ఎవరెస్ట్‌ ఎక్కనున్న ‘అడవి’ బిడ్డలు | Adilabad Tribal Women Plans To Climb Mount Everest | Sakshi
Sakshi News home page

ఎవరెస్ట్‌ ఎక్కనున్న ‘అడవి’ బిడ్డలు

Published Sun, May 5 2019 7:26 AM | Last Updated on Sun, May 5 2019 12:01 PM

Adilabad Tribal Women Plans To Climb Mount Everest - Sakshi

మడావి కన్నీబాయి,మడావి కల్పన 

కెరమెరి(ఆసిఫాబాద్‌): సాహసకృత్యాలంటే వారికి మహాఇష్టం.. పరుగుపందెం, గుట్టలు ఎక్కడం, దిగడం, నీటి సాహసం.. ఇలా ఎన్నో రకాల సాహసకృత్యాలు చే సి ప్రజల మన్ననలు పొందిన ఈ అడవిబిడ్డలు మరో సాహాసం చేయబోతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఇచ్చో డ అడవుల్లో గాయత్రీగుండం సాహసకృత్యం.. హైదరా బాద్‌లోని సైక్లింగ్‌ పరుగుపందెం.. అరకు లోయలో కటక వాటర్‌వాల్‌ రాఫ్లింగ్‌ పోటీల్లో పాల్గొని వేగంగా వ స్తున్న నీటిలో 425 ఫీట్ల లోతులో దిగడం ఇలాంటి ఎన్నో సాహకృత్యాలు చేసిన.. వీరు ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కేందుకు రేపు బయలుదేరుతున్నారు.

కెరమెరి మండలంలోని భీమన్‌గొంది గ్రామానికి చెందిన మడావి కన్నీబాయి, కొలాం కొఠారి గ్రామానికి చెందిన మడావి కల్పన సాహసకృత్యాలు చేయడంలో దిట్ట.. చిన్నతనం నుంచే సాహసం చేయడం అటవాటుగా ఉన్న వీరు ఇప్పటి వరకు ఎన్నో సహాసోపేత కృత్యాల్లో పాల్గొన్నారు. గతంలో ఇచ్చోడ మండలంలోని గాయత్రీదేవి గుండంలో అత్యంత లోతైన లోయలో దిగి ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే గతేడాది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లా అరకు లోయలో ఉన్న కటక వాటర్‌పాల్‌ రాఫ్లింగ్‌ పోటీల్లో పాల్గొన్నారు. అత్యంత వేగంగా పైనుంచి పడుతున్న జలధార తట్టుకుంటూ సుమారు 425 ఫీట్ల లోతులో 2.35 సెకండ్‌లలో చేరి ప్రథమ బహమతి సాధించారు. అనంతరం ఇటీవల మహబూబ్‌నగర్‌లో మయూరి పార్క్‌లో నిర్వహించిన సైక్లింగ్‌లో పాల్గొని భేష్‌ అనిపించారు. తమతోపాటు మరో ఆరుగురిని ఈ సైక్లింగ్‌లో పాల్గొనేలా చేశారు.

ఇప్పుడు ఎవరెస్ట్‌ శిఖరం
సోమవారం సాయంత్రం వీరు అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కెందుకు బయలుదేరుతున్నారు. హైదరాబాద్‌లోని అడ్వంచర్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వీరు ఎంపికయ్యారు. దేశం నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మందిని ఈ క్లబ్‌ ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి గిరిపుత్రికలు కన్నీబాయి, కల్పన ఎంపియ్యారు. గతంలో వీరు ఎన్నో సాహసకృత్యాలు చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వీరికి అవకాశం కల్పించినట్లు వారు తెలుపుతున్నారు. వీరికి ఐటీడీఏ పీవో కృష్ణఆదిత్య ప్రోత్సాహం, సహకారమందిస్తున్నారు. వారికి కావల్సిన దుస్తులు, షూలు సమకూరుస్తున్నారు. వీరికి సుమారు 10 రోజులు శిక్షణ ఇస్తారు. ఎలా నడవాలి అనే దానిపై శిక్షణ ఉంటుంది. ఒక్కొక్కరికి ఎవరెస్ట్‌ ఎక్కేందుకు రూ.1.50 లక్షల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఐటీడీఏ పీవో రూ.1.80 లక్షలు చెల్లించారని కన్నీబాయి తెలిపారు. 

ఆర్థికసాయం కోసం వేడుకోలు 
ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కాలంటే రుసుము చెల్లించాలి. అలాగే సుమారు పక్షం రోజులకు కావల్సిన ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అందుకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం.. దాతలు, మనసున్న మహారాజులు ఆరిక్థ సహాయం అందించాలని కన్నీబాయి, కల్పనలు కోరుతున్నారు. మరో మూడు లక్షలు తక్షణం అవసరముందని చెబుతున్నారు. దాతలు స్పందించాలని వేడుకుంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement