిన అనంతరం వారు ఆదివారం దుబ్బాక విలేకరులతో మాట్లాడారు. సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన సంఘటనపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. స్థానిక పోలీసులు కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని, కేసు పక్కదారి పట్టకుండా ఉండాలంటే సీబీసీఐడీకి అప్పజెప్పాలన్నారు. సీఎంతో పాటు హోంమంత్రి, రాష్ట్ర డీజీపీలకు విజ్ఞాపన పత్రాలను అందజేసినట్లు తెలిపారు. కఠినంగా శిక్షించాలి మిరుదొడ్డి: అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డీబీఎఫ్ రాష్ట్ర నాయకుడు ముత్యాల భూపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అత్యాచారానికి గురైన బాధితులకు నష్ట పరిహారంతోపాటు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గజ్వేల్ మండలం పిడిచెడ్‌లో హిందూ దేవాలయంలోకి పూజలు చేసేందుకు వెళ్లిన దళిత ఉపాధ్యాయుడిపై కొందరు అగ్రవర్గాల నేతలు కులం పేరుతో దూషించి దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ నాయకులు నక్క రాజయ్య, బిట్ల కుమార్, ఆర్ రాజయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. దాడులను అరికట్టడంలో విఫలం జోగిపేట: ఎస్సీ, ఎస్టీలపై రోజురోజుకు పెరిగిపోతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీపీఎం డివిజన్ కార్యదర్శి పి.మొగులయ్య ఆరోపించారు. దుబ్బాక మండలం రామక్కపేటలో గిరిజన కులానికి చెందిన తల్లీకూతళ్లపై అమానుషంగా అత్యాచారం చేసిన దుండగుల దిష్టిబొమ్మను జోగిపేటలోని తహశీల్ కార్యాలయం వద్ద ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా మొగులయ్య మాట్లాడుతూ ఈ సంఘటనలో బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, గంగ, సంజీవులు, శివకుమార్, గంగారాంలతో పాటు పలువురు పాల్గొన్నారు. దుండగులను శిక్షించాలి టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ జగదేవ్‌పూర్: రామక్కపేటలో తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కామల్ల భూమయ్య, తెలుగు యువత జిల్లా నాయకుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం వారు జగదేవ్‌పూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ తల్లీకూతుళ్లపై అత్యచారం జరగడం దారుణమన్నారు. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు. సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ మండలాధ్యక్షులు శివలింగం, నాయకులు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పగలు ఆటోడ్రైవింగ్ రాత్రిళ్లు అఘాయిత్యాలు
* గ్యాంగ్‌రేప్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు * వెలుగు చూస్తున్న అరాచకాలు సాక్షి, హైదరాబాద్: మృగాళ్ల ఆగడాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఒంటరి మహిళలను నమ్మిం చి ఆటోల్లో తీసుకువెళ్లి అఘాయిత్యాలకు పాల్ప డుతుంటారు. పగలంతా ఆటోలు నడపడం, రాత్రిళ్లు అసాంఘికచర్యలకు పాల్పడడం వారికి నిత్యకృత్యం. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆటోడ్రైవర్ల అకృత్యా లు బయటపడుతున్నాయి. భర్త, మరిదితో కలిసి కూలీ కోసం ఆటోలో వెళ్తున్న మహిళపై హైదరాబాద్ శివారులోని నారపల్లి సమీపంలో ఐదుగురు ఆటోడ్రైవర్లు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురిని మేడిపల్లి పోలీసులు బుధవారం అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడు రవి (22)ని గురువారం అరెస్టు చేశారు. రెండు రోజులుగా పరారీలో ఉన్న రవిని విశ్వసనీయ సమాచారం మేరకు చాంద్రాయణగుట్ట ఆటోఅడ్డా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందు రెక్కీ..: నారపల్లికి చెందిన ఇమ్ము అలియాస్ అక్రమ్ (22), అబ్బాస్ (24), జుబేర్(22), ఘట్కేసర్కు చెందిన షెహనాజ్ (20), ఫిర్జాదిగూడకు చెందిన సి.రవి(22) ఆటోడ్రైవర్లే. ఉప్పల్ నుంచి ఘట్కేసర్, ఎల్బీ నగర్‌లకు షేరింగ్ ఆటోలు నడిపిస్తుంటారు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వీరంతా ఉప్పల్‌లో కలుసుకుంటారు. విందులతో జల్సా చేస్తారు. రాత్రి 11 గంటలకు ఉప్పల్ బస్టాండ్‌కు వచ్చి ఒంటరి మహిళను టార్గెట్ చేస్తుంటారు. షెహ నాజ్ గుర్తించి మిగతా డ్రైవర్లకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం చేరవేస్తాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకొని ఆ మహిళను నమ్మించి ఆటోలోకి ఎక్కిస్తారు. ఆ తరువాత వీరు మేడిపల్లి దాటిన తరువాత అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌లకు పాల్పడుతుంటారు. తాజా ఘటనలో గిరిజన మహిళ తన భర్త, మరిదితో కలిసి ఘట్కేసర్ వెళ్లే షేరింగ్ ఆటో ఎక్కింది. అప్పటి వరకు ఈ ముగ్గుర్ని గమనిస్తున్న నిందితులు ఆ మహిళ ఎక్కిన ఆటోను తమ ఆటోలో అనుసరించారు. బాధితులున్న ఆటోను ఓవర్టేక్ చేస్తూ వెకిలిచేష్టలతో నిందితులు ఇబ్బంది పెట్టారు. నారపల్లి ప్రాంతంలో మహిళను, ఆమె భర్త, మరిదిని నడిరోడ్డు మీద దించి ఆటోవాలా వెళ్లిపోయాడు. నిందితులు ఆ మహిళను బెదిరించి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హోలీ ఆయిచే..
హోలీ పండగ వచ్చిందంటే చాలు వారం ముందు నుంచే గ్రామాల్లో గిరిజన మహిళలు ఆటపాటలతో సందడి చేస్తుంటారు. తండాల్లో పండగను ఘనంగా జరపుకోవడానికి పట్టణానికి వచ్చి సంప్రదాయపాటలు, నృత్యాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకొని డబ్బులను వసూలు చేస్తారు. వాటితె రంగులను, సంప్రదాయ బట్టలు, అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. శనివారం మన్యంకొండ వద్ద గిరిజనులు ప్రదర్శనలు నిర్వహిస్తూ ఇలా అలరించారు. -
చిన్నతరహా వ్యాపారాల ప్రోత్సాహానికి కేపీజీల ఏర్పాటు
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీలో చిన్నతరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు అర్హులైన గిరిజన మహిళలతో కూడిన గ్రూపులను గుర్తించాలని ఐటీడీఏ పీవో వీరపాండియన్ సూచించారు. శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిర ంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు, గుండాల అదే విధంగా భద్రాచలం డివిజన్లోని ఎనిమిది మండలాల్లో ఉమ్మడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఒక్కో మండలంలో ఏడు గ్రామాలను ఎంపిక చేసి మొత్తం 70 కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఆయా మండలాల్లో లభ్యమయ్యే పంటల ఆధారంగా ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో మిర్చి ఎక్కువగా పండిస్తున్నందున ఇందుకు సంబంధించిన వ్యాపారాలను ప్రోత్సహించాలన్నారు. ఆయా మండలాల్లో చైతన్య వంతులైన గిరిజన మహిళలతో కృషి ప్రొడ్యూసర్ గ్రూపు(కేపీజీ)లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే రూ.5 లక్షల వ్యయంతో కారం మిల్లులను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల్లో తాటి చెట్లు ఎక్కువగా ఉన్నందున అక్కడ తాటి పీచు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అదే విధంగా కూనవరం మండలం కరకగూడెంలో పౌష్టికాహార కేంద్రాలకు సర ఫరా చేసే సరుకుల ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రతిపాదనల ద్వారా గిరిజనులకు లబ్ధిచేకూర్చేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటికి సంబంధించిన వివరాలను సాధ్యమైనంత త్వరగా సర్వే చేసి ఇవ్వాలని ఎస్ఆర్పీలను ఆదేశించారు. ఈ సమావేశంలో ఐకేపీ ఏపీడీ ఆర్ జయశ్రీ, కొండరెడ్ల ప్రత్యేకాధికారిణి మల్లీశ్వరి, ఏపీవో అగ్రికల్చర్ నారాయణరావు, మర్కెటింగ్ డీపీఎం రంగారావు, సెర్ప్ అధికారి మూర్తి, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఎస్ఆర్పీలు పాల్గొన్నారు.